248

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉

🕌☪🕋🛐      *ఇస్లాం చరిత్ర - 248*       🛐🕋☪🕌

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 163*      🇸🇦🇸🇦

◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉

దైవప్రవక్త (సల్లం), 'హుమ్రాఉల్ అసద్' అనే ప్రదేశంలో అబూ సుఫ్'యాన్ కోసం మూడురోజుల దాకా ఎదురుచూశారు. కాని అబూ సుఫ్'యాన్ రాలేదు. అబూ సుఫ్'యాన్, మదీనాపై దండెత్తడానికి వస్తున్నానని మాటవరసకు అన్నాడేకాని, ముస్లిం యోధులంటే అతనికి లోపల భయంగానే ఉంది. అతని సైనికులకు కూడా ఈ విషయం బాగా తెలుసు. అందువల్ల వారు, ఎంతో కొంత దక్కిన గౌరవాన్నే ఘనవిజయంగా భావిస్తూ మక్కా దారిపట్టారు.

ఖురైష్ సైన్యం మక్కా వెళ్ళిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత దైవప్రవక్త (సల్లం) కూడా తన అనుయాయుల్ని తీసుకొని మదీనా తిరిగొచ్చారు.

*ప్రవక్త (సల్లం), మదీనాకు తిరిగి వచ్చే ముందు జరిగిన సంఘటన : -*

ప్రవక్త (సల్లం), మదీనాకు తిరిగి వచ్చేముందు 'అబూ అజ్జా హుజ్మీ' ఆయన (సల్లం)కు పట్టుబడ్డాడు. బద్ర్ యుద్ధంలో బంధీ అయిన తరువాత అతని దారిద్ర్యం, అతని కుమార్తెల ముఖం చూసి దైవప్రవక్త (సల్లం) అతనికి, తమకు వ్యతిరేకంగా ఖురైషులకు ఎలాంటి సాయం చేయబోడన్న షరతు విధించి విడుదల చేసి ఉన్న విషయం మనకు తెలిసిందే. కాని అతను చేసిన వాగ్దానానికి వ్యతిరేకంగా తన కవనంతో దైవప్రవక్త (సల్లం) మరియు సహాబా (రజి)లకు వ్యతిరేకంగా ఖురైషుల భావోద్రేకాలను రెచ్చగొట్టాడు. ఈ విషయం కూడా మనం వెనుకటి పుటల్లో చదువుకున్నదే.

ఆ తరువాత అతను ముస్లిములతో పోరాడటానికి స్వయంగా ఉహద్ యుద్ధంలో పాల్గొన్నాడు.

బంధీ అయిన అతణ్ణి, దైవప్రవక్త (సల్లం) దగ్గరకు తీసుకురాగా అతను, *"ముహమ్మద్ (సల్లం)! నా తప్పును క్షమించండి. నాపై కరుణ చూపండి. నా కుమార్తెల కోసం అయినా నన్ను వదిలిపెట్టండి. నేను ఇక నుండి ఇలాంటి బుద్ధితక్కువ చర్యలకు పాల్పడను."* అంటూ పరిపరి విధాల కాళ్ళావేళ్ళా బడ్డాడు.

అందుకు మహాప్రవక్త (సల్లం), *"ఇప్పుడు నీవు మక్కాకు వెళ్ళి ముహమ్మద్ (సల్లం)ను రెండుమార్లు మోసగించానని చెప్పే అవకాశమే ఇవ్వడం జరగదు. ఓ విశ్వాసి ఒకే కన్నం నుండి రెండు సార్లు కాటుకు గురిజాలడు (రెండు సార్లు అదే మోసానికి గురికాజాలడు అని అర్థం)."* అని అన్నారు.

పిదప హజ్రత్ 'జుబైర్ (రజి)' లేదా హజ్రత్ 'ఆసిమ్ బిన్ సాబిత్ (రజి)'ను అతని మెడ నరకమని ఆదేశించారు.

అలాగే మక్కాకు చెందిన మరో వేగులవాడు కూడా చంపబడ్డాడు. అతని పేరు 'ముఆవియా బిన్ ముగైరా బిన్ అబిల్ ఆస్'. ఇతను 'అబ్దుల్ మాలిక్ బిన్ మర్వాన్'కు తాత.

ఇతను ముస్లిములకు పట్టుబడ్డ తీరు ఎలాంటిది అంటే, తన పినతండ్రి కుమారుడు అయిన 'హజ్రత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రజి)'ను చూసి పోదామని వచ్చి దైవప్రవక్త (సల్లం) సంరక్షణ కోరాడు. మహాప్రవక్త (సల్లం) అతనికి మూడు రోజులకంటే ఎక్కువ కాలం మదీనాలో ఉంటే అతని తల మొండెం నుండి వేరుచేయబడుతుందనే షరతుపై అనుమతి ఇచ్చారు. కాని, మదీనా నగరం ఇస్లామీయ సేన లేకుండా ఖాళీ అయిన తరువాత రహస్య సమాచారాన్ని సేకరించేందుకు మూడు రోజుల కంటే అధికంగా మదీనాలో ఉండిపోయాడు. ఇస్లామీయ సేన తిరిగి రావడం చూసి పారిపోవడానికి సన్నద్ధుడవుతుండగా అతన్ని పట్టుకోవడం జరిగింది. మహాప్రవక్త (సల్లం), హజ్రత్ జైద్ బిన్ హారిసా (రజి)నో లేదా అమ్మార్ బిన్ యాసిర్ (రజి)నో అతణ్ణి వెంబడించి చంపేయమని ఆదేశం ఇచ్చారు. మహాప్రవక్త (సల్లం) ఆదేశం మేరకు అతను చంపబడ్డాడు.

'గజ్వయె హుమరా ఉల్ అసద్'ను ఓ ప్రత్యేకమైన పేరుతో పిలువడం జరుగుతోంది. కాని యదార్థం ఏమిటంటే, అది ఓ శాశ్వతమైన గజ్వా మాత్రం కాదు. ఇది ఉహద్ యుద్ధానికి సంబంధించిన ఓ భాగం. అంటే ఆ యుద్ధచరిత్రకు సంబంధించిన ఓ పుట మాత్రమే.

           *ఉహద్ యుద్ధ జయాపజయాలపై ఓ సమీక్ష*

'గజ్వయె ఉహద్' లేదా ఉహద్ యుద్ధానికి సంబంధించిన దశలు, వివరాలన్నీ (నిన్నటి భాగంలో మరియు) పైన చెప్పుకున్నాం. ఈ యుద్ధ పరిణామం గురించి ముస్లిములు, ఈ యుద్ధంలో అపజయం పాలయ్యారా లేదా అన్న దానిపై సుదీర్ఘమైన చర్చలూ జరిగాయి. ఆ యుద్ధం గురించిన యదార్థాలను పరిశీలిస్తే యుద్ధంలోని రెండవ దశలో బహుదైవారాధకులకే ఆధిక్యత లభించిందని, వారే విజయం సాధించారని, నష్టం ముస్లిములకే అధికంగా జరిగిందని చెప్పవచ్చు. ముస్లిముల ఓ వర్గం ఓడి పారిపోయి మదీనాకు చేరింది కూడా. యుద్ధ గమనం కూడా మక్కా సైన్యానికి అనుకూలంగానే మారింది. అయితే, ఇంత జరిగినా, కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడం మూలంగా ఈ విజయం బహుదైవారాధకులకే లభించింది అనడానికి వీల్లేదు. ఆ సంఘటనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. *↓↓↓*

మక్కా సైన్యం ముస్లిముల శిబిరాన్ని హస్తగతం చేసుకోలేకపోయింది.

మదీనా సైన్యంలో అస్తవ్యస్త పరిస్థితి, క్రమశిక్షణారాహిత్యం ఏర్పడినప్పటికీ వారు పూర్తిగా పలాయనాన్ని చిత్తగించలేదు. కాగా, ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి పోరాడుతూ, తమ సర్వసైన్యాధ్యక్షుని వద్దకు చేరుకోవడం జరిగింది. అంతేకాదు, ముస్లిములు మక్కా సైన్యం వెంటాడి తరిమే అంత బలహీనంగా కూడా లేరు.

దైవధిక్కారులు ఎలాంటి యుద్ధ సొత్తునూ హస్తగతం చేసుకునే అవకాశమే లభించలేదు. దానికి తోడు ఇస్లామీయ సైన్యం ఇంకా తన శిబిరంలోనే ఉన్నప్పటికీ ముష్రిక్కుల సైన్యం యుద్ధం మూడో దశ కోసం సిద్ధం కాలేకపోయింది.

అదే కాకుండా, బహుదైవారాధకుల సేన యుద్ధ మైదానంలో రెండూ లేక మూడు రోజుల వరకు వేచి చూడలేకపోయింది. అలా మూడు రోజుల వరకు యుద్ధ రంగంలో వేచి ఉండడం విజయం పొందిన సేన సంప్రదాయం. ఇది విజయానికి సంబంధించిన అత్యవసరమైన చర్య. కాని దైవతిరస్కారులు ఎంతో వేగంగా, ముస్లిముల కంటే ముందరే యుద్ధరంగాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు.

దైవధిక్కారులకు మదీనా పట్టణం కొంత దూరంలోనే ఉన్నప్పటికీ దాన్ని దోచుకోవడానికి వారికి ధైర్యం చాలలేదు. అదేకాకుండా ఆ సమయంలో వారిని అడ్డగించేవారు కూడా లేరు.

ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే, ఖురైషులు మహా అయితే, సమయం, సందర్భాన్ని ఆసరాగా తీసుకొని ముస్లిములకు భారీ నష్టాన్నే కలిగించగలరు. అలా జరగక ఉంటే, ఇస్లామీయ సేనను చుట్టుముట్టిన తరువాత దాన్ని పూర్తిగా తుడిచిపెట్టడమో లేదా సైనికుల్ని బంధీలుగా చేసుకోవడమో జరగాల్సి ఉంది, యుద్ధం దృష్టి కోణంతో చూస్తే అలా తప్పకుండా జరగాలి కూడా. ఆ పనిలో మాత్రం ఖురైషులు పూర్తిగా విఫలం అయ్యారనే చెప్పవచ్చు.

ముస్లిం సేన పెద్ద నష్టం పొందినప్పటికీ వారి దిగ్బంధాన్ని చేధించి బయటపడగలిగింది. ఇలాంటి నష్టం ఖుద్దు అనేకమంది విజేతలకు కూడా చవిచూడవలసి వస్తుంది యుద్ధ సమయంలో, కాబట్టి దీన్ని ముష్రిక్కుల విజయంగా నిర్ణయించడానికి వీల్లేదు.

కాగా, తిరుగు ప్రయాణంలో అబూ సుఫ్'యాన్ ప్రదర్శించిన తొందర పాటు ద్వారా యుద్ధం మూడోదశ ప్రారంభం అయితే తన సేన ఎనలేని నష్టానికి, ఓటమికి గురి అయిపోతుంది అనే భయం కూడా అవగతమవుతోంది. అబూ సుఫ్'యాన్ 'గజ్వయె హుమరా ఉల్ అసద్' సందర్భంగా అవలంబించిన తీరు ఈ విషయాన్ని మరింతగా ధృవపరుస్తోంది.

ఇలాంటి పరిస్థితిలో మనం గజ్వయె ఉహద్ లో ఒక వర్గానికి విజయం, మరో వర్గానికి పరాజయం లభించింది అని అనడం కంటే, దీన్ని ప్రయోజనం లేని ఓ యుద్ధంగా పరిగణించవచ్చు. ఈ యుద్ధంలో ప్రతి వర్గం తనకు కలిగిన నష్టాన్ని చవి చూడవలసి వచ్చింది. అదేకాదు, యుద్ధరంగం నుండి పారిపోయే బదులు తన శిబిరాన్ని శత్రువుకు ఆధీనం కాకుండా రక్షించుకొని యుద్ధం జరగకుండా చూడడం చేశారు ముస్లిములు. అందుకనే దీన్ని అసంపూర్ణ యుద్ధంగానే అభివర్ణించవచ్చు. ఈ విషయాన్నే ఉటంకిస్తూ దివ్య ఖుర్ఆన్ ఇలా అంటోంది....; ↓

*"వారిని వెంబడించటంలో ఏ మాత్రం బలహీనతను ప్రదర్శించకండి. ఒకవేళ మీరు అవిశ్రాంతంగా ఉన్నారనుకుంటే మీ మాదిరిగానే వారు కూడా అవిశ్రాంతంగా ఉన్నారు. పైగా అల్లాహ్ నుంచి వారు ఆశించని వాటిని మీరు ఆశిస్తున్నారు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేచనాపరుడు." (ఖుర్ఆన్ 4:104).*

ఈ ఆయత్ లో 'అవిశ్రాంతత' అనే విషయంలో ఇరు వర్గాలు సమానం అని అల్లాహ్ చెప్పడం జరిగింది. ఈ రెండు వర్గాల్లో, ఏ ఒక్క వర్గమూ మరో వర్గంపై విజయం సాధించకుండా వెనక్కు మళ్ళింది.

*ఉహద్ పోరాటం గురించి ఖుర్ఆన్ చేసిన విశ్లేషణ : - ↓*

*In Sha Allah రేపటి భాగములో....; →*

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment