269

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 269*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 184*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

    🛡⚔ *గజ్వయె అహ్జాబ్ (అగడ్త యుద్ధం - కందక యుద్ధం) : - 9* ⚔🛡

దైవప్రవక్త (సల్లం) తమ నిస్సహాయ స్థితి నుండి *"అల్లాహు అక్బర్"* అంటూ లేచి నిలబడ్డారు. ముస్లింలను ఉద్దేశించి, *"ముస్లిములారా వినండి! అల్లాహ్ తరఫున సహాయం మరియు విజయ శుభవార్త వచ్చింది."* అన్నారు.

దైవలీల ఏమిటోగాని శత్రు సేనలోనే చీలిక ఏర్పడింది. ఆ తరువాత వారు ఓటమికి గురి అయిపోయారు. అది ఎలా సాధ్యం అయిందో ఆ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి....; ↓

బనూ గత్ఫాన్ తెగకు చెందిన ఓ వ్యక్తి "నుఅయిమ్ బిన్ మస్ఊద్ బిన్ ఆమిర్ అష్'జయీ" మహాప్రవక్త (సల్లం) సన్నిధికి రావడం జరిగింది. ఆయన దైవప్రవక్త (సల్లం)తో ఇలా విన్నవించుకున్నారు.

*"ఓ దైవప్రవక్తా! నేను ఇస్లాం స్వీకరించాను. కాని ఈ విషయం నా జాతికి ఇప్పటి వరకూ తెలియదు. తమరు నాకు ఏదైనా ఆదేశం ఇవ్వండి. దాన్ని పాలించడానికి సిద్ధంగా ఉన్నాను."* అన్నారు.

*"నీవు కేవలం ఒంటరివాడివి. (ఆ సైన్యంతో యుద్ధం చేయలేవు) అయితే సాధ్యమైనంతమట్టుకు శత్రు శిబిరంలో చీలిక తెచ్చి వారి ధైర్యాన్ని పోగొట్టు, యుద్ధం అంటేనే కుయుక్తులకు మారుపేరు మరి."* అని సలహా ఇచ్చారు.

ఇది విన్న హజ్రత్ నుఅయిమ్ (రజి) వెంటనే బనూ ఖురైజా యూదుల వద్దకు వెళ్ళారు. ఇస్లాం స్వీకరించక పూర్వం ఆయన వారితో ఎంతో కలుపుగోలుగా ఉంటూ వచ్చినవారు. అక్కడకు వెళ్ళి, *"మీ యెడల నాకు ఎంత ప్రేమ ఉందో, నాకూ మీకూ నడుమగల ప్రత్యేక సంబంధం ఎలాంటిదో మీరు ఎరిగిన విషయమే కదా!"* అని పలికారు.

*"అవును ఇందులో సందేహమేముంది?"* అన్నారు వారు.

*"అయితే వినండి! మీరు ముహమ్మద్ (సల్లం)తో చేసుకున్న స్నేహ ఒప్పందాన్ని భంగపరచి ఖురైష్, గత్ఫాన్ తెగలతో చేతులు కలిపారని విన్నాను. ఖురైషుల వ్యవహారం మీకు భిన్నమైన వ్యవహారం. ఈ ప్రాంతం అంతా మనకు చెందిన ప్రాంతం. ఇక్కడ మీ ఇళ్ళూ వాకిళ్ళూ ఉన్నాయి. మీ వ్యాపారం అంతా ఈ ప్రాంతానికి చెందిందే. మీ ధనసంపద, పిల్లాజెల్లా అంతా ఇక్కడే ఉంటున్నారు. మీరు వాటిని వదిలి ఎక్కడికీ పోలేరు కూడా. అయితే ఖురైషులు మరియు గత్ఫానులు కలిసి ముహమ్మద్ (సల్లం)తో యుద్ధం చేయడానికి వస్తే మీరు ముహమ్మద్ (సల్లం)కు వ్యతిరేకంగా వారికి సహాయపడుతున్నారు. వారికి ఇక్కడ ఇళ్ళూ వాకిళ్ళూగానీ, భార్యాపిల్లలుగానీ, ధన సంపదలుగానీ ఏవీ లేవు. వారికి అవకాశం చిక్కితేనే ముహమ్మద్ (సల్లం)ను జయించగలరు. లేని పక్షంలో తమ పెట్టేబేడా సర్దుకుని ఇంటిముఖం పట్టేస్తారు. ఇక మిగిలేది మీరూ, ముహమ్మద్ (సల్లం) మాత్రమే. అప్పుడు మీరొక్కరే ముస్లింలను ఎదుర్కోవలసి ఉంటుంది. అలా మీరు ఘోరమైన ప్రమాదంలో పడిపోతారు. ఇప్పుడేం చేస్తారు చెప్పండి!"* అని భయపెట్టారు.

ఈ మాటలు విన్న బనూ ఖురైజా యూదులకు గుండెలు దడదడలాడాయి.

*"చెప్పండి నుఅయిమ్! మమ్మల్ని ఏమి చెయమంటారో....!"* అని అడిగారు.

*"ఏముందీ! మీరు ఈ ప్రమాదం నుండి బయటపడటానికి ఒకే మార్గం ఉంది. ఖురైషులకు చెందిన కొంతమంది వ్యక్తుల్ని మీ దగ్గర కుదవ పెట్టమనండి. ఆ వ్యక్తులు కూడా ప్రముఖ వ్యక్తులై ఉండాలి. ఇలా అయితే మీకూ తృప్తి ఉంటుంది. వారు కూడా ముహమ్మద్ (సల్లం)ను చంపేవరకు వెనక్కి తిరిగిపోయే మాటెత్తరు. ఒకవేళ వారే గనక దానికి సిద్ధపడకపోతే యుద్ధంలో మీరు పాల్గొనకూడదు."* అని సలహా ఇచ్చారు.

*"ఓహో! ఎంత మంచి సలహా ఇది. మీ సలహా తప్పకుండా పాటిస్తాం."* అని ఆయన్ను పొగడనారంభించారు వారు.

ఆ తరువాత హజ్రత్ నుఅయిమ్ (రజి) నేరుగా ఎవరికీ తెలియకుండా ఖురైషుల శిబిరానికి వెళ్ళారు. ఖురైషులను ఉద్దేశించి....;

*"మీరంటే నాకు ఎంత ఇష్టమో, మీకు మేలు జరగాలని ఎంతగా ఆకాంక్షిస్తున్నానో ఆ విషయం మీకు తెలిసిందే."* అన్నారు.

దానికి ఖురైషులు, *"అవును. అది మాకు బాగా తెలుసు. మీరు మా మేలు కోరేవారే."* అన్నారు.

*"అయితే వినండి! బనూ ఖురైజా యూదులు ముహమ్మద్ (సల్లం)తో చేసుకున్న ఒప్పందాన్ని భంగపరచి ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారు. ఇప్పుడు అందరూ కలసి ఓ నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే, వారు (ఆ యూదులు) మీ దగ్గర నుండి కొందరు మనుషుల్ని కుదవ పెట్టుకొని ముహమ్మద్ (సల్లం)కు అప్పజెప్పి క్షమాపణ కోరుకుంటారట. తిరిగి ముహమ్మద్ (సల్లం)తో చేసిన ఒడంబడికను పునరుద్ధరిస్తారట. కాబట్టి ఆ యూదులే గనక మీ మనుషుల్ని కుదవ పెట్టమని అడిగితే, జాగ్రత్త! ఒక్కరిని కూడా కుదువ పెట్టవద్దు సుమా!"* అని హితవు చేసి వెళ్ళిపోయారు.

అలాగే నుఅయిమ్ (రజి), గత్ఫాన్ తెగ సర్దారుల వద్దకు వెళ్ళి ఆ మాటలనే రెట్టించారు. వారు కూడా జాగరూకులైపోయారు.

ఇది జరిగిన తర్వాత శుక్రవారం మరియు శనివారం నాటి మధ్యరాత్రి ఖురైషులు, యూదుల వద్దకు ఓ వర్తమానం పంపించారు. ఆ వర్తమానంలోని సందేశం ఈ విధంగా ఉంది....; ↓

*"మా విడిది అంత సరైన ప్రదేశంలో లేదు. అందువల్ల మా గుర్రాలు, ఒంటెలు చనిపోతున్నాయి. కాబట్టి అటు నుండి మీరు, ఇటు నుండి మేము ముహమ్మద్ (సల్లం)పై వెంటనే దాడి చేయాలి."*

కాని యూదులు సమాధానంగా, *"ఈ రోజు శనివారం. మీకు తెలుసు సబ్బత్ రోజున మేము ఏ పనీ చేయమనేది. గతంలో దైవ ఆదేశాన్ని ధిక్కరించిన వారు దైవశిక్షను ఎలా అనుభవించారో మాకు బాగా తెలుసు. అంతేకాదు, ఒకవేళ ముహమ్మద్ గెలిచేలా ఉంటే మాత్రం మీరు మమ్మల్ని విడనాడి పోమని హామీనివ్వాలి. దాని కోసం మాకు నమ్మకం కలగడానికి మీ మనుషులు కొందరిని మా దగ్గర కుదువ పెట్టండి. ఆ తరువాతే మేము మీతో సహకరించగలం. అలా కాకుండా, మీరు మీ మనుషుల్ని కుదవ పెట్టని పక్షంలో మేము యుద్ధంలో పాల్గొనే ప్రసక్తే లేదు."* అని చెప్పి పంపించారు.

వార్తాహరుడు తెచ్చిన ఈ వార్త వినగానే ఖురైషులు మరియు గత్ఫానులు, *"దైవసాక్షి! నుఅయిమ్ నిజమే చెప్పాడు."* అని భావించి, బనూ ఖురైజా యూదులు నిజంగా ఏదో మోసం తలపెట్టారని అనుమానిస్తూ, *"అసాధ్యం. మేము ఏ ఒక్కరినీ మీ దగ్గర కుదువ పెట్టేవారం కాదు. మీరు త్వరగా మాతో సహకరించి (ఇరువైపుల నుండి) ముహమ్మద్ (సల్లం)పై దాడి చేయాల్సి ఉంది."* అని మరో వర్తమానం పంపించారు.

ఖురైష్ మరియు గత్ఫానుల ఈ వైఖరిని గమనించిన బనూ ఖురైజా యూదులు, *"దైవసాక్షి! నుఅయిమ్ నిజమే చెప్పారు."* అని అనుకున్నారు.

ఇలా రెండు వర్గాల్లో చీలిక ఏర్పడి పరస్పరం ఒకరిపై మరొకరికి ఉన్న నమ్మకం కాస్త అడుగంటిపోయింది. వారి సైన్యంలో చీలిక ఏర్పడి, ధైర్యాలు సన్నగిల్లాయి.

ఈ సందర్భంలో ముస్లిములు అల్లాహ్ ను ఇలా వేడుకుంటున్నారు....; ↓

*"ఓ ప్రభూ! మా రహస్యాలను శత్రువుకు తెలియకుండా దాచి ఉంచు. మమ్మల్ని అన్ని రకాల ప్రమాదాల నుండి కాపాడు."*

మహాప్రవక్త (సల్లం) దైవాన్ని ఇలా వేడుకుంటున్నారు....; ↓

*"ఓ అల్లాహ్! గ్రంథాన్ని అవతరించినవాడా! కర్మల లెక్కల్ని త్వరగా తీసుకునే ఓ ప్రభూ! ఈ సైన్యాలకు ఓటమిని కలుగజేయ్యి. ఓ అల్లాహ్! వారిని ఓడించు, ఊపివెయ్యి."*

చివరికి అల్లాహ్ ముస్లిముల వేడుకోలును విన్నాడు. ముష్రిక్కులలో చీలిక ఏర్పడి వారు భయభీతులు అయిపోయిన తర్వాత అల్లాహ్ వారిపై భీకరమైన తుఫానును పంపాడు. ఆ తుఫాను గాలులు వారి గుడారాల్ని పీకి వేశాయి. కుంపట్ల మీదున్న పెద్ద పెద్ద వంటపాత్రలు సైతం ఎగిరి తలక్రిందయి పడిపోయాయి. ఏ వస్తువూ స్థిరంగా ఉండలేదు. దానికితోడు దైవదూతల సేనను కూడా పంపించాడు అల్లాహ్. ఈ సేన వారందరినీ కుదిపివేసింది. వారి హృదయాల్లో భయభీతుల్నీ, ముస్లిములంటే జంకునూ సృష్టించాడు.

ఎముకలు కొరికివేసే ఈ శీతల రాత్రివేళనే దైవప్రవక్త (సల్లం), దైవధిక్కారుల పరిస్థితి ఎలాగుందో తెలుసుకురమ్మని 'హజ్రత్ హుజైఫా బిన్ యమాన్ (రజి)'ను పంపించారు. ఆయన యుద్ధరంగంలోనికి వెళ్ళి చూడగా, అక్కడ పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా ఉంది. ముష్రిక్కులు తిరుగు ప్రయాణానికి సంసిద్ధులవుతున్నారు.

హుజైఫా (రజి), ప్రవక్త (సల్లం) సన్నిధికి తిరిగివచ్చి ఆ పరిస్థితి గురించి ఆయన (సల్లం)కు తెలియజేశారు.

తెల్లవారిన తరువాత చూడగా (యుద్ధరంగం అంతా ఖాళీ అయిపోయింది) అల్లాహ్ శత్రువును ఎలాంటి ప్రయోజనం పొందకుండా ఆ కోపంలోనే వెనక్కు పంపించడం అగుపడింది ప్రవక్త (సల్లం)కు.

మొత్తానికి అల్లాహ్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. తన సేనకు గౌరవాన్ని చేకూర్చాడు. తన దాసునికి సహాయపడుతూ, ఆయన ఒక్కడే ఈ అపార సేనావాహినిని ఓడించాడు. ఆ తరువాత మహాప్రవక్త (సల్లం) మదీనాకు బయలుదేరి వెళ్ళిపోయారు.

అగడ్త యుద్ధం (గజ్వయె అహ్'జాబ్) ప్రామాణికమైన ఉల్లేఖనం ద్వారా, షవ్వాల్ నెల హిజ్రీ శకం - 5లో సంభవించింది. ముష్రిక్కులు ఒక నెలపాటు లేదా దాదాపుగా ఒక నెల వరకు దైవప్రవక్త (సల్లం)ను మరియు ముస్లిములను దిగ్బంధంలో ఉంచారు ఆ యుద్ధంలో. అన్ని ఆధారాలను పరిగణలోనికి తీసుకుంటే, ఈ దిగ్బంధం షవ్వాల్ నెల ఆరంభం నుండి ప్రారంభమై జీఖాదా నెల వరకు కొనసాగిందని తెలుస్తోంది. ఇబ్నె సఅద్ ఉల్లేఖనం ప్రకారం, *"అహ్జాబ్ యుద్ధం నుండి తిరుగు ప్రయాణమైన రోజు బుధవారం. జీఖాదా మాసం పూర్తి కావడానికి ఇంకా ఏడు రోజులు మిగిలి ఉన్నాయి."*

అహ్జాబ్ యుద్ధం వాస్తవానికి నష్టాల యుద్ధం అనే బదులు మానసికమైన ఒత్తిడికి గురిచేసిన యుద్ధమే అని అనడం సబబు. ఈ యుద్ధంలో ఎలాంటి రక్తపాతం జరగలేదు. అయినా ఇది ఇస్లామీయ చరిత్రకు సంబంధించిన నిర్ణయాత్మకమైన యుద్ధం. ఈ యుద్ధంలో ముష్రిక్కుల మనోబలం పూర్తిగా దెబ్బతిన్నది. అరేబియాకు చెందిన మరే శక్తి, మదీనాలో జీవం పోసుకుంటున్న ఈ చిన్న శక్తిని అంతమొందించజాలదు అనే విషయం తెలిసిపోయింది. ఎందుకంటే, అహ్జాబ్ యుద్ధంలో సమీకరించబడినంత సైనిక బలాన్ని తిరిగి సమకూర్చడం అరబ్బులకు సాధ్యం అయ్యే పని కాదు. అందుకని దైవప్రవక్త (సల్లం) అహ్జాబ్ యుద్ధం నుండి తిరిగివచ్చిన తర్వాత ఇలా సెలవిచ్చారు....; ↓

*"ఇక మనమే వారిపై దండెత్తి వెళ్ళవలసి ఉంది. వారు ఇక మనపై దండెత్తి రాలేరు. మన సేనయే వారి వైపునకు వెళుతుంది."* అని ప్రకటించారు.

*ఇంతటితో కందక యుద్ధం పూర్తయింది. కందక యుద్ధంలో, ముస్లింలతో చేసుకున్న స్నేహ ఒప్పందాన్ని భంగపరచి, శత్రువులతో చేతులు కలిపిన 'బనూ ఖురైజా' యూదుల పతనాన్ని In Sha Allah రేపటి భాగంలో తెలుసుకుందాం.*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment