244

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉

🕌☪🕋🛐      *ఇస్లాం చరిత్ర - 244*       🛐🕋☪🕌

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 159*      🇸🇦🇸🇦

◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉

          🛡⚔ *ఉహద్ పోరాటం : - 16*⚔🛡

*చల్లబడిన యుద్ధ వాతావరణం : -*

అబూ సుఫ్'యాన్ కు, హజ్రత్ ఉమర్ (రజి)తో మాటల వాదులాటలో, దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) చనిపోయారా లేదా అనే విషయంలో ఏర్పడిన సందిగ్ధత తొలిగిపోయింది. దైవప్రవక్త (సల్లం) సజీవంగానే ఉన్నారన్న విషయం అతనికి తెలియగానే, ఇక తాము యుద్ధం వదిలి వెళ్ళిపోవడమే లౌక్యం అనిపించి, *"త్వరగా ఇక్కణ్ణుంచి పారిపోండి"* అని తన సైన్యాన్ని ఆదేశించాడు.

*ముష్రిక్కుల తదుపరి కార్యక్రమాన్ని తెలుసుకునే ప్రయత్నం : -*

బహుదైవారాధకులు బయలుదేరి వెళుతూ ఉండగా వారి ఆంతర్యాన్ని తెలుసుకోగోరి దైవప్రవక్త (సల్లం), హజ్రత్ అలీ (రజి)ని వారిని వెంబడించమని, వారేంచేస్తున్నారో చూసిరమ్మని పంపించారు. ఇలా పంపిస్తూ ఆయన (సల్లం), హజ్రత్ అలీ (రజి)తో, *"వారే గనక గుర్రాలను ప్రక్కన నడుపుకుంటూ ఒంటెలపై ఎక్కి వెళితే మక్కాకే బయలుదేరి వెళుతున్నట్లు, అలా కాకుండా గుర్రాలపై వెళుతూ ఉంటే మదీనా వైపునకు వెళుతున్నట్లు. అందుకని, ఏ విషయం వెంటనే వచ్చి తెలియజేయి. వారే గనక మదీనాకు వెళ్ళదలిస్తే మాత్రం నేను వెళ్ళి తిరిగి యుద్ధం చేస్తాను."* అని అన్నారు.

_'హజ్రత్ అలీ (రజి)' గారి ఉల్లేఖనం ఇలా ఉంది....; ↓_

*"నేను వారిని అనుసరిస్తూ వెళ్ళి చూడగా, వారు గుర్రాల్ని ప్రక్కన నడిపిస్తూ ఒంటెలపైన్నే స్వారీ చేస్తూ మక్కా దారి పట్టడం గమనించాను."*

     *షహీదులు మరియు క్షతగాత్రులను వెతకడం*

ఖురైషులు వెళ్ళిపోయిన తరువాత ముస్లిములు తమకు చెందిన షహీదులను (అమరగతినొందిన వారిని), క్షతగాత్రులను వెతకడానికి పూనుకున్నారు.

[ *'హజ్రత్ జైద్ బిన్ సాబిత్ (రజి)' గారి కథనం ఇలా ఉంది....; ↓*

"మహాప్రవక్త (సల్లం) నన్ను ఉహద్ యుద్ధం నాడు, 'సఅద్ బిన్ రబీ (రజి)'ను వెతకమని పంపిస్తూ, *"మార్గంలో ఎవరైనా కనపడితే వారికి నా సలాం అందించి, ఇప్పుడు మీరేమనుకుంటున్నారని అడిగి తెలుసుకురమ్మని (ప్రవక్త - సల్లం) నన్ను పంపించారు."* అని చెప్పమన్నారు.

నేను హతుల నడుమ తిరుగుతూ 'సఅద్ (రజి)' దగ్గరకు వెళ్ళాను. ఆయన (రజి) అప్పుడు కొనఊపిరితో ఉన్నారు. ఆయన (రజి)కు బరిశెలు, కరవాలాలు మరియు బాణాలు తగిలి డెబ్భైకి పైన్నే గాయాలు అయివున్నాయి.

నేను 'సఅద్ (రజి)' దగ్గరకు వెళ్ళి, *"సఅద్! అల్లాహ్ ప్రవక్త (సల్లం) మీకు సలాం చెప్పారు. మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారో అడిగి రమ్మని నన్ను పంపించారు. ఇప్పుడు మీ గురించి చెప్పండి."* అని అడిగాను.

దానికి సఅద్ (రజి), *"దైవప్రవక్త (సల్లం)కు సలాం చెప్పండి. ఆయన (సల్లం)తో, _"ఓ ప్రవక్తా! నేనిప్పుడు స్వర్గ సుగంధాన్ని ఆఘ్రాణిస్తున్నానని"_ చెప్పండి. నా జాతి అన్సారులతో, _"మీరు బ్రతికుండగా ఏ శత్రువైనా దైవప్రవక్త (సల్లం) దగ్గరకు చేరితే, అల్లాహ్ ఎదుట ఇక మీ సాకేది పనికిరాదని చెప్పండి."_ "* అన్నారు.

ఆ మాట అనగానే ఆయన (రజి) ప్రాణాలు గాలిలో ఎగిరిపోయాయి."]

*ఒక్క నమాజు కూడా చేయకుండా వీరమరణం పొందిన విశ్వాసి : -*

[ఆ క్షతగాత్రుల్లో 'ఉసైరమ్' అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన మరో పేరు 'అమ్రూ బిన్ సాబిత్'. ఆయన కూడా కొనఊపిరితోనే ఉన్నాడు. ఇంతకు పూర్వం ఆయనకు ఇస్లాం ధర్మం వైపునకు పిలిస్తే దాన్ని పెడచెవిన పెట్టేవాడు.

ఇది చూసిన ముస్లిములు (ఆశ్చర్యంగా), *"ఇతను 'ఉసైరమ్' కదా. ఇక్కడికి ఎలా వచ్చాడు. ఇతను ఇస్లాం ధర్మాన్ని ధిక్కరిస్తూ ఉండేవాడు కదా!"* అని అనుకోసాగారు.

వీరిలో ఒక ముస్లిం అతణ్ణి ఉద్దేశించి, *"ఓ ఉసైరమ్! నీవు ఈ యుద్ధరంగానికి ఎందుకు వచ్చినట్లు? జాత్యాభిమానం వల్ల యుద్ధంలో వచ్చి చేరావా లేదా ఇస్లాం ధర్మం ఎడల ప్రేమతోనా?"* అని అడిగారు.

జవాబుగా ఆయన, *"నేను ఇస్లాం ధర్మం ఎడల అభిమానంతో ఈ యుద్ధంలో చేరాను. నిజం చెప్పాలంటే నేను అల్లాహ్ ను, ఆయన ప్రవక్త ముహమ్మద్ (సల్లం)ను విశ్వసించినవాణ్ణి. అందుకనే యుద్ధరంగంలో ఇస్లాం కు అండగా వచ్చి చేరాను. ఇప్పుడు మీరు చూస్తున్న పరిస్థితిలో ఉన్నాను."* అంటూ ప్రాణాలు విడిచారు.

దైవప్రవక్త (సల్లం)కు ఈ విషయం చెప్పగా ఆయన (సల్లం), *"ఆయన స్వర్గవాసుడయ్యాడు."* అని చెప్పడం జరిగింది.

'అబూ హురైరా (రజి)' గారి ఉల్లేఖనం ప్రకారం, *"ఆయన ఒక పూట నమాజు కూడా చెయ్యలేదు."*] _(అంటే ఇస్లాం ధర్మం స్వీకరించిన తరువాత ఏ నమాజు చేసే సమయం కూడా ఆయనకు చిక్కలేదని అర్థం. ఆ స్థితిలోనే షహీద్ అయిపోయారు. అమరగతిని పొందారు)._

[ఈ క్షతగాత్రుల్లోనే 'ఖజ్మాన్' కూడా ఉన్నాడు. అతను యుద్ధంలో ఎంతో పరాక్రమాన్ని ప్రదర్శించి, ఒక్కడే ఏడు లేదా ఎనిమిది మందిని హతమార్చాడు. అతను ఒక చోట గాయాలతో పడి ఉండగా అతణ్ణి 'బనూ జఫర్' వాడలోనికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ముస్లిములు అతనికి శుభవార్తను అందించారు. ఇది విన్న అతను, *"లేదు! దైవసాక్షి! నేను పోరాడింది నా జాతి గౌరవాన్ని నిలబెట్టడానికి, అదే లేకపోతే నేను యుద్ధం చేసేవాణ్ణేకాదు."* అన్నాడు. ఆ తరువాత ఆ గాయాలను భరించలేక తన గొంతును కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది వరకు ఇతణ్ణి గురించి ప్రస్తావన ఏదైనా వస్తే దైవప్రవక్త (సల్లం), *"అతడు నరకవాసి"* అని అంటూ ఉండేవారు. _(ఈ సంఘటన దాన్ని రుజువు చేసింది)._ యధార్థం ఏమిటంటే, ఇతను మహాప్రవక్త (సల్లం) మరియు ఆయన సహాబా (రజి)లతో కలిసి యుద్ధం చేసినప్పటికీ దైవధర్మోన్నతికి పాటుబడుతూ ప్రాణాలు అర్పించడానికి బదులు మరో ధ్యేయంతో పోరాడి ప్రాణాలర్పించాడు.]

[దీనికి పూర్తి భిన్నంగా, ఆ చనిపోయిన వారిలో 'బనూ సఅలబా' తెగకు చెందిన ఓ యూదుడు 'ముఖైరీఖ్' కూడా ఉన్నాడు. ఇతను, యుద్ధమేఘాలు ఆవరిస్తూ ఉండగా తన జాతినుద్దేశించి, *"ఓ యూద జాతి ప్రజలారా! దైవసాక్షి! ముహమ్మద్ (సల్లం) గారికి సహాయం అందించడం మీ విధి."* అని అన్నాడు.

అందుకు వారు, *"ఈ రోజు 'సబ్బత్' రోజు."* అని అన్నారు. _(అంటే యూదులకు పవిత్రమైన శనివారం రోజు)_

దానికి ముఖైరీఖ్, *"మీ కోసం సబ్బత్ అనేది ఏదీ లేదు"* అంటూ కరవాలాన్ని, యుద్ధ సరంజామాను తీసుకొని, *"నేనే చనిపోతే నా సొత్తు అంతా ముహమ్మద్ (సల్లం)కే చెందుతుంది. ఆయన (సల్లం) దాన్ని ఏమైనా చేసుకోనివ్వండి."* అంటూ యుద్ధరంగంలోనికి వచ్చి దుమికాడు. అలా యుద్ధం చేస్తూ తన ప్రాణాలను అర్పించాడు. ఈ విషయం తెలిసిన దైవప్రవక్త (సల్లం), *"ముఖైరీఖ్ అతి ఉత్తముడైన యూదుడు."* అన్నారు.]

_ఇదే సందర్భంలో దైవప్రవక్త (సల్లం) అమరగతినొందిన సహాబాల (రజి)ను చూడడం జరిగింది. వారిని చూసి ఆయన (సల్లం) ఇలా సెలవిచ్చారు....; ↓_

*"వీరి గురించి నేను సాక్షిగా ఉంటాను. యదార్థంగా ఎవరైతే అల్లాహ్ మార్గంలో గాయపరచబడతాడో అతణ్ణి అల్లాహ్ ప్రళయం రోజున, అతని శరీరం నుండి రక్తం కారే విధంగా లేపుతాడు. అక్కడ అది రక్తమే అయినా, అందులో నుంచి కస్తూరి సువాసన వస్తూ ఉంటుంది".*

కొందరు సహాబా (రజి)లు తమ షహీదుల్ని మదీనాకు కూడా చేర్చారు. దైవప్రవక్త (సల్లం) వారికి ఆదేశమిస్తూ, వారందరినీ తిరిగి ఉహద్ మైదానానికి తీసుకురమ్మన్నారు. వారిని, వారు అమరగతి పొందిన స్థలంలోనే ఖననం చేయమన్నారు. అంతేకాదు, వారు తమ శరీరాలపై ఉన్నటువంటి తోలు వస్త్రాలను సైతం తీసివేసి, అదే స్థితిలో గుస్ల్ (స్నానం) ఇవ్వకుండా ఖననం చేయమని ఆదేశించారు. దైవప్రవక్త (సల్లం), ఇద్దరేసి, ముగ్గురేసి షహీదుల్ని ఒకే సమాధిలో వేసి ఖననం చేయనారంభించారు. అలా ఇద్దరేసి షహీదుల్ని ఒకే వస్త్రంలో కలిపి చుట్టి వేస్తూ, *"వీరిలో ఎవరికి ఖుర్ఆన్ బాగా చదవడం వచ్చు?"* అని అడిగేవారు. అక్కడున్నవారు, *"ఫలానా వ్యక్తి ఖుర్ఆన్ పారాయణంలో మిన్న అయినవాడు."* అని అనగా, ఆ షహీదును ముందు సమాధిలోనికి దించేవారు. అలా దించుతూ, *"నేను ప్రళయం రోజున వీరిని గురించి సాక్ష్యమిస్తాను."* అని అనేవారు. 'అబ్దుల్లా బిన్ అమ్రూ బిన్ హిరామ్' మరియు 'అమ్రూ బిన్ జమూహ్ (రజి)'లను ఆయన ఒకే సమాధిలో ఖననం చేశారు. కారణం, వారిద్దరు మంచి మిత్రులు కావడమే.

*షహీద్ అయిన సహాబా (రజి)కు గుసుల్ చేయిస్తున్న దైవదూతలు : -*

'హజ్రత్ హంజలా (రజి)'గారి శవం కనపడలేదు. వెతకగా ఓ చోట ఆయన (రజి) భౌతికకాయం, భూమికి ఆనకుండా పైన గాలిలో తేలుతూ కనబడింది. ఆయన (రజి) శరీరం నుంచి నీరు కారుతూ ఉంది. దైవప్రవక్త (సల్లం), సహాబా (రజి)లకు ఆయన శవాన్ని చూపిస్తూ, *"ఈయన్ని దైవదూతలు స్నానం (గుసుల్) చేయిస్తున్నారు."* అని చెప్పారు. ఆ తరువాత ఆయన (సల్లం), *"ఆయన భార్యను అడగండి అసలు విషయం ఏమిటో అని?"* అని అన్నారు. ఆయన భార్యతో విషయం అడగగా ఆమె అసలు విషయం చెప్పారు. అప్పటి నుంచే 'హజ్రత్ హంజలా (రజి)'గారి బిరుదు *"గుసైలుల్ మలాయికా" (దైవదూతలు గుసుల్ ఇవ్వబడినవాడు)* గా పడిపోయింది.

_(↑ ఇందులోని మరింత వివరణ కోసం చదవండి ఇస్లాం చరిత్ర - 236 వ భాగంలోని 'హజ్రత్ హంజలా (రజి)'గారి వృత్తాంతం.)_

*హజ్రత్ హమ్'జా (రజి)గారి పరిస్థితి : -*

యుద్ద మైదానంలో, షహీదులను మరియు క్షతగాత్రులను వెతుకుతున్న సహాబా (రజి)కు, దైవప్రవక్త (సల్లం) గారి పెదనాన్న "హజ్రత్ హమ్'జా (రజి)" గారి భౌతికకాయం కనిపించింది. ఆ మృతదేహం పరిస్థితి చూసిన ప్రవక్త (సల్లం)కు దుఃఖం ఆగలేదు. హజ్రత్ హమ్'జా (రజి) మృతదేహం ముక్కలుగా ఖండించబడి ఎంతో భయానకంగా దయనీయంగా ఉంది.

*↑ ఇందులోని వివరణను In Sha Allah రేపటి భాగములో....; →*

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment