243

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉

🕌☪🕋🛐      *ఇస్లాం చరిత్ర - 243*       🛐🕋☪🕌

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 158*      🇸🇦🇸🇦

◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉

          🛡⚔ *ఉహద్ పోరాటం : - 15*⚔🛡

*చివరి వరకు పోరాడేందుకు ముస్లిముల సన్నాహాలు : -*

చివరి సమయంలో రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనల ద్వారా ప్రాణాలను సైతం తెగించి పోరాడే ముస్లిములు చివరి ఘడియ వరకు యుద్ధం చేయడానికి ఎలా సంసిద్ధులై ఉన్నారో, అల్లాహ్ మార్గంలో ప్రాణాలు అర్పించడానికి ఎంత స్థయిర్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

[ *1. హజ్రత్ కఅబ్ బిన్ మాలిక్ (రజి) ఇలా ఉల్లేఖిస్తున్నారు....; ↓*

"నేను లోయ వదిలి బయటకు వచ్చిన ముస్లిముల్లో ఒకణ్ణి, ముష్రిక్కులు ముస్లిం షహీదుల ముస్లా చేయడం నాకు కనిపించింది. నేను అక్కణ్ణే ఆగిపోయాను.

ఆ తరువాత ఇంకొంత ముందుకు వెళ్ళి చూద్దునుగదా, ఓ లావుపాటి బలాఢ్యుడైన ముష్రిక్ కవచం ధరించి షహీదుల మధ్య నుండి వెళుతూ హేళనగా, *"కోసి పారేసిన మేకల్లా పడి ఉన్నారు వీరు"* అని అంటున్నాడు. ఇంకో ముస్లిం కొంచెం దూరంగా ఉండి అతని రాక కోసం ఎదురు చూస్తున్నాడు. అతను కూడా కవచాన్ని ధరించి ఉన్నాడు. నేను ఇంకొంత ముందుకు పోయి అతని వెంట నడువసాగాను. ఆ తరువాత నిలబడి కళ్ళతోనే ఆ ఇద్దరి శక్తిని బేరీజు వేయనారంభించారు. ఆ దైవతిరస్కారే తన శరీరం, తన ఆయుధాలు మరియు తన శక్తిలో మిన్నగా అగుపించాడు. వారిద్దరు ఎప్పుడు తలపడతారా అని ఎదురు చూస్తూ నిలబడ్డాను. చివరికి ఇద్దరూ ఢీకొనడం జరిగింది. ఆ ముస్లిం వేసిన కత్తి వ్రేటు, ఆ ముష్రిక్ శరీరాన్ని రెండుగా చీల్చుకుంటూ కాళ్ళ వరకు వచ్చి ఆగింది. ఆ ముష్రిక్కు రెండు ముక్కలై క్రింద పడిపోయాడు. ఆ ముస్లిం తన ముఖంపై ఉన్న ముసుగును తొలగిస్తూ (నాతో), *"ఓ కఅబ్ ! ఎలాగుంది? నేను అబూ దుజానాను."* అని అన్నాడు."]

*2.* యుద్ధం చివరి దశలో కొందరు ముస్లిం మహిళలు జిహాద్ రంగంలోకి దుమికారు.

[ _'హజ్రత్ అనస్ (రజి)' గారు ఆ దృశ్యాన్ని ఇలా వివరిస్తున్నారు....; ↓_

*"నేను 'హజ్రత్ ఆయిషా బిన్తె అబీ బక్ర్ (రజి)' (ప్రవక్త (సల్లం) గారి సతీమణి) మరియు 'ఉమ్మె సులైమ్ (రజి)'లను కాళ్ళలోవున్న పట్టీలు కనబడేటట్లు తమ వస్త్రాన్ని పైకెత్తి, తోలు సంచులతో నీళ్ళను నింపి వీపులపై పెట్టుకొని మోసుకురావడం చూశాను. వారు ఆ నీళ్ళను ముస్లిముల నోటిలో పోసి వారి దాహం తీరుస్తున్నారు."*]

[ _'హజ్రత్ ఉమర్ (రజి)' గారి ఉల్లేఖనంలో ఇలా ఉంది....; ↓_

*"ఉహద్ రోజున 'హజ్రత్ ఉమ్మె సలీత్ (రజి)' తోలు సంచితో నీళ్ళు మోసుకురావడం నేను చూశాను."*]

ఆ మహిళల్లోనే 'హజ్రత్ ఉమ్మె అయిమన్ (రజి)' కూడా ఉన్నారు. ఆమె ఓడిపోయి మదీనాకు పారిపోయి వచ్చిన ముస్లిము ముఖంపై మట్టిని చిమ్ముతూ, *"ఇదిగో ఈ నూలువడికే తకిలీ - ఇది తీసుకొని మా చేతికి మీ కరవాలాలను ఇవ్వండి."*★ అంటూ వేగంగా యుద్ధరంగానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు నీరు త్రాపించనారంభించారు. ఈమెపై 'హిబ్బాన్ బిన్ అరక్' బాణం వదిలాడు. ఆమె క్రిందపడిపోగా ఆమె ముసుగు (పరదా) తొలగిపోయింది. దాన్ని చూసి ఆ దైవవిరోధి వికటాట్టహాసం చేశాడు. ఇది దైవప్రవక్త (సల్లం)కు రుచించలేదు. ఆయన (సల్లం), 'హజ్రత్ సఅద్ బిన్ అబీ వికాస్ (రజి)'కు ఓ బాణం అందిస్తూ, *"ఇదిగో దీన్ని వదలండి."* అని అన్నారు. 'హజ్రత్ సఅద్ బిన్ అబీ వికాస్ (రజి)' ఆ బాణాన్ని వదలగా అది అతని గొంతుపై తగిలింది. వెంటనే అతను వెల్లెకిలా పడిపోయాడు. అతని వస్త్రాలు ఊడిపోయాయి. దీన్ని చూసి మహాప్రవక్త (సల్లం) దంతాల చిగుళ్ళు అగుపడేటట్లు దరహాసం చేస్తూ, *"సఅద్, ఉమ్మె అయిమన్ (రజి) పగ తీర్చుకున్నారు. అల్లాహ్ ఆయన దుఆను మన్నించుగాక."* అన్నారు.

_(★→ నూలు వడకడం అరబ్బు స్త్రీల ప్రత్యేక వృత్తి. అందుకని నూలు వడికే తకిలీ (అంటే కండెతో సహా) ఆ స్త్రీలకు సంబంధించిన ప్రత్యేక అలంకరణ, మన దేశంలో స్త్రీలకు గాజుల్లా. ఈ సందర్భంలో మన భాషలోని సామెత, గాజులు తొడుక్కొని కరవాలాన్నివ్వండి అనే విధంగా తకిలీ తీసుకొని కరవాలాన్నివ్వండి అన్నట్లు అన్నమాట.)_

*లోయలో స్థిమితపడిన తరువాత : -*

దైవప్రవక్త (సల్లం) కొండ లోయలోని తమ స్థావరంలో కొంచెం స్థిమితపడిన తరువాత 'హజ్రత్ అలీ (రజి)' లేచి 'మెహ్రాస్' నుండి తన ఢాలులో కొన్ని నీళ్ళు తెచ్చారు. → _మెహ్రాస్, రాతి బండలో ఏర్పడిన గుంట అని చెప్పుకోవడం జరుగుతోంది. ఆ గుంటలో కొంత అధికంగానే నీరు నిలువ ఉంటుంది. అదేకాదు మెహ్రాస్ అనేది ఉహద్ కు చెందిన ఓ నీటి చెలమ పేరని కొందరి వాదన_← ఏదైతేనేమి 'హజ్రత్ అలీ (రజి)' ఆ నీటిని తెచ్చి దైవప్రవక్త (సల్లం)కు తాగమని అందించారు. ఆ నీటిలో ఓ విధమైన దుర్వాసన రావడం వలన దైవప్రవక్త (సల్లం) ఆ నీటిని సేవించలేదు కాని తన ముఖం మీద ఉన్న రక్తాన్ని శుభ్రం చేసుకున్నారు. తలపై కూడా చల్లుకున్నారు. అలా రక్తాన్ని శుభ్రం చేస్తూ ధైవప్రవక్త (సల్లం) ఇలా అంటూ ఉండగా వినడం జరిగింది. 

*"ప్రవక్త ముఖాన్ని రక్తసిక్తం చేసిన ఆ దుష్టుడిపై దైవాగ్రహం పడుగాక!"*

[ _'హజ్రత్ సహల్ (రజి)' ఇలా ఉంటారు....; ↓_

*"దైవప్రవక్త (సల్లం) గారి గాయాన్ని కడిగిందెవరో, నీరు పోసిందెవరో, చికిత్స చేసినదెవరో నాకు బాగా తెలుసు. ఆమె, ఆయన (సల్లం) ముద్దుల పట్టి 'హజ్రత్ ఫాతిమా (రజి)'. నీరు వేసి కడగడం వల్ల రక్తస్రావం కొంత అధికం అవుతూ ఉంటే ఆమె ఓ చాప ముక్కను తీసుకొని కాల్చి ఆ గాయంపై వేసి అదిమారు. అలా చేయడం వలన రక్తస్రావం ఆగిపోయింది."*] (సహీ బుఖారి - 2/584)

అటు 'హజ్రత్ ముహమ్మద్ బిన్ ముస్లమా (రజి)' తీయటి రుచికరమైన నీటిని తేగా దైవప్రవక్త (సల్లం) దాన్ని త్రాగి ఆయనను దీవించారు. గాయం అయిన కారణంగా దైవప్రవక్త (సల్లం) జొహ్ర్ నమాజు కూర్చునే చేశారు. సహాబా (రజి) కూడా ఆయన (సల్లం) వెనుక కూర్చునే నమాజు చేశారు.

*చల్లబడిన యుద్ధ వాతావరణం - అవహేళనకు దిగిన అబూ సుఫ్'యాన్ - హజ్రత్ ఉమర్ (రజి)తో సంవాదం : -*

బహుదైవారాధకుల తిరుగు ప్రయాణ సన్నాహాలు పూర్తి అయిపోగానే, అబూ సుఫ్'యాన్ ఉహద్ కొండ మీద ముస్లిములకు వినబడేటట్లు బిగ్గరగా, *"మీలో ముహమ్మద్ (సల్లం) ఉన్నారా?"* అని అడిగాడు. ముస్లిములు ఏమీ మాట్లాడకుండా మిన్నకుండిపోయారు.

అతను తిరిగి అదే ప్రశ్నను రెట్టిస్తూ, *"మీలో అబూ ఖహాఫా కుమారుడు (అబూ బక్ర్ - రజి) ఉన్నారా?"* అని అడిగాడు. దానికి కూడా ఎవ్వరూ సమాధానం ఇవ్వలేదు.

ఆ తరువాత మూడవసారి, *"మీలో ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజి) ఉన్నాడా?"* అని అడిగాడు. ఈ సారి కూడా ముస్లిములెవరూ మారుపలుకలేదు (దీనికి కారణం, దైవప్రవక్త (సల్లం) సహాబా (రజి)ను అలా మాట్లాడకుండా ఉండమని ఆదేశించడమే)

అబూ సుఫ్'యాన్ ఈ ముగ్గురు తప్ప మరెవరిని గురించీ అడగలేదు. ఎందుకంటే ఇస్లాం ధర్మసంస్థాపనం ఈ ముగ్గురి ద్వారానే సాధ్యమని అతనికీ, అతని జాతికీ బాగా తెలుసు గనుక. మొత్తానికి వారి (ముస్లిముల) నుండి ఏ సమాధానం రాకపోయేసరికి అతను (అబూ సుఫ్'యాన్), తన సైన్యాన్ని ఉద్దేశించి, *"పదండి, ఆ ముగ్గురూ అంతమైపోయారు."* అంటూ బయలుదేరడానికి ఆదేశమిచ్చాడు.

ఇది విన్న హజ్రత్ ఉమర్ (రజి), తన సహనాన్ని కోల్పోయి, *"ఓరీ దైవవిరోధి! నీవు ఇప్పటి వరకు ఏ ముగ్గురి పేర్లయితే ఉచ్ఛరించావో వారంతా సజీవంగానే ఉన్నారు. అల్లాహ్ ఇంకా నిన్ను అగౌరవానికి, అపఖ్యాతికి గురిచేయాలనే చూస్తున్నాడు."* అన్నారు.

ఆ తరువాత అబూ సుఫ్'యాన్, ముస్లిములను ఉద్దేశించి, *"మీ హతుల ముస్లా చేయబడింది. దానికి నేను ఆదేశించలేదు అని తెలుసుకోండి. హుబల్ కు జయం, హుబల్ కు జయం."* అన్నాడు.

దైవప్రవక్త (సల్లం), ముస్లిములను ఉద్దేశించి, *"మీరేమి మాట్లాడరేమిటీ?"* అని అడగగా; వారు, *"ఏమని చెప్పాలి దైవప్రవక్తా!"* అని అడిగారు.

*"అనండి, అల్లాహు ఆలా వఅజల్ల్." (అల్లాహ్ యే ఘనమైనవాడు, అధికుడూను.)*

ముస్లిముల ఈ మాటలు విన్న అబూ సుఫ్'యాన్ మరో నినాదం చేశాడు. *"మా కోసం ఉజ్జా ఉన్నాడు. మీకు ఉజ్జా లేడు."* అని.

దైవప్రవక్త (సల్లం) తిరిగి మాట్లాడరేమిటి అని సహాబాలను అడగగా, *"ఏమని చెప్పాలి దైవప్రవక్తా!"* అని వారు అడిగారు.

*"అనండి, అల్లాహు మౌలానా, వలా మౌలా లకుమ్." (అల్లాహ్ మా సంరక్షకుడు, మీకు సంరక్షకుడు ఇంకెవరూ లేరు.)* అని.

ముస్లిములు అబూ సుఫ్'యాన్ కు అదే సమాధానమిచ్చారు.

తిరిగి అబూ సుఫ్'యాన్, *"ఎంత గొప్ప కార్యం ఇది. ఇది బద్ర్ యుద్ధానికి జవాబు. యుద్ధం ఒక బొక్కెనలాంటిది."*■

_(■→ అంటే ఓ పక్షం ఓసారి విజయం సాధిస్తే, మరో పక్షం మరోసారి విజయం సాధిస్తుంది. ఎలాగైతే నీటితో నిండిన బొక్కెనను ఒకరు ఓసారి లాగితే ఇంకొకరు మరోసారి లాగుతారు అని అర్థం.)_

దీనికి సమాధానంగా ఉమర్ (రజి), *"లేదు, అలా అనుకోకు. మనం సమానులం కాము. మా హతులు స్వర్గంలో ఉన్నారు. మీ హతులు నరకంలో పడి కాలుతున్నారు."* అన్నారు.

పిదప అబూ సుఫ్'యాన్, ఉమర్ (రజి)ను, *"నా దగ్గరకు రా"* అని పిలువగా; మహాప్రవక్త (సల్లం), *"వెళ్ళండి ఉమర్, అతని దగ్గరకు వెళ్ళండి. అతను ఏమి అడుగుతాడో వినండి."* అని ఆదేశించారు.

ఆయన, అతని దగ్గరకు వెళ్ళగా, *"ఓ ఉమర్! నేను దైవాన్ని సాక్ష్యంగా నిలబెట్టి అడుగుతున్నాను. ముహమ్మద్ (సల్లం)ను మేము అంతమొందించలేదా చెప్పండి."* అని అడిగాడు అబూ సుఫ్'యాన్.

*"దైవసాక్షి! ముమ్మాటికి మీరు ఆయన (సల్లం)ను అంతమొందించలేదు. ఇప్పుడు ఆయన (సల్లం) నీవు చెప్పే మాటలను వింటున్నారు."* అని అన్నారు.

*"ఉమర్! మీరు నా దృష్టిలో ఇబ్నె ఖుమా కంటే సత్యసంధులు అని ఒప్పుకుంటాను."* అన్నాడు.

*బద్ర్ మైదానంలో మరో యుద్ధం చేస్తానని ప్రమాణం చేయడం : -*

[ *ఇబ్నె ఇస్'హాక్ గారి కథనం ప్రకారం....; ↓*

"అబూ సుఫ్'యాన్, అతని సహచరులు యుద్ధరంగం నుండి వెళ్ళిపోవడానికి సిద్ధపడగా, అబూ సుఫ్'యాన్ ముస్లిముల ముందు ఓ సవాలు విసిరాడు. *"వచ్చే సంవత్సరం బద్ర్ మైదానంలో తిరిగి యుద్ధం చేద్దాం సిద్ధమేనా?"* అని.

దైవప్రవక్త (సల్లం) ఓ సహాబీతో ఆ సవాలుకు ప్రతి సవాలుగా, *"సరే ఈ విషయం మీకు మాకు మధ్య జరిగిన ఒప్పందంగా భావించు."* అని చెప్పమన్నారు.

ఆయన అలానే అబూ సుఫ్'యాన్ కు ప్రతిసవాలుగా ఆ మాటలు పలికారు."]

*మిగిలినది In Sha Allah రేపటి భాగములో....;*

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment