249

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐


🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋


◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉


🕌☪🕋🛐      *ఇస్లాం చరిత్ర - 249*       🛐🕋☪🕌


🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 164*      🇸🇦🇸🇦


◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉


*ఉహద్ పోరాటం గురించి ఖుర్ఆన్ చేసిన విశ్లేషణ : -*


దివ్య ఖుర్ఆన్, ఈ పోరాటానికి సంబంధించిన ఒక్కొక్క దశను వెలుగులోకి తెచ్చి, వాటిని విడమర్చి చెబుతూ, ముస్లిములు ఏయే కారణాల వల్ల పెద్ద నష్టానికి గురికావలసి వచ్చిందో విశదీకరించింది. నిర్ణయాత్మకమైన ఈ తరుణంలో, ఇతర సమాజాల కంటే మిన్న అయిన ఈ విశ్వాసుల సమాజాన్ని ఏ ఉన్నత ధ్యేయాల కోసమైతే ఉనికిలోనికి తేవడం జరిగిందో, దానికి చెందిన వివిధ వర్గాల్లో ఎలాంటి బలహీనతలు చోటు చేసుకొని ఉన్నాయో వ్రేలేత్తి చూపించింది.


అలాగే దివ్య ఖుర్ఆన్ వంచకుల వైఖరిని కూడా బట్టబయలు చేసింది. వారి హృదయాల్లో దైవం మరియు దైవప్రవక్త (సల్లం) ఎడల దాగి ఉన్న కక్షను, కార్పణ్యాన్ని కూడా బయటకు లాగి బహిర్గతం చేసింది. అలాగే ఈ వంచకులు వారి యూద సోదరులతో చేసుకున్న రహస్య ఒప్పందాల్ని కూడా బహిరంగ పరచింది. దీనికి తోడు ఈ పోరాటం వెనుక దాగివున్న మహోన్నత ధ్యేయాల వైపునకు దృష్టిని కూడా మళ్ళించింది.


దివ్యగ్రంథం ఖుర్ఆన్ లోని ఆలి ఇమ్రాన్ సూరా (అధ్యాయం)లో ఈ పోరాటానికి సంబంధించినవే అరవై ఆయత్ లు అవతరించాయి. ప్రథమంగా ఇందు ఈ పోరాటం యొక్క మొదటి దశను వివరిస్తూ ఇలా చెప్పటం జరిగింది. ↓


*"(ఓ ప్రవక్తా! ఆ సమయాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకో,) అప్పుడు నీవు తెలతెలవారుతుండగా నీ ఇంటి నుండి బయలుదేరి రణరంగంలో విశ్వాసులు మోహరించవలసిన స్థలాలను నిర్థారించ సాగావు. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు." (ఖుర్ఆన్ 3:21).*


ఆ తరువాత చివరిలో ఈ యుద్ధం పరిణామాలు, దాని ఆంతర్యంపై వెలుగును ప్రసరింపజేస్తూ ఇలా చెప్పడం జరిగింది. ↓


*"అపవిత్రులను పవిత్రుల నుంచి వేరుపరచే వరకూ అల్లాహ్ విశ్వాసులను ఇప్పుడున్న స్థితిలోనే వదలిపెట్టడు. అలా అని అల్లాహ్ మీకు అగోచర విషయాలనూ తెలుపడు. పైగా అల్లాహ్ తన ప్రవక్తలలో తాను కోరిన వారిని (ఇందుకోసం) ఎన్నుకుంటాడు. అందుచేత మీరు అల్లాహ్ ను, ఆయన ప్రవక్తలను విశ్వసించండి. మీరే గనక విశ్వసించి, దైవభీతి పరులుగా మసలుకున్నట్లయితే మీకు గొప్ప పుణ్యఫలం లభిస్తుంది." (ఖుర్ఆన్ 3:179).*


*ఉహద్ పోరాటంలో ఇమిడి ఉన్న దైవాంతర్యాలు, దైవధ్యేయాలు : -*


'అల్లామా ఇబ్నె ఖైమ్' ఈ విషయం గురించి చాలా వివరంగా రాశారు. చూడండి, జాదుల్ ముఆద్ - 2/99-108.


హాఫిజ్ ఇబ్నె హజర్, ధార్మిక పండితులు ఉహద్ యుద్ధం, ఆ యుద్ధంలో ముస్లిములకు ఎదురైన చేదు అనుభవంలో అనేక దైవనిర్ణయాలు, ప్రయోజనాలు ఉన్నాయి అని అంటారు. ఉదాహరణకు, ముఖ్యంగా ముస్లిముల ఆనాటి దుర్వ్యవహారం, ప్రవక్త (సల్లం) గారి ఆదేశాలను శిరసావహించకుండా ఉండడంలాంటి విషయాల్లో అనేక అపశకునాలు ఎదురయ్యాయని చెప్పడం. ఎందుకంటే, విలుకాండ్రను తమ స్థానాల్లో స్థిరంగా నిలబడే ఏ ఆదేశం అయితే దైవప్రవక్త (సల్లం) ఇచ్చారో వారు దాన్ని ఉల్లంఘించడం జరిగింది. వారు, వారి కేంద్ర స్థానాల్ని విడిచిపెట్టి యుద్ధరంగంలో యుద్ధధనాన్ని ప్రోగు చేయడానికి వచ్చేశారు (ఈ కారణంగానే వారు కష్టాలపాలైపోవడం జరిగింది).


మరో విషయం ఏమిటంటే, దైవప్రవక్తలందరూ మొదట కష్టాలకు గురి కావడం సంప్రదాయంగా వస్తున్న విషయం. చివరికి వారికే విజయం చేకూరుతుంది. అయితే వారికే గనక విజయాలపై విజయాలు లభిస్తూపోతుంటే, అల్లాహ్ పై విశ్వాసంలేని వారు కూడా ముస్లిం సమాజంలో చోటు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఆ తరువాత సత్యసంధులు ఎవరో, అసత్యవాదులు ఎవరో తెలుసుకునే అవకాశమే చిక్కదు. అలాగే సతతం అపజయానికే గురికావలసి వస్తే వారు ప్రభవించడంలో అర్థమే ఉండకపోయేది. అందుకని దైవ వివేచన ప్రకారం వారికి ఈ రెండూ (జయాపజయాలు) సంభవించి తీరాల్సిందే. ఇలా జరగడం వలన తనవారూ, పరాయి వారిలో భేదం కనిపిస్తుంది. ఎందుకంటే, వంచకుల విశ్వాసం ముస్లిములకు తెలియదు. ఈ సంఘటన జరిగిన తరువాత కపట ముస్లిముల మాటలు, చేతలు బయటబడ్డాయి. ముస్లిములకు, వారి ఇండ్లలోనూ వారికి శత్రువులు ఉన్నారన్న విషయం అర్థమైపోయింది. ఈ కారణం చేత విశ్వాసులు వారిని ఎదుర్కోడానికి జాగరూకతతో సంసిద్ధులైపోయారు.


మరో విషయం ఏమిటంటే, కొన్ని చోట్ల దైవసహాయం అందడంలో కొంత ఆలస్యం జరగడం వల్ల వారిలో నమ్రత పొడసూపి, వారిలో చోటు చేసుకున్న గర్వం కాస్తా మటుమాయమైపోయింది. విశ్వాసులు ఈ కష్టాలను చవి చూసిన తరువాత ఎంతో సహనాన్ని అవలంబించారు. అయితే వంచకులలో హాహాకారాలు చెలరేగాయి.


అల్లాహ్ విశ్వాసుల గౌరవం కోసం స్వర్గంలో కొన్ని హోదాలను, అంతస్తులను సిద్ధపరచి ఉంచాడు. కేవలం ముస్లిముల కార్యాచరణ, సత్ప్రవర్తన ఆ హోదాలు, ఆ అంతస్తుల వరకు చేర్చజాలవు. కాబట్టి వారిని ఈ యుద్ధం ద్వారా కొంత పరీక్షకు గురిచేయడం జరిగింది. ఆ పరీక్షలో నెగ్గినవారికే ఆ అంతస్తులు, ఆ హోదాలు లభ్యమవుతాయి. ఇది కూడా దైవ వివేచనకు సంబంధించిన ఓ విషయమే.


ఇదే కాదు, దైవమార్గంలో ప్రాణాలు అర్పించి షహీద్ కావడం కూడా దైవానికి అతి ప్రియమైన అవులియాల హోదా. ఈ యుద్ధంలో ఆయన ధర్మం కోసం ప్రాణాలు అర్పించి ఆ హోదాను పొందగలిగారు.


ఇంకో దైవాంతర్యం ఏమిటంటే, ఈ యుద్ధం ద్వారా అల్లాహ్ తన శత్రువుల్ని సంహరింపజేయాలనుకోవడం. కాబట్టి వారి కోసం అలాంటి పరిస్థితులను సృష్టించాడు. అంటే తనకు ప్రియమైన అవులియాలను బంధించడం, హింసించడం లాంటివి మితిమీరిపోయాయి. (దాని ఫలితంగా) అల్లాహ్ విశ్వాసుల పాపాలను కడిగివేసి వారిని పరిశుద్ధులుగా చేశాడు. దైవధిక్కారులను సంహరించి భంగపాటుకు గురిచేశాడు. (ఫత్ హుల్ బారి - 7/347).


       *ఉహద్ పోరాటం తరువాతి సైనిక చర్యలు ↓*


    *In Sha Allah తరువాతి భాగములో....; ↓*


   *ఈద్ సందర్భంగా ఇస్లాం చరిత్రను 29/08/2018 నుంచి కొనసాగించగలమని మనవి చేసుకుంటున్నాం.*


✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 


✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻


*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*


                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment