250

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌  *ఇస్లాం చరిత్ర - 250*   🕌🛐🕋☪

🇸🇦🇸🇦  *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 165*  🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

               *ఉహద్ పోరాటం తరువాతి సైనిక చర్యలు*

*ఉహద్ యుద్ధంలో అపజయానికి గురియైన తరువాత ముస్లింలకు ఇప్పటి వరకు లభించిన ఖ్యాతి కాస్త మట్టిలో కలిసిపోయింది. విరోధుల హృదయాల్లో వారి యెడల ఉన్న భయభక్తులు తొలగిపోయి పులులైపోయారు. దీని ఫలితంగా, విశ్వాసులపై ఇటు మదీనాలోనూ, అటు మదీనాకు వెలుపల నుండి వచ్చిపడే కష్టాలు అధికమైపోయాయి. మదీనా నలువైపుల నుండి ప్రమాదాలు పొంచి చూస్తున్నాయి. యూదులు, వంచకులు మరియు బుద్దూలూ బాహాటంగా వారి శత్రుత్వాన్ని బహిర్గతం చేయనారంభించారు. ప్రతి వర్గం ముస్లింలకు నష్టం కలిగించే ప్రయత్నంలో నిమగ్నమైపోయింది. ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు ముస్లింలను అంతమొందించడం తేలిక అనీ, వారిని నామరూపాల్లేకుండా చేయవచ్చనే ధైర్యం కూడా వారికి కలిగింది.*

కాబట్టి ఉహద్ పోరాటం జరిగి రెండు నెలలు గడిచాయో లేదో 'బనూ అసద్' తెగ మదీనాపై దాడి చేయడానికి సంసిద్ధమైంది. సఫర్ నెల హిజ్రీ శకం - 4లో 'అజ్ల్' మరియు 'ఖారా' అనే రెండు తెగలు పన్నిన కుట్ర మూలంగా *పదుగురు సహాబా (రజి)లు అమరగతిని పొందవలసి వచ్చింది*.

అదే నెలలో 'బనూ ఆమిర్' అనే ధనవంతుడు అలాంటిదే మరో ద్రోహం తలపెట్టడం వలన *డెబ్భై మంది సహాబా (రజి)లు అమరగతి పొందారు*. ఈ సంఘటన 'బీరె మఊనా' పేరుతో ప్రఖ్యాతిగాంచింది.

ఈ తరుణంలోనే 'బనూ నజీర్' తెగ కూడా బాహాటంగా ముస్లింలకు వ్యతిరేకంగా కక్ష సాధించడానికి సిద్ధపడింది. ఆ తెగ, రబీఉల్ అవ్వల్ నెల, హిజ్రీ శకం - 4లో స్వయంగా *మహాప్రవక్త (సల్లం)నే హతమార్చే ప్రయత్నం చేసింది*. ఇటు 'బనీ గత్ఫాన్' తెగ ధైర్యం పెచ్చుపెరిగి జమాదిల్ ఊలా మాసం (హిజ్రీ శకం - 4)లో *మదీనాపై దాడి చేసే పథకాన్ని కూడా సిద్ధం చేసుకుంది*.

*మొత్తానికి ఉహద్ యుద్ధంలో మట్టిపాలైన ముస్లింల గౌరవం ఫలితంగా ముస్లింలు ఓ కొంత కాలం మట్టుకు ప్రమాదాల వలలో చిక్కుకుపోయారన్నది వాస్తవం*. అయితే, ఈ తరుణంలో మహాప్రవక్త (సల్లం) అనుసరించిన యుద్ధనీతి, చతురత, వివేచనలు ఆ ప్రమాదాలన్నిటిని తప్పించి ముస్లింలకు వారి పూర్వ గౌరవోన్నతులను తెచ్చిపెట్టగలిగాయి. తిరిగి వారికి పూర్వవైభవం కట్టబెట్టాయి.

ఈ విషయంలో మహాప్రవక్త (సల్లం) 'హుమ్రా ఉల్ అసద్' వరకు బహుదైవారాధకులను వెంటాడిన తీరు మొదటిది. ఈ చర్య మూలంగా ఆయన (సల్లం) సేన గౌరవం చాలా మటుకు నిలబడగలిగింది. ఎందుకంటే ఈ చర్య ఎంతో ధైర్యసాహసాలతో కూడిన యుద్ధవ్యూహానికి సంబంధించిన చర్య. ముఖ్యంగా దైవప్రవక్త (సల్లం)ను విరోధించే వారు ముఖ్యంగా 'మునాఫిక్'లు మరియు 'యూదులు' ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టారు.

ఆ తరువాత ఆయన (సల్లం) ఎడతెగకుండా నడిపిన సైనిక చర్యల్లో ముస్లింల పూర్వ ప్రాభవం తిరిగి రావడమే కాకుండా ఆ ప్రాభావం మరింత పెరిగిపోయింది కూడా. ముందు పుటల్లో ఆ విషయాల గురించే చెప్పడం జరుగుతోంది.

*1. సరియ్యా అబీ సల్మా : -*

ఉహద్ పోరాటం తరువాత ముస్లింలకు వ్యతిరేకంగా మొట్టమొదట 'బనూ అసద్ బిన్ ఖజీమా' తెగ సమాయత్తమైంది. 'ఖువైలీద్' ఇద్దరు కుమారులు 'తల్హా' మరియు 'సల్మా'లు కలసి తమ జాతిని, విధేయుల్ని వెంటబెట్టుకొని 'బనూ అసద్' తెగను దైవప్రవక్త (సల్లం)పై దాడి చేయడానికి పురికొల్పుతున్నారనే వార్త మదీనాకు చేరింది. వెంటనే మహాప్రవక్త (సల్లం) నూటయాభై మంది అన్సారులు మరియు ముహాజిర్లతో కూడిన ఓ సైనిక పటాలాన్ని సిద్ధపరిచారు.

'హజ్రత్ అబూ సల్మా (రజి)'కు ఆ సైనిక పటాలం జెండాను ఇచ్చి ఆయనను ఆ పటాలం కమాండరుగా నియమించి పంపారు. హజ్రత్ అబూ సల్మా (రజి), బనూ అసద్ బయలుదేరక మునుపే వారిపై విరుచుకుపడ్డారు. ఈ హఠాత్పరిణామానికి ఏమీ పాలుపోక వారు చెరో దిక్కు పారిపోయారు. ముస్లిములు వారి ఒంటెల్ని, మేకల్ని స్వాధీనపరుచుకొని మదీనాకు తిరిగి వచ్చారు. వారిని ఎదుర్కొని యుద్ధం చేసే అవసరమే ఏర్పడలేదు.

ఈ సరియ్యా, ముహర్రం నెల, హిజ్రీ శకం - 4న నెలపొడుపు రోజున పంపించడం జరిగింది. తిరిగివచ్చిన తరువాత హజ్రత్ అబూ సల్మా (రజి)కు ఉహద్ యుద్ధంలో అయిన గాయం వల్ల మరణం సంభవించింది.

*2. అబ్దుల్లా బిన్ ఉనీస్ (రజి) గారు జరిపిన సైనిక చర్య : -*

అదే నెల ముహర్రం 5వ తారీఖున (హిజ్రీ శకం - 4) 'ఖాలిద్ బిన్ సుఫ్యాన్ హుద్ లీ' అనేవాడు ముస్లింలపై దాడి చేయడానికి సైన్యాన్ని సమీకరిస్తున్నాడన్న వార్త అందింది. మహాప్రవక్త (సల్లం) అతని పీచమణచడానికిగాను 'హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉవీస్ (రజి)'ను పంపారు.

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉవీస్ (రజి) పద్దెనిమిది రోజుల తరువాత తిరిగి వచ్చారు. ఆయన, ఖాలిద్ ను చంపి అతని తలను కూడా వెంటతెచ్చారు. మదీనా చేరి ఆయన దైవప్రవక్త (సల్లం) ముందు ఆ తలను పడవేయగా దైవప్రవక్త (సల్లం), ఆయనకు ఓ చేతికర్రను బహుకరిస్తూ, *"ఇది నాకు నీకు ప్రళయం రోజున గుర్తుగా ఉంటుంది."* అన్నారు. ఆయన (రజి) మరణించేటప్పుడు ఈ చేతికర్రను నా కఫన్ లో చుట్టి దాన్ని కూడా ఖననం చేయమని మరణ శాసనం చేశారు.

*3. రజీ సంఘటన : -*

ఆ సంవత్సరమే (హిజ్రీ శకం - 4) సఫర్ నెలలో దైవప్రవక్త (సల్లం) వద్దకు 'అజ్ల్' మరియు 'ఖారా' తెగలకు చెందిన కొంతమంది వచ్చి, *"దైవప్రవక్తా! మా తెగలో ఇస్లాం ధర్మం గురించి బాగా ప్రచారం జరుగుతోంది. తమరు ధర్మబోధ కోసం, ఖుర్ఆన్ చదివించడానికి కొంతమందిని పంపండి."* అని కోరారు.

మహాప్రవక్త (సల్లం) కొంతమంది సహాబా (రజి)లను వారి వెంట పంపించారు.

ఇలా వారు ప్రయాణం సాగిస్తుండగా దారిలో ఓ ప్రదేశం వద్ద, 'అజ్ల్' మరియు 'ఖారా' తెగలకు చెందిన వారు 'హుజైల్' తెగ వారిని వారిపై (సహాబాలపై) పురికొల్పి వెన్నంటి చంపమని పంపించారు.

*↑ ఇందులోని వివరణను, తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగంలో....; →*

✏✏ *®@£€€q  +97433572282* ✏✏ 
             *(rafeeq)*

✏✏  *Salman    +919700067779* ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment