287

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 287*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 202*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

      *హుదైబియా ఒప్పందం : - 4*

*బుదైల్ బిన్ వర్కా మధ్య వర్తిత్వం : -*

దైవప్రవక్త (సల్లం)కు, హుదైబియాకు వచ్చిన తరువాత కొంత స్థిమితం ఏర్పడింది. ఈ లోపు 'బుదైల్ బిన్ వర్కా ఖుజాయి' తన 'ఖుజాఅ' తెగకు చెందిన కొందరు పెద్ద మనుషుల్ని వెంట బెట్టుకొని మహాప్రవక్త (సల్లం) గారి సన్నిధిలో హాజరయ్యాడు. ఖుజాఅ తెగ దైవప్రవక్త (సల్లం) శ్రేయాన్ని కోరుతున్న తెగ. బుదైల్, ప్రవక్త (సల్లం) సన్నిధికి రాగానే జనం అతణ్ణి ప్రశ్నించసాగారు. కాని అతను ఎవరికీ జవాబు చెప్పకుండా నేరుగా దైవప్రవక్త (సల్లం) గుడారంలోకి వెళ్ళి, దైవప్రవక్త (సల్లం)తో....; ↓

*"ముహమ్మద్ (సల్లం)! ఖురైషు నాయకులు నిన్న ఒక సమావేశం జరిపారు. అందులో మిమ్మల్ని మక్కాలోకి అడుగుపెట్టనీయరాదని ప్రతినబూనారు. మీకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు. తాము పూజించే విగ్రహాల సమక్షంలోనే వారు ఒట్టేసుకున్నారు. కనుక మీతో నా మనవి ఏమంటే, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వారు మీకు ఏ విధంగానైనా హాని కలిగించటానికి ప్రయత్నించవచ్చు. ఇప్పుడు నేను 'కఅబ్ బిన్ లుబా' దగ్గర నుండే ఇటు వచ్చాను. అతను హుదైబియాకు చెందిన ఒయాసిస్సు దగ్గర విడిది చేసి ఉన్నాడు. అతని వెంట స్త్రీలు, పిల్లలు కూడా ఉన్నారు. అతను తమతో పోరాడడానికి, కాబా గృహానికి పోకుండా తమను అడ్డుకోవడానికి గట్టి నిర్ణయం తీసుకున్నాడు."* అని అన్నాడు.

దానికి మహాప్రవక్త (సల్లం), *"మేము ఎవరితోనూ పోరాడడానికి రాలేదు. ఖురైషులను యుద్ధాలు సర్వనాశనం చేసివేశాయి. వారే కోరితే ఓ నిర్ణీత కాలం వరకు సంధి చేసుకోదలిచాను. వారు నాకూ, నా సహచరులకు నడుమ అడ్డుగా నిలువకుండా ఉండాలి. ప్రజలు ఇస్లాం ధర్మంలో ఎలా చేరిపోతున్నారో వారు కూడా ఇస్లాం ధర్మంలో చేరితే మంచిదే. కాదంటారా, ఈ ఒప్పందం ద్వారా వారికి శాంతి అయినా లభిస్తుంది. ఒకవేళ వారికి పోరాటం తప్ప మరేది నచ్చనట్లయితే దైవసాక్షిగా చెబుతున్నాను! ఎవరి చేతుల్లోనయితే నా ప్రాణాలున్నాయో, నేను నా ధర్మం విషయంలో నా తల నా మొండెం నుండి వేరైనంత మట్టుకు పోరాడుతూనే ఉంటాను. లేదా అల్లాహ్ తన నిర్ణయాన్ని వారిపై అమలునయినా చేస్తాడు."* అన్నారు.

*"తమరు చెప్పిన విషయం ఉన్నదీ ఉన్నట్లుగా వారికి తెలియజేస్తాను."* అంటూ ఖురైషీయుల వద్దకు వెళ్ళాడు బుదైల్. తరువాత వారిని సంబోధిస్తూ, *"ఖురైషీయులారా! నేను ఆయన (సల్లం)ను కలిసే వస్తున్నాను. నేను ఆయన (సల్లం) చెప్పిన మాటలు బాగా విన్నాను. మీరు వినదలచుకుంటే మీ ముందు ఉంచగలను."* అన్నాడు.

*"లేదు, మేము వినే అవసరమే లేదు. నీవు మా ముందు ఆయన (సల్లం) చెప్పింది ఏమీ చెప్పొద్దు."* అన్నారు వారిలోని కొందరు మూర్ఖులు.

కాని ఎవరికయితే కొంత బుద్ధీవివేచనలున్నాయో వారు మాత్రం, *"చెప్పు, ఆయన (సల్లం) ఏమని చెప్పాడో!"* అని అడిగారు.

దైవప్రవక్త (సల్లం), తనకు ఏం చెప్పారో, ఆ మాటలనే ఖురైషీయులకు వినిపించాడు బుదైల్.

ఇది విన్న ఖురైషీయులు, ముస్లింల గురించి తమ గుండెల్లో రగులుతున్న క్రోధాగ్నిని వెళ్ళగ్రక్కుతూ, *"ఏమిటీ, ముహమ్మద్ (సల్లం) మళ్ళీ మా మీద దాడి చేసి, మమ్మల్ని అవమానపరచటానికి వచ్చాడా? ఉత్బా, షైబా, ఇబ్నె హిషామ్ లాంటి మా నాయకుల్ని చంపింది చాలదంటనా? వారి చావు దృశ్యం ఇంకా మా కళ్ళ ముందు నుంచి తొలగిపోలేదు. వారి భార్యలు ఇంకా వారి కోసం ఏడుస్తూనే ఉన్నారు. ఇంతలోనే మరో యుద్ధానికి తెగబడ్డాడా?"* అని గాండ్రించారు.

బుదైల్ వారి మాటను మధ్యలోనే ఆపి, *"నన్ను నమ్మండి. నేను కళ్ళారా చూసి వచ్చాను. వారంతా ఇహ్రాం దుస్తులు ధరించి ఉన్నారు. సాంప్రదాయిక ఖడ్గాలు తప్ప వారి దగ్గర ఇతర ఆయుధాలు కూడా ఏమీ లేవు. పైగా వారు బలి ఇవ్వటానికి ఎన్నో జంతువులను కూడా తీసుకువచ్చారు. వాళ్ళది ఒకే ఆశ. అది ఉమ్రా చేయటం. ఈ ధర్మకార్యాన్ని నిర్వర్తించుకొని శాంతియుతంగా వెళ్ళిపోయేందుకు ముహమ్మద్ (సల్లం)ను అనుమతించండి."* అని ఖురైషు సర్దారులను కోరాడు.

తాము దూసిన ఖడ్గాలు శాంతించి తిరిగి ఒరల్లోకి వెళ్తాయని ఆశిస్తున్నట్లయితే, వెంటనే తాను ఆ భ్రమ నుంచి తెరుకోవాలని ఖురైషులు బుదైల్ ను హెచ్చరించారు. తమకు సలహాలు ఇవ్వటం మానుకొమ్మంటూ అతనికి చీవాట్లు పెట్టారు. అతని మాటల్ని విషపూరితమైనవిగా పేర్కొన్నారు. అతని తెగవారు ముహమ్మద్ (సల్లం)తో ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇక తమను తప్పుదారి పట్టించడం మానుకుంటే మంచిదని వారు అతణ్ణి హెచ్చరించారు.

*ముక్రజ్ బిన్ హఫజ్ మధ్యవర్తిత్వం : -*

ఇక ఆ తరువాత ఖురైషీయులు, ప్రవక్త (సల్లం) వద్దకు 'ముక్రజ్ బిన్ హఫజ్' అనే వ్యక్తిని విషయాలు తెలుసుకురమ్మని పంపించారు. దైవప్రవక్త (సల్లం), అతణ్ణి దూరం నుండే చూస్తూ, *"ఒప్పందాలను త్రెంచే నీచుడు వస్తున్నాడు చూడండి."* అని సహాబా (రజి)కు చెప్పారు. అతను దగ్గరకు వచ్చి దైవప్రవక్త (సల్లం)తో మాట్లాడాడు. మహాప్రవక్త (సల్లం), ఇది వరకు బుదైల్ కు చెప్పిన విషయమే అతనికి చెప్పారు. ముక్రజ్ వెనుదిరిగి వెళ్ళి ఆ విషయం పూర్తిగా ఖురైషులకు చెప్పాడు.

*'హులైస్ బిన్ అల్కమా' మధ్యవర్తిత్వం : -*

మక్కా ప్రజల నాయకుడైన అబూ సుఫ్యాన్ తన ప్రజలకు సలహా ఇస్తూ, *"బనూ హులైస్ నాయకుడు, 'అల్కమా' కుమారుడైన 'అల్ హులైస్'ను మనం మన రాయబారిగా ముహమ్మద్ (సల్లం) వద్దకు పంపుదాం. అతను మన పొరుగువాడే. అదీగాక అతను మన కూటమి సభ్యుడు. అతను ముహమ్మద్ (సల్లం)ను మదీనాకు త్రిప్పి పంపించగలుగుతాడేమో."* అన్నాడు.

అబూ సుఫ్యాన్ ఇచ్చిన ఈ సలహాను అందరూ అంగీకరించారు.

ఆ తర్వాత, ఖురైషీయుల రాయబారిగా హులైస్, మహాప్రవక్త (సల్లం) వద్దకు బయలుదేరాడు. తమ వద్దకు వస్తున్న హులైస్ రాకను దూరం నుంచే గమనించిన దైవప్రవక్త (సల్లం), సహాబాలతో, *"చూడండి, వచ్చేవాడు హులైస్. ఇతను హదీ పశువులను అధికంగా గౌరవించే జాతికి చెందినవాడు. కాబట్టి మీరు అతనికి ఎదురుగా మీ హదీ పశువులను నిలబెట్టండి. వాటిని చూసి, మనం ఉమ్రా యాత్ర కోసం మాత్రమే వచ్చామని, వినాశనం కోసం రాలేదని తెలుసుకుంటాడు."* అని ఆదేశించారు.

సహాబా (రజి), ఆ ఖుర్బానీ పశువులను అతనికి ఎదురుగా తోలుతూ *"లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్"* అని పఠించనారంభించారు.

ఈ దృశ్యం హులైస్ చూశాడు. సాంప్రదాయకంగా తీర్చిదిద్దిన పశువుల గుంపు చూసి అతని కళ్ళు చెమర్చాయి. ఖురైషీయులు నిజంగానే ముస్లింలపై అన్యాయానికి పాల్పడుతున్నారని గ్రహించాడు. *"సుబ్హానల్లాహ్! వీరిని దైవగృహానికి పోకుండా ఆపడం సరి అయిన విషయం కాదు."* అంటూ, దైవప్రవక్త (సల్లం)తో మాట్లాడకుండానే వెనక్కు వెళ్ళిపోయాడు.

హులైస్ విజయవంతంగా తిరిగొస్తాడని, తమ గుండెల్లో మండుతున్న ప్రతీకార జ్వాలల్ని చల్లార్చే శుభవార్త మోసుకొస్తాడని ఖురైష్ నాయకులు తెగ సంబరపడిపోతూ అతని రాక కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

కాస్సేపటికి హులైస్ గంభీరవదనంతో వచ్చాడు. రాగానే ఖురైషీయుల ఆశలను వమ్ముచేస్తూ, *"నేను హదీ పశువుల్ని చూశాను. వాటి మెడలలో పట్టాలున్నాయి. ఒంటెల కోహాన్లు (మూపరాలు) కూడా చీల్చబడి ఉన్నాయి. నేను మాత్రం వారిని దైవగృహం కాబాకు రాకుండా అడ్డుకోవడం సరి అయిన విషయం కాదని తలుస్తున్నాను."* అని అన్నాడు.

_ఖురైషీయులతో హులైస్ అన్న ఈ మాటలు వేరొక ఉల్లేఖనం ప్రకారం....; ↓_

*"ఖురైషీయులారా! పుణ్యక్షేత్ర యాత్ర చేసుకోవడానికి వచ్చినవారిని ఆపటం మహాపాపం"* అని అంటూ, తమ ప్రదేశం కాని వాళ్ళయిన 'యుహ్జర్', 'హిమ్యర్' తెగలవారికి తాము కాబా యాత్ర చేసుకోవటానికి అనుమతించిన సంగతిని గుర్తు చేస్తూ, *"ముహమ్మద్ (సల్లం) తాతగారు గొప్ప నాయకుల్లో ఒకరు. ఆయన మనవణ్ణి మక్కాలో అడుగుపెట్టనీయకుండా నిలువరించడం భావ్యం కాదు. ప్రజలను హజ్, ఉమ్రా యాత్రలు చేయకుండా ఆపటానికి నేను మీతో కూటమిలో చేరలేదు. ఒకవేళ మీరు ఈ విషయంలో మొండిగా ప్రవర్తించి, ముహమ్మద్ (సల్లం)ను మరియు ఆయన అనుచరులను కాబా గృహాన్ని సందర్శించనీయకపోతే, నా ఆధీనంలో ఉన్న తెగలన్నీటిని తీసుకొని మీ నుంచి వేరైపోతాను. మన మధ్య ఉన్న ఒప్పందాన్ని త్రెంచుకోవాల్సి వస్తుంది కూడా. అంతేకాదు, ముహమ్మద్ (సల్లం) పక్షాన నిలబడి మీ అంతు చూస్తాను."* అని హెచ్చరించి అక్కణ్ణుంచి బయలుదేరాడు.

ఖురైషులు అతణ్ణి ఆపుతూ, *"హులైస్! మరీ అంత కోప్పడవద్దు. ఆలోచించుకోవడానికి మాకు కొంత సమయం ఇవ్వు."* అని కోరారు.

ఖురైషులు మీమాంసలో పడిపోయారు. ఒక వైపేమో తాము ముహమ్మద్ (సల్లం)ను అడ్డుకుంటామని తమ పూజ్య దేవతల ముందు ఒట్టేసుకొని ఉన్నారు. మరోవైపు గత యుద్ధాల్లో ముస్లింల శక్తిసామర్థ్యాలనూ వారు చూసి ఉన్నారు. బద్ర్ యుద్ధం రోజున ఒక చిన్న సైనిక పటాలం చేతిలో వారు తిన్న చావుదెబ్బ వారి జీవిత చరిత్రలో ఒక చీకటి పుటగా మిగిలిపోయింది. అలాగే ఉహద్ యుద్ధంలో తాత్కాలికంగా తమది పైచేయి అయినా అందులోనూ వారికి ఒరిగిందేమీ లేదు. ఇటీవల జరిగిన కందక యుద్ధ భయానక పరిణామాలూ ఇంకా వారి స్మృతిపథం నుంచి చెరిగిపోలేదు.

అయితే, ముస్లింలను ఇప్పుడు అడ్డుకోకుండా మక్కాలోకి స్వాగతిస్తే, అది తమ పాలిట ఇంకా అవమానకరంగా పరిణమిస్తుందన్న భయం కూడా మరో వైపు ఖురైషులను వెంటాడుతూ ఉంది.

*ఉర్వా బిన్ మస్ఊద్ మధ్యవర్తిత్వం గురించి In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment