🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐
🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋
◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉
🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర - 239* 🛐🕋☪🕌
🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 154* 🇸🇦🇸🇦
◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉
🛡⚔ *ఉహద్ పోరాటం : - 11*⚔🛡
*ఉహద్ పోరాటంలో దైవప్రవక్త (సల్లం) పై దాడి జరుగుతున్న సందర్భం*
*దైవప్రవక్త (సల్లం) చుట్టూ జరుగుతున్న భీకర పోరాటం : -*
ఇస్లామీయ సేన చుట్టుముట్టబడి ముష్రిక్కుల దాడులకు బలి అవుతున్న సమయంలోనే మహాప్రవక్త (సల్లం) చుట్టూ కూడా భీకర పోరాటం జరుగుతోంది. ముష్రిక్కుల వలయం, ప్రవక్త (సల్లం) చుట్టు బిగిస్తూ ఉన్నప్పుడు మహాప్రవక్త (సల్లం) వెంట తొమ్మండుగురు సహాబాలు ఉన్న విషయం, ఆయన (సల్లం) ముస్లిములను, *"నా వైపునకు రండి, నేను అల్లాహ్ ప్రవక్తను"* అని పిలిచినప్పుడు ఆ పిలుపు ముస్లిములకు ముందే ముష్రిక్కులకు చేరిందన్న విషయం, వారు ఆయన (సల్లం)ను చుట్టుముట్టిన తీరు మనం ఇదివరకే చెప్పుకున్నాం.
కాబట్టి వారు ఆలస్యం చేయకుండా దైవప్రవక్త (సల్లం)పై దాడి చేయనే చేశారు. ఏ ఒక్క ముస్లిం ఆయన (సల్లం)ను చేరకమునుపే వారు తమ శక్తినంతా ఆయన (సల్లం)పై ప్రయోగించనారంభించారు. హఠాత్తుగా జరిగిన ఈ దాడి ఫలితంగా ఆయన (సల్లం) వెంట ఉన్న తొమ్మండుగురు సహాబా (రజి)లకు మరియు ముష్రిక్కులకు నడుమ భీకర యుద్ధం ప్రారంభం అయింది. ఈ దాడిలో ప్రాణాలు అర్పించే వైనం, ధైర్య సాహసాలు, పరాక్రమానికి సంబంధించిన అసాధారణ సంఘటనలు ఉనికిలోకి వచ్చాయి.
*''సహీ ముస్లిం''లో 'హజ్రత్ అనస్ (రజి)' గారి ఉల్లేఖనం ఆ దృశ్యాన్ని ఇలా వివరిస్తోంది....; ↓*
ఉహద్ యుద్ధం రోజున దైవప్రవక్త (సల్లం) గారి వెంట ఉన్న ఏడుగురు అన్సారులు, ఇద్దరు ఖురైషీ సహాబా (రజి)లు ముస్లిం సైన్యానికి దూరంగా ఉన్నారు. దాడి చేసేవారు మరీ దగ్గరకు రావడం చూసి మహాప్రవక్త (సల్లం) వారిని ఉద్దేశించి, *"వారిని దగ్గరకు రాకుండా ఎవరు అడ్డుకోగలరో వారి కోసం స్వర్గం ఎదురుచూస్తోంది."* లేదా *"అతను నా వెంట స్వర్గంలో ఉంటాడు."* అని అన్నారు.
ఆ తరువాత ఓ అన్సారీ సహాబీ ముందుకొచ్చి యుద్ధం చేస్తూ అమరగతినొందారు. ఆ తరువాత ముష్రిక్కులు మరింత దగ్గరకు రాగానే తిరిగి అలానే జరిగింది. అలా ఒకరి తరువాత మరొకరు ఏడుగురు అన్సారీ సహాబా (రజి)లు అమరగతిపొందారు. ఇది చూసిన దైవప్రవక్త (సల్లం) మిగిలిన తన ఇద్దరు అనుచరులను (అంటే ఖురైషీలను సంబోధిస్తూ), *"మనం మన ఈ సహచరుల ఎడల న్యాయం చేయలేదు."* అని అన్నారు.
ఈ ఏడుగురిలో చివరి సహాబీ 'అమ్మారా (రజి) బిన్ యజీద్ బిన్ అలస్కన్'. ఆయన పోరాడుతూ బాగా గాయాలై క్రింద పడిపోయారు.★
_(★→ ఓ క్షణం తరువాత దైవప్రవక్త (సల్లం) దగ్గరకు సహాబా (రజి)కు చెందిన కొందరు చేరిపోయారు. వారు దైవతిరస్కారుల్ని 'హజ్రత్ అమ్మారా (రజి)'కు దూరంగా నెట్టారు. ఆయన్ను మహాప్రవక్త (సల్లం) దగ్గరికి తీసుకొని వెళ్ళగా ఆయన్ను తన కాళ్ళకు ఆధారంగా ఆనించి కూర్చున్నారు. అదే స్థితిలో ఆయన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రాణం విడిచేటప్పుడు ఆయన చెక్కిలి దైవప్రవక్త (సల్లం) గారి పాదాలపై ఉంది. ఇబ్నె హష్షామ్ - 2/81.)_
'అమ్మారా (రజి)' పడిపోయిన తరువాత దైవప్రవక్త (సల్లం) గారి వెంట ఉన్న వారు కేవలం ఇద్దరు ఖురైషీ సహాబీలే. 'సహీయైన్'లో 'హజ్రత్ అబూ ఉస్మాన్ (రజి)' గారి ఉల్లేఖనం ప్రకారం, ఆ మిగిలి ఉన్న ఇద్దరు 'తల్హా బిన్ ఉబైదుల్లా (రజి)' మరియు 'సఅద్ బిన్ అబీ వికాస్ (రజి)'లు.
*ఈ క్షణం దైవప్రవక్త (సల్లం) కోసం ఎంతో కఠినమైనది మరియు ముష్రిక్కుల కోసం అది ఎంతో స్వర్ణావకాశంగా పరిణమించింది. నిజం చెప్పాలంటే ముష్రిక్కులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడంలో ఏ మాత్రం జాప్యం చేయలేదు. వారు ఎడతెగకుండా దైవప్రవక్త (సల్లం) పై దాడి చేస్తూనే ఉన్నారు, ఆయన్ను హతమార్చడానికి. ఈ దాడిలో 'ఉత్బా బిన్ అబీ వికాస్', దైవప్రవక్త (సల్లం) పై ఒక రాయి విసరగా ఆయన (సల్లం) ప్రక్కకు పడిపోవడం జరిగింది. ఆయన (సల్లం) కుడి వైపున ఉన్న క్రింది 'రుబాయి'■ దంతం విరిగిపోయింది. దానికితోడు దైవప్రవక్త (సల్లం) గారి క్రింది పెదవికి కూడా గాయమైంది.*
*'అబ్దుల్లా బిన్ షహాబ్ జహ్రీ' ముందుకు వెళ్ళి దైవప్రవక్త (సల్లం) నొసటిని కూడా గాయపరిచాడు. మరో అశ్వారూఢుడైన దైవధిక్కారి 'అబ్దుల్లా బిన్ ఖమా' ఆయన (సల్లం) గారి భుజంపై కత్తివ్రేటు వేశాడు _(ఆ దెబ్బ బాధను దైవప్రవక్త (సల్లం) ఒక నెల వరకు అనుభవించారని ఉల్లేఖనాలు చెబుతున్నాయి)._ అయితే దైవప్రవక్త (సల్లం) తొడిగిన రెండు కవచాల్లోని ఒక కవచం మాత్రం తెగలేదు. ఆ తరువాత అతడు మొదటి వ్రేటు వేసినట్లే రెండో వ్రేటు కూడా వేశాడు. అది కంటి కింద ఉన్న ఎముకపై తగిలింది. దాని కారణంగా తలపై పెట్టుకున్న శిరస్త్రాణపు (హెల్మెట్) రెండు చివర్లు ఆయన (సల్లం) గారి ముఖంలో గ్రుచ్చుకున్నాయి. వెంటనే అతడు, _"నేను ఖుమా (విరిచేవాడు) కుమారుణ్ణి"_ అని చెప్పి పరిచయం చేసుకోగా, దైవప్రవక్త (సల్లం) రక్తాన్ని తుడుచుకుంటూ, _"అల్లాహ్ నిన్ను కూడా విరిచేయుగాక!"_ అన్నారు.◆*
_'సహీ బుఖారీ' గ్రంథంలో ఇలా ఉంది....; ↓_
*"దైవప్రవక్త (సల్లం) గారి రుబాయి దంతం విరిచేయబడింది. తలను గాయపర్చడం జరిగింది. ఆ సమయంలో ఆయన (సల్లం) రక్తం తుడుచుకుంటూ ఇలా పలుకుతున్నారు. "ఏ జాతి అయితే, దైవం వైపునకు పిలిచే తన ప్రవక్తను గాయపరిచిందో, ఆయన (సల్లం) దంతాన్ని విరిచిందో, అది ఎలా సాఫల్యం పొందగలదు?"*
దీనికి అల్లాహ్ ఈ ఆయత్ ను అవతరింపజేశాడు.
*"(ఓ ప్రవక్తా! ఈ వ్యవహారంలో) నీకెలాంటి నిర్ణయాధికారం లేదు. అల్లాహ్ (గనక తలిస్తే) వారి పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడు లేదా వారిని శిక్షిస్తాడు. ప్రస్తుతానికి వారు అక్రమానికి పాల్పడిన వారే!" (ఖుర్ఆన్ 3:128).*
_'తిబ్రానీ' ఉటంకించిన ఉల్లేఖనం ప్రకారం, దైవప్రవక్త (సల్లం) ఇలా సెలవిచ్చినట్లుగా ఉంది....; ↓_
*"ఆ జాతిపై అల్లాహ్ శిక్ష పడుగాక! ఏ జాతి అయితే తన ప్రవక్త (సల్లం) ముఖాన్ని రక్తసిక్తం చేసిందో." కొంచెం ఆగి మళ్ళీ ఇలా అన్నారు: "ఓ అల్లాహ్! నా జాతిని మన్నించు. దానికి ఏమీ తెలియదు."*
_'సహీ ముస్లిం' గ్రంథంలో ఈ ఉల్లేఖనం ఉంది. ఆయన (సల్లం) పదే పదే ఇలా పలుకుతున్నారని....; ↓_
*"ఓ ప్రభూ! నా జాతిని క్షమించు, దానికి ఏదీ తెలియదు."*
_'ఖాజీ అయ్యాజ్' రచించిన "షఫా" గ్రంథంలో ఈ పదాలు కనపడుతాయి. ↓_
*"ఓ అల్లాహ్ ! నా జాతికి రుజుమార్గం చూపు! దానికి ఏమీ తెలియదు."*
దైవప్రవక్త (సల్లం)ను అంతమొందించేందుకు ముష్రిక్కులు ఆయన (సల్లం)పై దాడి చేశారనడంలో సందేహం ఏమాత్రం లేదు. కాని ఆ ఇద్దరు ఖురైషీ సహాబా (రజి)లు, అంటే 'హజ్రత్ సఅద్ బిన్ అబీ వికాస్ (రజి)' మరియు 'తల్హా బిన్ ఉబైదుల్లా (రజి)'లు అసాధారణ పరాక్రమం, ధైర్యసాహసాలతో ఇద్దరే అయినప్పటికీ ముష్రిక్కుల విజయాన్ని అసాధ్యంగా మార్చివేశారు. ఆ ఇద్దరు అరబ్బులు నిపుణులైన విలుకాండ్రు. వారు తమ శరాఘాతాలతో ముష్రిక్కు సేనను దైవప్రవక్త (సల్లం) దాపుకు రాకుండా అడ్డుకున్నారు.
'సఅద్ బిన్ అబీ వికాస్ (రజి)' గారి విషయానికొస్తే, దైవప్రవక్త (సల్లం), ఆయనకు తన తూణీరం నుండి బాణాలు అందిస్తూ, *"బాణాలు వదలండి! నా తల్లితండ్రులు మీపై అర్పితం."* అంటున్నారు. దైవప్రవక్త (సల్లం) ఇప్పటి వరకు తన తల్లితండ్రులను అర్పించే మాట మరే సందర్భంలోనూ అనలేదు. దీని ద్వారా 'హజ్రత్ సఅద్ బిన్ అబీ వికాస్ (రజి)' గారి సామర్థ్యం ఎంతో అర్థమవుతుంది.
ఇక 'హజ్రత్ తల్హా (రజి)' గారి విషయానికొస్తే, ఆయన ఘనకార్యం ఎలాంటిదో 'నిసాయి' గ్రంథంలో ఉటంకించిన ఉల్లేఖనం ద్వారా తెలుస్తుంది. ఈ గ్రంథంలో 'హజ్రత్ జాబిర్ (రజి)' గారు, వ్రేళ్ళపై లేక్కబెట్టేటంత మంది సహచరులతో ఉన్నప్పుడు ముష్రిక్కులు దైవప్రవక్త (సల్లం) పై దాడి చేసిన వైనాన్ని వివరించారు. ఆయన (రజి) ఉల్లేఖనం ఇలా ఉంది....; ↓
"ముష్రిక్కులు దైవప్రవక్త (సల్లం)పై దాడికి దిగినతోడనే ఆయన (సల్లం), *"వారిని ఎవరు అడ్డగించగలరు?"* అని అనగా, హజ్రత్ తల్హా, *"నేను సిద్ధంగా ఉన్నాను దైవప్రవక్తా (సల్లం)"* అని అన్నారు. ఆ తరువాత 'జాబిర్ (రజి)' అన్సారులు ముందుకు రావడం, ఒక్కోకరుగా షహీద్ అయిన తీరును వివరించారు." (ఆ వివరాలను మనం ఇది వరకే చెప్పుకున్నాం.)
_'హజ్రత్ జాబిర్ (రజి)' గారి కథనం ప్రకారం....; ↓_
"వీరందరూ షహీదులు (అమరులు) అయిన పిదప 'హజ్రత్ తల్హా (రజి)' ముందుకు వచ్చారు. ఆయన పదకొండు మందికి ధీటుగా ఒక్కరే యుద్ధం చేశారు. చివరికి, చేతిపై తగిలిన ఖడ్గ ప్రహారానికి ఆయన చేతివ్రేళ్ళు తెగిపోయాయి. అలా వ్రేళ్ళు తెగగానే ఆయన నోట ఓ బాధాకరమైన శబ్దం వెలువడింది *శ్శ్ శ్శ్* అని. అది విన్న దైవప్రవక్త (సల్లం), ఆయనతో, *"నీవే గనక 'బిస్మిల్లాహ్' అని ఉంటే దైవదూతలు నిన్ను ఎత్తుకునేవారు, ప్రజలు నిన్ను గమనించేవారు కూడా."* అన్నారు. ఆ తరువాత ముష్రిక్కులను అల్లాహ్ వెనక్కు పంపించేశాడు."
_'హాకీం' ఉల్లేఖనం ప్రకారం....; ↓_
*"ఆయన (రజి)కు ఉహద్ రోజున ముప్పై తొమ్మిది లేదా ముప్పై అయిదు గాయాలైనట్లు, ఆ గాయాల్లో చేతి మధ్య వ్రేళ్ళు మరియు చూపుడు వ్రేలు ఉన్నాయని ఉంది."*
*ఉహద్ పోరాటంలో దైవప్రవక్త (సల్లం) పై దాడి చేస్తున్న ముష్రిక్కులను అత్యంత ధైర్యసాహసాలతో ఎదుర్కొన్న 'హజ్రత్ తల్హా బిన్ ఉబైదుల్లా (రజి)' పరాక్రమం గురించి, ఆయన (రజి) యుద్ధ విధానం గురించి, ఆ తరువాత జరిగిన సంఘటనలను In Sha Allah రేపటి భాగములో....;*
_(■→ నోటిలోని మునిపళ్ళలోని పైవి, క్రిందివి రెండు దంతాలను 'సనాయా' అంటారు. అదే విధంగా పైన, క్రింద ఉన్న కుడి ఎడమలు గల రెండు దంతాలు 'రుబాయి' దంతాలు. అంటే కోర పంటికి ప్రక్కనున్న దంతాలన్నమాట.)_
_(◆→ అల్లాహ్, ప్రవక్త (సల్లం) గారి 'దుఆ'ను విన్నాడు. 'ఇబ్నె ఆయిజ్ (రజి)' గారి ఉల్లేఖనం ప్రకారం....; → *"'ఇబ్నె ఖుమా' యుద్ధానంతరం ఇంటికి వెళ్ళి తన మేకలను చూడడానికి బయలుదేరాడు. అతని మేకలు గుట్ట శిఖరంపై ఉన్నాయి. ఇతను అక్కడికి వెళ్ళగా ఓ కొండ పొట్టేలు అతనిపై దాడి చేసింది. కొమ్ములతో కుమ్మి ఆ ఎత్తైన కొండ నుంచి క్రిందికి దొర్లించింది."* (ఫత్'హుల్ బారి - 7/373)._
_తిబ్రానీ ఉల్లేఖనం ప్రకారం....; → *"అల్లాహ్ అతనిపై ఓ కొండ పొట్టేలును ఉసికొల్పాడు. అది అతణ్ణి కొమ్ములతో పొడిచి పొడిచి ముక్కలు ముక్కలుగా చేసింది."* (ఫత్'హుల్ బారి - 7/322).)_
✍🏻✍🏻 *®@£€€q* *+97433572282* ✍🏻✍🏻
*(rafeeq)*
✍🏻✍🏻 *Salman* *+919700067779* ✍🏻✍🏻
*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*
💎💎 *మా సలాం* 💎💎
─┄┅━═══✦═══━┅┄─
No comments:
Post a Comment