282

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 282*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 197*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

*హజ్రత్ జువైరియా (రజి)తో దైవప్రవక్త (సల్లం) వివాహం : -*

దైవప్రవక్త (సల్లం) యుద్ధరంగం నుంచి మదీనాకు తిరిగివచ్చాక యుద్ధంలో లభించిన సమరసోత్తును యోధులకు పంచి పెట్టారు. సమరసొత్తులో అపార ధనం, ఆయుధాలతో పాటు స్త్రీ పురుష ఖైదీలు కూడా ఉన్నారు.

యుద్ధ ఖైదీలలో బనీ ముస్తలిక్ తెగ నాయకుడు 'హారిస్' కుమార్తె 'జువైరియా (రజి)' కూడా ఉన్నది. ఈమె 'హజ్రత్ సాబిత్ బిన్ ఖైస్ (రజి)'కు లభించిన వాటాలో వచ్చింది.

నిన్నటిదాకా స్వేచ్ఛావాయువుల్ని పీల్చుతూ కాలం గడిపిన జువైరియా (రజి)కు ఇప్పుడిలా బానిసగా ఉండాలంటే మనసు ఒప్పడం లేదు. యజమాని సాబిత్ (రజి)కు కొంత డబ్బిచ్చి బానిస బ్రతుకు నుండి బయటపడదామనుకుంది. ఆ విషయాన్ని గురించి ఆమె హజ్రత్ సాబిత్ (రజి) దగ్గర ప్రస్తావించింది. దానికి ఆయన సంతోషంగా అంగీకరించారు.

యజమాని తనకు స్వేచ్ఛనివ్వడానికయితే అంగీకరించాడు. మరి అందుకు ప్రతిఫలంగా ఆయనకు డబ్బివ్వాలి కదా! అదెలా లభిస్తుంది? ఈ విషయంలో ఆమె దైవప్రవక్త (సల్లం) సహాయం అర్థించడానికి వెళ్ళింది.

*"అయ్యా! నేను హారిస్ కూతుర్ని. నా పేరు జువైరియా. మా నాన్న మా తెగకంతటికీ నాయకుడు. నేనిక్కడ ఎలాంటి ఆపదలో చిక్కుకున్నానో మీకు తెలుసు. నేను సాబిత్ (రజి) గారికి లభించిన వాటాలో వచ్చాను. ఆయన నాకు స్వేచ్ఛనివ్వడానికి ఒప్పుకున్నారు. ఈ విషయంలో నేను మీ సహాయం కోరడానికి వచ్చాను."* అన్నది ఆమె.

*"దానికంటే మంచి మార్గం మరొకటి చెప్పనా?"* అన్నారు దైవప్రవక్త (సల్లం).

*"చెప్పండి"* అన్నది జువైరియా ఉత్సాహంతో.

*"సాబిత్ కు నువ్వు చెల్లించాల్సిన పైకం మొత్తం నేనే చెల్లిస్తాను. నిన్ను అనాథగా వదలిపెట్టకుండా వివాహం కూడా చేసుకుంటాను."* అన్నారు దైవప్రవక్త (సల్లం).

*"మహాప్రసాదం! దైవప్రవక్తా! మహాప్రసాదం!! అంతకంటే అదృష్టం ఇంకేం కావాలి? నాకు ముమ్మాటికి ఇష్టమే"* అన్నది ఆమె విప్పారిన ముఖంతో.

అంతేకాదు, అప్పటికప్పుడు ఆమె సత్యధర్మాన్ని విశ్వసించి ముస్లింగా మారిపోవడం కూడా జరిగింది. దాంతో ఆమె అదృష్టతార మరింత ప్రకాశించింది.

హజ్రత్ జువైరియా (రజి) ఇప్పుడు సాధారణ ముస్లిం మహిళ కాదు. ఆమె దైవప్రవక్త (సల్లం) అర్థాంగి. యావత్ ముస్లిం సమాజానికే మాతృమూర్తి. పవిత్ర స్త్రీల జాబితాలో చేరి ప్రథమాంకంలో నిలచిన మహిళా జ్యోతి.

ఈ శుభవార్త తెలిసి ముస్లిములు ఆనందభరితులయ్యారు. వెంటనే వారు తమ దగ్గరున్న బనీ ముస్తలిక్ తెగ బానిసలందరినీ బానిసత్వం నుండి విముక్తం చేశారు.

*"ఇప్పుడు వీరు దైవప్రవక్త (సల్లం)కు సన్నిహితులు. ఆయన శ్రీమతి హజ్రత్ జువైరియా (రజి) తరఫు బంధువులు. అందువల్ల వీరిప్పుడు ఎంతో గౌరవనీయులు."* అన్నారు ముస్లిములు బనీముస్తలిక్ తెగవారికి అమితమైన గౌరవమిస్తూ.

*"జువైరియా ఎంతటి శుభప్రదమైన స్త్రీ! ఆమె మూలాన ఆమె తెగవాళ్ళందరికీ స్వేచ్ఛ లభించింది. ఏ స్త్రీకి ఇంతటి మహాభాగ్యం లభించలేదు. ఈ ఆమె ప్రతిష్ఠ ఆమె ఒక్క దానికే లభించింది."* అన్నారు హజ్రత్ ఆయిషా (రజి) ఈ శుభవార్త విని.

   *గజ్వయె బనీ ముస్తలిక్ తరువాత చేపట్టిన సైనిక చర్యలు*

*1. సరియ్యా దయారె బనీ కల్బ్ (దూమతుల్ జందల్ ప్రాంతం) : -*

ఈ సైనిక పటాలాన్ని 'హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి)' గారి సారథ్యంలో షాబాన్ నెల హి.శ - 6లో పంపడం జరిగింది. దైవప్రవక్త (సల్లం) ఆయన్ను తన ఎదురుగా కూర్చోబెట్టుకొని స్వయంగా తన చేతి మీదుగా ఆయన తలపై తలపాగా కట్టారు. యుద్ధంలో మేలైన తీరును అవలంబించమని హితవు జేస్తూ, "వారే గనక మీకు విధేయులైపోతే వారి రాకుమార్తెను వివాహమాడండి" అని చెప్పి సాగనంపారు.

అచ్చం దైవప్రవక్త (సల్లం) గారు చెప్పినట్లే జరిగింది. హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి), 'తమాజిర్ బిన్తె అజ్బగ్'ను వివాహమాడారు. ఆ తరువాత ఈమె అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి) గారి కుమారుడు 'అబూ సల్మా'కు తల్లి అయింది. ఈ మహిళ తండ్రి తన జాతికి చెందిన సర్దారు మరియు రాజు కూడాను.

*2. సరియ్యా దయారె బనీ సఅద్ (ఫిదక్ ప్రాంతం) : -*

ఈ సైనిక పటాలం 'హజ్రత్ అలీ (రజి)' గారి నేతృత్వంలో షాబాన్ నెల హి.శ - 6లోనే పంపబడింది. ఈ సైనిక చర్యకు గల కారణం, బనూ సఅద్ తెగ ఓ యూదుల సైన్యానికి సహాయం అందిస్తూ ఉంది అనే వార్త అందడమే. కాబట్టి దైవప్రవక్త (సల్లం) హజ్రత్ అలీ (రజి) గారికి తోడు రెండు వందల సైనికుల నిచ్చి పంపించారు. వీరు రాత్రి పూట ప్రయాణిస్తూ పగలు దాగి ఉండేవారు. చివరికి వారికి ఓ వేగులవాడు పట్టుబడ్డాడు. అతను, యూదులకు ఖర్జూరాలు సరఫరా చేసేందుకు సహాయం చేయడానికి సిద్ధపడ్డాడన్న విషయాన్ని అంగీకరించాడు. అదే కాకుండా ఆ వేగులవాడు, బనూ సఅద్ ఏ ప్రదేశంలో ప్రోగై ఉన్నారో కూడా తెలిపాడు. హజ్రత్ అలీ (రజి), వారిపై రాత్రి పూట దాడి చేసి అయిదువందల ఒంటెల్ని, రెండు వేల మేకల్ని హస్తగతం చేసుకున్నారు. అయితే బనూ సఅద్ తమ భార్యాపిల్లలతో సహా పారిపోవడంలో కృతకృత్యులయ్యారు. వారి సర్దారు పేరు 'వబ్ర్ బిన్ అలీమ్'.

*మిగిలినది In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment