241

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉

🕌☪🕋🛐      *ఇస్లాం చరిత్ర - 241*       🛐🕋☪🕌

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 156*      🇸🇦🇸🇦

◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉

          🛡⚔ *ఉహద్ పోరాటం : - 13*⚔🛡

*ముష్రిక్కులు, దైవప్రవక్త (సల్లం) పై దాడి చేస్తున్న ఈ సందర్భంలో, తమ ప్రాణాలను సైతం లెక్కజేయకుండా ప్రవక్త (సల్లం)ను కాపాడుతున్న సహాబా (రజి)లు*

*[అద్భుతమైన పరాక్రమం : -*

మొత్తానికి, ఈ సందర్భంలోనే ముస్లిములు అసాధారణ ధైర్యసాహసాలను, పరాక్రమాన్ని ప్రదర్శించి, చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచే త్యాగానికి పూనుకున్నారు. అబూ తల్హా (రజి), తన శరీరాన్ని మహాప్రవక్త (సల్లం)కు అడ్డంగా పెట్టి నిలబడ్డారు. ఆయన (సల్లం)కు ఎదురుగా పెట్టి వచ్చే శరపరంపరను మహాప్రవక్త (సల్లం)కు తగలకుండా తన వక్షస్థలాన్ని పైకెత్తి నిలుచున్నారు.

_'హజ్రత్ అనస్ (రజి)' గారి కథనం ప్రకారం....; ↓_

ఆ ఉహద్ యుద్ధం నాడు సాధారణ ముస్లిములు పరాజయం పాలై దైవప్రవక్త (సల్లం) దగ్గరకి రావడానికి బదులుగా అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు. హజ్రత్ అబూ తల్హా (రజి) మాత్రం దైవప్రవక్త (సల్లం) గారి ఎదుట ఢాలులా నిలబడి ఆయన (సల్లం)ను రక్షిస్తున్నారు. తల్హా (రజి) ఓ ఆరితేరిన విలుకాడు. బాణాన్ని బాగా లాగి వదలడం ఆయన (రజి) ప్రత్యేకత. కాబట్టి ఆ రోజు రెండో మూడో విల్లుల్ని విరగకొట్టేశారాయన. దైవప్రవక్త (సల్లం) దగ్గర నుండి ఎవరైనా బాణాల తూణీరాన్ని తీసుకొని పోతూ ఉంటే, ఆయన (సల్లం) వారితో, *"మీ బాణాలన్నీ అబూ తల్హా (రజి)కు ఇచ్చేయండి."* అని ఆదేశిస్తున్నారు.

దైవప్రవక్త (సల్లం) తన జాతి వైపు తల ఎత్తి చూసినప్పుడల్లా, అబూ తల్హా (రజి), *"ఓ ప్రవక్తా (సల్లం)! నా తల్లితండ్రులు మీకై అర్పితం. తమరు తల ఎత్తి చూడొద్దు. బహుశా వారి బాణం ఏదైనా తమకు వచ్చి తాకవచ్చు. నా వక్షస్థలం తమ వక్షస్థలానికి అడ్డంగా ఉంది కదా."* అని అనేవారు.]

[_'హజ్రత్ అనస్ (రజి)' గారి మరో ఉల్లేఖనం ప్రకారం....; ↓_

*హజ్రత్ అబూ తల్హా (రజి) దైవప్రవక్త (సల్లం) గారితో పాటు ఒకే ఒక ఢాలుతో ఆ బాణాల్ని అడ్డుకుంటున్నారు. అబూ తల్హా (రజి) ఓ మంచి విలుకాడు. ఆయన (రజి) బాణాన్ని వదలగానే, మహాప్రవక్త (సల్లం) ఆ బాణం ఎక్కడ పడిందా అని మెడ పైకెత్తి చూసేవారు."*]

[_'హజ్రత్ అనస్ (రజి)' గారి మరో ఉల్లేఖనం ప్రకారం....; ↓_

*హజ్రత్ అబూ తల్హా (రజి) దైవప్రవక్త (సల్లం) గారితో పాటు ఒకే ఒక ఢాలుతో ఆ బాణాల్ని అడ్డుకుంటున్నారు. అబూ తల్హా (రజి) ఓ మంచి విలుకాడు. ఆయన (రజి) బాణాన్ని వదలగానే, మహాప్రవక్త (సల్లం) ఆ బాణం ఎక్కడ పడిందా అని మెడ పైకెత్తి చూసేవారు."*]

హజ్రత్ అబూ దుజానా (రజి) దైవప్రవక్త (సల్లం) దగ్గరకు వచ్చి నిలబడ్డారు. తన వీపును ఆయన (సల్లం) కోసం ఢాలుగా ఉంచారు. వీపుపై బాణాలు వచ్చి పడ్డా ఆయన ఎటూ కదలలేదు.

హజ్రత్ హాతిబ్ బిన్ అబీ బల్'తఆ (రజి), 'ఉత్బా బిన్ అబీ వికాస్'ను తరుముతున్నారు. అతను, దైవప్రవక్త (సల్లం) గారి దంతాన్ని విరగగొట్టినవాడు. అలా తరుముతూ వెళ్ళి అతనిపై ఖడ్గఘాతాన్ని వేయగా అతని తల తెగి క్రిందపడిపోయింది. హాతిబ్ (రజి), అతని గుర్రాన్ని, ఖడ్గాన్ని స్వాధీనం చేసుకున్నారు. 'హజ్రత్ సఅద్ (రజి) బిన్ అబీ వికాస్' తన సోదరుడు 'ఉత్బా బిన్ అబీ వికాస్'ను చంపడానికి చాలా ప్రయత్నించారు. కాని ఆ ప్రయత్నంలో ఆయన సఫలీకృతులు కాలేకపోయారు. ఈ అదృష్టం 'హజ్రత్ హాతిబ్ (రజి)' గారికే దక్కింది.

'హజ్రత్ సహల్ (రజి) బిన్ హునైఫ్' కూడా ఓ పరాక్రమవంతుడైన విలుకాడు. ఆయన (రజి), దైవప్రవక్త (సల్లం) ఎదుటకు వచ్చి ప్రాణాలు వదలిందాకా పోరాడుతానని ప్రతిజ్ఞ చేశారు. ఆ తరువాత ఆయన (రజి) ముష్రిక్కులను అడ్డుకోవడానికి తన శక్తినంతా ధారపోశారు.

మహాప్రవక్త (సల్లం) స్వయాన బాణాలు వదులుతున్నారు. ఈ విషయంలో 'ఖతాదా బిన్ నోమాన్ (రజి)' గారి ఉల్లేఖనం ఒకటుంది. దాని ప్రకారం, దైవప్రవక్త (సల్లం) తన విల్లుతో బాణాలు వదులుతూ ఉండగా దాని చివరి భాగం విరిగిపోయింది. ఆ తరువాత ఆ విల్లును 'హజ్రత్ ఖతాదా (రజి) బిన్ నోమాన్'కు ఇచ్చివేయగా అది ఆయన దగ్గరనే ఉండిపోయింది.

ఆ రోజు మరో సంఘటన కూడా జరిగింది. 'హజ్రత్ ఖతాదా (రజి)' గారి కంటికి దెబ్బ తగిలి ఆయన కనుగ్రుడ్డు బయటపడి ముఖంపై జారిపోయింది. దైవప్రవక్త (సల్లం) తన చేత్తో దాన్ని దాని స్థానంలో దూర్చివేశారు. ఆ తరువాత ఆ కన్ను యధాస్థితికి వచ్చేసింది. ఆయన రెండు కళ్ళల్లో ఈ కన్నే ఎంతో అందంగా అగుపడసాగింది. దాని చూపు కూడా మొదటి కంటే పెరిగిపోయింది.

'హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి)' పోరాడుతూ ఉండగా ఆయన నోటిలో గాయం అయింది. దాని వల్ల ఆయన ముందటి పన్ను విరిగిపోయింది. ఆయనకు ఇరవై లేదా ఇరవై రెండు గాయాలయ్యాయి. వాటిలో కొన్ని కాలికి తగలడం వలన ఆయన కుంటివారైపోయారు.

'అబూ సయీద్ ఖుద్రీ (రజి)' గారి తండ్రి 'మాలిక్ బిన్ సనాన్ (రజి)' గారు, దైవప్రవక్త (సల్లం) గారి ముఖం నుండి ప్రవహిస్తున్న రక్తాన్ని నోటితో పీల్చి శుభ్రం చేయగా, ఆయన (సల్లం) దాన్ని ఊసివేయమని చెప్పారు. దానికి ఆయన (రజి), *"దైవసాక్షి ! దీన్ని నేనసలే ఉసివేయను"* అంటూ వెనక్కు తిరిగి యుద్ధంలో నిమగ్నమైపోయారు. ఆయన్ను చూసి దైవప్రవక్త (సల్లం), *"ఎవరైనా ఓ స్వర్గ నివాసిని చూడదలచుకుంటే ఆయన్నే చూడాలి."* అని అన్నారు. ఆ తరువాత 'మాలిక్ బిన్ సనాన్ (రజి)' యుద్ధం చేస్తూ అమరగతి పొందారు.

*మరో అసాధారణ ఘనకార్యం....; ↓*

మహిళా సహాబీయా 'హజ్రత్ ఉమ్మె అమ్మారా నసీబా బిన్తే కఅబ్ (రజి)' నిర్వహించినది. ఆమె కొందరు ముస్లింలతో కలసి పోరాడుతూ 'ఇబ్నె ఖుమా' ఎదురుగా వెళ్ళి నిలబడ్డారు. ఇబ్నె ఖుమా, ఆమె భుజంపై వేసిన కత్తి వ్రేటుకు లోతైన గాయం అయింది. ఆమె కూడా ఇబ్నె ఖుమా పై ఎన్నో కత్తివ్రేటులను వేశారు. కాని అతను రెండు కవచాలు ఒకదానిపై ఒకటి ధరించటం వలన బ్రతికి బయటపడ్డాడు. హజ్రత్ ఉమ్మె అమ్మారా (రజి) అలా పోరాడుతూ ఉండగా ఆమెకు పన్నెండు గాయాలయ్యాయి.

'హజ్రత్ ముస్అబ్ బిన్ ఉమైర్ (రజి)' ఎంతో వీరోచితంగా పోరాడుతున్నారు. ఆయన (రజి), దైవప్రవక్త (సల్లం)ను, ఇబ్నె ఖుమా మరియు అతని సహచరులు చేసిన ఎడతెగని దాడుల్ని అడ్డుకుంటున్నారు. ఆయన చేతిలో ఇస్లామీయ సైన్యపతాకం రెపరెపలాడుతోంది. దుష్టులు ఆయన చేతిపై వేసిన ఖడ్గపు వ్రేటుకు ఆయన చేయి తెగిపడిపోయింది. ఆ తరువాత ఆయన ఆ జెండాను ఎడమ చేతిలోనికి తీసుకొని దైవధిక్కారుల ఎదురుగా నిలబడ్డారు. చివరికి ఆయన ఎడమ చేయి కూడా నరకబడింది. పిదప ఆయన మోకాలిపై కూర్చొని ఆ పతాకాన్ని తన వక్షస్థలానికి ఆనించుకొని నిలబెట్టారు. అదే పరిస్థితిలో 'హజ్రత్ ముస్అబ్ (రజి)' అమరగతి పొందారు. ఆయన్ను చంపినవాడు 'ఇబ్నె ఖుమా'యే. అతను 'హజ్రత్ ముస్అబ్ (రజి)'ను చూసి ఆయనే ముహమ్మద్ (సల్లం) అనుకున్నాడు. ఎందుకంటే ముస్అబ్ బిన్ ఉమైర్ (రజి), దైవప్రవక్త (సల్లం) గారి పోలికలు కలిగి ఉండేవారు. కాబట్టి అతను ముస్అబ్ (రజి)ను షహీద్ చేసి ముష్రిక్కుల వైపునకు వెళ్ళి, పెద్దగా అరుస్తూ ముహమ్మద్ (సల్లం) హతమైపోయారు అని ప్రకటించనారంభించారు.

*మహాప్రవక్త (సల్లం) గారి మరణ వార్త - యుద్ధంపై దాని ప్రభావం : -*

దైవప్రవక్త (సల్లం) హతులైనట్లు వెలువడిన వార్త ముస్లిములు మరియు ముష్రిక్కుల నడుమ దావానంలా వ్యాపించింది. దైవప్రవక్త (సల్లం) నుండి వేరుబడిపోయి ముష్రిక్కులు దిగ్బంధంలో చిక్కిపోయిన ముస్లిములకు అది సున్నితమైన ఘడియ. వారి ధైర్యాలు పూర్తిగా అడుగంటిపోయాయి. వారి స్థయిర్యం చల్లబడిపోయింది. వారి వరుసలు చిన్నాభిన్నమైపోయాయి.

అయితే, దైవప్రవక్త (సల్లం) గారి మరణవార్తతో ఓ మేలే జరిగింది. ముష్రిక్కులు చేస్తున్న దాడుల్లో కొంత తీవ్రత తగ్గిపోయింది. ఎందుకంటే, దైవప్రవక్త (సల్లం)ను హతమార్చడమే వారి లక్ష్యం. ఆ లక్ష్యం కాస్తా నెరవేరిపోయింది కాబట్టి ముష్రిక్కులు తమ దాడుల్ని ఆపి ముస్లిం షహీదుల (అమరగతినొందినవారి) శరీరాలను ముస్లా (చనిపోయినవారి ముక్కులు చెవులు కోసి ముఖాల్ని చెడగొట్టడం) చేయనారంభించారు.

*దైవప్రవక్త (సల్లం) యుద్ధాన్ని కొనసాగిస్తూ పరిస్థితులను నియంత్రించడం : -*

'హజ్రత్ ముస్అబ్ బిన్ ఉమైర్ (రజి)' గారి అమరగతి తరువాత ముస్లిముల యుద్ధ పతాకం 'హజ్రత్ అలీ (రజి)'కు ఇవ్వడం జరిగింది. ఆయన (రజి) స్థిరంగా నిలబడి యుద్ధం చేయనారంభించారు. అక్కడ ఉన్న సహాబా (రజి)లు కూడా అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించి శత్రువు దాడుల్ని అడ్డుకుంటూ ఎదురుదాడులకు దిగారు. దీనివల్ల మహాప్రవక్త (సల్లం)కు, శత్రువుల దిగ్బంధాన్ని చీల్చి సహాబా ఉన్న వైపునకు దారి కల్పించడానికి అవకాశం లభించింది. కాబట్టి మహాప్రవక్త (సల్లం) అడుగు ముందుకువేస్తూ సహాబా (రజి) ఉన్న వైపునకు కదలడం ఆరంభించారు. అందరికంటే ముందు 'హజ్రత్ కఅబ్ బిన్ మాలిక్ (రజి)' దైవప్రవక్త (సల్లం)ను గుర్తుపట్టారు. సంతోషాతిరేకంతో, *"ఓ ముస్లిం యోధుల్లారా! సంబరపడండి, చూడండి, ఇరుగో దైవప్రవక్త (సల్లం)!"* అంటూ అరవనారంభించారు. దానికి మహాప్రవక్త (సల్లం) ఆయన్ను, తమ ఉనికి మరియు తాము నిలబడిన స్థానం ఏదో తెలియకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో *"అరవకండి!"* అని సైగతో వారించారు.

కాని 'కఅబ్ (రజి)' గారి కేక ముస్లిముల చెవులకు చేరనేచేరింది. ముస్లిములు ఒక్కొక్కరుగా ఆయన (సల్లం) దగ్గరకు చేరనారంభించారు. క్రమక్రమంగా వారి సంఖ్య నలభై మంది వరకు పెరిగిపోయింది.

ఇంతమంది సహాబా (రజి)లు చేరిన తరువాత మహాప్రవక్త (సల్లం) కొండలోయ వైపు అంటే ముస్లిముల శిబిరం వైపునకు కదలనారంభించారు. వెనక్కు తిరిగే ఈ చర్య వల్ల ముష్రిక్కులు, ముస్లిములను తమ దిగ్బంధంలోకి తీసుకొని వారిని సంహరిద్దామనే పథకం పూర్తిగా నిరుపయోగమైపోయింది.

ఇలా ముష్రిక్కుల ఈ నిర్బంధాన్ని చేధించి బయటపడే మార్గం ఏర్పడింది. ముస్లిం యోధుల పరాక్రమం ముందు వారు నిలువలేకపోయారు.

ఈలోపే ముష్రిక్కులకు చెందిన తల తిరిగిన అశ్విక యోధుడు 'ఉస్మాన్ బిన్ అబ్దుల్లా ముగైరా', ప్రవక్త (సల్లం) పైకి, *"నేనైనా ఉండాలి లేదా ముహమ్మద్ (సల్లం) అయినా ఉండాలి"* అంటూ లంఘించాడు.

అటు, దైవప్రవక్త (సల్లం) కూడా అతణ్ణి మార్కొనడానికి సిద్ధంగా లేచి నిలబడ్డారు.

*మిగిలినది In Sha Allah రేపటి భాగములో....;*

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment