245

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉

🕌☪🕋🛐      *ఇస్లాం చరిత్ర - 245*       🛐🕋☪🕌

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 160*      🇸🇦🇸🇦

◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉

          🛡⚔ *ఉహద్ పోరాటం : - 17*⚔🛡

*ఉహద్ యుద్ధ మైదానంలో హజ్రత్ హమ్'జా (రజి)గారి పరిస్థితి : -*

యుద్ద మైదానంలో, షహీదులను మరియు క్షతగాత్రులను వెతుకుతున్న సహాబా (రజి)కు, దైవప్రవక్త (సల్లం) గారి పెదనాన్న "హజ్రత్ హమ్'జా (రజి)" గారి భౌతికకాయం కనిపించింది. హజ్రత్ హమ్'జా (రజి) మృతదేహం ముక్కలుగా ఖండించబడి ఎంతో భయానకంగా కడు దయనీయంగా ఉంది. ఆ మృతదేహం పరిస్థితి చూసిన ప్రవక్త (సల్లం)కు దుఃఖం ఆగలేదు. ఆవేదనాభరితమైన ఆయన (సల్లం) హృదయం నుంచి సన్నగా (ఈ క్రింది) శబ్ద తరంగిణి జాలువారింది....; ↓

*"అబ్బా! ఇంతటి బాధాకరమైన దృశ్యం నేనింతవరకు చూడలేదు. (హమ్'జా సోదరి) సఫియా బాధపడకుండా ఉంటే, ఈ పని నా తదనంతరం ఆచారంగా మారుతుందన్న భయం కూడా లేకుండా ఉంటే నేను హమ్'జా దేహాన్ని ఇలాగే గద్దలకు, మృగాలకు వదిలి పెట్టేవాడిని. ఎప్పటికైనా శత్రువులపై ఆధిక్యత పొందగలిగితే వారిలో ముప్పై మంది మనుషులకు ఇదే గతి పట్టిస్తాను."*

కాని....; ↓

*"ఒకవేళ మీరు ప్రతీకారం తీర్చుకోదలచినా, మీకు ఏ మేరకు భాధపెట్టడం జరిగిందో ఆ మేరకే ప్రతీకారం తీర్చుకోండి. ఒకవేళ మీరు ఓర్చుకున్నట్లయితే, ఓర్పు వహించేవారి పాలిట ఇది ఎంతో శ్రేయస్కరమైనది. (ఓ ముహమ్మద్ - సల్లం!) నువ్వు సహనం వహించు. (అయితే) అల్లాహ్ తోడ్పాటు లేకుండా నువ్వు సహనం వహించలేవు. వారి పరిస్థితిపై బాధపడకు. వారు పన్నే కుట్రలు, కుయుక్తులకు లోలోపలే దుఃఖించకు. అల్లాహ్ తనకు భయపడుతూ జీవితం గడిపేవారికి, సద్వర్తనులకు తోడుగా ఉంటాడు." (ఖుర్ఆన్ 16:126-128).*

....అనే దైవవాణి మనోవీధిలో మెదులుతుండగా అంతరంగంలోని ఆవేదన అంతరించి శాంతించారు దైవప్రవక్త (సల్లం). ఆయన (సల్లం) దైవాజ్ఞ ముందు తలవంచి శత్రువుల్ని క్షమించారు.
__________________________________

ఆ తరువాత ప్రవక్త (సల్లం) మేనత్తగారైన 'హజ్రత్ సఫియా (రజి)', తన సోదరుణ్ణి చూసుకుందామనే తలంపుతో అక్కడకు అరుదెంచారు. కానీ, దైవప్రవక్త (సల్లం), సఫియా (రజి) తనయుడు 'హజ్రత్ జుబైర్ (రజి)తో, *"ఆమె తన సోదరుని పరిస్థితి చూడలేరు. శవం వద్దకు పోనివ్వకుండా వెనక్కు తీసుకువెళ్ళు."* అని అన్నారు.

కాని హజ్రత్ సఫియా (రజి), *"ఏమిటి! నేను ఎందుకు ఆయన్ను చూడకూడదు? ఆయన్ను 'ముస్లా' చేసిన విషయం నాకు తెలుసు. అలా జరిగింది అల్లాహ్ మార్గంలోనే. నేను దానికి పూర్తిగా సంసిద్ధురాలనయ్యే వచ్చాను. ఆయన్ను చూసి పుణ్యం కట్టుకోదలచుకుంటున్నాను. ఇన్ షా అల్లాహ్ నేను సహనం వహిస్తాను. నాకు ఆయన ముఖం చూపించండి."* అని గట్టిగా కోరారు.

ఆ తరువాత ఆమెకు ఆమె సోదరుడైన హమ్'జా (రజి)గారి శవాన్ని చూయించడం జరిగింది. అలా చూస్తూ ఆమె *"ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్"* చదివారు. అల్లాహ్ తో ఆయన (రజి) మన్నింపు కోసం 'దుఆ' చేశారు.

ఆ తరువాత మహాప్రవక్త (సల్లం), 'హజ్రత్ హమ్'జా (రజి)'ను 'హజ్రత్ అబ్దుల్లా బిన్ హజష్ (రజి)'గారితో కలిపి ఖననం చేయమని ఆదేశించారు.

అబ్దుల్లా బిన్ హజష్, హజ్రత్ హమ్'జా (రజి) గారికి మేనల్లుడు మరియు వారు ఉభయులూ ఒకే తల్లి పాలు త్రాగడం వల్ల సోదరుడు కూడాను.

[ _'హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రజి)' గారి ఉల్లేఖనం ప్రకారం....;_

*"ప్రవక్త శ్రీ (సల్లం) హజ్రత్ హమ్'జా (రజి) గారి గురించి ఏడ్చినంతగా మరెవ్వరి గురించీ ఏడ్వలేదు. ప్రవక్త శ్రీ (సల్లం) ఆయన శవాన్ని ఖిబ్లా వైపునకు ఉంచి ఆయనకు ఎదురుగా నిలబడి విలపిస్తూ ఉండగా ఆయన (సల్లం) గొంతులో నుంచి ఏడుస్తున్న శబ్దం కూడా మాకు వినిపించింది." అని అంటారు హజ్రత్ మస్ ఊద్ (రజి).*]

నిజం చెప్పాలంటే, షహీదుల దృశ్యమే హృదయాలను కదిలించేదిగా ఉంది అప్పుడు.

[ _'హజ్రత్ ఖబ్బాబ్ బిన్ అరత్'గారి ఉల్లేఖనం ప్రకారం....; ↓_

*"హజ్రత్ హమ్'జా (రజి) గారి కఫన్ కోసం నల్లటి చారలు గల ఓ దుప్పటి తప్ప మరేదీ లభించలేదు. ఈ దుప్పటి తలపై వేస్తే కాళ్ళు కనిపిస్తాయి. కాళ్ళపైకి జరిపితే శిరస్సు బయటపడుతూ ఉంది. చివరకు ఆ దుప్పటితో తలను కప్పివేయడం జరిగింది. కాళ్ళపై ఇజ్'ఖర్ గడ్డిని వేసి కప్పివేశారు."*]

[ _'హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి)' గారు ఇలా అంటారు....; ↓_

*"హజ్రత్ ముస్అబ్ బిన్ ఉమైర్ (రజి) అమరగతిని పొందారు - _ఆయన నాకంటే శ్రేష్ఠులు_ - ఆయన్ను ఒకే దుప్పటిలో చుట్టి ఖననం చేయడం జరిగింది. ఈ దుప్పటి తలపై వేసి కప్పినప్పుడు కాళ్ళు బయటపడేవి. కాళ్ళపై వేసినప్పుడు తల బయటపడేది. ఈయనగారి ఈ పరిస్థితినే హజ్రత్ ఖబ్బాబ్ (రజి) కూడా వివరించడం జరిగింది. అయితే అందులో ఈ వాక్యాలు అదనంగా ఉన్నాయి. (ఈ పరిస్థితిని చూసి) మహాప్రవక్త (సల్లం), _"ఆయన తలను ఆ దుప్పటితో కప్పివేసి, కాళ్ళపై ఇజ్'ఖర్ గడ్డిని పరచండి."_ అని ఆదేశించారు."*]

*ప్రవక్త శ్రీ (సల్లం) దైవాన్ని స్తుతించడం - ఆయన్ను వేడుకోవడం : -*

*ఇమామె అహ్మద్ గారి ఉల్లేఖనం : - ↓*

"ఉహద్ రోజున బహుదైవారాధకులు వెళ్ళిపోయిన తరువాత ప్రవక్త శ్రీ (సల్లం), సహాబా (రజి)లతో, *"అందరూ వరుసలు కట్టండి, నేను నా ప్రభువు స్తోత్రం చేస్తాను."* అని అనగా, వారంతా ఆయన (సల్లం) వెనుక బారులు తీరి నిలబడ్డారు. అప్పుడు ప్రవక్త శ్రీ (సల్లం) ఇలా విన్నవించుకున్నారు....; ↓

*"ఓ అల్లాహ్ ! నీ కోసమే సర్వస్తోత్రాలన్నీ. ఓ ప్రభూ! నీవు దేన్నయితే పెద్దదిగా చేస్తావో దాన్ని ఎవరూ కుదించలేరు. నీవు కుదించినదాన్ని మరెవ్వరూ విస్తరించలేరు. నీవు ఎవరిని మార్గభ్రష్టుడుగా చేస్తావో అతనిని ఎవడూ సన్మార్గగామిగా చెయ్యలేడు. అలాగే నీవు ఎవరికైతే సన్మార్గాన్ని చూపుతావో ఆ వ్యక్తిని ఇంకెవ్వడూ మార్గభ్రష్టుడుగా మార్చలేడు. దేన్నయితే నీవు ఇవ్వకుండా ఆపేస్తావో దాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. మరి దేన్నయితే నీవు ప్రసాదిస్తావో మరెవ్వరూ దాన్ని లభించకుండా అడ్డుకోలేరు. నీవు దేన్నయితే దూరం చేస్తావో దాన్ని ఇంకెవ్వరూ దగ్గరకు చేర్చలేరు. మరి దేన్నయితే నీవు దగ్గరకు చేరుస్తావో దాన్ని మరొకడెవ్వడూ దూరం చేయలేడు. ఓ ప్రభూ! మాపై నీ శుభాలను, నీ కారుణ్యాన్ని, నీ దయను మరియు నీ ఉపాధిని విస్తరింపజెయ్యి.*

*ఓ అల్లాహ్! నేను నీతో శాశ్వతంగా ఉండే వరాన్ని యాచిస్తున్నాను. ఆ వరం అందనిదై, అంతమైనదై ఉండకూడదు. ఓ ప్రభూ! నేను దారిద్ర్యం నాడు సహాయాన్ని, భయం రోజున శాంతాన్ని కోరుకుంటున్నాను. ఓ అల్లాహ్! నీవు మాకు ఇచ్చిన దాని చెడుగు నుండి, మరేదైతే నీవు మాకు ఇవ్వలేదో దాని చెడుగు నుండి కూడా నీ శరణు వేడుకుంటున్నాను. ఓ ప్రభూ! మాకు నీ విశ్వాసాన్నే ప్రియమైనదిగా చెయ్యి. దాన్ని మా హృదయాల్లో మనోహరమైనదిగా మలుచు. 'కుఫ్ర్'ను , 'ఫిస్క్'ను, నీ అవిధేయతను మాకు వెగటైనదిగా, అయిష్టమైనదిగా మలుచు. మమ్మల్ని సన్మార్గగాములుగా చెయ్యి. ఓ అల్లాహ్! మమ్మల్ని ముస్లిములుగా ఉంటూనే మరణించే మరియు ముస్లిములుగా ఉంటూనే జీవించే భాగ్యాన్ని కలుగజెయ్యి. మమ్మల్ని సంక్షోభానికి అతీతంగా అగౌరవంపాలు కాకుండా చేసి నీ పుణ్యపురుషుల్లో, సన్మార్గగాముల్లో కలుపు. ఓ అల్లాహ్! నీ ప్రవక్తలను ధిక్కరించే వారిపై, నీ మార్గంపైకి రాకుండా అడ్డుకునే కాఫిర్ లపై నీ భయంకర శిక్షను అవతరింపజెయ్యి. ఓ అల్లాహ్! గ్రంథవహులైన నీ ధిక్కారులను కూడా తుదముట్టించు. యా ఇలాహుల్ హఖ్!"*

*మదీనాకు తిరుగు ప్రయాణం - దైవప్రవక్త (సల్లం) పట్ల అభిమానం, ప్రేమ ఉట్టిపడే అసాధారణ సంఘటనలు : -*

షహీదుల ఖననం, అల్లాహ్ స్తోత్రం మరియు ఆయన సమక్షంలో చేసిన వేడుకోలు అనంతరం ప్రవక్త శ్రీ (సల్లం) మదీనాకు తిరుగు ప్రయాణం కట్టారు. యుద్ధరంగంలో ప్రవక్త శ్రీ (సల్లం)గారి అనుచరగణం ప్రదర్శించిన అభిమానం, ప్రేమ లాంటి సంఘటనలే తిరుగు ప్రయాణంలో మహిళా విశ్వాసులు కూడా ప్రదర్శించడం జరిగింది. ఆ ఆసక్తిగొలిపే సంఘటనలు కొన్నింటిని ఇక్కడ తెలియపరుస్తున్నాం. ↓

*In Sha Allah రేపటి భాగములో....; →*

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment