277

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 277*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 192*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

     *గజ్వయె బనీయిల్ ముస్తలిక్ : - 2*

*గజ్వయె బనీ ముస్తలిక్ కు పూర్వం కపట విశ్వాసి అబ్దుల్లా బిన్ ఉబై అవలంభించిన వైఖరి : -*

(మునుపటి భాగం కొనసాగింపుతో....) అలాగే అహ్జాబ్ యుద్ధం సందర్భంలో కూడా అబ్దుల్లా బిన్ ఉబై అతని సహచరులు ముస్లిముల నడుమ భయోత్పాతాన్ని సృష్టించేందుకు, వారి ధైర్య సాహసాలను దెబ్బ కొట్టేందుకు రకరకాలుగా ప్రయత్నించి ఉన్నారు. ఆ విషయమే దివ్య ఖుర్ఆన్ లోని అల్ అహ్'జాబ్ సూరాలో ఈ క్రింది విధంగా వివరించడం జరిగింది.

(దయచేసి చదవండి దివ్య ఖుర్ఆన్ 33:12-20)

ఈ ఖుర్ఆన్ వాక్యాలలో సందర్భాన్నిబట్టి, మునాఫిక్ ల భావోద్రేకాలు, వారి వైఖరి, వారి మానసిక పరిస్థితి, స్వార్థం, అవకాశవాదానికి సంబంధించిన ఓ విస్పష్ట చిత్రం మన ముందు ఉంచుతోంది.

దీనికి తోడు యూదులకు, మునాఫిక్ లకు, బహుదైవారాధకులకు మాత్రమే కాదు ఇస్లాం విరోధి మూకలన్నింటికీ, ఇస్లాం ప్రాబల్యానికి కారణం, భౌతిక ఆధిక్యత, ఆయుధ సంపత్తి, సైనికబలం మాత్రమే కాదనీ, ఈ ప్రాబల్యానికి గల ప్రధాన కారణం ముస్లిములలో ఉన్న నైతిక సుగుణాలే అన్న విషయం తెలిసివచ్చింది.

ఈ నైతిక సుగుణాలు ఆనాటి ఇస్లామీయ సమాజంలో మరియు ఇస్లాం ధర్మంతో ఏమాత్రం సంబంధం కలిగి ఉన్న ప్రతి వ్యక్తిలోనూ ప్రస్ఫుటంగా అగుపించేవి. ఇంకా ఈ ఇస్లాం విరోధి మూకలకు, శుభాల సరోవరమైన దైవప్రవక్త (సల్లం) గారి వ్యక్తిత్వమే అన్న విషయమూ, ఆ నైతిక సుగుణాలు ఆయన (సల్లం)లో మహత్మ్యాల కంటే ఉన్నతమైనవిగా ఉన్నాయన్న విషయమూ తెలిసి ఉండడమే.

అలాగే, ఇస్లాం ధర్మవిరోధులు ఐదు సంవత్సరాల వరకు ఆయనతో యుద్ధం చేస్తూ, ఈ ధర్మానుయాయుల్ని ఆయుధ బలంతో లోబరుచుకోవడం లేదా వారిని నామరూపాల్లేకుండా చేయడం దుస్సాధ్యం అన్న విషయాన్ని గ్రహించే ఉన్నారు. అందుకని వారు, బహుశా నైతిక కోణంతో ఆ ధర్మానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచార యుద్ధాన్ని ప్రారంభించాలనుకున్నారు. మొట్టమొదటగా దైవప్రవక్త (సల్లం) గారి వ్యక్తిత్వంపై గురిపెట్టి ఆ ప్రచారాన్ని ప్రారంభించాలని తీర్మానించుకున్నారు.

మునాఫిక్ లు ముస్లింలలో ఐదో వర్గం. వీరు మదీనాలోనే ఉంటూ ఉన్నారు. ముస్లిములతో ఎలాంటి అరమరికలు లేకుండా కలిసిపోయినవారు. వారి భావోద్రేకాలను కూడా సమయాన్నిబట్టి సునాయసంగా రెచ్చగొట్టనూగలరు. కాబట్టి ఈ దుష్ప్రచార బాధ్యతను తమ నెత్తినేసుకున్నారు ఈ మునాఫిక్ లు. 'అబ్దుల్లా బిన్ ఉబై' దీనికి నాయకత్వం వహించాడు.

వారి ఈ ప్రణాళిక వెలుగుజూసింది ఎప్పుడంటే, 'జైద్ బిన్ హారిసా(రజి)' తన భార్య 'జైనబ్ (రజి)'కు విడాకులు ఇచ్చి, ఆమెను దైవప్రవక్త (సల్లం)కు ఇచ్చి వివాహం చేసినప్పుడు. అరేబియా సంప్రదాయం ప్రకారం, వారు ముతబన్నా (పెంపుడు కుమారుడు)కు తమ సొంత కుమారుని హోదా కల్పిస్తూ ఉండేవారు. అతని భార్యను సొంత కుమారుని భార్యగా నిషిద్ధం అని అనుకునేవారు. అందుకని దైవప్రవక్త (సల్లం), జైనబ్ (రజి)ని వివాహమాడగానే మునాఫిక్ లకు దైవప్రవక్త (సల్లం) గారికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడానికి మంచి అవకాశం లభించింది. వారి దృష్టిలో వారికి రెండు బలహీన అవకాశాలు చేతచిక్కాయని అనుకోవడం జరిగింది.

హజ్రత్ జైనబ్ (రజి), దైవప్రవక్త (సల్లం) గారి ఐదవ సతీమణి. దివ్య ఖుర్ఆన్ నలుగురి కంటే ఎక్కువ మందిని ఏకకాలంలో భార్యలుగా ఉంచడానికి అనుమతి ఇవ్వలేదు. కాబట్టి ఈ వివాహం సక్రమమైన వివాహం ఎలా అవుతుంది? అన్నది ఒకటి.

రెండవది, హజ్రత్ జైనబ్ (రజి) ఆయన కుమారుని - అంటే పెంపుడు కుమారుని - భార్య. కాబట్టి అరేబియా సంప్రదాయం ప్రకారం, ఆమెను వివాహమాడడం ఓ పెద్ద నేరం మరియు తీవ్రమైన పాపం కూడా. కాబట్టి ఈ విషయంలోనూ బాగా ప్రాపగాండా చేయడం జరిగింది. రకరకాల కట్టుకథలు అల్లడమూ జరిగింది. దుష్ప్రచారం చేసేవారు ఈ కట్టుకథల్లో, ముహమ్మద్ (సల్లం) జైనబ్ (రజి)ను చూడగానే ప్రేమలో పడిపోయారనీ, ఈ విషయం ఆయన పెంపుడు కుమారుడు జైద్ (రజి)కి తెలియగానే, ఆయన దైవప్రవక్త (సల్లం) కోసం మార్గాన్ని సుగమం చేయడానికి ఆమెకు విడాకులిచ్చారని కూడా చెప్పడం జరిగింది.

మునాఫిక్ లు అల్లిన ఈ కట్టుకథలను ఎంత విస్తృతంగా ప్రచారం చేశారో ఆ విషయాలు ఇప్పటివరకూ హాదీసు గ్రంథాల్లో, ఖుర్ఆన్ వ్యాఖ్యానాల్లో కానవస్తాయి. ఆ కాలంలో ఈ ప్రాపగాండాకు బలహీనులు, అమాయకులూ అయిన ముస్లిములు బాగా ప్రభావితం అయినందునే, ఈ విషయానికి సంబంధించి అల్లాహ్ దీనిని ఖండించడానికి దివ్యవాణిని అవతరింపజేశాడు. ఆ ఆయత్ లలో వీరి అనుమానాలకు సంబంధించి వారి హృదయాల్లో చోటుచేసుకున్న వ్యాధికి సంబంధించిన పూర్తి చికిత్స ఉంది. ఈ ప్రాపగాండ ఎంత పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందో, దాని తీవ్రతను గ్రహించేందుకు, దాని ఖండన కోసం అహ్'జాబ్ సూరా ఈ క్రింది వాక్యాలతోనే ప్రారంభం అయింది అన్నది గ్రహించవచ్చు.

*"ఓ ప్రవక్తా! అల్లాహ్ కు భయపడుతూ ఉండు. అవిశ్వాసులకు, కపటులకు విధేయత చూపకు. నిశ్చయంగా అల్లాహ్ యే మహా జ్ఞాని, మహా వివేకి." (ఖుర్ఆన్ 33:1)*

మునాఫిక్ ల దుష్ప్రచారాన్నీ, వారి వైఖరినీ వ్రేలెత్తి చూపుతున్న సమగ్ర చిత్రమే ఈ వాక్యాలు. మహాప్రవక్త (సల్లం) ఈ కపటులు అవలంబిస్తున్న ఈ వైఖరిని ఎంతో సహనంతో, సంయమనంతో భరిస్తూనే ఉన్నారు. అటు ముస్లిములు కూడా ఈ దుష్ప్రచారానికి ప్రభావితులు కాకుండా సహనం వహిస్తున్నారు. దైవం తరఫు నుండి అప్పుడప్పుడు మునాఫిక్ లు అగౌరవం పాలు అవుతున్న అనుభవం వారికి ఉంది కనుక. ఈ విషయంలో ఈ క్రింది ఆయత్ లు అవతరించాయి.

*"ఏమిటీ, ప్రతి ఏటా ఒకటి లేక రెండు సార్లు తాము ఏదో ఒక ఆపదలో చిక్కుకు పోవటాన్ని వారు గమనించటం లేదా?★ అయినాసరే వారు పశ్చాత్తాపం చెందటం గానీ, గుణపాఠం నేర్చుకోవటం గానీ జరగటం లేదు." (ఖుర్ఆన్ 9:126)*

_(★→ అరబీలో *'యుఫ్తనూన్'* అని ఉంది. అంటే పరీక్షించబడుతూ ఉండటం అని అసలు అర్థం. రకరకాలుగా వారు పరీక్షించబడుతూ ఉన్నారు. ఒక్కోసారి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ఒక్కోసారి వ్యాధులకు లోనవుతున్నారు. యుద్ధాల ద్వారా కూడా పరీక్షించబడుతున్నారు. పూర్వాపరాల దృష్ట్యా ఈ మూడవ అర్థమే సరైనదిగా తోస్తోంది.)_

ఇవి, గజ్వయె బనీ ముస్తలిక్ కు పూర్వం కపట విశ్వాసి అబ్దుల్లా బిన్ ఉబై పన్నిన కుట్రలు.

*గజ్వయె బనీ ముస్తలిక్ లో మునాఫిక్ ల పాత్ర : -*

గజ్వయె బనీ ముస్తలిక్ జరిగినప్పుడు మునాఫిక్ లు కూడా ఆ పోరాటంలో దైవప్రవక్త (సల్లం)తో వెళ్ళడం జరిగింది. వారు ప్రవక్త (సల్లం)తో పాటు వెళ్ళడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే, బనీ ముస్తలిక్ తెగ నివసించే ప్రాంతం మదీనా నగరానికి ఏమంత దూరాన లేదు. ఎర్రసముద్రం తీరాన జిద్ద, రాబిగ్ ల మధ్య ఉంది. ప్రయాణ మార్గం సాఫీగానే ఉంటుంది. ధనప్రాణాలకు కూడా పెద్దగా ప్రమాదం ఉండదు. పైగా సమరసొత్తు లభిస్తుందన్న గట్టి నమ్మకం ఉంది. అందువల్ల కపట విశ్వాసి అబ్దుల్లా బిన్ ఉబై కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తూ తన అనుచరులతో దైవప్రవక్త (సల్లం) వెంట బయలుదేరాడు.

బనీ ముస్తలిక్ తో పోరాటం అనంతరం, తిరుగు ప్రయాణంలో దుష్ప్రచారం చేసేందుకుగాను మునాఫిక్ లకు రెండు అవకాశాలు లభించాయి. వాటిని ఆసరాగా తీసుకొని ముస్లిములలో విభేదాలు, వైషమ్యాలు సృష్టించి దైవప్రవక్త (సల్లం)కు వ్యతిరేకంగా నీచమైన దుష్ప్రచారం చేశారు. ఈ రెండు సంఘటనలకు సంబంధించిన వివరాలు కొన్ని ఇక్కడ తెలియజేస్తున్నాము.

*1. మదీనా నుండి అతి నీచమైన వ్యక్తిని గెంటివేసే విషయం : -*

గజ్వయె బనీ ముస్తలిక్ ముగించుకొని మహాప్రవక్త (సల్లం), ముర్యసీ ఊట బావి వద్దకు వచ్చి విడిది చేశారు. ఆ బావి వద్దకు కొంతమంది ముస్లింలు నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళిన వారిలో 'హజ్రత్ ఉమర్ (రజి)' గారికి చెందిన ఓ కూలీవాడు కూడా ఉన్నాడు. అతని పేరు 'జహ్ జాహ్ గిఫ్ఫారి'. అక్కడ అతనికి, మరో వ్యక్తి 'సనాన్ వబర్ జుహ్నీ'కి నడుమ తోపులాట జరిగింది. వారిద్దరూ కొట్టుకున్నారు కూడా. అంతలోనే జుహ్నీ, *"ఓ అన్సారు ప్రజలారా! సహాయానికి రండి"* అని పిలిచాడు అన్సారులను. ఇటు జహ్ జాహ్ గిఫ్ఫారి కూడా తమ జాతి ప్రజల్ని, *"ఓ ముహాజిర్ ప్రజలారా! సహాయానికి రండి"* అని పిలిచాడు.

*ఆ తర్వాత జరిగినది In Sha Allah రేపటి భాగంలో తెలుసుకుందాం.*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment