274

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 274*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 189*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

*అహ్జాబ్ మరియు ఖురైజా పోరాటాల తదుపరి సైనిక చర్యలు : -*

దైవప్రవక్త (సల్లం) అహ్జాబ్ మరియు ఖురైజా పోరాటాల నుండి తీరిక లభించింది. యుద్ధ నేరస్తులకు తగిన శిక్ష కూడా లభించింది. ఇక శాంతి భద్రతలకు అడ్డుగా నిలిచి ఉన్న బద్దూల పనిపట్టవలసి ఉంది. ఈ బద్దూలు ఈ మహాశక్తి భయం లేకపోతే తమ ఆగడాలను కట్టిపెట్టేవారుకారు మరి. కాబట్టి దైవప్రవక్త (సల్లం) వారి వైపునకు దృష్టిని సారించారు. ఇప్పుడు బద్దూలకు వ్యతిరేకంగా చేపట్టిన సైనిక చర్యలను గురించి చెప్పుకుందాం.

*2. ముహమ్మద్ బిన్ ముస్లిమా సరియ్యా : -*

అహ్జాబ్ మరియు ఖురైజా యుద్ధాల నుండి తీరిక లభించిన తరువాత చేపట్టిన ప్రథమ సరియ్యా ఇది. ఈ సైనిక చర్యలో కేవలం ముప్పై మంది ముస్లిం యోధులే పాల్గొన్నారు.

ఈ సైనికుల్ని 'నజద్'లోని 'బక్రాత్' ప్రాంతం దాపులో ఉన్నటువంటి 'ఖర్తా' అనే పేరుగల ప్రదేశానికి పంపించడం జరిగింది. 'ఖర్తా', 'జరియా'కు దాపులో ఉంది. జరియా, మదీనాకు ఏడు రాత్రుల ప్రయాణ దూరంలో ఉంది. ఈ సైనిక పటాలం ముహర్రం పదవ తేదీ (హి.శ. ఆరు)న బయలుదేరింది. వీరి లక్ష్యం బనూ బక్ర్ కు చెందిన ఓ తెగ 'కిలాబ్'.

ముస్లిములు ఆ తెగపై దాడి చేయగా వారంతా పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. వారి గొర్రెలను, పశువులను తోలుకొని ముస్లిములు ముహర్రం నెల పూర్తి కావడానికి ఇంకా ఒక రోజు మిగిలి ఉండగానే మదీనాకు చేరుకున్నారు. వీరు తమ వెంట బనూ హనీఫా సర్దారు 'సమామా బిన్ అసాల్ హనఫీ'ని కూడా బంధించి తెచ్చారు. అతను మారువేషంలో, 'ముసైలమా కజ్జాజ్' ఆదేశం మేరకు దైవప్రవక్త (సల్లం)ను హతమార్చడానికి బయలుదేరినవాడు. మదీనాకు గొనివచ్చి మస్జిదె నబవీ కంబానికి కట్టిపడేశారు. మహాప్రవక్త (సల్లం) అతని వద్దకు వచ్చి, *"సమామా! నీవు ఏ ఉద్దేశ్యంతో వచ్చినట్లు?"* అని అడిగారు.

*"ఓ ముహమ్మద్ (సల్లం)! నేను సదుద్దేశ్యంతో వచ్చినవాణ్ణి. తమరే గనక నన్ను చంపేస్తే కేవలం ఎలాంటి తప్పు చేయనివాని రక్తం చిందించినట్లవుతుంది. ఒకవేళ తమరే నన్ను వదిలేస్తే నాపై దయజూపినవారవుతారు. ధన సంపదే కావలసి వస్తే అడగండి, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను."* అని అన్నాడు.

అది విన్న దైవప్రవక్త (సల్లం) అతణ్ణి ఆ పరిస్థితిలోనే ఉంచి వెళ్ళిపోయారు.

రెండో సారి అతని వద్ద నుండి వెళుతూ ఇది వరకు అడిగినట్లే అడిగారు దైవప్రవక్త (సల్లం) సమామానుద్దేశించి. అతను క్రితం ఇచ్చిన సమాధానమే ఇచ్చాడు.

మూడోసారి అటుగా వెళుతూ తిరిగి సమామాను అదే ప్రశ్న అడిగారు ప్రవక్త (సల్లం). అతను ఈ సారి కూడా అదే సమాధానాన్ని రెట్టించాడు.

ఆ తరువాత మహాప్రవక్త (సల్లం) తన అనుచరులతో అతణ్ణి స్వతంత్రుణ్ణి చేసెయ్యండి అనగా వారు అతణ్ణి బంధవిముక్తునిగా చేశారు. సమామా మస్జిదె నబవీ ప్రక్కన ఉన్న తోటలోనికి వెళ్ళి స్నానం చేసి తిరిగి దైవప్రవక్త (సల్లం) గారి సన్నిధికి వచ్చి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ముస్లిం అయిపోయారు.

ఆ తరువాత ఆయన దైవప్రవక్త (సల్లం)తో, *"ఓ ప్రవక్తా (సల్లం)! దైవసాక్షి! ఒకప్పుడు ఈ భూమండలం మీద ఏ ముఖమూ నాకు మీ ముఖం కంటే కంటకంగా ఉండలేదు. కాని ఇప్పుడు, తమ ముఖారవిందం ఇతర ముఖాలన్నిటికంటే అత్యంత ప్రియమైనదైనది. అలాగే దైవసాక్షిగా చెబుతున్నాను. క్రితం, ఈ భూమండలం మీద ఏ ధర్మం నా దృష్టిలో ఇస్లాం కంటే కంటగింపుగా ఉండలేదు. కాని ఇప్పుడు తమ ధర్మం ఇతర ధర్మాలన్నిటికంటే అత్యంత ప్రియమైపోయినది, తమ ఉష్ట్రారోహులు నన్ను బంధించినప్పుడు నేను ఉమ్రా చేసే సంకల్పం చేసి ఉన్నాను."* అని అన్నారు.

మహాప్రవక్త (సల్లం) ఆయనకు శుభవార్తనందిస్తూ, ఉమ్రా చేసి రమ్మని పంపించేశారు.

సమామా ఉమ్రా కోసం మక్కా వెళ్ళగా ఆయన్ను చూసి ఖురైషులు, *"నీవు ధర్మభ్రష్టుడవైపోయావని తెలిసిందే!"* అని అడిగారు.

దానికి సమాధానంగా ఆయన, *"కాదు! నేను ముహమ్మద్ (సల్లం) చేతిమీదుగా ముస్లిమునైపోయాను. జాగ్రత్తగా వినండి! దైవసాక్షిగా చెబుతున్నాను, మీ వద్దకు యమామా నుండి ఒక గోధుమ గింజను సయితం రానివ్వను, దైవప్రవక్త (సల్లం) అనుమతిస్తే తప్ప."* అని బదులిచ్చారు.

యమామా వాసులు మక్కా ప్రజలకు పంట చేనులాంటివారు. హజ్రత్ సమామా తన స్వదేశానికి తిరిగివెళ్ళి మక్కాకు వెళ్ళే ధాన్యాన్ని పోకుండా అడ్డుకున్నారు. ఇది ఖురైషుల కోసం మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. ఖురైషులు దైవప్రవక్త (సల్లం) వద్దకు వచ్చి ఆయనతో తమకు గల బంధుత్వాన్ని గుర్తుచేస్తూ ఆ ధాన్యాన్ని తిరిగి పంపించమని అర్థించారు. దైవప్రవక్త (సల్లం) దాన్ని మన్నించి తిరిగి ధాన్యం పంపించే ఆదేశం ఇచ్చారు సమామా (రజి)కు.

*3. గజ్వయె బనూ లహియ్యాన్ : -*

గతంలో రజీ అనే ప్రదేశంలో సహాబా (రజి)లను చుట్టుముట్టి వారిలో ఎనమండుగురిని మోసంతో హతమార్చిన వారే బనూ లహియ్యాన్ తెగవారు. ఇద్దరిని మక్కావాసులకు బానిసలుగా అమ్మేయగా వారిని నిర్దయగా చంపడం జరిగింది.

కాని వీరు నివసించే ప్రాంతం హిజాజ్ లో చాలా దూరాన మక్కా పొలిమేరలకు దాపున ఉన్నందున, ఆ పరిస్థితులల్లో ముస్లిములకు, బద్దూలకు నడుమ తీవ్రమైన సంఘర్షణ చోటు చేసుకొని ఉండడం మూలంగానూ మహాప్రవక్త (సల్లం) ఆ ప్రాంతంలో చాలా దూరంగా ఉన్న తమ పెద్ద శత్రువు దాపుకు వెళ్ళడం సరికాదని తలుస్తూ ఉండేవారు. కాని దైవతిరస్కారుల వివిధ తెగల్లో చీలిక ఏర్పడి, వారు బలహీనపడిన తరువాత ఆ పరిస్థితులను ఆసరాగా చేసుకొని, ఇప్పుడు బనూ లహియ్యాన్ తెగతో తమ హతుల ప్రతీకారాన్ని తీర్చుకోడానికి అవకాశం ఏర్పడింది.

కాబట్టి మహాప్రవక్త (సల్లం) రబీ ఉల్ అవ్వల్ లేదా జమాదిల్ ఊలా (హి.శ. 6)లో రెండు వందల సహాబా (రజి)లను వెంటబెట్టుకొని బనూ లహియ్యాన్ వైపునకు బయలుదేరారు. మదీనా బాధ్యతలను 'హజ్రత్ ఉమ్మె మక్తూమ్ (రజి)'కు అప్పగిస్తూ, *"మేము సిరియా వైపు వెళుతున్నాము"* అని చెప్పి అమ్జ్ మరియు అస్ఫాన్ నడుమన గల 'బత్నెగరాన్' పేరుగల ఓ లోయలో వచ్చి దిగారు - అక్కడే ఇదివరకు తన సహాబీలను సహరించడం జరిగింది - అక్కడే ఆయన ఆ హతుల మన్నింపు కోసం అల్లాహ్ ను వేడుకోవడం జరిగింది.

అటు బనూ లహియ్యాన్ కు దైవప్రవక్త (సల్లం) గారి రాక గురించిన వర్తమానం అందగా వారు పారిపోయి కొండ శిఖరాలపై తలదాచుకున్నారు. వారికి చెందిన ఎ వ్యక్తీ పట్టుబడలేదు. దైవప్రవక్త (సల్లం) రెండు రోజులు వారి ప్రాంతంలోనే విడిది చేశారు. ఈ లోపు ఆయన మరికొన్ని సరియ్యాలను (సైనిక పటాలాలను) పంపించి వెదికించారు. కాని వారు దాగి ఉండడం కారణంగా పట్టుబడలేదు.

ఆ తరువాత ఆయన 'గస్ఫాన్' వైపునకు బయలుదేరారు. అక్కడ నుండి పది మంది అశ్వారోహకులను 'కరాగుల్ గమీమ్' వైపునకు ఖురైషులకు తమ రాక తెలిసిరావాలనే ఉద్దేశ్యంతో పంపించారు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) అక్కడ పూర్తిగా పదునాలుగు రోజులు గడిపి మదీనాకు వచ్చేశారు.

ఈ సైనిక చర్య నుండి తిరిగివచ్చి మహాప్రవక్త (సల్లం) ఒకదాని తరువాత మరొకటి సరియ్యాలను, సైనిక పటాలాలను పంపించడం జరిగింది. వాటి గురించి మరింత వివరంగా తెలుసుకుందాం....; ↓ 

*4. సరియ్య గమర్ : -*

రబీ ఉల్ అవ్వల్ లేదా రబీ ఉల్ ఆఖిర్ మాసం (హి.శ. 6)లో హజ్రత్ 'అక్కాషా బిన్ ముహ్సిన్ (రజి)' గారి వెంట నలభై మందిని ఇచ్చి 'గమర్' వైపునకు పంపించడం జరిగింది. 'గమర్' బనూ అసద్ కు చెందిన ఓ ఊట బావి పేరు. ముస్లిముల రాకను గమనించిన శత్రువులు పారిపోయారు. ముస్లిములు వారికి చెందిన రెండొందల ఒంటెలను తోలుకొని మదీనాకు వచ్చారు.

*5. సరియ్యాయె జుల్ ఖస్సా - 1 : -* ↓

*In Sha Allah రేపటి భాగంలో....; →*

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

No comments:

Post a Comment