289

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 289*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 204*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

      *హుదైబియా ఒప్పందం : - 6*

*ముస్లిముల తరఫున హజ్రత్ ఖరాష్ బిన్ ఉమయ్యా (రజి) రాయబారం : -*

దైవప్రవక్త (సల్లం) ఈసారి ఖురైషీయులకు తాము కాబాదర్శనం నిమిత్తమే వచ్చామని తెలియజేయడానికి 'హజ్రత్ ఖరాష్ బిన్ ఉమయ్యా (రజి)'ని పంపారు.

హజ్రత్ ఖరాష్ (రజి) ఒంటె ఎక్కి మక్కా బయలుదేరారు. ఆయన నేరుగా అబూ సుఫ్యాన్ ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో అబూ సుఫ్యాన్ ఇంటి ఆవరణలో కూర్చొని ఉన్నాడు. ఆయనతో పాటు 'ఇక్రమా బిన్ అబూజహల్', 'ఖాలిద్ బిన్ వలీద్', 'అమ్రూ బిన్ ఆస్' వగైరా ప్రముఖులు కూడా ఉన్నారు. వారిలో ముస్లింల దగ్గరకి రాయబారిగా వెళ్ళివచ్చిన 'హులైన్ బిన్ అల్కమా' కూడా ఉన్నాడు.

*"ఖురైషీయులారా! నేను దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) ప్రత్యేక దూతను. మేము మీతో యుద్ధం చేయడానికి రాలేదని, కాబాదర్శనం కోసం మాత్రమే వచ్చామని తెలియజేయడానికి నేను మీ దగ్గరకి వచ్చాను. కాబట్టి మీరు మమ్మల్ని కాబాదర్శనం చేసుకోనివ్వండి. మమ్మల్ని నిరోధించకండి."* అన్నారు హజ్రత్ ఖరాష్ (రజి).

*"ఒకవేళ మేము మిమ్మల్ని కాబాదర్శనం చేసుకోనివ్వకుండా నిరోధిస్తే....?"* అన్నాడు ఇక్రమా బిన్ అబూజహల్.

*"అప్పుడు మేము యుద్ధం చేస్తాం. మిమ్మల్నందర్నీ హతమార్చి కాబాదర్శనం చేసుకుంటాం."* అన్నారు హజ్రత్ ఖరాష్ (రజి) ఎలాంటి జంకూ గొంకూ లేకుండా.

*"ఓహో! నువ్వు మమ్మల్ని బెదిరించడానికి వచ్చావన్నమాట!! కాని నీ చావుబ్రతుకులు మా చేతిలో ఉన్న సంగతి మరచిపోతున్నావు సుమా!"* అన్నాడు ఇక్రమా.

*"పొరపడుతున్నావు ఇక్రమా! ప్రతి మనిషి చావుబ్రతుకులు సర్వలోక ప్రభువయిన అల్లాహ్ చేతిలో ఉన్నాయి. ఆయన ఆజ్ఞ లేనిదే నువ్వేమీ చెయ్యలేవు."* అన్నారు ఖరాష్ (రజి)

అల్లాహ్ పేరు వినగానే అవిశ్వాసులు మండిపడ్డారు. వెంటనే వారిలో కొందరు లేచి ఖరాష్ (రజి) తీసుకొచ్చిన ఒంటెను చంపి, ఖరాష్ (రజి) మీదికి లంఘించారు.

హజ్రత్ ఖరాష్ (రజి) ఆగ్రహోదగ్రులై చర్రున కత్తి దూసి వారి ముందు నిలబడ్డారు.

*"నీచులారా! మీరు చర్చలకు వచ్చిన రాయబారినే చంపడానికి సిద్ధమయ్యారా! మీలో అసలు ఆత్మాభిమానం మచ్చుకైనా ఉందా? మీరంతగా యుద్ధజ్వాలల కోసం వెంపర్లాడుతుంటే, రండి మాతో పోరాడండి. కాని ఒక విషయం గుర్తుంచుకోండి. నేను ఏ ప్రజల తరఫున రాయబారిగా పంపబడ్డానో, వారు మీపై విరుచుకుపడి మిమ్మల్ని సమూలంగా మట్టుపెడతారు. నా మరణం మీ అందరి పాలిట మరణమృదంగం అవుతుంది."* అన్నారు ఆయన (రజి).

ఖడ్గం చేతిలో పట్టుకొని కళ్ళలో నిప్పులు కురిపిస్తున్న ఖరాష్ (రజి)ని చూసి సత్యతిరస్కారులు వెనుకంజ వేశారు. హులైస్ కు కూడా ఖురైషీయుల వైఖరి నచ్చలేదు.

*"ఖురైషీయులారా! ఏమిటి ఈ అన్యాయం? ఎంతటి పిరికిపంద జాతి కూడా రాయబారిని వధించదు. మీరు గనక అతడ్ని చంపితే మీ జాతి మీద మాయని మచ్చ ఏర్పడుతుంది. మీకు ధైర్యం ఉంటే బయటికెళ్ళి ముస్లిములతో పోరాడండి."* అన్నాడతను.

*"నిజమే. రాయబారిగా వచ్చిన మనిషిని చంపితే మన జాతికి పెద్ద కళంకం వస్తుంది. ఖరాష్ (రజి)! నీవు వెళ్ళిపోయి, మేము ముస్లింలను ఎట్టిపరిస్థితిలోనూ మక్కాలో ప్రవేశించనీయం అని మీ ప్రవక్తకు చెప్పెయ్యి."* అన్నాడు ఇక్రమా.

ఆ తర్వాత హజ్రత్ ఖరాష్ (రజి) ఖడ్గం వరలో పెట్టేసి వెళ్ళిపోయారు.

చర్చల కోసం వెళ్ళిన ఖరాష్ (రజి), అత్యంత ఆందోళనకర స్థితిలో వెనక్కి వచ్చి, జరిగిన వృత్తాంతాన్ని ప్రవక్త (సల్లం)కు ఇలా వివరించారు....; ↓

*"ఓ ప్రవక్తా! ఖురైషులు క్రోధాగ్నిలో రగిలిపోతున్నారు. వారు నా ఒంటెను చంపేశారు. అహాబిష్ తెగవారు నన్ను కాపాడారు కాబట్టి సరిపోయింది. లేకపోతే వారు అసలు నన్ను చంపేసేవారే."*

రాయబారికి, రాయబారి సొమ్ముకు కీడు తలపెట్టటమనేది అరబ్బుల్లో ఎన్నడూ లేదు. అసలు అదొక పెద్ద ఘాతుకంగా భావించబడేది. ఖురైషులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ముస్లిముల పట్ల ఖురైషులు ఎంతటి కోపావేశాలతో రగిలిపోతున్నారో ఈ దురాగతం వెల్లడి చేసింది.

దైవప్రవక్త (సల్లం) మాత్రం ఈ సంఘటనపై చాలా సౌమ్యంగా స్పందించారు. ఖురైషులకు వ్యతిరేకంగా ఆయన (సల్లం) ఒక్క మాట కూడా అనలేదు. రాయబారులు అందించిన సమాచారం గురించి అన్ని కోణాల్లో ఆలోచించటం మొదలుపెట్టారు. తర్వాత తన సహచరులను ఉద్దేశించి, *"మనం వారి క్రూరత్వాన్ని సహనంతో ఎదుర్కొందాం. వారి ఈ రోగానికి మన్నింపుల మందుతో చికిత్స చేద్దాం. బహుశా ఖరాష్ (రజి) వారి కంటికి గొప్ప రాయబారిగా కనిపించలేదేమో! ఉమర్ (రజి) అయితే బాగా చర్చలు జరపగలరని నా అభిప్రాయం."* అన్నారు.

ఇప్పుడు దైవప్రవక్త (సల్లం), తమ ప్రస్తుత ప్రయాణాన్ని గురించి విడమర్చి చెప్పడానికి ఖురైషుల ముందుకు మరొక దూతను 'హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజి)'ను పంపాలని నిశ్చయించుకున్న తర్వాత ఆయన (రజి)ను పిలువనంపారు.

కాని రాయబారిగా వెళ్లేందుకు ఉమర్ (రజి) అనుమానం వెలిబుచ్చుతూ, *"ఓ అల్లాహ్ ప్రవక్తా! ఒకవేళ అక్కడ నన్ను బాధించడం జరిగితే, బనీ కఅబ్ తెగలో ఏ వ్యక్తి కూడా వారి ఆగడాలను సహించక నన్ను ఆదుకునేవాడు కానరావడం లేదు. కాబట్టి తమరు హజ్రత్ ఉస్మాన్ (రజి)ను అక్కడికి పంపించండి. ఆయన వంశం, కుటుంబం అంతా మక్కాలోనే ఉంది. అలా ఆయన తమ సందేశాన్ని వారికి అందజేసినవారవుతారు."* అని విన్నవించుకున్నారు.

_ఉమర్ (రజి), దైవప్రవక్త (సల్లం)తో పలికిన ఈ మాటలు వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉన్నాయి....; ↓_

*"దైవప్రవక్తా! ఇంతవరకూ నేనెప్పుడూ మీ మాట కాదనలేదు. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మక్కాకు వెళితే నా ప్రాణానికే ముప్పు. మక్కావారు నన్నూ, నా తెగవారిని విపరీతంగా ద్వేషిస్తున్నారు. మేమంతా ముస్లింలమై మక్కా వదిలిపెట్టి వచ్చాము. అక్కడ నాకు రక్షణ కల్పించేవారెవ్వరూ లేరు. అయితే మక్కాలో మంచి స్థానం, రక్షణ కలిగిన వ్యక్తి మనలో ఒకరు ఉన్నారు. ఆయనే ఉస్మాన్ (రజి). మక్కా నాయకులైన అబాన్, ముఆవియా, అబూ సుఫ్యాన్ వీళ్ళందరూ ఉస్మాన్ (రజి) వంశం వారే. కాబట్టి ఉస్మాన్ (రజి)కు మక్కాలో ఎటువంటి హాని ఉండదు."* అన్నారు.

మహాప్రవక్త (సల్లం), హజ్రత్ ఉస్మాన్ (రజి)ను పిలువనంపి ఆయన్ను ఖురైషుల వద్దకు వెళ్ళమని ఆదేశిస్తూ, *"వారికి ఎరుకపరచకండి! మేము పోరాడటానికి రాలేదు, కేవలం ఉమ్రా చేయడానికి వచ్చాము అని. దానితో పాటు వారిని ఇస్లాం వైపునకు రమ్మని ఆహ్వానించండి. మక్కాలో ఉన్న విశ్వాసుల స్త్రీ పురుషులందరికి త్వరలోనే విజయం చేకూరుతుంది అనే శుభవార్తను కూడా తెలుపండి. అల్లాహ్ తన ధర్మాన్ని మక్కాలో విస్తరింపజేస్తాడనీ, దానికే విజయం చేకూరుతుందనీ, ఇస్లాం విషయంలో మునుముందు ఎవ్వరూ దాక్కునే అవసరం కూడా ఉండబోదనీ శుభవార్తనందించండి."* అని చెప్పి పంపించారు.

*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment