268

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 268*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 183*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

    🛡⚔ *గజ్వయె అహ్జాబ్ (అగడ్త యుద్ధం - కందక యుద్ధం) : - 8* ⚔🛡

సైన్యాధ్యక్షుడు అబూ సుఫ్'యాన్ కు ఈ విషయం తెలిసి ఎంతో విచారించాడు. నౌఫల్ మృతదేహం ఇచ్చివేస్తే దానికి బదులు వంద ఒంటెలు ఇస్తామని ముస్లింలకు కబురు చేశాడు. ఈ కబురు అందుకున్న దైవప్రవక్త (సల్లం) ఇలా సమాధానమిచ్చారు....;

*"తీసుకెళ్ళండి, మీ సైనికుడి మృతదేహాన్ని. రక్తపరిహారంగా ఇవ్వజూపుతున్న మీ ఒంటెలు మాకవసరం లేదు. మీ సైనికుడి మృతదేహం కూడా అపవిత్రమైనదే, దాని రక్తపరిహారం కూడా అపవిత్రమైనదే."*

అవిశ్వాసులు కందకంలో నుంచి నౌఫల్ మృతదేహం బయటికి తీసి తమ శిబిరానికి మోసుకెళ్ళారు. ఇంత జరిగినా వారు తమ ప్రయత్నాలు మానుకోలేదు. రేయింబవళ్ళూ కందకం దాటడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. దాని కోసం కొన్ని ప్రత్యేక సైనిక దళాలను కూడా తయారు చేసుకున్నారు. ఈ దళాలు కందకం దాటడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి.

యుద్ధం తీవ్రరూపం దాల్చింది. కదనరంగం భయానకంగా మారింది. ఖురైష్‌ విలుకాండ్రు కందకం చుట్టూ నిలబడి బీరుపోకుండా బాణాలు వదులుతున్నారు. ముస్లింలు ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు. శత్రువుల ధాటిని ఎదుర్కోవడానికి ఎంతో శ్రమపడవలసి వస్తోంది. అసలే ఆకలితో ఉండటం వల్ల ఎదురుదాడిలో ముస్లిం యోధులు చాలా అలసిపోయారు. వారి పరిస్థితి దయనీయంగా ఉంది. కాని మనోస్థ్యయిర్యం సన్నగిల్లలేదు. పర్వతశ్రేణుల్లా తమ స్థానాల్లో స్థిరంగా నిలబడి యుద్ధం చేస్తున్నారు. అటు వైపు నుండి వచ్చేపడే బాణాల నుండి తమను తాము రక్షించుకుంటూ ఉన్నారు.

ఇలా జరిగిన దాడుల సందర్భంలోనే మహాప్రవక్త (సల్లం) గారి మూడు పూటల నమాజు పోయింది. సహీయైన్ లో 'హజ్రత్ జాబిర్ (రజి)' గారి ఉల్లేఖనం ఇలా ఉంది....; ↓

*"హజ్రత్ ఉమర్ (రజి) కందకం యుద్ధం నాడు బహుదైవారాధకులను తిట్టారు కూడా. ఆయన (రజి), దైవప్రవక్త (సల్లం) దగ్గరకు వచ్చి, _"ఓ దైవప్రవక్తా! నేను ఈరోజు సూర్యాస్తమయ్యేటప్పుడుగాని నమాజు చేయడానికి కుదిరింది కాదు."_ అని అనగా, మహాప్రవక్త (సల్లం), _"దైవసాక్షి! నేనైతే ఇంకా నమాజే చేయలేదు."_ అని అన్నారు. ఆ తరువాత మేమందరం కలిసి బత్'హాన్ అనే ప్రదేశానికి వెళ్ళి ఉజూ చేశాం. ఆ తరువాత ఆయన (సల్లం) మొదట 'అస్ర్' నమోజు చేశారు. ఇది సూర్యుడు అస్తమించినప్పటి విషయం. ఆ తరువాతగాని 'మగ్రిబ్' నమాజు చేయలేదు."*

దైవప్రవక్త (సల్లం)కు నమాజు చేయలేకపోయినందుకు ఎంతో బాధ కలిగింది. ఆ బాధతో ఆయన (సల్లం) బహుదైవారాధకులను శపించారు కూడా. సహీ బుఖారీ గ్రంథంలో 'హజ్రత్ అలీ (రజి)' గారి ఉల్లేఖనం ఉంది. దాని ప్రకారం....; దైవప్రవక్త (సల్లం) అగడ్త యుద్ధం రోజున, *"అల్లాహ్ ఈ బహుదైవారాధకులకు తోడు వారి ఇళ్ళను, వారి సమాధుల్ని అగ్నితో నింపేయుగాక! మమ్మల్ని వీరు సూర్యాస్తమయం అయినా 'నమాజె వుస్తా'ను చేయకుండా అడ్డుకున్నారు."* అని శపించారు.

'ముస్నదె అహ్మద్' మరియు 'ముస్నదె షాఫయీ'లోని ఉల్లేఖనాల ప్రకారం, ముష్రిక్కులు దైవప్రవక్త (సల్లం)ను జుహ్ర్, అస్ర్, మగ్రిబ్ మరియు ఇషా నమాజులు చేయకుండా యుద్ధంలో నిమగ్నులుగా చేశారు. ఆయన (సల్లం) ఈ మొత్తం నమాజులు ఒకేసారి చేశారు. ఇమామె నోవీ (రహ్మలై), ఈ ఉల్లేఖనాల నడుమ గల తేడాలను ఉటంకిస్తూ, కందక యుద్ధం చాలా రోజుల వరకు కొనసాగిందని, ఓ రోజు ఓ నమాజు ఖజా అయితే, మరో రోజు మరో నమాజు ఖజా అయి ఉండవచ్చని అంటారు.

ఇలా జరగడం వల్లనే బహుదైవారాధకులు కందకాన్ని దాటడానికి సతతం ప్రయత్నిస్తూనే ఉన్నారని, దాన్ని ముస్లిములు అడ్డుకోవడం జరిగిందన్నది వ్యక్తమవుతోంది.

రెండు పక్షాల మధ్య దాటలేనంత పెద్ద కందకం ఉండటం వల్ల కత్తి యుద్ధం సాధ్యపడలేదు. అందువల్ల ప్రాణనష్టం కూడా ఎక్కువ సంభవిస్తున్నట్లు కనపడటంలేదు. అయితే అనేకమందికి గాయాలవుతున్నాయి. కాళ్ళు తెగినవారు, చేతులు విరిగినవారు, పళ్ళు ఊడినవారు రక్తసిక్తమయి హాహాకారాలు చేస్తున్నారు.

ఈ బాణాల యుద్ధంలో ఇరుపక్షాలకు చెందిన కొందరు చనిపోయారు. అయితే వారి సంఖ్య బహు తక్కువ. అంటే ఆరుగురు ముస్లింలు, పది మంది ముష్రిక్కులు చనిపోయారు. వీరిలోనూ ఒకరిద్దరు ఖడ్గఘాతం వల్ల హతులైయ్యారు.

అవస్ తెగ ముస్లింల నాయకుడు 'హజ్రత్ సఅద్ బిన్ ముఆజ్ (రజి)' కూడా విల్లు ఎక్కుపెట్టి బాణాలు కురిపిస్తున్నారు. కాస్సేపటికి కందకం ఆవల ఒక శత్రువు మాటుకాచి సఅద్ (రజి) వైపు గురిపెట్టి బాణం వదిలాడు. దాంతో సఅద్ (రజి) తీవ్రంగా గాయపడ్డారు. బాధతో మెలికలు తిరుగుతూ అక్కడ్నుంచి పక్కకు తప్పుకున్నారు.

కారుతున్న రక్తధారలతో అప్రయత్నంగా చేతులు జోడించి ఫైకెత్తారు. సకల చరాచరాల సృష్టికర్త, పరమ కృపాశీలుడయిన విశ్వప్రభువు ముందు అంతరంగం నుండి పొంగిన ఆవేదనా తరంగిణి జాలువారింది....; ↓

*"నా దైవమా! ఖురైషీయులతో ఇంకా యుధ్ధం కొనసాగించవలసి ఉంటే నన్ను ఇంకా సజీవంగా ఉంచు. ఏ జాతి జనం నీ ప్రవక్తను తిరస్కరించి దేశబహిష్కరణ చేశారో అలాంటివారితో తప్ప నాకు మరొకరితో యుద్ధం చేయాలన్న కోరిక లేదు. అయితే ఖురైషీయులతో ఇప్పుడు యుద్ధం ముగిసిపొతే, అది జరగకపొతే నాకు ఈ గాయంతోనే అమరగతి భాగ్యం ప్రసాదించు. అలా కాకపొతే బనూ ఖురైజా తెగ వల్ల నా నేత్రాలు చల్ల బడనంతవరకూ నాకు చావునివ్వకు."*

'హజ్రత్ సఅద్ బిన్ ముఆజ్ (రజి)' గారి వేడుకోలు గురించి వేరొక ఉల్లేఖనం ప్రకారం....; ↓

ఈ శరపరంపర సందర్భంలోనే హజ్రత్ సఅద్ బిన్ ముఆజ్ (రజి)కు కూడా ఓ బాణం వచ్చి తగిలింది. దీనివల్ల ఆయన చేతి ప్రధాన నరం ఒకటి తెగిపోయింది. ఆయనకు బాణం వేసింది 'హబ్బాన్ బిన్ అర్కా' అనేవాడు. ఇతను ఖురైష్ కు చెందిన ముష్రిక్కు. హజ్రత్ సఅద్ (రజి) (గాయపడ్డ తరువాత) అల్లాహ్ ను ఇలా వేడుకున్నారు....;

*"ఓ అల్లాహ్! ఏ జాతి అయితే నీ ప్రవక్త (సల్లం)ను ధిక్కరించిందో, ఆయన్ను ఇంటి నుండి గెంటివేసిందో, వారితో నీ మార్గంలో యుద్ధం చేయడం ఎంత ప్రియమైన విషయమో నీకు బాగా తెలుసు. ఓ అల్లాహ్! నీవు ఈ యుద్ధాన్ని చివరి దశకు చేరుస్తున్నావని అనుకుంటున్నాను. ఖురైషులతో ఇంకా యుద్ధం కొనసాగించవలసి వస్తే నన్ను వారి కొరకు సజీవంగా ఉంచు. నేను నీ మార్గంలో వారితో జిహాద్ చేస్తాను. ఒకవేళ నీవే ఈ యుద్ధాన్ని ఇంతటితో ముగించదలిస్తే మాత్రం నాకు కలిగిన ఈ గాయాన్ని మానకుండా అలానే ఉంచు. ఈ గాయంతోనే నన్ను మరణించేటట్లు చెయ్యి."*

ఆయన వేడుకోలులోని చివరి వాక్యం ఇలా ఉంది....; *"(కాని,) బనూ ఖురైజా వ్యవహారంలో నా కళ్ళు చల్లబడే వరకు నాకు మరణాన్ని ఇవ్వవద్దు."*

బనూ ఖురైజా యూదులు ముస్లిములతో చేసుకున్న స్నేహ ఒప్పందం భంగం చేసి ఉండకపోతే ముస్లిం ముజాహిద్ లకు ఇంతటి ప్రమాదకర పరిస్థితి ఎదురయ్యేది కాదు. యూదులు కనీసం ఖురైష్‌ సైనికులతో చేతులు కలపకపోయినా పరిస్థితి ఇంత దారుణంగా విషమించేది కాదు.

కాని ఇప్పుడు ఈ క్లిష్ట పరిస్థితిని ఎలా అధిగమించడం? ముస్లింలు సంకట స్థితిలో పడి తల్లడిల్లిపోతున్నారు. ఒక్కొక్కఘడియ ఒక్కొక్క యుగంలా గడిచిపోతోంది. అనుక్షణం భయాందోళనలతో గడపవలసి వస్తోంది. రేయింబవళ్ళూ రెప్ప వాల్చకుండా కందకాన్ని కాపలా కాయవలసి వస్తోంది. నిద్రలేమికి కళ్ళు తిరుగుతున్నాయి. క్రణక్షణానికి తీప్రరూపం దాల్చుతున్న కదనరంగం చూసి గుండెలు గొంతుల్లోనికి వస్తున్నాయి.

ఓ వైపు ఇస్లామీయ సేనలో అలుముకున్న పరిస్థితి ఇది. మరొక వంక దైవప్రవక్త (సల్లం), ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తన తలను, ముఖాన్ని గుడ్డతో కప్పుకున్నారు. అలానే చాలా సేపటి వరకు వెల్లకిలా పడుకొని ఉన్నారు. మహాప్రవక్త (సల్లం) గారి ఈ పరిస్థితి చూసి ముస్లిముల్లో భయభీతులు చోటుచేసుకున్నాయి. అయితే ఆ తరువాత ఆయన (సల్లం)కు స్థిమితం చేకూరింది. ఆయన (సల్లం)లో క్రొత్త ఆశలు పొడసూపాయి.

దైవప్రవక్త (సల్లం) తమ నిస్సహాయ స్థితి నుండి *"అల్లాహు అక్బర్"* అంటూ లేచి నిలబడ్డారు. ముస్లింలను ఉద్దేశించి, *"ముస్లిములారా వినండి! అల్లాహ్ తరఫున సహాయం మరియు విజయ శుభవార్త వచ్చింది."* అన్నారు.

దైవలీల ఏమిటోగాని శత్రు సేనలోనే చీలిక ఏర్పడింది. ఆ తరువాత వారు ఓటమికి గురి అయిపోయారు. అది ఎలా సాధ్యం అయిందో ఆ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి....; ↓

బనూ గత్ఫాన్ తెగకు చెందిన ఓ వ్యక్తి "నుఅయిమ్ బిన్ మస్ఊద్ బిన్ ఆమిర్ అష్'జయీ" మహాప్రవక్త (సల్లం) సన్నిధికి రావడం జరిగింది. ఆయన దైవప్రవక్త (సల్లం)తో ఇలా విన్నవించుకున్నారు.

*"ఓ దైవప్రవక్తా! నేను ఇస్లాం స్వీకరించాను. కాని ఈ విషయం నా జాతికి ఇప్పటి వరకూ తెలియదు. తమరు నాకు ఏదైనా ఆదేశం ఇవ్వండి. దాన్ని పాలించడానికి సిద్ధంగా ఉన్నాను."* అన్నారు.

*ఆ తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment