240

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉

🕌☪🕋🛐      *ఇస్లాం చరిత్ర - 240*       🛐🕋☪🕌

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 155*      🇸🇦🇸🇦

◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉

          🛡⚔ *ఉహద్ పోరాటం : - 12*⚔🛡

*ఉహద్ పోరాటంలో దైవప్రవక్త (సల్లం) పై దాడి చేస్తున్న ముష్రిక్కులు. శత్రువులను అత్యంత ధైర్యసాహసాలతో ఎదుర్కొన్న 'హజ్రత్ తల్హా బిన్ ఉబైదుల్లా (రజి)' పరాక్రమం గురించి, ఆయన యుద్ధ విధానం గురించి, ఆ తరువాత జరిగిన సంఘటనలను తెలుసుకుందాం.*

_'హాకీం' ఉల్లేఖనం ప్రకారం....; ↓_

*"ఆయన (తల్హా - రజి)కు ఉహద్ రోజున ముప్పై తొమ్మిది లేదా ముప్పై అయిదు గాయాలైనట్లు, ఆ గాయాల్లో చేతి మధ్య వ్రేళ్ళు మరియు చూపుడు వ్రేలు ఉన్నాయని ఉంది."*

_'ఇమామ్ బుఖారి', 'ఖైస్ బిన్ అబీ హాజిమ్' ఉల్లేఖనాన్ని ఉటంకిస్తూ ఆయన ఇలా చెప్పాడని రాశారు....; ↓_

*"నేను 'హజ్రత్ తల్హా (రజి)' గారి చేతి వైపు చూశాను. ఆయన చేయి మొద్దుబారి ఉంది. ఆ చేత్తోనే ఆయన ఉహద్ (యుద్ధం) రోజున దైవప్రవక్త (సల్లం)ను రక్షించారు."*

_'తిర్మిజీ' ఉల్లేఖనంలో, దైవప్రవక్త (సల్లం), 'హజ్రత్ తల్హా (రజి)' గురించి ఓ రోజున ఇలా సెలవిచ్చినట్లు ఉంది._ *"ఎవరైనా ఓ షహీద్ ను భూమ్మీద తిరగాడుతూ చూడదలిస్తే, అతడు 'తల్హా (రజి) బిన్ ఉబైదుల్లా'ను చూడవచ్చు." అన్నారు.*

_'అబూ దావూద్ తయాసీ', 'హజ్రత్ ఆయిషా (రజి)' గారి ఉల్లేఖనాన్ని ఇలా ఉల్లేఖించినట్లు చెబుతారు....; ↓_

*"అబూ బక్ర్ (రజి) ఉహద్ యుద్ధం గురించి చెప్పినప్పుడల్లా, ఆ యుద్ధం పూర్తిగా హజ్రత్ తల్హా (రజి) కోసమే జరిగింది." (అంటే ఇందులో దైవప్రవక్త (సల్లం)ను సంరక్షించే ఘనకార్యం ఆయనే నిర్వహించారు).*

_'హజ్రత్ అబూ బక్ర్ (రజి)' ఆయన గురించి ఇంకా ఇలా కూడా చెప్పినట్లు ఉంది....; ↓_

*"ఓ తల్హా బిన్ ఉబైదుల్లాహ్! నీ కోసం స్వర్గాలు వాజిబ్ అయ్యాయి (లిఖించబడ్డాయి). ఇంకా నీ వద్ద ఇప్పుడు 'హూరెఐన్'లు (పెద్ద కళ్ళు గల స్వర్గ అప్సరసలు) ఉన్నారు."*

_ఈ సున్నితమైన, కష్టతరమైన తరుణంలోనే అల్లాహ్ పరోక్షంగా తన సహాయాన్ని అందించాడు. 'సహీయైన్' గ్రంథంలో 'హజ్రత్ సఅద్ (రజి)' గారి ఉల్లేఖనం ఇలా ఉంది....; ↓_

*"ఉహద్ నాడు నేను దైవప్రవక్త (సల్లం) వైపు చూడగా, ఇద్దరు వ్యక్తులు తెల్లటి దుస్తులు ధరించి ఆయన (సల్లం) గారి తరఫున భయంకరంగా పోరాడుతున్నారు. వారిద్దరిని అంతకు పూర్వం నేను చూసి ఎరుగను. ఆ తరువాత కూడా వారు నా కంటబడలేదు."* మరో ఉల్లేఖనంలో, *"వారిరువురు 'హజ్రత్ జిబ్రీల్ మరియు మీకాయిల్ (దైవదూతలు)"* అని ఉంది.

*దైవప్రవక్త (సల్లం) వద్దకు సహాబా చేరుకోనారంభించడం : -*

ఇదంతా కొన్ని క్షణాల్లోనే, హఠాత్తుగా, అతి శీఘ్రంగా సంభవించిన సంఘటన. దైవప్రవక్త (సల్లం) ఎంపిక చేసిన సహాబా (రజి) మొదటి వరుసలో ఉన్నారు. యుద్ధ పరిస్థితి మారిపోగానే లేదా ప్రవక్త (సల్లం) గారి పిలుపు వినగానే వీరంతా మహాప్రవక్త (సల్లం) వైపునకు, దైవప్రవక్త (సల్లం)కు ఏ ప్రమాదమూ సంభవించకూడదు అనే ఉద్దేశ్యంతో పరుగెత్తుకు వచ్చేశారు. కాని వీరు వచ్చే లోపలే మహాప్రవక్త (సల్లం) గాయపడి ఉన్నారు. ఆరుగురు అన్సారీ సహాబాలు షహీద్ అయి ఉన్నారు. ఏడవ అన్సారీ గాయాలతో క్రిందపడిపోయి ఉన్నారు. 'హజ్రత్ సఅద్ (రజి)' మరియు 'హజ్రత్ తల్హా (రజి)' ప్రాణాలకు తెగించి దైవప్రవక్త (సల్లం)ను రక్షించడంలో నిమగ్నమై ఉన్నారు. వచ్చిన సహాబాలు అక్కడికి చేరగానే తమ శరీరాలను మరియు ఆయుధాలను అడ్డంగా ఉంచి మహాప్రవక్త (సల్లం) చుట్టూ గోడలా నిలబడ్డారు. శత్రువు ఎడతెగకుండా చేస్తున్న దాడుల్ని ఎంతో ధైర్యంగా ప్రతిఘటించడానికి ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధ మైదానం నుండి మొట్టమొదట వచ్చిన సహాబీ, గుహ సహవాసి 'హజ్రత్ అబూ బక్ర్ (రజి)'యే.

*[ 'ఇబ్నె హబ్బాన్' తన సహీహ్ గ్రంథంలో 'హజ్రత్ ఆయిషా (రజి)' గారి ఉల్లేఖనాన్ని ఉటంకిస్తూ 'హజ్రత్ అబూ బక్ర్ (రజి)' గారు ఇలా చెప్పారని రాశారు....; ↓*

"ఉహద్ రోజున అందరూ దైవప్రవక్త (సల్లం)ను వదిలి వెళ్ళిపోయారు. (అంటే ఆ తొమ్మండుగురు సంరక్షకులు తప్ప తక్కిన సహాబా (రజి) అంతా యుద్ధం చేయడానికి ముందు వరుసల్లోనికి వెళ్ళిపోయి ఉన్నారు. ఆ తరువాత దిగ్భందం జరిగిన తరువాత) మొట్టమొదటగా దైవప్రవక్త (సల్లం) గారి వద్దకు వచ్చినవాణ్ణి నేనే. చూద్దునుగదా! దైవప్రవక్త (సల్లం) గారి ముందు నిలబడి ఆయన (సల్లం) తరఫున యుద్ధం చేస్తూ ఓ వ్యక్తి అగుపించాడు. అతను దైవప్రవక్త (సల్లం)ను రక్షిస్తున్నాడు. నేను (నా మనస్సులో), *"తప్పక నీవు తల్హావే అయిఉంటావు. నా తల్లిదండ్రులను నీకు అర్పింతునుగాక! తప్పకుండా నీవు తల్హావే అయిఉంటావు."* అని అనుకున్నాను.

అంతలోనే 'అబూ ఉబైదా బిన్ జర్రాహ్', పక్షి ఎగురుతూ ఉన్నట్లు పరుగెత్తుకొని నా దగ్గరకు వచ్చేశారు. ఇప్పుడు మేమిద్దరం కలసి దైవప్రవక్త (సల్లం) వైపునకు పరుగుతీశాం. చూద్దుము కదా! దైవప్రవక్త (సల్లం) ముందు హజ్రత్ తల్హా పడిపోయి ఉన్నారు. మహాప్రవక్త (సల్లం) మమ్మల్ని చూసి, *"మీ సోదరుణ్ణి కాపాడండి! ఇతను స్వర్గాన్ని వాజిబ్ చేసుకున్నాడు."* అని అన్నారు.

మేము అక్కడికి వెళ్ళి చూద్దుముగదా దైవప్రవక్త (సల్లం) గారి ముఖం గాయపడి ఉంది. శిరస్త్రాణం రెండు అంచులు ఆయన (సల్లం) కంటి క్రింద చెక్కిలిలో దూరిపోయి ఉన్నాయి. నేను వాటిని లాగడానికి ప్రయత్నం చేయగా అబూ ఉబైదా నన్ను వారిస్తూ, *"అల్లాహ్ కోసం ఆగండి, వాటిని నేను పీకుతాను."* అని అన్నారు.

ఆ తరువాత ఆయన తన మునిపళ్ళతో ఒక దాన్ని దైవప్రవక్త (సల్లం)కు బాధ కలగకుండా పీకి బయటకు లాగిపారేశారు. (ఈ ప్రయత్నంలో) ఆయన క్రింది పన్ను ఒకటి ఊడిపోయింది. ఇక రెండో అంచును కూడా మెల్లగా మునిపళ్ళతోనే లాగారు. అప్పుడు కూడా ఆయన మరో పన్ను ఊడిపోయింది.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లం), *"మీ సోదరుడు తల్హాను కాపాడండి, (అతను స్వర్గాన్ని) వాజిబ్ చేసుకున్నాడు."* అని అన్నారు. మేము 'హజ్రత్ తల్హా (రజి)' వైపునకు తిరిగి ఆయన్ను ఆదుకున్నాం. ఆయనకు పదికంటే ఎక్కువ గాయాలే అయ్యాయి." *]*

_(హజ్రత్ తల్హా (రజి) ఆ రోజు ఎంత పరాక్రమంగా ప్రాణాలొడ్డి దైవప్రవక్త (సల్లం)ను రక్షించారో ఈ సంఘటన ద్వారా అంచనా వేయవచ్చు.)_

*ఈ సున్నితమైన క్షణాల్లోనే దైవప్రవక్త (సల్లం) గారి చుట్టూ ధీరులైన ముస్లిములు వచ్చి చేరారు, వచ్చినవారి పేర్లు ఇవి....; ↓*

1. అబూ దుజానా (రజి), 2. ముస్అబ్ బిన్ ఉమైర్ (రజి), 3. అలీ (రజి), 4. సహల్ బిన్ హునైఫ్ (రజి), 5. మాలిక్ బిన్ సనాన్ (రజి), 6. (అబూ సయీద్ ఖుద్రీ (రజి) గారి తల్లి) ఉమ్మె అమ్మారా నుసైబా బిన్తె కఅబ్ మాజ్'నీయా (రజి), 7. ఖతాదా బిన్ నోమాన్ (రజి), 8. ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజి), 9. హాతిమ్ బిన్ ముల్తఆ (రజి) మరియు 10. అబూ తల్హా (రజి)లు.

*పెరుగుతున్న ముష్రిక్కుల ఒత్తిడి : -*

ఇటు ముష్రిక్కుల సంఖ్య కూడా క్షణక్షణం పెరిగిపోతూనే ఉంది. దీని ఫలితంగా దాడులు కూడా తీవ్రం కానారంభించాయి. ఒత్తిడి కూడా బాగా పెరుగుతోంది. దైవప్రవక్త (సల్లం), 'అబూ ఆమిర్ ఫాసిఖ్' ఇలాంటి సమయం కోసమే త్రవ్వి ఉంచిన గుంటల్లో ఒక దానిలోనికి ఒరిగిపోతున్నారు. ఆ సమయంలోనే ఆయన (సల్లం) మోకాలు బెణికింది. హజ్రత్ అలీ (రజి) ఆయన (సల్లం) చేయి పట్టుకొని ఊతమిచ్చారు. గాయాలతో పడి ఉన్న తల్హా బిన్ ఉబైదుల్లా ఆయన్ను బాహువుల్లో చిక్కించుకొని బయటకులాగి నిలబెట్టడం వలన దైవప్రవక్త (సల్లం) లేచి సరిగా నిలబడగలిగారు.

*[ నేను ఓ ముహాజిర్ ను ఇలా చెబుతూ ఉండగా విన్నాను అని 'నాఫె బిన్ జుబైర్ (రజి)' ఉల్లేఖిస్తున్నారు....; ↓*

"యుద్ధం జరిగేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. అన్ని వైపుల నుండి దైవప్రవక్త (సల్లం)పై బాణాల వర్షం కురుస్తోంది. అన్ని బాణాలు ఆయన (సల్లం)కు తగలకుండా ప్రక్కకు నెట్టివేయబడుతున్నాయి (అంటే చుట్టుముట్టి ఉన్న సహాబా వాటిని దైవప్రవక్త (సల్లం)కు తగలకుండా అడ్డుపడుతున్నారు). నేను చూస్తూ ఉండగానే, 'అబ్దుల్లా బిన్ షహాబ్ జహ్రీ' అనేవాడు, *"ముహమ్మద్ ఎక్కడున్నాడో నాకు చూపించండి. నేనైనా ఉండాలి లేదా ఆయననైనా బ్రతికి ఉండాలి."* అని అంటున్నాడు.

దైవప్రవక్త (సల్లం) అతని ప్రక్కనే నిలబడి ఉన్నారప్పుడు. ఆయన ప్రక్కన ఇంకెవరూ లేరు. అలా అంటూనే అతను ముందుకు వెళ్ళిపోయాడు. అది చూసి 'సుఫ్ఫాన్' అతణ్ణి తిడుతూ (దైవప్రవక్త (సల్లం) గారి ఉనికిని చూపించగా) అతను, *"దైవసాక్షి! ఆయన నాకు కనబడలేదే! దైవసాక్షి! అల్లాహ్, ముహమ్మద్ ను నాకు కనబడకుండా చేశాడట్లుంది."* అన్నాడు.

ఆ తరువాత మేము నలుగురం కలసి ముహమ్మద్ (సల్లం)ను హతమార్చే ప్రతిజ్ఞ చేస్తూ ముందు వెళ్ళాం. కాని మేము ఆయన (సల్లం)ను చేరలేకపోయాం." *]*

*అద్భుతమైన పరాక్రమం : -*

మొత్తానికి, ఈ సందర్భంలోనే ముస్లిములు అసాధారణ ధైర్యసాహసాలను, పరాక్రమాన్ని ప్రదర్శించి, చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచే త్యాగానికి పూనుకున్నారు. 'అబూ తల్హా (రజి)' తన శరీరాన్ని మహాప్రవక్త (సల్లం)కు అడ్డంగా పెట్టి నిలబడ్డారు. ఆయన (సల్లం)కు ఎదురుగా పెట్టి వచ్చే శరపరంపరను మహాప్రవక్త (సల్లం)కు తగలకుండా తన వక్షస్థలాన్ని పైకెత్తి నిలుచున్నారు.

*↑ ఇందులోని మరింత వివరణను In Sha Allah రేపటి భాగములో....; →*

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment