273

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 273*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 188*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

*అహ్జాబ్ మరియు ఖురైజా పోరాటాల తదుపరి సైనిక చర్యలు : - 1*

*1. సలామ్ బిన్ అబిల్ హకీక్ సంహారం : -*

*సలామ్ బిన్ అబిల్ హకీక్* - ఇతని మారు పేరు *అబూ రాఫె* కూడా - యూదులకు చెందిన ఓ దుష్టుడు. ఇతను ముష్రిక్కులను ముస్లిములకు వ్యతిరేకంగా ఉసికొల్పిన నేరస్తుడు. అలాగే ముష్రిక్కులకు ధనధాన్యాలు సరఫరా చేసి ఆదుకున్నవాడు. దానికితోడు, అతను దైవప్రవక్త (సల్లం)ను బాధించేవాడు కూడా.

ముస్లిములు, బనూ ఖురైజా దిగ్బంధం నుండి వెనక్కు మరలి వచ్చిన తరువాత ఖజ్రజ్ తెగవారు, దైవప్రవక్త (సల్లం)ను, 'అబూ రాఫె'ను అంతమొందించే అనుమతి కోరారు. ఇంతకు పూర్వం 'కఅబ్ బిన్ అష్రఫ్'ను అవస్ తెగవారు సంహరించి ఉన్నందున ఈ తెగ ఖజ్రజ్ కూడా అలాంటిదే ఓ ఘనకార్యం చేయాలని ఉవ్విళ్ళూరుతూ ఉంది. అందుకనే వారు దైవప్రవక్త (సల్లం)ను అనుమతి కోరడంలో తొందరపడడం జరిగింది.

మహాప్రవక్త (సల్లం) వారికి అనుమతి అయితే ఇచ్చారుగాని వారిని హెచ్చరిస్తూ వారి స్త్రీలు, పిల్లల జోలికి మాత్రం పోవద్దని తాకీదు చేశారు. ఆ తరువాత అయిదుగురు యువకులతో కూడిన బృందం ఒకటి ఆ దుష్టుణ్ణి సంహరించడానికి బయలుదేరి వెళ్ళింది. వీరంతా ఖజ్రజ్ తెగకు చెందిన బనూ సల్మాకు సంబంధించినవారే. వీరి కమాండరు 'హజ్రత్ అబ్దుల్లా బిన్ అతీన్ (రజి)'.

ఈ వర్గం నేరుగా ఖైబర్ వైపునకు బయలుదేరింది. ఎందుకంటే, అబూ రాఫె కోట అక్కడనే ఉంది కనుక. వీరు దాని దాపునకు చేరేటప్పటికి ప్రొద్దుక్రుంకింది. ప్రజలు తమ పశువులను తోలుకొని కోటలోనికి వెళ్ళిపోయారు. అబ్దుల్లా బిన్ అతీక్ (రజి) తన అనుచరులతో, *"మీరు ఇక్కడనే ఆగండి. నేను వెళ్ళి కోటను రక్షిస్తున్నవానితో ఏదో సాకు చెప్పి లోనికి వెళ్ళిపోతాను, బహుశా లోనికి వెళ్ళే మార్గం ఏదైనా అగుపడవచ్చు."* అన్నారు.

ఆ తరువాత ఆయన కోట గుమ్మం దగ్గరగా వెళ్ళి, తన తలపై ఓ వస్త్రాన్ని కప్పుకొని మల విసర్జనం చేసేవాని వలె ప్రక్కన కూర్చున్నారు. పహరా కాచేవాడు అది చూసి బిగ్గరగా, *"ఓ మనిషీ! లోపలి వచ్చేయదలచుకుంటే త్వరగా వచ్చేయి. నేను ద్వారాలను మూసేస్తున్నాను."* అని ఆయన్ను పిలిచాడు.

ఇదే అదనుగా హజ్రత్ అబ్దుల్లా బిన్ అతీక్ లోనికి వెళ్ళిపోయారు.

_ఆ తరువాత జరిగినది ఆయన కథనం ప్రకారం....; ↓_

*→*"నేను లోనికి చొరబడి ఓ మూలన ఎవరూ చూడకుండా నక్కాను. అందరూ లోనికి వచ్చేసిన తరువాత ఆ భటుడు తలుపులు మూసి దాని తాళపు చెవులను ఓ గోడపై ఉన్న ఓ శీలకు తగిలించాడు. (అన్ని వైపులా సద్దుమణిగిన తరువాత) ఆ తాళపు చెవులను తీసుకొని కోట ద్వారం తెరిచేశాను.

అబూ రాఫె తన ఇంటి పై అంతస్తులో ఉంటున్నాడు. అక్కడనే అతని సభ కూడా జరిగేది. సభికులంతా వెళ్ళిపోయిన తరువాత నేను పై అంతస్తు పైకి ఎక్కనారంభించాను. ఏ తలుపు అడ్డం వచ్చినా దాన్ని తెరుస్తూ, తిరిగి లోన్నుండి గడియ వేసుకుంటూ వెళుతున్నాను. అక్కడున్న వారు నన్ను కనుగొన్నప్పటికి వారు నా దగ్గరకు వచ్చి చేరే లోపలే అబూ రాఫెను సంహరిద్దాం అనే ఉద్దేశ్యంతో అలా ముందుకు వెళుతూనే ఉన్నాను.

చివరికి నేను అతని దాపునకు చేరగానే చూద్దును కదా, అతను తన భార్యాపిల్లలతో ఓ చీకటి గదిలో ఉన్నాడు. అతను ఆ గదిలో ఏ మూలన ఉన్నాడో నాకు అగుపడడం లేదు. అందుకని నేను అతను ఎక్కడున్నాడో తెలుసుకునే ఉద్దేశ్యంతో *"ఓ అబూ రాఫె"* అని పిలిచాను. అతను నా పిలుపునకు సమాధానంగా *"ఎవరూ?"* అని అనగానే ఆ శబ్దం వైపునకు కదిలి అటు వైపు ఓ ఖడ్గప్రహారాన్ని చేశాను. అయితే నేను ఆ సమయంలో అయోమయ స్థితిలో ఉన్నందున ఏమీ చేయలేకపోయాను (అంటే నేనేసిన ఖడ్గ ప్రహారం అతనిపై పడలేదన్నమాట). అటు అతను ఓ పెద్ద గావుకేక పెట్టగా నేను ఆ గది నుండి వెంటనే బయటకు వచ్చేశాను. తిరిగి (నా గొంతును మార్చి), *"అబూ రాఫె! ఏమిటా కేక?"* అని అన్నాను. అతను, *"నీ తల్లి నాశనం గాను! ఇప్పుడే ఎవరో నాపై కత్తి వ్రేటు వేశాడు"* అని అన్నాడు. అతను మాట్లాడుతూ ఉండగా ఆ శబ్దం వైపునకు వెళ్ళి మరొక కత్తిపోటు వేశాను. ఆ దెబ్బతో అతను రక్తసిక్తమైపోయాడు. అయితే ఇంకా నేనతణ్ణి చంపలేకపోయాను. అందుకని నా ఖడ్గం మొన అతని కడుపు మీద వేసి అదమగా అది పొట్టలో దూరి వీపు వైపు నుండి బయటకు వచ్చేసింది. అప్పుడు నాకు నమ్మకం కుదిరింది అతను చనిపోయాడని.

ఆ తరువాత నేను ఒక్కొక్క తలుపును తెరుచుకుంటూ బయటకు వచ్చి మెట్ల దగ్గర నేను భూమి మీద ఉన్నాననే ధ్యాసతో అడుగు ముందుకు వేశాను. వెంటనే క్రిందపడిపోగా నా చీలమండ ఎముక తొలిగిపోయింది. నేను దాన్ని నా తలపాగా వేసి గట్టిగా చుట్టి తలుపు దగ్గరగా వచ్చి కూర్చున్నాను. అబూ రాఫె చనిపోయిన విషయం తెలియనంత వరకు నేను ఇక్కడి నుండి కదలవద్దని తీర్మానించుకున్నాను.

కోడి కూసిన తరువాత మరణవార్తను చాటేవాడు కోటపైకెక్కి పెద్దగా, *"ఓ హిజాజ్ వర్తకులారా! అబూ రాఫె చనిపోయాడు"* అని ప్రకటించగా అప్పుడు నేను నా సహచరుల వద్దకు వచ్చి చేరాను. *"పదండి, ఇక్కడ నుంచి పారిపోదాం"* అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాం.

అల్లాహ్ అబూ రాఫెను అతని దురాగతాలకు శిక్ష వేశాడు. మేము దైవప్రవక్త (సల్లం) సన్నిధికి చేరి విషయమంతా విన్నవించుకున్నాము. ఆయన (సల్లం) నా కాలును చాపమని చెప్పగా నేను నా కాలుని బార్లా చాపాను. దైవప్రవక్త (సల్లం) తన చేతితో దానిపై నిమిరారు, వెంటనే నా బాధ మాటుమాయమైపోయింది." *←*

ఇది సహీ బుఖారీ ఉల్లేఖనం. అయితే ఇబ్నె ఇస్'హాక్ ఉల్లేఖనం మరోలా ఉంది. అదేమిటంటే, అబూ రాఫె ఇంట అయిదుగురు సహాబాలు చొరబడ్డారు. వారంతా అతని హత్యలో పాల్గొన్నవారే. ఏ సహాబీ (రజి) అయితే అబూ రాఫె పొట్టపై తన కరవాలాన్ని వేసి అదిమి చంపారో ఆయన హజ్రత్ అబ్దుల్లా బిన్ అనీస్ (రజి).

ఈ ఉల్లేఖనంలో, వారంతా రాత్రి సమయంలో అబూ రాఫెను చంపినప్పుడు, హజ్రత్ అబ్దుల్లా బిన్ అతీక్ (రజి) గారి పిక్క ఎముక విరిగిపోయింది. ఆయన్ను వారు మోసుకొని కోట గోడలో నుండి ఓ నీటి కాలువ పోతుంటే అందు చొరబడి దాక్కున్నారు అని ఉంది. యూదులు కాగడాలు ముట్టించి అన్ని వైపులా తిరిగి చూసి ఎవరూ కనబడకపోయేసరికి తిరిగి హతుని వద్దకు వెళ్ళగా సహాబా (రజి) హజ్రత్ అబ్దుల్లా బిన్ అతీక్ (రజి)ను మోసుకొని దైవప్రవక్త (సల్లం) వద్దకు గొనివచ్చారు.

ఈ సరియ్యా జీఖాదా లేదా జీహజ్జా మాసం, హిజ్రీ శకం - 5లో జరిగింది.

దైవప్రవక్త (సల్లం) అహ్జాబ్ మరియు ఖురైజా పోరాటాల నుండి తీరిక లభించింది. యుద్ధ నేరస్తులకు తగిన శిక్ష కూడా లభించింది. ఇక శాంతి భద్రతలకు అడ్డుగా నిలిచి ఉన్న బద్దూల పనిపట్టవలసి ఉంది. ఈ బద్దూలు ఈ మహాశక్తి భయం లేకపోతే తమ ఆగడాలను కట్టిపెట్టేవారుకారు మరి. కాబట్టి దైవప్రవక్త (సల్లం) వారి వైపునకు దృష్టిని సారించారు. ఇప్పుడు బద్దూలకు వ్యతిరేకంగా చేపట్టిన సైనిక చర్యలను గురించి చెప్పుకుందాం.

*2. ముహమ్మద్ బిన్ ముస్లిమా సరియ్యా : -*

అహ్జాబ్ మరియు ఖురైజా యుద్ధాల నుండి తీరిక లభించిన తరువాత చేపట్టిన ప్రథమ సరియ్యా ఇది. ఈ సైనిక చర్యలో కేవలం ముప్పై మంది ముస్లిం యోధులే పాల్గొన్నారు.

*↑ ఇందులోని వివరణను In Sha Allah రేపటి భాగంలో తెలుసుకుందాం →*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

No comments:

Post a Comment