246

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉

🕌☪🕋🛐      *ఇస్లాం చరిత్ర - 246*       🛐🕋☪🕌

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 161*      🇸🇦🇸🇦

◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉

          🛡⚔ *ఉహద్ పోరాటం : - 18*⚔🛡

*మదీనాకు తిరుగు ప్రయాణం - దైవప్రవక్త (సల్లం) పట్ల అభిమానం, ప్రేమ ఉట్టిపడే అసాధారణ సంఘటనలు : -*

షహీదుల ఖననం, అల్లాహ్ స్తోత్రం మరియు ఆయన సమక్షంలో చేసిన వేడుకోలు అనంతరం ప్రవక్త శ్రీ (సల్లం) మదీనాకు తిరుగు ప్రయాణం కట్టారు. యుద్ధరంగంలో ప్రవక్త శ్రీ (సల్లం)గారి అనుచరగణం ప్రదర్శించిన అభిమానం, ప్రేమ లాంటి సంఘటనలే తిరుగు ప్రయాణంలో మహిళా విశ్వాసులు కూడా ప్రదర్శించడం జరిగింది. ఆ ఆసక్తిగొలిపే సంఘటనలు కొన్నింటిని ఇక్కడ తెలియపరుస్తున్నాం. ↓

మదీనాకు తిరుగు ప్రయాణం చేసేటప్పుడు మార్గమధ్యంలో 'హజ్రత్ హమ్నా బిన్తె హజష్ (హజష్ కుమార్తె హమ్నా)' కలిశారు. ఆమెగారికి ఆమె సోదరుడు 'అబ్దుల్లాహ్ బిన్ హజష్'గారు పరమపదించారనే వార్త ఇదివరకే అందించి. ఆమె, ఆయన (రజి) మరణానికి *"ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజి ఊన్"* చదివి ఆయన మన్నింపు కోసం దుఆ కూడా చేశారు.

ఆ తరువాత, ఆమె మేనమామ "హజ్రత్ హమ్'జా (రజి) బిన్ అబ్దుల్ ముత్తలిబ్" అమరగతి పొందారన్న విషయం చెప్పగా ఆమె తిరిగి *"ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజి ఊన్"* అని చదివి, మన్నింపు కోసం దైవాన్ని వేడుకున్నారు.

ఆ పిదప ఆమె భర్త అయిన 'హజ్రత్ ముస్అబ్ బిన్ ఉమైర్ (రజి)'గారు అమరగతిని పొందారని చెప్పడం జరిగింది. ఆ వార్త వినగానే ఆమె పెద్దగా కేక పెట్టారు. అందరికీ వినపడేటట్లు రోదించనారంభించారు. ఇది చూసిన దైవప్రవక్త (సల్లం), *"స్త్రీ దృష్టిలో ఆమె భర్త ఓ ప్రత్యేక స్థానాన్ని అలంకరించి ఉంటాడు."* అన్నారు.

ఇలాగే, మార్గంలో 'బనూ రీనార్' తెగకు చెందిన ఓ స్త్రీ దైవప్రవక్త (సల్లం)ను కలవడం జరిగింది. ఆమె భర్త, ఆమె సోదరుడు మరియు ఆమె తండ్రి ఈ యుద్ధంలో అమరగతిని పొందినవారే. ఆమెకు వీరి మరణవార్తను చేరవేయగా అదేమీ పట్టించుకోకుండా, *"మహాప్రవక్త (సల్లం) ఏమయ్యారు?"* అని అడగనారంభించారు ఆమె.

ఆమెతో ఓ ఫలానా వ్యక్తి, *"తల్లీ! దైవప్రవక్త (సల్లం) క్షేమంగానే ఉన్నారు. దైవకృప వలన ఆయన (సల్లం) నీవు అనుకున్నట్లుగానే క్షేమంగా ఉన్నారు."* అనే విషయం చెప్పడం జరిగింది.

దానికి ఆమె, *"నాకు ఆయన (సల్లం)ను చూపించండి, నా కళ్ళతో ఆయన (సల్లం)ను దర్శించుకుంటాను."* అని అనగా, అక్కడున్నవారు సైగచేసి ఓ వైపునకు చూపెట్టారు. ఆమె దృష్టి ప్రవక్త శ్రీ (సల్లం)పై పడగానే ఆమె, *"చాలు! నాకింకేం కావాలి! తమరుంటే చాలు, నా కష్టాలన్నీ తమ ముందు దిగదుడుపే!"* అన్నారు.

ఇలా ప్రయాణం చేస్తూ ఉండగానే, 'హజ్రత్ సఅద్ బిన్ ముఆజ్ (రజి)' గారి మాతృమూర్తి ప్రవక్త శ్రీ (సల్లం) వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆ సమయంలో హజ్రత్ సఅద్ బిన్ ముఆజ్ (రజి), దైవప్రవక్త (సల్లం)గారి గుర్రం కళ్ళెం పట్టుకొని నడుస్తున్నారు. ఆమెను చూసి ఆయన, ప్రవక్త శ్రీ (సల్లం)తో, *"దైవప్రవక్తా! ఆమె నా తల్లిగారు."* అని పరిచయం చేశారు. మహాప్రవక్త (సల్లం) ఆమెకు శుభాకాంక్షలు అంటూ ఆమెకు స్వాగతం పలకడానికి ఆగిపోయారు.

ఆమె దగ్గరకు రాగానే, ఆమె కుమారుడు 'అమ్రూ బిన్ ముఆజ్ (రజి)'గారి వీరమరణ వార్త చెప్పి ఓదార్చారు. అది విన్న ఆమె, *"ప్రవక్తా (సల్లం)! మిమల్ని సజీవంగా చూసిన తరువాత నా దుఃఖాలు, కష్టాలు అన్నీ మాటుమాయమైపోయాయి చాలు."* అని అన్నారు.

తరువాత దైవప్రవక్త (సల్లం), ఉహద్ యుద్ధంలో అమరగతి పొందిన యోధులను గురించి దుఆ చేస్తూ, *"ఓ ఉమ్మె సఅద్! (సఅద్ మాతృమూర్తి!) మీరు సంబరపడండి. అలాగే వీరమరణం పొందిన వారి ఇంటి వారికీ శుభవార్త చెప్పండి. వారంతా స్వర్గంలో తోడుగా ఉన్నారని, వారి ఇంటివారి కోసం వారి సిఫార్సు స్వీకరించబడిందని."* అని అన్నారు.

ఈ శుభవార్త విన్న ఉమ్మె సఅద్ (రజి), *"ఓ దైవప్రవక్తా (సల్లం)! చనిపోయిన వారి కుటుంబసభ్యుల కోసం కూడా ప్రార్థించండి."* అని అనగా; దైవప్రవక్త (సల్లం), *"ఓ అల్లాహ్! వీరి హృదయాల్లోని దుఃఖాన్ని పోగొట్టు, వారు అనుభవించే కష్టానికి ప్రత్యామ్నాయాన్ని ఒసగు, మిగిలిన వారి కుటుంబసభ్యులను కాపాడు."* అని ప్రార్థించారు.

                 *ఉహద్ యుద్ధం తరువాత*

*మదీనాలోకి ప్రవేశించిన దైవప్రవక్త (సల్లం) : -*

అదే రోజు - సోమవారం, షవ్వాల్ నెల 7వ తేది, హిజ్రీ శకం - 3న సాయంత్రం అయ్యేసరికి ప్రవక్త శ్రీ (సల్లం) మదీనాలో కాలుపెట్టారు.

ప్రవక్త (సల్లం), ఇంటికి చేరగానే తన కరవాలాన్ని తన ముద్దులపట్టి 'హజ్రత్ ఫాతిమా (రజి)'కు అందిస్తూ, *"అమ్మా! దీనికి అంటి ఉన్న రక్తాన్ని కడిగెయ్యి. దైవసాక్షి! ఇది ఈ రోజు నా కోసం సరైన పనిని నెరవేర్చింది."* అన్నారు. 'హజ్రత్ అలీ (రజి)' కూడా తన కరవాలాన్ని ఆమెకు అందిస్తూ, *"దీని రక్తం కూడా కడిగెయ్యి. దైవసాక్షి! ఇది నాకు బాగా పనికొచ్చింది."* అని అనగా; దైవప్రవక్త (సల్లం) అలీ (రజి)ను ఉద్దేశించి, *"ఒకవేళ నీవు బాగా యుద్ధం చేశానని అనుకుంటే గుర్తుంచుకో, నీతో పాటు 'సహల్ బిన్ హునైఫ్ (రజి)' మరియు 'అబూ దుజాన (రజి)' కూడా బాగా యుద్ధం చేశారు సుమా!"* అన్నారు.

అమరగతి పొందిన వారి సంఖ్య 70 మంది. అందులోను అధికులు అన్సారులకు చెందిన వారు, అంటే వారు మొత్తం 65 మంది అమరగతి పొందారని, (41 మంది ఖజ్రజ్ తెగకు మరియు 24 మంది అవస్ తెగకు చెందినవారు అన్నమాట.) యూదుల్లో షహీద్ అయినవారు ఒకరని, తక్కిన వారంతా ముహాజిర్లు, వారి సంఖ్య నాలుగు అని అనేక ఉల్లేఖనాలు చెబుతున్నాయి.

ఇక మిగిలిన వారు ఖురైషులు. వారి హతుల సంఖ్య మొత్తం 22 మంది అని ఇబ్నె ఇస్'హాక్ గారి కథనం. కాని ముగాజీ, ఇతర సీరత్ చరిత్రకారులు ఈ యుద్ధం గురించి అందించిన వివరాల ప్రకారం, ఆ యుద్ధం వివిధ దశల్లో హతులైన బహుదైవారాధకుల సంఖ్యను బేరీజు వేస్తే వారి సంఖ్య 22 కాకుండా 37 మంది అని తేలుతుంది. (వల్లాహుఆలం)★

_(★→ చూడండి, ఇబ్నె హష్షామ్ - 2/122-129). ఫతహుల్ బారీ - 7/351 మరియు ముహమ్మద్ అహ్మద్ బాష్మీల్ ఉహద్ యుద్ధం గురించి రాసిన గ్రంథం, పుట - 278, 279, 280.)_

*మదీనాలో ఆత్యయిక పరిస్థితి : -*

ముస్లిములు ఉహద్ యుద్ధం నుండి తిరిగి వచ్చారు. అది షవ్వాల్ నెల 8వ తారీఖు, హిజ్రీ శకం - 3, ఆదివారం.

ఆ రోజు నడిరేయి వారు జాగరూకులై మెలగవలసి వచ్చింది. యుద్ధం వారిని బాగా అలసటకు గురిచేసి ఉంది. అయినా వారు రాత్రంతా మదీనాకు వచ్చే మార్గాలపై పహారా కాస్తూనే ఉన్నారు. తమ సర్వసైన్యాధ్యక్షులు దైవప్రవక్త (సల్లం)ను ప్రత్యేకంగా రక్షణలోనికి తీసుకున్నారు. ఎందుకంటే, వారికి అన్ని వైపుల నుండి ప్రమాదం వచ్చిపడే భయం ఉంది కనుక.

*గజ్వయె హుమరా ఉల్ అసద్ : -*

ఇటు దైవప్రవక్త (సల్లం) రాత్రి అంతా, యుద్ధం వల్ల ఉత్పన్నమైన గడ్డు పరిస్థితిని సమీక్షిస్తూ గడిపివేశారు. యుద్ధంలో ముష్రిక్కులు తమదే గెలుపైనా, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేరు అని గ్రహిస్తే అది వారికి తలవంపులుగా ఉండవచ్చు. అందువలన తిరిగి మదీనాపై దండెత్తనూ వచ్చు అని ఆలోచించారు మహాప్రవక్త (సల్లం). అందుకని ఆయన (సల్లం) మక్కా సైన్యాన్ని వెంటాడటానికే నిశ్చయించుకున్నారు.

సీరత్ చరిత్రకారుల కథనం ప్రకారం, ప్రవక్త శ్రీ (సల్లం) ఉహద్ యుద్ధం జరిగిన రెండో రోజే అంటే ఆదివారం, షవ్వాల్ నెల - 8వ తారీఖున ఉదయమే శత్రువును తరమడానికి బయలుదేరాలని ప్రకటించారు.

*మక్కా సైన్యాన్ని వెంటాడటానికి బయలుదేరిన ఇస్లామీయ సైన్యం....; ↓*

*In Sha Allah రేపటి భాగములో....; →*

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment