278

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 278*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 193*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

     *గజ్వయె బనీయిల్ ముస్తలిక్ : - 3*

*1. మదీనా నుండి అతి నీచమైన వ్యక్తిని గెంటివేసే విషయం : -*

గజ్వయె బనీ ముస్తలిక్ ముగించుకొని మహాప్రవక్త (సల్లం), ముర్యసీ ఊట బావి వద్దకు వచ్చి విడిది చేశారు. ఆ బావి వద్దకు కొంతమంది ముస్లింలు నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళిన వారిలో 'హజ్రత్ ఉమర్ (రజి)' గారికి చెందిన ఓ కూలీవాడు కూడా ఉన్నాడు. అతని పేరు 'జహ్ జాహ్ గిఫ్ఫారి'. అక్కడ అతనికి, మరో వ్యక్తి 'సనాన్ వబర్ జుహ్నీ'కి నడుమ తోపులాట జరిగింది. వారిద్దరూ కొట్టుకున్నారు కూడా. అంతలోనే జుహ్నీ, *"ఓ అన్సారు ప్రజలారా! సహాయానికి రండి"* అని పిలిచాడు అన్సారులను. ఇటు జహ్ జాహ్ గిఫ్ఫారి కూడా తమ జాతి ప్రజల్ని, *"ఓ ముహాజిర్ ప్రజలారా! సహాయానికి రండి"* అని పిలిచాడు.

దైవప్రవక్త (సల్లం)కు ఈ వార్త అందగానే అక్కడికి వెళ్ళి, *"ఇంకా నేను మీలో ఉండగానే ఈ అజ్ఞానపు పిలుపులా? ఈ వైఖరిని వదలండి, ఇది ఎంతో హేయమైన విషయం."* అని చెప్పగా, వారందరూ వెళ్ళిపోయారు.

ఈ వార్త అబ్దుల్లా బిన్ ఉబై చెవిన కూడా పడింది. అతను కోపంతో, *"వారు ఇలా చేశారా? వీరు మన ప్రాంతానికి వచ్చి మనకే ఎదురు తిరుగుతున్నారా? దైవసాక్షి! మనం మన కుక్కను బాగా బలిసినట్లు పెంచితే అది మనల్నే పీక్కుతిన్నట్లుగా ఉంది. మన పూర్వీకులు చెప్పిన సామెత మనపై పూర్తిగా నిజం చేశారు వారు. వినండి! మనం మదీనాకు తిరిగి వెళ్ళాక మనలోని అతి గౌరవనీయుడు మనలోని అతి నీచమైన వ్యక్తిని మదీనా నుండి వెళ్ళగొడతాడు"* అంటూ, అక్కడున్న వారిని ఉద్దేశించి, *"ఈ పీడను స్వయంగా మీరే కొనుక్కున్నారు, వీరిని తీసుకొచ్చి మీ నగరంలో చోటిచ్చారు, మీ ఆస్తుల్ని పంచిపెట్టారు. చూడండి! ఇప్పుడు మీ దగ్గర ఉన్నది వారికి ఇవ్వడం మానేస్తే, వీరు మీ నగరాన్ని వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతారు"* అని రెచ్చగొట్ట నారంభించాడు.

ఆ సమయాన అక్కడ ఓ యువ సహాబీ 'హజ్రత్ జైద్ బిన్ అర్కమ్ (రజి)' కూడా ఉన్నారు. ఆ యువ సహాబీ ఈ విషయాన్ని తన పినతండ్రికి వివరించారు. ఆయన వెళ్ళి దైవప్రవక్త (సల్లం) గారికి ఈ వృత్తాంతాన్ని వివరించారు.

దైవప్రవక్త (సల్లం) వెంటనే జైద్ బిన్ అర్కమ్ (రజి)ని పిలిచి, *"బాబు! నీవు అక్కడ విన్న మాటలేమిటో మరోసారి చెప్పు."* అన్నారు.

జైద్ బిన్ అర్కమ్ (రజి) ఉన్నది ఉన్నట్లు పూసగుచ్చినట్లు చెప్పారు.

దానికి దైవప్రవక్త (సల్లం), *"బహుశా నీవు ఇబ్నె ఉబై పట్ల కోపంగా ఉన్నావు కాబోలు. లేక వినడంలో పొరబడి ఉండవచ్చు."* అన్నారు.

దానికి జైద్ (రజి) తల అడ్డంగా తిప్పుతూ, *"లేదండీ! దైవసాక్షిగా చెబుతున్నాను. నేను ఈ మాటలన్నీ నా చెవులారా అతని నోట విన్నాను."* అన్నారు.

ఇది విన్న హజ్రత్ ఉమర్ (రజి), అబ్దుల్లా బిన్ ఉబై గురించి విని ఆవేశాన్ని అణచుకోలేకపోయారు. *"దైవప్రవక్తా! ఆ ద్రోహిని హతమార్చడానికి అనుమతించండి. ఒక్క వ్రేటుతో వాడి శిరస్సు ఖండిస్తాను. నాకు ఈ అనుమతినివ్వడం సమంజసం కాదనుకుంటే, అన్సారుల్లోనే ముఆజ్ (రజి)కు గాని, అబ్బాద్ (రజి)కు గాని, సఅద్ (రజి)కు గాని, ముహమ్మద్ బిన్ ముస్లిమా (రజి)కు గాని, లేదా మరెవరికైనా అనుమతి ఇవ్వండి. వారతడ్ని వధిస్తారు."* అన్నారు ఆయన (రజి).

*"ఉమర్! శాంతించు. అతడ్ని చంపితే లోకం ఏమనుకుంటుంది? ముహమ్మద్ తన సొంత అనుచరుల్నే చంపుతున్నాడని అనుకోదా? అప్పుడు మన పరిస్థితి ఏమిటి? వద్దు. అలా చేయకూడదు."* అన్నారు దైవప్రవక్త (సల్లం).

ఆ తరువాత దైవప్రవక్త (సల్లం), అబ్దుల్లా బిన్ ఉబై ని పిలిచి అడిగితే, అతను దేవుని మీద ప్రమాణం చేస్తూ, *"నేను ఈ మాటలు అనలేదు."* అని పలికాడు.

అప్పుడు కొందరు అన్సార్ పెద్దలు కల్పించుకొని, *"దైవప్రవక్తా! జైద్ (రజి) అపార్థం చేసుకొని ఉంటాడు. ఇబ్నె ఉబై మానాయకుడు, పెద్దమనిషి. అతని ముందు జైద్ (రజి) మాటలు పట్టించుకోకండి."* అని సర్దిచెప్పారు.

కొందరు జైద్ (రజి)ని మందలించారు. పాపం! జైద్ (రజి) బిక్కమొహం వేసుకొని అసహాయంగా చూస్తూ నిలబడ్డాడు. కాని దైవప్రవక్త (సల్లం)కు, అబ్దుల్లా బిన్ ఉబై ఎలాంటివాడో, జైద్ (రజి) ఎలాంటివాడో తెలుసు.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) తక్షణమే సైన్యం మదీనాకు బయలుదేరాలని ఆదేశించారు.

అది మిట్టమధ్యాహ్నం వేళ. సూర్యుడు ఆకాశం మధ్యకు వచ్చి నిప్పు కణాలు చెరుగుతున్నాడు. సాధారణంగా దైవప్రవక్త (సల్లం) ఇలాంటి వేళల్లో ప్రయాణానికి ఆజ్ఞ జారీ చెయ్యరు. కాని ఈ రోజు ఇంతటి తీవ్రమైన ఎండలో ఇలా ప్రకటించడం....? ముజాహిద్ లకు ఆశ్చర్యం వేసింది.

సహచరులంతా బయలుదేరగా చూసి 'హజ్రత్ ఉసైద్ బిన్ హుజైర్ (రజి)' దైవప్రవక్త (సల్లం) గారి దగ్గరకు వచ్చి, *"ఏమిటి దైవప్రవక్తా! తమరు ఈ రోజు ఎటూ కాని వేళలో బయలుదేరమని ఆదేశమిచ్చారు?"* అని అడిగారు.

*"ఏమిటీ? మీ మనిషి (అంటే అబ్దుల్లా బిన్ ఉబై) చెప్పింది నీకు తెలియదా?"* అడిగారు దైవప్రవక్త (సల్లం).

*"అతనేమన్నాడు?"* ప్రశ్నించారు ఉసైద్ (రజి).

*"అతను మదీనాకు వెళ్ళగానే అతి గౌరవనీయుడు అతి నీచమైన వ్యక్తిని మదీనా నుండి గెంటివేస్తాడట."* అన్నారు ప్రవక్త (సల్లం).

*"దైవప్రవక్తా (సల్లం)! తమరే అనుకుంటే అతన్ని మదీనా నుండి గెంటివేయగలరు. దైవసాక్షి! అతను ఎంతో నీచమైనవాడు. తమరు అతి గౌరవనీయులు. దైవప్రవక్తా (సల్లం)! అతని ఎడల కొంత మెత్తగా వ్యవహరించండి. ఎందుకంటే, దైవసాక్షి! అల్లాహ్ తమరిని మా వద్దకు తీసుకువచ్చినప్పుడు మా జాతి అతణ్ణి కిరీటధారునిగా చేయడానికి పగడాల కిరీటం తయారు చేయిస్తోంది. కాబట్టి అతను ఇప్పుడు, తమరు అతని రాజ్యాధికారాన్ని లాక్కున్నారని తలుస్తున్నాడు."* అన్నారు ఉసైద్ (రజి).

ఈ సంగతి క్రమంగా అన్సార్ ముస్లింలలో వ్యాపించింది. ఇబ్నె ఉబై పట్ల వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

కొందరు అతనితో, *"వెళ్ళి దైవప్రవక్త (సల్లం)కు క్షమాపణ చెప్పుకో"* అన్నారు.

దానికి ఇబ్నె ఉబై తీవ్రంగా స్పందిస్తూ, *"మీరు ఆయన (సల్లం)ని విశ్వసించమన్నారు. నేను విశ్వసించాను. మీరు నన్ను జకాత్ ఇవ్వమన్నారు. నేను జకాత్ కూడా ఇచ్చాను. ఇక నేను ముహమ్మద్ (సల్లం)కు సాష్టాంగపడటం ఒక్కటే మిగిలింది."* అని అన్నాడు.

ఈ మాటలు విని అన్సారులు మరింత ఆగ్రహోదగ్రులై పోయారు. అందరూ అతనికి శాపనార్థాలు పెట్టడం ప్రారంభించారు.

*జైద్ (రజి) పలికిన మాటలను ధృవపరిచిన విశ్వప్రభువు : -*

దైవప్రవక్త (సల్లం) ప్రొద్దుక్రుంకే వరకు రోజంతా, ఉదయం అయ్యే వరకు రాత్రంతా అలా ప్రయాణిస్తూనే ఉన్నారు. మరీ చెప్పాలంటే, బాగా ప్రోద్దెక్కే వరకు తమ ప్రయాణాన్ని సాగిస్తూనే ఉన్నారు అనవచ్చు. బాగా ప్రోద్దెక్కి ఎండ వేడిమి అధికమైనప్పుడు ఓ చోట విడిది చేశారు. అలసి ఉండడం వల్ల ఆదమరచి నిద్రపోయారందరూ.

ఆ సమయంలోనే దైవప్రవక్త (సల్లం) ముఖారవిందం వికసించింది. ఆయన (సల్లం), జైద్ (రజి)ని పిలిపించారు. జైద్ (రజి) వచ్చిన తరువాత ప్రవక్త (సల్లం) చిరునవ్వు నవ్వుతూ, *"జైద్ (రజి)! నీ చెవులు నిజాన్నే విన్నాయి. అల్లాహ్ నీ మాటల్ని ధృవీకరించారు."* అని అన్నారు.

ఈ సంఘటన గురించి దివ్యవాణి ఇలా అవతరించింది....; ↓

*""దైవప్రవక్త వెంట ఉన్నవారిపై ఏమీ ఖర్చు పెట్టకండి. చివరికి వారంతట వారే చెల్లాచెదురైపోతారు." అని చెప్పేది కూడా వీరే. యదార్థానికి భూమ్యాకాశాలలోని నిధినిక్షేపాలన్నీ అల్లాహ్ యాజమాన్యంలోనివే. కాని కపటులు అర్థం చేసుకోవటం లేదు." (ఖుర్ఆన్ 63:7)*

*""మనం గనక మదీనా నగరానికి తిరిగి వెళ్ళినట్లయితే, గౌరవనీయుడు అల్పుణ్ణి అక్కణ్ణుంచి వెళ్ళగొడతాడు" అని వారు అంటున్నారు. నిజానికి గౌరవమైతే అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు, విశ్వాసులకే చెందుతుంది. కాని ఈ కపటులు తెలుసుకోవటం లేదు." (ఖుర్ఆన్ 63:8)*

హజ్రత్ జైద్ (రజి) ఇలా అంటారు....; → *"ఆ వాక్యాలు అవతరించిన తరువాత దైవప్రవక్త (సల్లం) నన్ను పిలిపించి వాటిని చదివి వినిపించారు. ఆ తరువాత ఆయన (సల్లం), (జైద్!) అల్లాహ్ నిన్ను ధృవపరిచాడు."* అని చెప్పారు.

ఈ మునాఫిక్ అబ్దుల్లా బిన్ ఉబై కుమారుడు అబ్దుల్లా (రజి), తన తండ్రి వ్యక్తిత్వం కంటే భిన్నమైన వ్యక్తిత్వం గలవారు. ఆయన (రజి) ఓ మంచి సహచరుడు కూడాను. తన తండ్రి చేసిన దుర్మార్గపు పనికి అబ్దుల్లా (రజి) మండిపోసాగారు.

*2. ఇఫ్క్ సంఘటన : -*

ఈ గజ్వాకు సంబంధించిన మరో ముఖ్య సంఘటన 'ఇఫ్క్' సంఘటన. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటంటే...., ↓

*In Sha Allah రేపటి భాగంలో తెలుసుకుందాం.*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment