🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐
🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋
◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉
🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర - 237* 🛐🕋☪🕌
🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 152* 🇸🇦🇸🇦
◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉
🛡⚔ *ఉహద్ పోరాటం : - 9*⚔🛡
*విలుకాండ్ర ఘోర తప్పిదం : - - : అపజయంగా మారిన విజయం*
ఈ పరిమిత ఇస్లామీయ పటాలం, మక్కా పౌరులకు వ్యతిరేకంగా చరిత్ర పుటల్లో బద్ర్ యుద్ధ విజయానికి తీసిపోని మరో మహోన్నత విజయాన్ని నమోదు చేస్తున్న శుభ తరుణంలోనే, దైవప్రవక్త (సల్లం)చే 'జబ్లె రమాత్' పై నియమించబడిన విలుకాండ్ర అధిక సంఖ్య ఓ తప్పిదానికి పాల్పడింది. ఈ తప్పిదం వల్ల యుద్ధ ఫలితమే తారుమారైపోయింది. ముస్లిములు తీరని నష్టానికి గురైపోయారు. *అంతేకాదు, స్వయంగా దైవప్రవక్త (సల్లం) కూడా వెంట్రుకవాసిలో అమరగతిని తప్పించుకున్నారు.* బద్ర్ యుద్ధం కారణంగా ముష్రిక్కుల గుండెల్లో ముస్లిములంటే ఏర్పడ్డ భయోత్పాతం, అఘోరం, విలువ అన్నీ విలుకాండ్ర ఈ తప్పిదం వల్ల తుడుచుకు పోయినట్లయింది.
వెనుకటి పుటల్లో దైవప్రవక్త (సల్లం), విలుకాండ్రను నియమిస్తూ, *"విజయం పొందినా, అపజయం పాలైనా అన్ని పరిస్థితుల్లోనూ (మీరు) ఆ కొండను వదిలిపెట్టి పోవద్దు."* అని తాకీదు చేయడం మనకు గుర్తు ఉండే ఉంటుంది. అయినా, ఇన్ని ఆదేశాలు ఇచ్చినప్పటికీ వారు, ముస్లిములు యుద్ధ ధనాన్ని ప్రోగుచేసుకోవడం చూసి వారిలో ప్రపంచ వ్యామోహం కొంత పొడసూపింది. వారిలో కొందరు మరికొందరితో...., *''యుద్ధధనం, యుద్ధధనం! మనమే గెలిచాం. ఇక మనకు ఇక్కడేం పని."* అని చెప్పనారంభించారు.
_మరొక ఉల్లేఖనం ప్రకారం....; →_ *"అదిగో అటు చూడండి. మన సైనికులు యుద్ధధనాన్ని ఎలా ప్రోగుచేస్తున్నారో. అవిశ్వాసులు ఓడిపోయారు కదా! ఇక మనం ఎందుకు ఇక్కడ అకారణంగా పడి ఉండటం? పదండి, మనం కూడా సమరసొత్తును సేకరిద్దాం."* అన్నారు వారు.
ఈ మాటలు విన్నంతనే ఆ పటాలం కమాండరు "హజ్రత్ అబ్దుల్లా బిన్ జుబైర్ (రజి), దైవప్రవక్త (సల్లం)గారి ఆదేశాలను వారికి గుర్తు చేస్తూ...., *"దైవప్రవక్త (సల్లం) మీకు ఏ ఆదేశాలైతే ఇచ్చారో వాటిని మీరు మరిచిపోయినట్లుంది."* అని వారించడానికి ప్రయత్నం చేశారు. _వేరొక ఉల్లేఖనం ప్రకారం....; →_ (మరికొందరు దాన్ని వ్యతిరేకిస్తూ, *"దైవప్రవక్త (సల్లం) చెప్పుంది అప్పుడే మరచిపోయారా? వెనుక ఉండి మన వాళ్ళను కాపాడుతూ ఉండాలని, మన ఈ స్థానం నుంచి ఒక్క అంగుళం కూడా కదలకూడదని ఆయన (సల్లం) మనకు చెప్పలేదా?"* అన్నారు.)
అయినా కూడా ఆయన (అబ్దుల్లా - రజి) ఈ హితవుల్ని చాలా మంది పట్టించుకోకుండా...., *"దైవసాక్షి! మేము వారి దగ్గరికి తప్పకుండా వెడతాము. యుద్ధధనం నుండి మేము కొంత ప్రోగు చేసుకుంటాం."* అన్నారు. _ఇంకొక ఉల్లేఖనంలో....; →_ (కాని మొదటి వర్గం దాన్ని ఖండిస్తూ, *"ఆయన (సల్లం) చెప్పిన మాటల అంతరార్థం శత్రువులు ఓడిపోయేవరకే వర్తిస్తుంది. శత్రువులు ఓడిపోయాక కూడా మీరు ఇక్కడే ఉంటారా?"* అన్నారు.)
ఆ తరువాత నలభై మంది విలుకాండ్రు తమ యుద్ధ మోర్చాలను వదిలి యుద్ధధనం ప్రోగు చేసుకోవడానికి సైన్యంలో చొరబడ్డారు. (కొద్దిమంది తప్ప అందరూ ఆ కీలక స్థానం వదిలిపెట్టి సమరసొత్తు కోసం పరుగెత్తారు.) ఇలా ముస్లిముల వెనుక భాగం (కొండల్లో సందు) అంతా ఖాళీ అయిపోయింది. అక్కడ కేవలం 'హజ్రత్ అబ్దుల్లా బిన్ జుబైర్ (రజి)' మరియు ఆయనతోపాటు మరి తొమ్మండుగురు మాత్రమే మిగిలిపోయారు. చివరి ఆదేశం లభిస్తే అక్కడికి వెడదామని, లేనిపక్షంలో అక్కడే ఉండి పోరాడి అవసరమొస్తే ప్రాణాలను సైతం ధారపోస్తామని శపథం చేసి నిలబడ్డారు.
*ఇస్లామీయ పటాలాన్ని చుట్టుముట్టిన ముష్రిక్కు సేన : -*
ఇదివరకే మూడు మార్లు ఈ విలుకాండ్రు వలయాన్ని ఛేదించి, ముస్లిం సేన వెనుకభాగాన చేరి దాడి చేయడానికి ప్రయత్నించిన 'ఖాలిద్ బిన్ వలీద్' ఈ స్వర్ణావకాశాన్ని ఎలా చేజార్చుకుంటాడు. ఆయన అదునుచూసి ఎంతో వేగంగా చుట్టూ తిరిగి కొన్ని నిమిషాల్లోనే 'హజ్రత్ అబ్దుల్లా బిన్ జుబైర్ (రజి)' మరియు ఆయన సహచరుల్ని చంపేసి, ఇస్లామీయ సైనిక పటాలంపై వెనుక నుండి దాడి చేయనే చేశారు. ఆయన నడుపుతున్న అశ్వికదళం ఒక్కసారే నినాదం చేయడంవల్ల, ఓడి అలసిసొలసిపోయి ఉన్న ముష్రిక్కు సేనలో ఓ క్రొత్త ప్రాణం వచ్చినట్లయింది. వారు కూడా వెనుదిరిగి ముస్లిములపై విరుచుకుపడ్డారు.
ఇటు, 'బనూ హారిస్' వంశానికే చెందిన ఓ స్త్రీ 'ఉమ్రా బిన్తె అల్కమా' వెంటనే క్రిందపడిపోయి ఉన్న ముష్రిక్కుల పతాకాన్ని పైకి ఎత్తి పట్టుకుంది. ఇంకేముంది! చెల్లాచెదురు అయిపోయిన ముష్రిక్కులు దానిచుట్టూ చేరనారంభించారు. వారు అలా జెండా వైపునకు వస్తూ ఒకరినొకరు కేకలేసి పిలువడం వలన ముస్లిములకు వ్యతిరేకంగా ఓ పెద్ద సేన తయారైపోయింది. అక్కడ నుండి వారు స్థిరంగా ఉంటూ ముస్లిములను ఎదుర్కోనారంభించారు. ఇప్పుడు ముస్లిములు, ముందూ వెనుకా ముష్రిక్కులచే చుట్టుముట్టబడి, తిరుగలి రెండు రాళ్ళ నడుమ నలుగుతున్న గింజల్లా మారిపోతున్నారు.
*→ ఇస్లామీయ సైన్యంపై శత్రువులు రెండోసారి దాడి చేయడం గురించి మరొక సీరత్ కితాబ్ ప్రకారం : -*
యుద్ధమైదానం వదిలి పారిపోయే అవిశ్వాసుల్లో 'ఖాలిద్ బిన్ వలీద్' కూడా ఉన్నాడు. అలా పారిపోతుంటే కాకతాళీయంగా అతని దృష్టి, (ఖాళీ అయిన ఆ) కనుమపై పడింది. చూస్తే కొందరు విలుకాండ్రు తప్ప కనుమంతా దాదాపు ఖాళీగా ఉంది. తక్షణమే అతను తన ఆధీనంలో ఉన్న కొంత సైన్యంతో కొండ చుట్టి కనుమ దగ్గరికి చేరుకున్నాడు. అదే సమయంలో ఎడం పక్షం నాయకుడు 'ఇక్రమా' కూడా తన సైనికులతో వచ్చి 'ఖాలిద్'కు తోడయ్యాడు. వీరంతా కలసి కనుమ దగ్గరున్న కొద్దిమంది ముస్లిం విలుకాండ్రపై మెరుపుదాడి చేశారు. 'హజ్రత్ అబ్దుల్లా బిన్ జుబైర్ (రజి)', ఆయన అనుయాయులు అత్యంత ధైర్య శౌర్యాలతో శత్రువుల్ని ఎదుర్కొని చివరికి అమరగతులయ్యారు.
ఇప్పుడు కనుమ ఖాళీ అయి దారి ఏర్పడింది. అది గమనించిన శత్రుసైన్యం కనుమ గుండా ముందుకు పురోగమించింది. ముస్లిం సైనికులు సమరసొత్తు సేకరించు కోవడంలో పూర్తిగా లీనమైపోయారు. వారు, శత్రువులు ఎప్పుడో పారిపోయారన్న భ్రమలోనో ఇంకా పడి ఉన్నారు.
అవిశ్వాసులు చాలా దగ్గరగా వచ్చి ఉజ్జాకి జై! హుబల్ కి జై!! అని పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ముస్లింల మీద విరుచుకుపడ్డారు. ఈ హఠాత్పరిణామానికి ముస్లిం యోధులు బిత్తరపోయారు. వారు ఆయుధాలు తీసి ఎక్కు పెట్టే లోపుగానే అవిశ్వాసులు విజృంభించి వారిని సునాయాసంగా హతమార్చడం ప్రారంభించారు. *←*
_ఈ సందర్భాన్ని దివ్య ఖుర్ఆన్ ఈ విధంగా వర్ణించింది....; ↓_
*"అల్లాహ్ మీకు చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపాడు. అప్పుడు మీరు ఆయన అనుజ్ఞతో వారిని వధించసాగారు. అయితే ఆఖరికి మీరు పిరికితనం చూపారు. కార్యనిర్వహణలో విభేదించుకున్నారు. మీరు ఇష్టపడే వస్తువును ఆయన మీకు చూపేసరికి, మీరు అవిధేయతకు ఒడిగట్టారు. మీలో కొందరు ప్రపంచం కోసం ప్రాకులాడగా, మరికొందరు పరలోకాన్ని కోరుకున్నారు. అందువల్ల అల్లాహ్ మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం, మిమ్మల్ని వారి నుంచి వెనక్కి మళ్ళించాడు. అయినా ఆయన మిమ్మల్ని క్షమించాడు. యదార్థానికి అల్లాహ్ విశ్వాసుల పట్ల గొప్ప అనుగ్రహమూర్తి." (ఖుర్ఆన్ 3:152).*
*మహాప్రవక్త (సల్లం) తీసుకున్న ప్రమాదభరితమైన మరియు సాహసోపేతమైన నిర్ణయం : -*
ఆ సమయంలో దైవప్రవక్త (సల్లం) వెనుకా★ ముందూ ఉన్న తన తొమ్మండుగురు☆ సహాబాల నడుమ ఉన్నారు. ఆయన (సల్లం), ముస్లిములు శత్రువును వెనక్కు నెట్టడం, శత్రుసేన ఓడిపోయి వెనక్కి పారిపోవడం చూస్తున్నారు. హఠాత్తుగా ఆయన (సల్లం), 'ఖాలిద్ బిన్ వలీద్' అశ్వికదళం తమ వెనుకకు రావడం చూశారు. ఇప్పుడు దైవప్రవక్త (సల్లం) ముందు రెండే రెండు మార్గాలున్నాయి.
*శత్రువు చుట్టుముట్టిన తన సేనను వారి అదృష్టం మీద వదిలిపెట్టి ఆయన (సల్లం), తన వెంట ఉన్న వారితో సహా కలసి ఏదైనా సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోవడం ఒక మార్గం. అయితే రెండో మార్గం, తన ప్రాణాలను సైతం ప్రమాదంలో పడవేసి, ఓ పటిష్టమైన శక్తిని తయారు చేయడానికి సహాబా (రజి)లను తమ వద్దకు పిలిచి ముష్రిక్కుల వలయాన్ని ఛేదించి తమ సేనను ఉహద్ కొండ పైకి తీసుకువెళ్ళే మార్గం చూపెట్టడం.*
కఠిన పరీక్షకు సంబంధించిన ఈ కీలకమైన తరుణంలో దైవప్రవక్త (సల్లం) గారి యుద్ధకౌశల్యం, సాటిలేని ధైర్యసాహసం తీరు ఎలాంటిదో ద్యోతకమవుతాయి. ఎందుకంటే, ఆయన (సల్లం) తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోయే బదులుగా, తన ప్రాణాన్ని ప్రమాదంలో పడవేసి సహాబా (రజి) గార్ల ప్రాణాలను కాపాడే నిర్ణయం గైకొన్నారు.
కాబట్టి 'ఖాలిద్ బిన్ వలీద్' సైన్యాన్ని చూడగానే ఆయన (సల్లం) పెద్దగా అరుస్తూ...., *"ఓ దైవదాసుల్లారా! ఇటు రండి"* అని పిలిచారు. ఆయన (సల్లం)కు తెలుసు, ఈ పిలుపు ముస్లిములకంటే ముందు ముష్రిక్కులకే వినపడుతుందన్న విషయం. జరిగింది కూడా అదే.
ఇది విన్న ముష్రిక్కులకు దైవప్రవక్త (సల్లం) అక్కడనే ఉన్నారన్న విషయం తెలిసిపోయింది. కాబట్టి ముష్రిక్కుల పటాలం ఒకటి ముస్లిములకంటే ముందే దైవప్రవక్త (సల్లం) దగ్గరకు చేరుకుంది. తక్కిన గుర్రపు రౌతులు వేగంగా ముస్లిములను చుట్టుముట్టనారంభించారు.
_ఇప్పుడు, ఈ రెండు యుద్ధ రంగాలను వేరువేరుగా తెలుసుకుందాము ....; ↓_
*చెల్లాచెదరవుతున్న ముస్లిములు : -*
ముస్లిములు దిగ్బంధంలోనికి వచ్చాక వారి ఓ వర్గం వారి మెదళ్ళే మొద్దుబారిపోయాయి. కేవలం ప్రాణాలు ఎలా దక్కించుకోవాలా అన్నదే వారి ఆలోచన. కాబట్టి వారు యుద్ధ మైదానాన్ని వదిలిపెట్టి పారిపోయారు కూడా. వెనుక ఏం జరుగుతోందో వారికి తెలియదు. వారిలో ఒక వర్గం వారు పారిపోయి మదీనాలో ఆశ్రయం కూడా పొందారు. కొందరు కొండలపైకి ఎక్కేశారు. మరో వర్గం వెనక్కు తిరిగి ముష్రిక్కు సేనలోకి పోయి కలగాపులగమైపోయింది. ఒకరికి మరొకరి ధ్యాసే లేకుండా పోయింది. దీని ఫలితంగా స్వయంగా ముస్లిములే ముస్లిముల చేతిలో హతులవుతున్నారు.
*సహీ బుఖారీలో 'హజ్రత్ ఆయిషా (రజి)' గారి ఉల్లేఖనం ప్రకారం....; ↓*
*In Sha Allah రేపటి భాగములో....; →*
_(★→ దీనికి ఆధారం దివ్య ఖుర్ఆన్ లోని ఆయత్ (అర్థం : ప్రవక్త మిమ్మల్ని మీ వెనుక వైపు నుండి పిలుస్తున్నాడు అన్నది.))_
_(☆→ సహీ ముస్లిం - 2/107లోని ఉల్లేఖనం ప్రకారం, దైవప్రవక్త (సల్లం) ఏడుగురు అన్సారులు మరియు ఇద్దరు ఖర్షీ (ముహాజిర్) సహాబాల నడుమ ఉన్నారు.)_
✍🏻✍🏻 *®@£€€q* *+97433572282* ✍🏻✍🏻
*(rafeeq)*
✍🏻✍🏻 *Salman* *+919700067779* ✍🏻✍🏻
*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*
💎💎 *మా సలాం* 💎💎
─┄┅━═══✦═══━┅┄─
No comments:
Post a Comment