242

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉

🕌☪🕋🛐      *ఇస్లాం చరిత్ర - 242*       🛐🕋☪🕌

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 157*      🇸🇦🇸🇦

◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉

          🛡⚔ *ఉహద్ పోరాటం : - 14*⚔🛡

_(నిన్నటి భాగం కొనసాగింపు)_

ఇలా ముష్రిక్కుల ఈ నిర్బంధాన్ని చేధించి బయటపడే మార్గం ఏర్పడింది. ముస్లిం యోధుల పరాక్రమం ముందు వారు నిలువలేకపోయారు.

ఈలోపే ముష్రిక్కులకు చెందిన తల తిరిగిన అశ్విక యోధుడు 'ఉస్మాన్ బిన్ అబ్దుల్లా ముగైరా', ప్రవక్త (సల్లం) పైకి, *"నేనైనా ఉండాలి లేదా ముహమ్మద్ (సల్లం) అయినా ఉండాలి"* అంటూ లంఘించాడు.

అటు, దైవప్రవక్త (సల్లం) కూడా అతణ్ణి మార్కొనడానికి సిద్ధంగా లేచి నిలబడ్డారు. కాని దాడి చేసే అవకాశమే లభించలేదతనికి. ఎందుకంటే ఆ సమయంలోనే అతని గుర్రం ఓ గోతిలో పడిపోవడం జరిగింది. అంతలోనే 'హారిస్ బిన్ సమా (రజి)' అతని దగ్గరకు వచ్చి అతని కాలిపై తన కరవాలంతో ఓ గట్టి దెబ్బ వేశారు. ఆ దెబ్బకు అతను అక్కడనే కుప్పకూలిపోయాడు. అతణ్ణి అంతమొందించి, అతని ఆయుధాన్ని తీసుకొని దైవప్రవక్త (సల్లం) దగ్గరకు వచ్చారాయన.

కాని, ఇంతలోనే మక్కా సేనకు చెందిన మరో అశ్వికుడు 'అబ్దుల్లా బిన్ జాబిర్' వెనుదిరిగి 'హజ్రత్ హారిస్ బిన్ సమా (రజి)'పై దాడి చేశాడు. ఆయన (రజి) భుజంపై ఖడ్గప్రహారం చేసి గాయపరిచాడు. కాని ముస్లిములు ఆయన్ను ఎత్తుకున్నారు. తలపై ఎర్ర రుమాలు చుట్టుకొని యుద్ధం చేస్తున్న 'హజ్రత్ అబూ దుజానా (రజి)' ఇది చూసి 'అబ్దుల్లా బిన్ జాబిర్'పై విరుచుకుపడ్డారు. ఆయన (రజి) వేసిన ఖడ్గం వ్రేటుకు అతని తల ఎగిరి దూరంగా పడిపోయింది.

ఆ సంకుల సమరం జరిగేటప్పుడు దైవలీల ఏమిటోగాని ముస్లిములకు నిద్ర ఆవహించి కునుకులు పడుతున్నారు. ఖుర్ఆన్ లో చెప్పినట్లుగా, *"ఇది అల్లాహ్ తరఫున వారికి ప్రశాంతత, సాంత్వన."*

[ _↑ఈ విషయంలో 'అబూ తల్హా (రజి)' ఉల్లేఖనం ఇలా ఉంది....; ↓_

*ఉహద్ రోజున నిద్ర ఆవహిస్తున్న వారిలో నేనూ ఒక్కణ్ణే. నా చేతిలోని కరవాలం ఆ కునుకులు పడుతున్నప్పుడు అనేకసార్లు చేతి నుండి జారిపోయింది. అది చేతి నుండి జారిపోతుంటే నేను దాన్ని ఎత్తుకునేవాణ్ణి. అలా అనేకమార్లు అది భూమి మీద పడిపోగా నేను దాన్ని ఎత్తుకుంటున్నాను.*]

చెప్పొచ్చిందేమిటంటే, ఇలా పరాక్రమం, ధైర్యసాహసాలను ప్రదర్శిస్తూ ఈ దళం పకడ్బందీగా వెనక్కి తగ్గుతూ పర్వత లోయల్లో ఉన్న తన శిబిరానికి చేరిపోయింది. తక్కిన సేన కోసం ఈ సురక్షిత ప్రదేశం వరకు చేరే మార్గాన్ని సుగమం చేసింది. మిగిలిన సేన అంతా సురక్షితంగా దైవప్రవక్త (సల్లం) వరకు చేరగలిగింది. ఇలా 'ఖాలిద్ బిన్ వలీద్' యుద్ధకౌశల్యం, మహాప్రవక్త (సల్లం) గారి యుద్ధకౌశల్యం ముందు పనిచేయలేక విఫలం అయిపోయింది.

*ఉబై బిన్ ఖల్ఫ్ సంహారం : -*

*ఇబ్నె ఇస్'హాక్ ఉల్లేఖనం ప్రకారం....; ↓*

మహాప్రవక్త (సల్లం) ఆ లోయలోనికి వచ్చి చేరిన తరువాత, ఉబై బిన్ ఖల్ఫ్ అనేవాడు, *"ముహమ్మద్ ఎక్కడ? ఈ రోజు నేను లేదా అతను ఎవరో ఒకరు బ్రతికి ఉంటారు."* అంటూ ముందుకు రానారంభించాడు.

ఇది చూసిన సహాబా (రజి), *"దైవప్రవక్త (సల్లం)! అతనిపై దాడి చేయడానికి మాలో ఎవరికైనా అనుమతి ఇవ్వండి."* అని అభ్యర్థించారు.

దానికి దైవప్రవక్త (సల్లం), *"అతణ్ణి దగ్గరకు రానివ్వండి."* అని వారిని వారించారు.

అతను, ప్రవక్త (సల్లం)కు చేరువగా వచ్చినప్పుడు ఆయన (సల్లం), 'హారిస్ బిన్ సమా (రజి)' గారి చేతిలో ఉన్న చిన్న బరిశెను తీసుకొని విదిలించారు. ఈ విదిలింపుకు అక్కడున్నవారంతా, ఒంటె తన శరీరాన్ని జలదరించినప్పుడు దాని శరీరంపై ఉన్న జోరీగల్లా ఎగిరిపోయారు.

ఆ తరువాత ఆయన (సల్లం) అతనికి ఎదురుగా వెళ్ళి అతను ధరించి ఉన్న కవచం మరియు శిరస్త్రాణం నడుమ గొంతు దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశంలో ఆ బరిశెను ఆనించి గ్రుచ్చారు. ఆ దెబ్బకు అతను తన గుర్రం మీది నుండి ఎన్నోమార్లు దొర్లిపోయాడు.

(అతని గొంతు వద్ద ఏమంత పెద్ద గాయం కూడా లేదు. కేవలం బరిశె గీరుకొనిపోయిన ఆనవాళ్ళు మాత్రమే కనబడుతున్నాయి. ఆ గాయం నుండి రక్తం కూడా కారడం లేదు.)

కానీ, ఆ తర్వాత (అతను) ఖురైష్ దగ్గరకు వెళ్ళి, *"దైవసాక్షి! ముహమ్మద్ నన్ను హత్య చేశాడు."* అని బెంబేలెత్తడం ప్రారంభించాడు.

అతని వాలకం చూసిన ఖురైషీయులు, *"దైవసాక్షి! నీకు పిచ్చిపట్టినట్లుంది. నీకు ఎలాంటి గాయం కూడా తగల్లేదు."* అని అన్నారు.

అది విన్న అతను, *"మీకు తెలియదు, మక్కాలో ఉన్నప్పుడు నేను నిన్ను చంపేస్తానని అని చెప్పి ఉన్నాడు."*★
అందుకని, *"దైవసాక్షి! అతను నాపై ఉమ్మి వేసినా నాప్రాణం పోయేది."* అని అన్నాడు. చివరకు ఈ అల్లాహ్ విరోధి, మక్కాకు తిరిగి వెలుతున్నప్పుడు 'సర్ఫ్' అనే చోటుకు చేరిన తరువాత చనిపోయాడు.

[ _'అబుల్ అస్వద్', 'హజ్రత్ ఉర్వా (రజి)'గారు ఉల్లేఖిస్తూ....; ↓_

ఇతను ఎద్దు అరిచినట్లుగా అరుస్తూ, *"ఎవరి చేతిలోనైతే నా ప్రాణం ఉందో ఆ దైవం సాక్షిగా చెబుతున్నాను. నాకు ఈ రోజు ఉన్న బాధను జిల్'మజాజ్ (సంత) కు చెందిన ప్రజలందరికీ పంచి పెట్టినా వారందరూ ఆ బాధను భరించలేక చచ్చిపోతారు."* అని చెప్పాడు.]

_(మక్కాలో, దైవప్రవక్త (సల్లం) ఎదురైనప్పుడల్లా అతను, *"ఓ ముహమ్మద్! నా దగ్గర 'ఇవద్' అనే పేరుగల గుర్రం ఉంది. నేను దానికి ప్రతి రోజు మూడు 'సాఅ'ల (అంటే ఏడున్నర కిలోల) దాణా వేసి మేపుతున్నాను. దాని వీపుపై కూర్చుని నిన్ను హతమారుస్తాను చూడు."* అని అనేవాడు. సమాధానంగా మహాప్రవక్త (సల్లం), *"కాదు! దైవచిత్తమైతే నేనే నిన్ను చంపుతాను."* అనేవారు.)_

*మహాప్రవక్త (సల్లం) గారికి ఊతమిచ్చి లేపిన 'హజ్రత్ తల్హా (రజి)' : -*

మహాప్రవక్త (సల్లం) కొండ వైపునకు వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో ఒక ఎత్తయిన బండరాయి అడ్డుగా ఉంది. దైవప్రవక్త (సల్లం) దాన్ని ఎక్కడానికి ప్రయత్నించారు కాని సాధ్యం కాలేదు. దానికి కారణం, ఆయన (సల్లం) శరీరం బరువుగా ఉండడం, దానికి తోడు ఒక దానిపై మరొకటిగా రెండు కవచాలను ధరించి ఉండడం. పైగా గాయపడి ఉన్నారు కూడా. అందుకని హజ్రత్ తల్హా బిన్ ఉబైదుల్లా (రజి) క్రింద కూర్చోగా దైవప్రవక్త (సల్లం) ఆయన భుజాలపైకి ఎక్కి కూర్చున్నారు. అలా, తల్హా (రజి) లేచి నిలబడగా దైవప్రవక్త (సల్లం) ఆ బండరాయి పైకి చేరగలిగారు. అలా ఎక్కిన తరువాత దైవప్రవక్త (సల్లం), *"తల్హా (రజి) స్వర్గాన్ని వాజిబ్ చేసుకున్నారు."* అన్నారు.

*బహుదైవారాధకులు చేసిన అంతిమ దాడిదాడి : -*

ప్రవక్త శ్రీ (సల్లం) లోయలోని తమ శిబిర కేంద్రానికి చేరిపోయిన తరువాత బహుదైవారాధకులు ముస్లిములకు నష్టం కలిగించే ఉద్దేశ్యంతో చివరి ప్రయత్నంగా దాడి చేశారు. ఇబ్నె ఇస్'హాక్ కథనం ఇలా ఉంది....; ↓

దైవప్రవక్త (సల్లం) లోయలోనికి వెళ్ళిపోయే లోపల 'అబూ సుఫ్'యాన్' మరియు 'ఖాలిద్ బిన్ వలీద్'ల నాయకత్వంలో బహుదైవారాధకుల ఒక సైనిక పటాలం వారిపై దాడి చేయడానికి వచ్చేసింది. ఆ సందర్భంలోనే మహాప్రవక్త (సల్లం) ఈ దుఆ చేశారు.

*"ఓ అల్లాహ్ ! వీరిని మాకంటే పైకి ఎక్కకుండా చెయ్యి."*

ఆ దుఆ చేసిన తరువాత 'హజ్రత్ ఉమర్ (రజి)' మరియు ముహాజిర్లకు చెందిన కొంతమంది వారితో పోరాడి వారిని కొండపైకి ఎక్కకుండా క్రిందికి దించేశారు.

_'ముగాజీ ఉమవీ'గారి ఉల్లేఖనం ప్రకారం,_ → బహుదైవారాధకులు కొండపైకి ఎక్కడం చూసి దైవప్రవక్త (సల్లం), హజ్రత్ సఅద్ (రజి)గారితో, *"వారిని భయభీతులుగా చేయండి (అంటే వారిని వెనక్కు నెట్టేయండి)."* అని అన్నారు.

దానికి సఅద్ (రజి) సందిగ్ధపడుతూ, *"నేనొక్కడినే వారిని ఎలా భయపెట్టగలను."* అని అన్నారు.

ఇలా దైవప్రవక్త (సల్లం) మూడుమార్లు ఆ మాటనే చెప్పగా ఆయన తన తూణీరం నుండి బాణం తీసి దాన్ని సంధించారు. శత్రు సైనికుల్లో ఒకడు అక్కడనే కుప్పకూలిపోయాడు.

_హజ్రత్ సఅద్ (రజి) గారి కథనం ప్రకారం,_ → *"నేను ఆ బాణాన్ని గుర్తుపట్టి తీసుకున్నాను. తిరిగి ఆ బాణంతోనే మరొకణ్ణి చంపేశాను. ఆ బాణాన్ని గుర్తుపట్టి వెనక్కు తీసుకొని మూడో వ్యక్తిని దానితో అంతమొందించాను. ఆ తరువాత బహుదైవారాధకులు పైకి ఎక్కకుండా క్రిందికి దిగిపోయారు. ఇది ఎంత శుభప్రదమైన బాణం అనుకుంటూ దాన్ని నా తూణీరంలో ఉంచుకున్నాను."*

ఈ బాణం ఆయన జీవితకాలం అంతా ఆయన వద్దనే ఉండిపోయింది. ఆ తరువాత అది ఆయన సంతానం సొత్తయి పోయింది.

*అమరగతి నొందిన వారిని ముస్లా చేయడం (అంటే, ముక్కు చెవులను కోసి ముఖాన్ని చెడగొట్టడం) : -*

దైవప్రవక్త (సల్లం)కు వ్యతిరేకంగా ముష్రిక్కులు పాల్పడిన చిట్టచివరి హేయమైన కార్యం ఇది. దైవప్రవక్త (సల్లం) గారి విషయంలో చివరి వరకూ వారికి సరియైన అవగాహన ఏదీ లేదు. కాగా ఆయన (సల్లం) అమరగతినొందారనే వారనుకుంటున్నారు దాదాపుగా, అందుకని వారు తమ శిబిరం వైపునకు తిరిగి వెళ్ళిపోయారు. మక్కాకు తిరిగి వెళ్ళేందుకు సంసిద్ధులవుతున్నారు.

కొందరు ముష్రిక్కులు మరికొందరు స్త్రీలు ముస్లిం షహీదుల 'ముస్లా'కు ఉపక్రమించారు. అంటే అమరగతినొందిన వారి మర్మాంగాలను, చెవుల్ని, ముక్కులను కోసి వేశారన్నమాట. పొట్టల్ని చించి పారవేశారు. 'హింద్ బిన్తె ఉత్బా', హజ్రత్ హమ్'జా (రజి)గారి కాలేయాన్ని బయటకు లాగి కక్షతో నమల నారంభించింది. దాన్ని మ్రింగాలనుకుంది కాని మ్రింగలేక బయటకు ఉమ్మేసింది. కోసిన ముక్కులను మరియు చెవులను దండలుగా చేసి కాళ్ళకు పట్టీలుగా, మెడలో దండలుగా వేసుకుంది.

*చివరి వరకు పోరాడేందుకు ముస్లిముల సన్నాహాలు : -*

చివరి సమయంలో రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనల ద్వారా ప్రాణాలను సైతం తెగించి పోరాడే ముస్లిములు చివరి ఘడియ వరకు యుద్ధం చేయడానికి ఎలా సంసిద్ధులై ఉన్నారో, అల్లాహ్ మార్గంలో ప్రాణాలు అర్పించడానికి ఎంత స్థయిర్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

*1. హజ్రత్ కఅబ్ బిన్ మాలిక్ (రజి) ఇలా ఉల్లేఖిస్తున్నారు....; ↓*

*In Sha Allah రేపటి భాగములో....; →*

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment