283

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 283*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 198*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

*3. సరియ్యా వాదియుర్ ఖురా (ఖురా లోయ) : -*

ఈ సైనిక చర్య 'హజ్రత్ అబూ బక్ర్ సిద్దీఖ్ (రజి)' లేదా 'హజ్రత్ జైద్ బిన్ హారిసా (రజి)' గారి నేతృత్వంలో రమజాన్ మాసం హిజ్రీ శకం - 6లో పంపబడిన సైనిక చర్య. ఈ సైనిక పటాలాన్ని పంపడానికి గల కారణం, ఫజారా తెగకు చెందిన ఓ శాఖ, మోసంతో దైవప్రవక్త (సల్లం)ను హతమార్చే పథకం వేయడమే. కాబట్టి మహాప్రవక్త (సల్లం) హజ్రత్ అబూ బక్ర్ (రజి)ను పంపించడం జరిగింది. హజ్రత్ సల్మా బిన్ అకూ (రజి) ఆయన వెంట ఉన్నారు. హజ్రత్ సల్మా బిన్ అకూ (రజి) గారి కథనం ప్రకారం....; ↓

*"ఈ సరియ్యాలో నేను కూడా అబూ బక్ర్ (రజి) వెంటే ఉన్నాను. మేము ఫజ్ర్ నమాజు చేసిన తరువాత హజ్రత్ అబూ బక్ర్ (రజి) దాడి చేయమని ఆదేశించగానే మేము వారిపై దాడి చేశాము. అక్కడున్న ఊట బావిని హస్తగతం చేసుకున్నాము. అబూ బక్ర్ (రజి) కొందరిని చంపేశారు. నేను, స్త్రీలు పిల్లలు కలిగిన ఓ గుంపును చూశాను. వీరు నా కంటే ముందు కొండపైకి వెళ్ళిపోతారేమోననే అనుమానం కలిగింది నాకు. కాబట్టి నేను వారిపై బడ్డాను వారికి, కొండకు నడుమన ఉండి వారిపై శరపరంపరలను కురిపించగా వారు అక్కడనే ఆగిపోయారు. ఆ గుంపులో 'ఉమ్మె ఖర్ఫా' పేరు గల ఓ మహిళ కూడా ఉంది. ఆమె పాత చొక్కాను తొడుక్కొని ఉంది. ఆమె వెంట ఆమె కుమార్తె కూడా ఉంది. ఈమె అరేబియాలోనే అతి అందగత్తెగా పేరుగాంచిన స్త్రీ. వారందరినీ అబూ బక్ర్ (రజి) దగ్గరకు తీసుకొని వచ్చాను. ఆయన ఆ అమ్మాయిని నాకు బహుకరించారు. కాని నేను ఆమె ముసుగును మాత్రం తొలగించలేదు."*

ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) ఈ యువతిని హజ్రత్ సల్మా బిన్ అకూ నుండి వేరు చేసి మక్కాకు పంపించారు. ఆమెకు బదులు అక్కడ నివసించే అనేక మంది ముస్లిము ఖైదీలను విడిపించడం జరిగింది.★

_(★→ చూడండి, సహీ ముస్లిం - 2/89; ఈ సరియ్యా హిజ్రీ శకం - 7లో సంభవించింది అని చెప్పుకోవడం కూడా జరిగింది.)_

ఉమ్మె ఖర్ఫా ఓ షైతాను స్త్రీ. దైవప్రవక్త (సల్లం)ను హతమార్చడానికి అనేక పన్నాగాలు పన్నేది. దీని కోసమని ఆమె తన కుటుంబానికి చెందిన ముప్పై మంది ఉష్ట్రారోహుల్ని సిద్ధపరచి ఉంచింది కూడా. దానికి ఆమెకు సరియైన ప్రతిఫలమే లభించింది. ఆ ముప్పై మంది ఉష్ట్రారోహులు చంపివేయబడ్డారు.

*4. సరియ్యా ఉర్ నియ్యీన్ : -*

ఈ సైనిక పటాలం షవ్వాల్ నెల హిజ్రీ శకం - 6లో, 'హజ్రత్ కర్జ్ బిన్ జాబిర్ ఫహరీ (రజి)'■ గారి నేతృత్వంలో పంపబడింది. అక్ల్ మరియు ఉరీనాకు చెందిన కొందరు వ్యక్తులు మదీనాకు వచ్చి ఇస్లాం స్వీకరించారు. వారు మదీనాలో ఉంటూ ఉండగా అక్కడి వాతావరణం వారికి సరిపడక రోగగ్రస్తులయ్యారు. దైవప్రవక్త (సల్లం) వారికి కొన్ని ఒంటెలనిచ్చి పచ్చికబయళ్ళలలో ఉంటూ ఒంటెల పాలు, దాని మూత్రం త్రాగుతూ ఉండండి అని పంపించారు. వీరు అలా చేసి ఆరోగ్యవంతులయ్యారు. దైవప్రవక్త (సల్లం)గారు, వారి వెంట పంపించిన కాపరిని హతమార్చి వారు ఒంటెల్ని తోలుకొని వెళ్ళిపోయారు. అంటే, ఇస్లాం స్వీకరించిన తరువాత తిరిగి ముర్తిద్ లు (ధర్మభ్రష్టులు) అయ్యారన్నమాట. కాబట్టి వారిని పట్టుకోవడానికిగాను కర్జ్ బిన్ జాబిర్ ఫహరీ (రజి)కి ఇరవై మందిని ఇచ్చి పంపించడం జరిగింది. పోయేటప్పుడు దైవప్రవక్త (సల్లం) అల్లాహ్ ను ఇలా వేడుకున్నారు.

*"ఓ అల్లాహ్! ఉర్నీలకు మార్గం అగుపడకుండా చెయ్యి. వారి మార్గాన్ని కష్టతరం చెయ్యి."*

అల్లాహ్, ప్రవక్త (సల్లం) గారి ఈ దుఆను మన్నించాడు. వారికి మార్గం ఏమీ తోచలేదు. వారు పట్టుబడిపోయారు. వారు ముస్లిం కాపరులు ఎడల అవలంబించిన తీరుకు ప్రతీకారంగా వారి కాళ్ళు చేతులు నరికి వేయడం, వారి కళ్ళకు వాతలు పెట్టడం జరిగింది. అలా వారిని హర్రాలోని ఓ మారుమూల ప్రదేశంలో వదిలేయడం వల్ల అక్కడే అంతమైపోయారు.

ఈ సంఘటన 'హజ్రత్ అనస్ (రజి)'గారు ఉల్లేఖించినట్లు సహీ బుఖారీ వగైరా గ్రంథాల్లో ఉంది.

సీరత్ చరిత్రకారులు ఆ తరువాత మరో సరియ్యా గురించి రాస్తారు. అది 'హజ్రత్ అమ్రూ బిన్ ఉమయ్యా జమ్రీ (రజి)', 'హజ్రత్ సల్మా బిన్ అబీ సల్మా (రజి)' కలిసి షవ్వాల్ నెల హిజ్రీ శకం - 6లో నడిపినట్లుగా చెప్పబడుతోంది. దీని వివరాల్లోనికి వెడితే, హజ్రత్ అమ్రూ బిన్ ఉమయ్యా జమ్రీ (రజి), అబూ సుఫ్'యాన్ ను హతమార్చే ఉద్దేశ్యంతో మక్కాకు వెళ్ళారు. ఎందుకంటే, అబూ సుఫ్'యాన్ ఓ బద్దూ (పల్లెవాసి)ను, దైవప్రవక్త (సల్లం)ను హతమార్చే ఉద్దేశ్యంతో మదీనాకు పంపించడం జరిగింది. అయితే ఆ ఉభయుల్లో ఏ ఒక్కరూ తాము చేపట్టిన కార్యంలో కృతకృత్యులు కాలేకపోయారు.

       అహ్జాబ్ యుద్ధం మరియు బనీ ఖురైజా గజ్వా తరువాత చోటు చేసుకున్న సరాయాలు మరియు గజ్వాలు ఇవి. వీటిలో ఎలాంటి భయంకరమైన యుద్ధమూ జరగలేదు. కేవలం మామూలు దాడులు మాత్రమే జరిగాయి. కాబట్టి వీటిని పోరాటాలకు బదులు సైనిక చర్యలుగానే చెప్పుకోవడం సమంజసమైన విషయం. ఇవి కేవలం సైనిక కవాతుల్లాంటివి. వీటి ఉద్దేశ్యం బద్దూలను, శత్రువులను భయభీతులు చేయడమే అని చెప్పవచ్చు. ఆ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తే, అహ్జాబ్ యుద్ధం తరువాత వాటిలో మార్పు రావడం గమనించవచ్చు. ఇస్లాం విరోధులు ధైర్యాలు దెబ్బతినసాగాయి. ఇక ఇస్లాం ప్రాభవాన్ని భంగపరచి ఇస్లామీయ ప్రచారాన్ని అడ్డుకోవడంలో ఎలాంటి ఆశ వారిలో మిగిలిలేదు. కాని ఈ మార్పు ప్రస్ఫుటంగా అగుపించింది ముస్లిములు *హుదైబియా ఒప్పందం* చేసుకున్నప్పుడు మాత్రమే. ఈ ఒప్పందం అసలు ఇస్లామీయ శక్తిని గుర్తించి చేసుకున్న ఒప్పందం. ఆ కాలంలో ఈ శక్తికి అరేబియా ద్వీపకల్పంలో వ్యాపింపజేయకుండా ఉండడానికి ఏ శక్తీ అడ్డుకోజాలదు అనే యదార్థాన్ని చాటి చెప్పిన ఒప్పందం అది.

_(■→ బద్ర్ యుద్ధానికి పూర్వం గజ్వయె సఫ్'వాన్ లో మదీనా పశువులపై దాడి చేసి వాటిని మక్కాకు తోలుకుపోయిన 'వర్జ్ బిన్ జాబిర్ ఫహరీయే ఈయన. ఆ తరువాత ఆయన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి మక్కా విజయం సందర్భంగా అమరగతినొందారు.)_

*In Sha Allah రేపటి భాగంలో....; ↓*

*హుదైబియా ఒప్పందం*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment