272

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 272*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 187*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

*ముస్లిములు, బనూ ఖురైజా ను వధించిన తరువాత జరిగిన సంఘటనలు : -*

బనూ ఖురైజా వినాశనానికి గురి అయిన వెంటనే బనూ నజీర్ తెగకు చెందినా సర్దారు, ఈ యుద్ధానికి సంబంధించిన పెద్ద నేరగాడు 'హుయ్ బిన్ అఖ్తబ్' కూడా అంతం చేయబడ్డాడు. ఇతను ఉమ్ముల్ మోమినీన్ (ముస్లిముల మాతృమూర్తి) హజ్రత్ సఫియ్యా (రజి) గారి తండ్రి. ఖురైష్ మరియు గత్ఫాన్ వెనక్కు మళ్ళిపోయిన తరువాత బనూ ఖురైజా దిగ్బంధానికి గురి అయినప్పుడు వారి వెంటే అతనూ, తాను చేసిన శపథం ప్రకారం వారితోనే కోటలోనికి వెళ్ళి దాక్కున్నాడు. అహ్జాబ్ యుద్ధం జరిగే రోజుల్లో ఇతను కఅబ్ బిన్ అసద్ ను, ముహమ్మద్ (సల్లం)కు వ్యతిరేకంగా తిరగబడి ద్రోహం చేయడానికి పురికొల్పినవాడు. అతను ఇప్పుడు కఅబ్ కు ఇచ్చిన ఆ మాటను నిలబెట్టుకుంటున్నాడు.

అతన్ని పట్టి దైవప్రవక్త (సల్లం) వద్దకు తీసుకువచ్చినప్పుడు తన ఒంటెపై మేలైన వస్త్రాలను తొడిగి ఉన్నాడు. వాటిని తాను స్వయంగా చుట్టూ, ఒక్కొక్క అంగుళం మేర చించుకున్నాడు. అతని ఉద్దేశ్యం, తాను మరణించిన తరువాత తన ఈ బట్టలు యుద్ధ ధనానికి పనికిరాకుండా ఉండాలి అన్నదే.

అతని రెండు చేతులు మెడ వెనుకకు వేసి కట్టబడి ఉన్నాయి. అతను దైవప్రవక్త (సల్లం)ను సంబోధిస్తూ, *"వినండి! నేను మీ ఎడల శత్రుత్వం వహించినందుకు సిగ్గుపడడం లేదు. కాని అల్లాహ్ తో యుద్ధం చేసిన వాడు ఓడిపోక తప్పదు."* అన్నాడు.

ఆ తర్వాత అక్కడున్న వారిని సంబోధిస్తూ, *"ప్రజలారా! అల్లాహ్ ఇచ్చిన తీర్పులో తేడా ఏదీ లేదు. ఇది మా పాలిట రాయబడిన దురదృష్టం. ఇది బనీ ఇస్రాయీల్ కోసం రాసిపెట్టి ఉంచిన పెద్ద హత్యాకాండ"* అంటూ కూర్చోగా అతని తల నరికివేయబడింది.

ఈ సంఘటనలో బనూ ఖురైజా తెగకు చెందిన ఓ స్త్రీని కూడా చంపడం జరిగింది. ఆమె 'హజ్రత్ ఖల్లాద్ బిన్ సువైర్ (రజి)'పై తిరుగల బండ విసిరి చంపిన స్త్రీ. దీనికి బదులుగా ఆమెను హతమార్చడం జరిగింది.

మహాప్రవక్త (సల్లం), నాభి క్రింద వెంట్రుకలు మొలచిన ప్రతివాణ్ణి చంపమని ఆదేశం ఇచ్చి ఉన్నారు. అయితే 'అతియా కర్జీ'కి ఇంకా వెంట్రుకలు మొలవలేనందున ఆమెను వదలివేయడం జరిగింది. ఆ తరువాత ఆమె ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి దైవప్రవక్త (సల్లం) గారి సహచరుల్లో చేరారు.

హజ్రత్ సాబిత్ బిన్ ఖైస్ (రజి), 'జుబైర్ బిన్ బాతా' మరియు ఆయన కుటుంబ సభ్యులను తనకు హిబా చేయమని అర్థించగా ఆయన ఆ విన్నపాన్ని స్వీకరించి హిబా చేశారు. ఇది వరకు జుబైర్, సాబిత్ ను ఆదుకొని ఉండడమే దానికి కారణం.

ఆ తరువాత సాబిత్ బిన్ ఖైస్ (రజి), జుబైర్ తో, *"దైవప్రవక్త (సల్లం) నిన్నూ నీ కుటుంబాన్నీ నా కోసం హిబా చేసి ఉన్నారు. ఇప్పుడు వారందరినీ నీకు అప్పజేప్పేస్తున్నాను (అంటే వారందరినీ స్వతంత్రులుగా చేస్తున్నానని అర్థం)."* అన్నారు.

కాని ఆ తరువాత జుబైర్ కు తన జాతి అంతా అంతం అయిపోయిందన్న విషయం తెలియగా అతను, *"జుబైర్ ! నేను నీకు చేసిన సహాయానికి ప్రతిగా నన్ను నా మిత్రుల్లా అంతమొందించు"* అని అడగగా; జుబైర్, బాతాను కూడా చంపేయడం జరిగింది. అయితే జుబైర్ కుమారుడు అబ్దుర్రహ్మాన్ ను మాత్రం అలానే వదిలేశారు. తరువాత ఆయన ఇస్లాం స్వీకరించి ముస్లిములైపోయారు.

అలాగే బనూ నజ్జార్ కు చెందిన ఓ మహిళ 'హజ్రత్ ఉమ్ముల్ మున్జిర్ సల్మా బిన్తె ఖైస్' చేసిన అభ్యర్థన మేరకు 'సమ్ వాయిల్ ఖర్జీ' కుమారుడు 'రిఫాఅ'ను ఆమె కోసం హిబా చేయడం జరిగింది. 'రిఫాఅ'ను ఆమెకు అప్పగించారు. ఆమె 'రిఫాఅ'కు జీవితం ఒసగారు. ఆ తరువాత ఆయన కూడా ఇస్లాం స్వీకరించి దైవప్రవక్త (సల్లం)కు సహచరులయ్యారు.

మరికొందరు వ్యక్తులు ఆయుధాలు పడవేసేముందే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం వలన వారి ఆస్తిపాస్తులు, ధన ప్రాణాలు అన్నీ సురక్షితంగానే ఉండిపోయాయి. అదే రాత్రి, బనూ ఖురైజా చేసిన కుట్రలో పాలుపంచుకోకుండా, ఒప్పందాన్ని భంగపరిచిన వారికి దూరంగా ఉన్న వ్యక్తి బయటకు రాగా, పహరా కాస్తున్న కమాండరు ముహమ్మద్ బిన్ ముస్లిమా (రజి) చూశారు. కాని అతణ్ణి గుర్తు పట్టి వదలివేయడం జరిగింది. ఆ తరువాత అతను ఎటు వెళ్ళిపోయాడో తెలియరాలేదు.

బనూ ఖురైజా యూదులకు చెందిన ఆస్తులు, ధన సంపద నుండి దైవప్రవక్త (సల్లం) ఖుమ్స్ తీసి అందరికీ పంచిపెట్టారు. అశ్వారూఢులకు మూడు భాగాలు ఇచ్చారు. ఆ మూడు భాగాల్లో రెండు భాగాలు గుర్రాలవి, ఒక భాగం సైనికులది. పదాతిదళానికి ఒక భాగం పంచి పెట్టారు. ఖైదీలను, పిల్లలను 'హజ్రత్ సఅద్ బిన్ జైద్' పర్యవేక్షణలో నజద్ కు పంపించి, బదులుగా గుర్రాలను, ఆయుధాలను కొనడం జరిగింది.

దైవప్రవక్త (సల్లం) తన కోసం బనూ ఖురైజా స్త్రీలలో ఒకామె 'హజ్రత్ రీహానా బిన్తె అమ్రూ బిన్ ఖనఫా'ను ఎంచుకున్నారు. ఈమె ఇబ్నె ఇస్'హాక్ కథనం ప్రకారం, దైవప్రవక్త (సల్లం) గారి మరణం వరకు ఆయన ఆధీనంలోనే ఉన్నారు. కాని కలబీ కథనం ప్రకారం, దైవప్రవక్త (సల్లం) ఆమెను హిజ్రీ శకం ఆరులో స్వతంత్రురాలిగా చేసి వివాహమాడినట్లు ఉంది. ఆయన చివరి హజ్ (హజ్జతుల్ విదా) నుండి తిరిగి వచ్చేటప్పటికి ఆమె చనిపోయారని, ఆమెను బకీ ఖనన వాటికలో ఖననం చేశారని ఉంది.

*హజ్రత్ సఅద్ (రజి)గారి మరణం : -*

బనూ ఖురైజా పని పూర్తిగా పట్టిన తరువాత 'హజ్రత్ సఅద్ బిన్ ముఆజ్ (రజి)' గారి వేడుకోలు స్వీకరించబడే తరుణం ఆసన్నమైంది. ఈ దుఆ ఏమిటో గజ్వయె అహ్జాబ్ సందర్భంలో మనం చెప్పుకున్నదే. కాబట్టి ఆయన గాయం తిరగతోడింది. ఆయన అప్పుడు మస్జిదె నబవీలో ఉన్నారు. దైవప్రవక్త (సల్లం), ఆయన్ను పరామర్శించే ఉద్దేశ్యంతో అక్కడనే ఓ గుడారం వేయించి ఉంచారు. హజ్రత్ ఆయిషా (రజి) గారి ఉల్లేఖనం ప్రకారం, ఆయన గాయం పగిలి రక్తం స్రవించనారంభించింది. ఆ మసీదులోనే బనూ గిఫ్ఫార్ కు చెందిన కొన్ని గుడారాలు కూడా ఉన్నాయి. ఆ రక్తం స్రవించి వారి వైపునకు రానారంభించినందున దాన్ని చూసి భయపడ్డారు. వారు గుడారవాసులతో, *"ఓ గుడారవాసులారా! ఇదేమిటీ మన వైపునకు వస్తున్నది, కొంచెం చూడండి."* అని అరిచారు. చూడగా అది హజ్రత్ సఅద్ (రజి) గారి గాయం నుండి స్రవించి వస్తున్న రక్తం. ఆ రక్తస్రావం వల్లనే ఆయన మరణం సంభవించింది.

సహీయైన్ గ్రంథాల్లో ఉటంకించిన 'హజ్రత్ జాబిర్ (రజి)' గారి ఉల్లేఖనంలో మహాప్రవక్త (సల్లం) ఇలా ప్రవచించారని ఉంది....; ↓

*"సఅద్ బిన్ ముఅజ్ (రజి) గారి మరణంతో రహ్మాన్ సింహాసనం కదిలిపోయింది."*

ఇమామె తిర్మిజీ, హజ్రత్ అనస్ (రజి) గారి ఉల్లేఖనాన్ని ఉటంకించి అది ప్రామాణికమైనదని చెబుతూ, హజ్రత్ సఅద్ (రజి) జనాజాను (శవపేటికను) ఎత్తినప్పుడు మునాఫిక్ లు ఆశ్చర్యంగా, *"వీరి జనాజా ఇంత తేలిగ్గా ఉందేమిటీ?"* అని అన్నారు. దానికి మహాప్రవక్త (సల్లం), *"దాన్ని దైవదూతలు ఎత్తుకున్నారు (కాబట్టి అది మీకు తేలికగా అనిపిస్తోంది)."* అని అన్నారు.

బనూ ఖురైజా దిగ్బంధం జరుగుతున్న సమయంలోనే ఓ ముస్లిం అమరగతి పొందాడు. ఆయన పేరు 'ఖల్లాద్ బిన్ సువైద్ (రజి)'. ఈయనపై బనీ ఖురైజాకు చెందిన ఓ స్త్రీ తిరుగలి బండను ఎత్తి పడేసి చంపేసింది. ఈయన కాకుండా 'హజ్రత్ అక్కాషా (రజి)' గారి సోదరుడు 'అబూ సనాన్ బిన్ ముహ్సిన్' కూడా ఈ దిగ్బంధం సందర్భంగానే మరణించారు.

అబూ లుబాబా (రజి) గారి విషయానికొస్తే, ఆయన ఆరు రాత్రిళ్ళు తననుతాను మస్జిద్ కంబానికి వేసి కట్టుకునే ఉన్నారు. ఆయన భార్య నమాజు సమయం కాగానే వచ్చి ఆయన కట్లను విప్పేసేవారు. నమాజు పూర్తి అయిన తరువాత తిరిగి ఆయన తనను ఆ కంబానికి వేసి కట్టుకునేవారు. ఆ తరువాత మహాప్రవక్త (సల్లం)పై తౌబా సూరా అవతరించింది. ఆ సమయంలోనే ఆయన (సల్లం) ఉమ్మె సల్మా (రజి) గారి ఇంట ఉన్నారు.

అబూ లుబాబా (రజి) స్వయంగా ఈ సంఘటన గురించి చెబుతూ, హజ్రత్ ఉమ్మె సల్మా (రజి) గారు తన గది ద్వారం వద్ద నిలబడి నాతో, *"ఓ అబూ లుబాబా! సంబరపడు. అల్లాహ్ నీ తౌబాను స్వీకరించాడు"* అన్నారు.

అక్కడ దాపులో ఉన్న సహాబా (రజి)లు ఇది విని ఆయన కట్లు ఊడదీయడానికి పరుగున వచ్చారు. కాని ఆయన, వారు తన కట్లను విప్పడాన్ని అంగీకరించలేదు. *"నా కట్లను దైవప్రవక్త (సల్లం) తప్ప మరెవ్వరూ విప్పడానికి వీల్లేదు"* అని అన్నారు. మహాప్రవక్త (సల్లం) ఆయన ప్రక్క నుండి పోతున్నప్పుడు తన స్వహస్తాలతో ఆయన కట్లు విప్పి స్వతంత్రులుగా చేశారు.

ఈ గజ్వా జీఖాదా నెలలో సంభవించిన గజ్వా. దాదాపు ఇరవై అయిదు రోజుల వరకు యూదుల్ని దిగ్బంధించి ఉంచడం జరిగింది. అల్లాహ్ ఈ గజ్వా మరియు గజ్వయె అహ్జాబ్ గురించిన వివరాలను తెలుపుతూ 'అల్ అహ్జాబ్' సూరాలో అనేక ఆయత్ లు అవతరింపజేశాడు. ఈ రెండు పోరాటాలకు సంబంధించిన విషయాలను విడమరచి చెప్పాడు అందులో. మోమిన్ (విశ్వాసులు)లు మరియు మునాఫిక్ (కపట ముస్లిముల)ల పరిస్థితుల్ని వివరించాడు. విరోధి పక్షానికి సంబంధించిన వర్గాల్లో చీలిక ఎలా ఏర్పడిందో, వారు భయానికి ఎలా లోనయ్యారో వివరించి చెప్పాడు. అదే కాకుండా గ్రంథవహుల (యూదుల) వాగ్దానభంగం వల్ల ఎలాంటి ఫలితాలు చోటుచేసుకున్నాయో వివరించారు.

*In Sha Allah రేపటి భాగంలో → అహ్జాబ్ మరియు ఖురైజా పోరాటాల తదుపరి సైనిక చర్యలు....;*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment