263

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 263*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 178*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

    🛡⚔ *గజ్వయె అహ్జాబ్ (అగడ్త యుద్ధం - కందక యుద్ధం) : - 3* ⚔🛡

_కందకం త్రవ్వేటప్పుడు దైవప్రవక్త (సల్లం) ద్వారా అనేక చమత్కారాలు వెలుగులోనికి వచ్చాయి. అవేమిటంటే....; ↓_

హజ్రత్ నోమాన్ బిన్ బషీర్ సోదరి కందకం వద్దకు తన సోదరుడు భుజించాలనే ఉద్దేశ్యంతో రెండు దోసిళ్ళ ఖర్జూరాలను పట్టుకొచ్చారు. ఆమె దైవప్రవక్త (సల్లం) ముందుగా వెళుతూ ఉంటే, ఆయన (సల్లం) ఆ ఖర్జూరాలను అడిగి తీసుకున్నారు. వాటిని ఓ వస్త్రంపై పరచి పనిచేస్తున్న వారందరినీ తినమని పిలుపునిచ్చారు. వారందరూ వచ్చి దాని చుట్టూ కూర్చుని తిననారంభించారు. ఆ ఖర్జూరాలు పెరుగుతూ పోతున్నాయి. చివరికి అందరూ కడుపునిండా వాటిని భుజించి వెళ్ళిపోయినప్పటికీ ఆ ఖర్జూరాలు ఆ వస్త్రం అంచుల నుండి బయటపడిపోతున్నాయి.

ఆ కాలంలోనే ఈ రెండు సంఘటనలకు మించిన మరొ సంఘటన కూడా జరిగింది. ఇది ఇమామె బుఖారీ, హజ్రత్ జాబిర్ (రజి) గార్ల ఉల్లేఖనాల నుండి గ్రహించిన సంఘటన. హజ్రత్ జాబిర్ (రజి) గారు ఇలా ఉల్లేఖించారు.

*"మేము అగడ్తను త్రవ్వుతూ ఉండగా ఓ శిల అడ్డుపడింది. అది ఎంతకూ పగలకపోయేసరికి ముస్లింలు దైవప్రవక్త (సల్లం) దగ్గరకు వచ్చి ఈ గండు శిలలాంటి రాయి అడ్డుపడడం వల్ల కందకం పని ఆగిపోయిందని చెప్పారు. ఇది విన్న దైవప్రవక్త (సల్లం), _"ఆగండి! నేను కూడా దిగుతున్నాను"_ అని కందకంలోకి దిగారు. అప్పుడు ఆయన (సల్లం) పరిస్థితి, ఆకలిబాధతో పొట్టపై రాయి కట్టుకొని ఉన్న పరిస్థితి - మేమూ మూడు రోజుల నుండి ఏ పదార్థమూ తినలేదు - ఆ తరువాత మహాప్రవక్త (సల్లం) తన గొడ్డలి (గడ్డపార)తో ఆ బండపై వ్రేటువేయగా ఆ బండరాయి పైకి ఉబికి ఉన్న ఓ మట్టి దిబ్బగా మారిపోయింది."*

ఇలాంటిదే మరొక సంఘటన హజ్రత్ బరా (రజి) గారు ఉల్లేఖిస్తున్నారు. ↓

కందకం త్రవ్వేటప్పుడు అందులో ఓ పెద్ద బండరాయి అడ్డొచ్చింది. హజ్రత్ సల్మాన్ ఫార్సీ (రజి), ఆయన జట్టు సభ్యులు పలుగులతో దాన్ని కొట్టి కొట్టి విసిగిపోయారు. ఎంతకొట్టినా ఆ రాయి కాస్త కూడా పగల్లేదు. చుట్టుపక్కల కందకం త్రవ్వుతున్న ఇతర సహచరులు కూడా వచ్చి తమ బలాలను ప్రదర్శించారు. కాని ఆ రాయి మాత్రం చెక్కు చెదరలేదు.

ఈ విశేషం చూసి వారు ఎంతో ఆశ్చర్యపోతూ విషయం దైవప్రవక్త (సల్లం) దృష్టికి తీసుకెళ్ళారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) తాను చేస్తున్న పని వదిలేసి బయలుదేరారు.

దైవప్రవక్త (సల్లం) వచ్చిన తరువాత కొందరు మాట్లాడుతూ, *"ఈ రాయిని పగలగొట్టడం సాధ్యమయ్యే పనిలా కన్పించడం లేదు. అంచేత ఈ చోటు వదిలి పక్కకు జరిపి త్రవ్వుకోవడం మంచిది."* అని సలహా ఇచ్చారు.

దైవప్రవక్త (సల్లం) చిరునవ్వు నవ్వుతూ పలుగు తీసుకున్నారు. అగడ్తలోకి దిగి *"బిస్మిల్లాహ్"* అంటూ బలంగా ఒకే ఒక్క దెబ్బ వేశారు. ఆ దెబ్బకు రాయి మీద సన్నని పగులు ఏర్పడి, అందులో నుంచి తళుక్కున ఓ కాంతిపుంజం వెలువడింది. వెంటనే దైవప్రవక్త (సల్లం) *"అల్లాహుఅక్బర్"* అన్నారు. అప్రయత్నంగా అనుచరుల నోట కూడా *"అల్లాహుఅక్బర్"* అనే పలుకులు వెలువడి ఆ ప్రదేశమంతా మార్మోగింది.

దైవప్రవక్త (సల్లం) రాతిపై మరోదెబ్బ వేశారు. దాంతో రాయి మరికాస్త పగిలి అందులో నుంచి మళ్ళీ వెలుగు విరజిమ్మింది. దైవప్రవక్త (సల్లం) రాయిమీద ఇంకో దెబ్బవేశారు. దాంతో ఆ బండరాయి ముక్కలు ముక్కలుగా పగిలి దేదీప్యమానమైన వెలుగు విరజిమ్మింది. క్షణంపాటు పరిసరాలన్నీ ప్రకాశించాయి. దైవప్రవక్త (సల్లం) *"అల్లాహుఅక్బర్"* అన్నారు. అనుచరులు కూడా అదేవిధంగా నినదించారు.

దైవప్రవక్త (సల్లం) కందకం నుండి పైకి వచ్చిన తరువాత, ఒడ్డు మీద నిల్చున్న అనుచరులు తొంగి తొంగి చూడసాగారు. అంతటి బలమైన ఆ చట్టును దైవప్రవక్త (సల్లం) మూడే మూడు దెబ్బలకు నుజ్జు నుజ్జు చేయడం పట్ల వారు ఆశ్చర్యచకితులయ్యారు.

*"ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఇది దైవదౌత్య మహిమ"* అన్నారు ఒకరు.

*"ఔను. నిస్సందేహంగా ఇది దైవమహిమే. ఇంతటి శక్తిమంతమైన రాయి పగలడం మానవశక్తికి అతీతమైన పని"* అన్నారు మరొకరు.

*"దైవప్రవక్తా! మీరు ఆ బండరాయి మీద పలుగుతో కొట్టినప్పుడు అందులో నుంచి వెలుగు కిరణాలు ప్రసరించాయేమిటీ?"* అని అడిగారు కొందరు అనుచరులు.

*"నువ్వు కూడా చూశావా?"* దగ్గర నిలబడి ఉన్న 'హజ్రత్ సల్మాన్ ఫార్సీ (రజి)'ని అడిగారు దైవప్రవక్త (సల్లం).

*"చూశాను దైవప్రవక్తా! నాతో పాటు ఉన్న ఇతర సహచరులు కూడా ఆ వెలుగుని చూశారు"* అన్నారు సల్మాన్ ఫార్సీ (రజి).

*"నేను మొట్టమొదట పలుగుతో ఆ రాయి మీద కొట్టినప్పుడు 'జిబ్రీల్ (అలైహి)' ప్రత్యక్షమై నాకు యమన్ దేశపు తాళపుచెవులు ఇచ్చారు. రెండవసారి కొట్టినప్పుడు సిరియా దేశపు తాళపుచెవులు అప్పగించారు. మూడవసారి కొట్టినప్పుడు ఈరాన్ దేశపు తాళపుచెవులు ఇచ్చి, _"ఈ మూడు దేశాలు మీ అనుచర సముదాయం ఆధీనంలోకి వస్తాయి★"_ అన్నారు జిబ్రీల్ దూత."* అని వివరించారు దైవప్రవక్త (సల్లం) చిరునవ్వుతో.

ఈ శుభవార్త విని ముస్లింలు పరమానందభరితులయ్యారు. హర్షాతిరేకంతో దిక్కులు పిక్కుటిల్లేలా మరోసారి *"అల్లాహుఅక్బర్"* అంటూ నినదించారు.

_(★→ యమన్ దేశం దైవప్రవక్త (సల్లం) జీవితకాలంలోనే ముస్లింల ఆధీనంలోకి వచ్చింది. సిరియా వైపు దండయాత్రలు మొదటి ఖలీఫా 'అబూ బక్ర్ (రజి)' పాలనా కాలంలోనే ప్రారంభమయ్యాయి. అయితే రెండవ ఖలీఫా 'ఉమర్ (రజి)' పాలన కాలంలో సిరియా పూర్తిగా ముస్లింల ఆధీనంలోకి వచ్చింది. పోతే ఈరాన్ వైపు దండయాత్రలు రెండవ ఖలీఫా ఉమర్ (రజి) పాలనా కాలంలో ప్రారంభమై, ఆయన పాలనా కాలంలోనే ఈరాన్ పూర్తిగా ముస్లింల ఆధీనంలోకి వచ్చింది.)_

ముస్లిములు అలుపూ సొలుపూ లేకుండా కందకాన్ని త్రవ్వుతూనే ఉన్నారు. పగలు కందకాన్ని త్రవ్వుతూ రాత్రి కాగానే ఇళ్ళకు వెళ్ళిపోయేవారు. మదీనా పొలిమేరల వరకు దైవతిరస్కారుల సైన్యం చేరేటప్పటికీ త్రవ్వకం పని పూర్తి అయిపోయింది.

మొత్తం మీద త్రవ్వకం ఆరు రోజుల్లో పూర్తయింది. కందకం తయారయింది. ఇప్పుడు మదీనా పట్టణానికి పూర్తి భద్రత ఏర్పడింది.

ఇటు ఖురైషులు తమ నాలుగు వేల సైనికులతో మదీనా దాపున ఉన్న రోమా, జుర్ఫ్ మరియు జగాబాలకు నడుమగల "మజ్మ ఉల్ అస్'యాల్" అనే ప్రదేశంలో విడిది చేశారు. మరోవంక గత్ఫాన్ మరియు వారి నజద్ కు చెందిన సహచరులు ఆరు వేల మందితో ఉహద్ పర్వతం తూర్పు ప్రక్కన 'జన్బె నఖమీ' అనే ప్రదేశంలో వచ్చి దిగారు.

మదీనా నుంచి ముస్లిం సైన్యం బయలుదేరింది. ఆ సేనను ఢీకొనడానికి దైవప్రవక్త (సల్లం) కూడా మూడువేల మంది ముస్లింల సేనను తీసుకొని అక్కడికి వచ్చారు. 'సలా' పర్వతాన్ని వెనుకగా ఉంచి సంరక్షణ వలయాన్ని ఏర్పరిచారు. ఇక ముందు ఉన్నది అగడ్తే. ఇది ముస్లింలకు దైవధిక్కారులకు నడుమ అడ్డుగా ఉంది. ముస్లింల సంకేతపదం *"హామ్మీమ్ లా యన్సరూన్" (అంటే హామ్మీమ్ వారికి ఎలాంటి సహాయం అందబోదు అని అర్థం).* మదీనా పాలనా బాధ్యతను 'హజ్రత్ ఉమ్మె మక్తూమ్ (రజి)'గారికి అప్పజెప్పడం జరిగింది. స్త్రీలను, పిల్లలను మదీనా కోటల్లోనూ, చిన్న చిన్న గఢాలలోను సురక్షితంగా ఉంచడం జరిగింది.

*కందకం వద్దకు చేరుకున్న శత్రువులు : -*

బహుదైవారాధకులు మదీనాపై దండెత్తడానికి మదీనా దాపుకు రాగానే వారికి అడ్డంగా ఓ వెడల్పాటి కందకం అగుపడింది. విధిలేక వారు అక్కడనే ఆగిపోవలసివచ్చింది. వారు ఇండ్ల నుంచి బయలుదేరేటప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కోవలసివస్తుందని అనుకోలేదు. ఎందుకంటే ఆత్మరక్షణకు సంబంధించిన ఈ ఎత్తుగడ - వారు చెప్పేదాని ప్రకారం - ఇప్పటి వరకు అరబ్బులకు తెలియని ఎత్తుగడ. కాబట్టి వారు దీనికి ఏమాత్రం సిద్ధమై రాలేదు.

బహుదైవారాధకులు కందకం దగ్గరకు వచ్చి క్రోధం మితిమీరేటట్లు దాని ప్రక్కగా చిందులేయనారంభించారు.

*↑ ఇందులోని వివరణను తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగంలో....; →*

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment