275

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 275*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 190*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

*4. సరియ్య గమర్ : -*

రబీ ఉల్ అవ్వల్ లేదా రబీ ఉల్ ఆఖిర్ మాసం (హి.శ. 6)లో హజ్రత్ 'అక్కాషా బిన్ ముహ్సిన్ (రజి)' గారి వెంట నలభై మందిని ఇచ్చి 'గమర్' వైపునకు పంపించడం జరిగింది. 'గమర్' బనూ అసద్ కు చెందిన ఓ ఊట బావి పేరు. ముస్లిముల రాకను గమనించిన శత్రువులు పారిపోయారు. ముస్లిములు వారికి చెందిన రెండొందల ఒంటెలను తోలుకొని మదీనాకు వచ్చారు.

*5. సరియ్యాయె జుల్ ఖస్సా - 1 : -* ↓

అదే నెల రబీ ఉల్ అవ్వల్ లేదా రబీ ఉల్ ఆఖిర్ (హి.శ. 6)లో హజ్రత్ ముహమ్మద్ బిన్ ముస్లిమా (రజి) గారి నేతృత్వంలో పది మంది యోధుల ఓ పటాలాన్ని 'జుల్ ఖస్సా' వైపు పంపడం జరిగింది. ఈ ప్రదేశం బనూ సఅలబాకు చెందిన ప్రదేశం. శత్రువులు మొత్తం వంద మంది. వీరంతా పారిపోయి దాక్కున్నారు. సహాబా (రజి)లందరూ నిశ్చింతగా నిద్రపోతున్నప్పుడు శత్రువులను హఠాత్తుగా దాడి చేసి వారిని హతమార్చారు. ఈ దాడిలో కేవలం ఒక ముహమ్మద్ బిన్ ముస్లిమా (రజి)గారు ఒక్కరే గాయపడి ప్రాణాలు దక్కించుకోగలిగారు.

*6. సరియ్యయె జుల్ ఖస్సా - 2 : -*

ముహమ్మద్ బిన్ ముస్లిమా సహచరులు అమరగతి పొందిన తరువాత రబీ ఉల్ అవ్వల్ నెల (హి.శ. 6)లోనే దైవప్రవక్త (సల్లం) హజ్రత్ అబూ ఉబైదా (రజి) గారి నేతృత్వంలో ఓ సైనిక పటాలం ఇచ్చి 'జుల్ ఖస్సా' వైపునకు పంపించడం జరిగింది. ఆ సైనిక పటాలంలో మొత్తం నలభై మంది సహాబాలు పాల్గొన్నారు. వీరంతా క్రితం సహాబా (రజి)లు అమరగతి పొందిన ప్రదేశానికి చేరి ఒక్కసారిగా దాడి చేశారు. కాని బనూ సఅలబా వీరికి చిక్కకుండా ఎంతో వేగంగా కొండల్లోకి పోయి దాక్కున్నారు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే పట్టుబడ్డాడు. ఆ తరువాత అతను ఇస్లాం ధర్మం స్వీకరించి ముస్లిము అయిపోయాడు. అయితే వారి మేకలు, గొర్రెలు, ఇతర పశువులన్నీ ముస్లిముల చేతికి చిక్కాయి.

*7. సరియ్యయె జమూమ్ : -*

ఈ సరియ్యా జైద్ బిన్ హారీసా (రజి) గారి నేతృత్వంలో, రబీ ఉల్ ఉఖ్రా (హి.శ. 6)లోనే జమూమ్ వైపునకు పంపబడిన సరియ్యా. జమూమ్ అనేది మర్రజ్ జహ్రాన్ (ప్రస్తుతం వాదియె ఫాతిమా)లోని ఓ ఊట బావి పేరు. హజ్రత్ జైద్ (రజి) అక్కడికి చేరగా ఆ తెగకు చెందిన ఓ మహిళ 'హలీమా' వారికి చిక్కింది. ఆమె బనూ సులైమ్ ఉంటున్న ఓ ప్రదేశాన్ని చూపించింది. ఆ సరియ్యాలో ముస్లిముల చేతికి అనేక పశువులు, మేకలు మరియు ఖైదీలు చిక్కారు. హజ్రత్ జైద్ (రజి) వారందరిని వెంటబెట్టుకొని మదీనాకు తిరిగి వచ్చేశారు. మహాప్రవక్త (సల్లం) ఆముజనీ మహిళను స్వతంత్రురాలుగా చేసి ఓ ముస్లిముకిచ్చి వివాహం చేశారు.

*8. సరియ్యయె ఈస్ : -*

ఈ సరియ్యా నూటా డెబ్భై మంది ఉష్ట్రారోహుల సైన్యంతో కూడిన సరియ్యా. దాని నేతృత్వంలో కూడా హజ్రత్ జైద్ బిన్ హారీసా (రజి)గారే నిర్వహించారు. జమాదిల్ ఊలా (హి.శ. 6)లో ఈ పటాలాన్ని 'ఈస్' అనే ప్రదేశం వైపునకు పంపించారు దైవప్రవక్త (సల్లం). ఈ సైనిక చర్యలో ఖురైషులకు చెందిన ఓ వర్తక బిడారం చేతచిక్కింది. ఈ బిడారం దైవప్రవక్త (సల్లం) గారి అల్లుడు హజ్రత్ అబుల్ ఆస్ (రజి) గారి నేతృత్వంలో ప్రయాణిస్తోంది. అప్పటికి హజ్రత్ అబుల్ ఆస్ ఇస్లాం స్వీకరించి ఉండలేదు. ఆయన పట్టుబడలేదు. నేరుగా మదీనాకు పారిపోయి వచ్చి హజ్రత్ జైనబ్ (రజి) గారి సంరక్షణ పొందారు. ఆమెతో, దైవప్రవక్త (సల్లం) గారికి చెప్పి ఆ వర్తక బిడారానికి సంబంధించిన సొత్తును తిరిగి ఇవ్వమని సిఫార్సు చెయ్యమని కోరారు. ఆమె మహాప్రవక్త (సల్లం)కు ఈ విషయం గురించి విన్నవించుకోగా ఆయన ఎలాంటి ఒత్తిడి చేయకుండా సహాబా (రజి)ను ఆ సొత్తును తిరిగి ఆయనకు ఇచ్చేయమని సైగ చేశారు. సహాబా (రజి) పూర్తి వ్యాపార సామాగ్రిని ఆయనకు అప్పజెప్పడం జరిగింది.

ఆ తరువాత అబుల్ ఆస్ (రజి) మక్కాకు వెళ్ళి ఆ సామాగ్రిని వారి యజమానులకు అప్పజెప్పేశారు. పిదప ముస్లిమై మదీనాకు తిరిగి వచ్చేశారు. మహాప్రవక్త (సల్లం) మొదటనే హజ్రత్ జైనబ్ (రజి)నిచ్చి ఆయన నికాహ్ చేశారు. ఇది ప్రామాణికమైన హదీసు ద్వారా రుజువైన విషయం.

మహాప్రవక్త (సల్లం) మొదటనే నికాహ్ ఆధారంగా ఆమెను ఆయనకు అప్పజెప్పడం జరిగింది. అంటే, అప్పటి వరకు దైవధిక్కారులకు ముస్లిం మహిళలను నిషిద్ధం చేసే ఆదేశం అవతరించకపోవడమే. ఓ హాదీసులో, దైవప్రవక్త (సల్లం) క్రొత్తగా నికాహ్ చేసి ఆయనకు అప్పజెప్పిన విషయం ఏదైతే చెప్పబడినదో లేదా ఆరు సంవత్సరాల తరువాత ఆయన వెంట పంపించడం జరిగిందో అర్థరహితమైనది, ఆధారంలేని విషయం. అదే కాదు, ఈ రెండు హదీసులు బలహీనమైనవి.

*9. సరియ్యయె తర్ఫ్ లేదా తర్ఖ్ : -*

ఈ సరియ్యా కూడా హజ్రత్ జైద్ బిన్ హారీసా (రజి) గారి నేతృత్వంలో, జమాదిల్ ఆఖిరా మాసంలో  'తర్ఫ్' లేదా 'తర్ఖ్' చోటికి పంపబడిన సరియ్యా. ఈ ప్రదేశం బనూ సాలిబా ప్రాంతంలో ఉంది. హజ్రత్ జైద్ (రజి) కేవలం పదిహేను మంది యోధులు మాత్రమే ఉన్నారు. కాని బద్దూలు వీరి రాకను పసికట్టి పారిపోయారు. మహాప్రవక్త (సల్లం) గారే స్వయంగా వస్తున్నారని వారు తలచారు. హజ్రత్ జైద్ (రజి) గారి చేతికి కేవలం నాలుగు ఒంటెలు మాత్రమే చిక్కాయి. ఆయన నాలుగు రోజులు అయిన తరువాత మదీనాకు తిరిగి వచ్చేశారు.

*10. సరియ్యయె వాదియె ఖురా : -*

ఈ సరియ్యా పన్నెండు మంది యోధులతో కూడుకున్నది. దీని కమాండరు కూడా హజ్రత్ జైద్ బిన్ హారీసా (రజి)గారే. ఆయన రజబ్ నెల (హి.శ. 6)లో వాదియె ఖురా (ఖురా లోయ) వైపునకు బయలుదేరారు. దీని లక్ష్యం శత్రువు కార్యకలాపాల్ని గమనించడం. కాని వాదియె ఖురావాసులు వీరిపై దాడి చేయగా తొమ్మిది మంది సహాబాలు అమరగతి పొందారు. ముగ్గురు తప్పించుకోగలిగారు. వీరిలో హజ్రత్ జైద్ (రజి) ఒకరు.

*11. సరియ్య ఖబ్త్ : -*

ఇది రజబ్ నెల (హి.శ. 8)లో జరిగినట్లు చెప్పబడుతోంది. కాని సందర్భాన్ని బట్టి చూస్తే ఇది హుదైబియా ఒప్పందానికి ముందు జరిగిన సంఘటన. హజ్రత్ జాబిర్ (రజి) గారి ఉల్లేఖనం ఇలా ఉంది ఈ విషయంలో....; ↓

*→* "దైవప్రవక్త (సల్లం) మా వెంట మూడొందల మంది ఉష్ట్రారోహుల పటాలం ఇచ్చి పంపించారు. మాకు కమాండరు హజ్రత్ అబూ ఉబైదా బిన్ జర్రాహ్ (రజి). ఖురైషులకు చెందిన ఓ వర్తక బిడారం ఆచూకీ తెలుసుకోవడానికి మమ్మల్ని పంపించడం జరిగింది. మేము ఈ సైనిక కార్యం సందర్భంగా ఆకలితో అలమటించాం. చివరికి మేము ఆకలి బాధకు తాళలేక చెట్ల ఆకులు కొట్టుకొని తిననారంభించాం. అందుకే ఈ పటాలం పేరు 'జైషుల్ ఖబ్త్' (ఖబ్త్ అంటే ఆకులను దులిపేవాడు, రాల్చేవాడు అని అర్థం) పడింది. చివరికి ఓ వ్యక్తి మూడు ఒంటెల్ని జిబహ్ చేశాడు. ఆ తరువాత మూడు ఒంటెలు, మరో మారు మూడు ఒంటెలు జిబహ్ చేయబడ్డాయి. కాని ఆ తరువాత హజ్రత్ అబూ ఉబైదా (రజి) అలా చేయకుండా మమ్మల్ని వారించారు.

ఆ తరువాత సముద్రం నుండి మా వైపునకు 'అంబర్' పేరుగల ఓ చేప కొట్టుకువచ్చింది. దాన్ని మేము పదిహేను రోజుల వరకు తిని ఆకల్ని తీర్చుకున్నాం. దాని నూనెను కూడా ఒంటిపై పూసుకునేవాళ్ళం. అప్పటికిగాని మా శరీరాలు తిరిగి మునుపటిలా తయారు కాలేదు. మేము తిరిగి ఆరోగ్యాన్ని పొందగలిగాము. హజ్రత్ అబూ ఉబైదా (రజి) దాని ప్రక్కటెముకకు చెందిన ఓ ముళ్ళు తీసుకొని నిలబెట్టారు. మా సైన్యంలోని అతి పొడగైన వ్యక్తి మరో ఎత్తయిన ఒంటెపై నిలబడి ఆ చేప ప్రక్కటెముక క్రింది నుండి సునాయాసంగా రాగలిగాడు (అంటే అది అంత పెద్ద చేప అన్నమాట).

మేము ఆ చేప మాంసాన్ని ముక్కలుగా చేసి చద్దిగా ఉంచుకున్నాం. మదీనాకు చేరి ఈ విషయాన్ని మహాప్రవక్త (సల్లం)కు చెప్పగా ఆయన, *"ఇది అల్లాహ్ మీ కోసం పంపించిన భోజనం. దాని మాంసం ఏదైనా మీ దగ్గర ఉంటే నాకు కూడా పెట్టండి." అన్నారు. అప్పుడు మేము దైవప్రవక్త (సల్లం) సన్నిధికి కొంత మాంసాన్ని పంపించాము."* *←* ఈ సంఘటన ఇక్కడ ఇంతటితో ముగుస్తోంది.

అయితే పైన ఈ సంఘటనకు సంబంధించిన సందర్భాన్ని చెబుతూ, ఇది హుదైబియా ఒప్పందానికి పూర్వం జరిగిన సంఘటన అని చెప్పుకున్నాం. దీనికి కారణం ఏమిటంటే, హుదైబియా ఒప్పందం జరిగిన తరువాత ముస్లిములు ఖురైషులకు సంబంధించిన ఏ వర్తక బిడారం జోలికి పోలేదు.

*In Sha Allah రేపటి భాగంలో....; ↓*

        *గజ్వయె బనీయిల్ ముస్తలిక్*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment