236

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉

🕌☪🕋🛐      *ఇస్లాం చరిత్ర - 236*       🛐🕋☪🕌

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 151*      🇸🇦🇸🇦

◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉

          🛡⚔ *ఉహద్ పోరాటం : - 8*⚔🛡

*హజ్రత్ హమ్'జా (రజి) గారి షహాదత్ (అమరగతి పొందడం) : -*

*హజ్రత్ హమ్'జా (రజి) గారి హంతకుని పేరు 'వహ్షీ బిన్ హరబ్'. హమ్'జా (రజి) ఎలా వధించబడ్డారో అతని నోటనే విందాం....; ↓*

→"నేను, 'జుబైర్ బిన్ ముత్యిమ్'కు బానిసగా ఉండేవాణ్ణి. జుబైర్ పినతండ్రి 'తుఅయిమా బిన్ అద్దీ' బద్ర్ యుద్ధంలో చంపబడ్డాడు. ఖురైషీయులు, ఉహద్ యుద్ధం కోసం బయలుదేరి వెళ్ళేటప్పుడు 'జుబైర్ బిన్ ముత్యిమ్', నాతో...., *"వహ్'షీ! నా పినతండ్రి చావుకు బదులుగా నీవు ముహమ్మద్ (సల్లం) పినతండ్రి హమ్'జా (రజి)ను చంపితే, నిన్ను బానిసత్వం నుంచి విముక్తి కలిగించి స్వతంత్రుణ్ణి చేస్తాను."* అని అన్నాడు.

జుబైర్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవడానికి, నేను కూడా ఖురైష్ సైన్యం వెంట బయలుదేరాను.

నేను 'నీగ్రో' బానిసను. నీగ్రోల మాదిరిగా బరిశె విసరడంలో మంచి నైపుణ్యం గలవాణ్ణి. నా గురి తప్పడం చాలా అరుదు. యుద్ధం తారస్థాయికి చేరినప్పుడు, నేను నా బరిశెను చేతబట్టి ''హజ్రత్ హమ్'జా (రజి)'' కోసం ఎదురుచూడనారంభించాను. ఎట్టకేలకు ఆయన (రజి) భీకరంగా యుద్ధం చేస్తూ నా కంటబడ్డారు. అప్పుడు ఆయన (రజి) వాలకం ఓ బూడిద రంగు గల ఒంటెలా ఉంది. సైనికులను చెల్లాచెదురు చేస్తూ సంహరిస్తూ పోతున్నారు. ఆయన (రజి) ముందు ఎవరూ నిలిచేటట్లు అగుపడడం లేదు.

దైవసాక్షిగా చెబుతున్నాను! నేను ఆయన (రజి)ను సంహరించడానికి ఓ చెట్టో లేదా ఓ రాతి బండ చాటున ఒరిగి దగ్గరకు రాగానే దాడి చేయాలని సిద్ధపడుతున్నాను. ఆ సమయంలోనే 'సబా బిన్ అబ్దుల్ ఉజ్జా' నా కంటే ముందుకు ఉరికి హమ్'జా (రజి) ముందుకు వెళ్ళాడు. ఆయన (రజి) అతణ్ణి హెచ్చరిస్తూ అతని తలపై తన కరవాలంతో వ్రేటు వేయనేవేశారు. ఆ దెబ్బకు అతని తల మొండెం నుండి వేరై క్రిందపడిపోయింది.

ఆ సమయంలోనే నేను నా బరిశెను గురిపెట్టి హమ్'జా (రజి) వైపునకు విసిరాను. ఆ బరిశె, ఆయన నాభి క్రింద తగిలి కాళ్ళ సందుల్లో నుండి బయటకు వచ్చేసింది. ఆయన నన్ను చూసి నా వైపునకు రావడానికి ప్రయత్నం చేశారుగాని శక్తి ఉడిగి క్రిందపడిపోయారు. ఆయన్ను నేను అదే పరిస్థితిలో వదిలివేశాను.

ఆ తరువాత ఆయన (రజి) ప్రాణాలు ఎగిరిపోయిన తరువాత నా బరిశెను బయటకు లాగి శుభ్రం చేసి నా సైన్యంలోకి వచ్చి కూర్చుండిపోయాను నా పని పూర్తి అయిపోయినట్లుగా. నాకు కావలసింది ఆయన ఒక్కడే. ఆయన్ను నేను చంపింది, కేవలం బానిసత్వ బంధాలను త్రెంచుకొని స్వాతంత్ర్యం పొందడానికే. మక్కాకు వచ్చిన తర్వాత నాకు ఆ స్వాతంత్ర్యం లభించింది కూడా."←★

_(★→ హమ్'జా (రజి)ని చంపిన వహ్షీ, తాయెఫ్ యుద్ధం జరిగిన తరువాత ఇస్లాం స్వీకరించారు. ఆయన హమ్'జా (రజి)ని చంపిన ఆ బరిశెతోనే, అబూ బక్ర్ (రజి) ఖిలాఫత్ కాలంలో, యమామా యుద్ధం సందర్భంగా 'ముసైలమా కజ్జాబ్'ను హతమార్చారు. రోమనులకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధం "యర్'మోక్"లోనూ పాల్గొన్నారు.)_

*యుద్ధంలో ముస్లిముల ఆధిక్యత : -*

"హజ్రత్ హమ్'జా (రజి)" గారు అమరగతినొందిన ఫలితంగా ముస్లిములకు తీరని నష్టం వాటిల్లింది. అయినప్పటికీ విజయం ముస్లిముల వైపే మొగ్గుజూపుతోంది. హజ్రత్ అబూ బక్ర్ (రజి), హజ్రత్ ఉమర్ (రజి), హజ్రత్ అలీ (రజి), జుబైర్ బిన్ ముస్అబ్ బిన్ ఉమైర్, తల్హా బిన్ ఉబైదుల్లా, అబ్దుల్లా బిన్ హజష్, సఅద్ బిన్ ముఆజ్, సఅద్ బిన్ ఉబాదా, సఅద్ బిన్ రబీ (రజి)లు ఇంకా నజ్ర్ బిన్ అవస్ (రజి) వగైరాలు చూపిస్తున్న ధైర్యసాహస పరాక్రమాల కారణంగా ముష్రిక్కులు నిలువలేకపోతున్నారు. వారి ధైర్యం దెబ్బతింటోంది. వారి శక్తి పూర్తిగా సన్నగిల్లుతోంది.

*భార్య కౌగిలింపును వదలించుకొని కరవాలపు నీడల్లోకి దుమికిన యోధుడు : -*

మనం ఇప్పుడు ఆ యోధుల్లో మరొకరి యుద్ధ పటిమను కూడా వీక్షిద్దాం. ఆ యోధుడు 'హజ్రత్ హంజలా అల్ గసీల్ (రజి)'.

ఆయన (రజి) యుద్ధం రోజున ఓ వినూత్న ఉత్సాహంతో యుద్ధరంగంలో ప్రవేశించారు. _(మనం వెనుకటి పుటల్లో చర్చించుకున్న 'ఫాసిఖ్' బిరుదాంకితుడు 'అబూ ఆమిర్' కుమారుడు ఈయన.)_

'హజ్రత్ హంజలా (రజి)'కు యుద్ధం జరిగే రోజుల్లోనే పెళ్ళయింది. యుద్ధం కోసం దైవప్రవక్త (సల్లం) గారి పిలుపు అందినప్పుడు ఆయన తన భార్య ఆలింగనంలో ఉన్న వ్యక్తి. ఆ పిలుపు వినగానే అదే పరిస్థితిలో జిహాద్ కోసం బయలుదేరి వచ్చారు. ముష్రిక్కులతో యుద్ధం ప్రారంభం కాగానే వారి వరసల్ని చీల్చుకుంటూ ఆ సేనకు సర్వసైన్యాధ్యక్షుడు అయిన ''అబూ సుఫ్'యాన్'' వరకు వెళ్ళగలిగారు. అతణ్ణి అంతం చేద్దాం అని అతనిపై కరవాలం ఎత్తారో లేదో 'షద్దార్ బిన్ అవస్' అనేవాడు హంజలా (రజి)ని చూశాడు. వెంటనే ఆయనపై దాడి చేసి నేలకూల్చాడు. 'హజ్రత్ హంజలా (రజి)' అక్కడనే ప్రాణాలు వదిలి అమరగతిని పొందారు.

*విలుకాండ్ర ఘనకార్యం : -*

_(ఉహద్ యుద్ధ మైదానం తూర్పు వైపున కొండల్లో ఓ చిన్న సందు ఉంది. శత్రువులు అటునుంచి వచ్చి దాడి చేసే ప్రమాదం ఉన్నందున, దైవప్రవక్త (సల్లం) అక్కడ యాభై మంది విలుకాండ్రను నియమించారన్న విషయం వెనుకటి పుటల్లో మనం చదువుకున్నాం ↓)_

జబలె రమాత్ పై ఏ విలుకాండ్రనైతే మహాప్రవక్త (సల్లం) నియమించారో వారు యుద్ధాన్ని ముస్లిములకు అనుకూలంగా మార్చడంలో ప్రముఖ పాత్రను పోషించారు.

'ఖాలిద్ బిన్ వలీద్' నడుపుతున్న మక్కా అశ్వికదళం సైనికులు, 'అబూ ఆమిర్ ఫాసిఖ్' సహాయంతో ఇస్లామీయ సైన్యపు ఎడమ పార్శ్వాన్ని బీటలువార్చి ముస్లిముల వెనుక భాగానికి చేరి వారిని ఛిన్నాభిన్నం చేసి ఓడించడానికి మూడుసార్లు విఫల ప్రయత్నం చేసింది. ఆ మూడు మార్లు కూడా ముస్లిమ్ విలుకాండ్రు ఆ పటాలాన్ని తమ బాణాల వర్షంతో అడ్డుపడి ఆ ప్రయత్నాన్ని విఫలం చేశారు.

*ముష్రిక్కుల ఓటమి : -*

కొంతకాలం వరకు భీకర సంగ్రామం జరుగుతూనే ఉంది. ముస్లిముల ఈ చిన్న సేన, యుద్ధగమనంపై పూర్తి ఆధిక్యతను సంపాదిస్తోంది. చివరికి ముష్రిక్కుల ధైర్యం సన్నగిల్లి వారి వరుసలు కుడి ఎడమలుగా, ముందు వెనుకలుగా చెల్లాచెదరవుతున్నాయి. అంటే, మూడు వేల మంది ముష్రిక్కు సైనికులు, ఏడు వందలు కాదు, ముప్పై వేల మంది ముస్లిముల సైన్యంతో తలపడినట్లుగా అగుపడుతోంది.

ఇటు ముస్లిములు, విశ్వాసం, నమ్మకం మరియు పరాక్రమానికి మారుపేరుగా ఖడ్గ విన్యాసాలు సాగిస్తున్నారు.

ఖురైషులు, ముస్లిముల ఎడతెగని ఈ దాడులను అడ్డుకోవడానికి తమ శక్తినంతా వెచ్చిస్తూనే ఉన్నారు. అయినా వారిలో నిరుత్సాహం, చేతకానితనం చోటు చేసుకుంటున్నాయి. 'సువాబ్' హత్య తరువాత యుద్ధాన్ని కొనసాగించడానికి, తమ పడిపోయిన జెండా దగ్గరకు చేరి దానిని ఎత్తుకునే ధైర్యం కూడా ఎవ్వరూ చేయలేకపోతున్నారు. ఆ పరిస్థితిలోనే వారు వెనక్కు తగ్గనారంభించారు. ఆ తరువాత పారిపోయే ప్రయత్నంలోపడ్డారు. పగ తీర్చుకోవడానికి, గౌరవమర్యాదలను నిలబెట్టుకోవడానికి వారు ఏ ప్రగల్భాలనైతే పలికారో, వాటన్నింటినీ మరిచిపోయి యుద్ధరంగం నుండి పారిపోతున్నారు.

_ఆ సమయంలో అల్లాహ్ ముస్లింలకు తన సహాయాన్ని అందించి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇబ్నె ఇస్'హాక్ కథనం ఇలా ఉంది....; ↓_

*"ముస్లిములు తమ కరవాలాలతో ముష్రిక్కులను వధించిన తీరు ఎలాంటిదీ అంటే, వారు తమ శిబిరాలకు కూడా చేరకుండా దూరంగా పారిపోయారు. అలా పారిపోవడం వలన వారికి పూర్తి ఓటమిని చవిచూసినట్లయింది."*

_నా తండ్రి ఆ సమయంలో ఇలా అన్నారని 'అబ్దుల్లా బిన్ జుబైర్' ఉల్లేఖిస్తున్నారు....; ↓_

*"దైవసాక్షి! 'ఉత్బా' కుమార్తె 'హింద్' మరియు ఆమె తోటి స్త్రీలంతా కాలిపిక్కెలు అగుపడేటట్లు కట్టుకున్న వస్త్రాలను చేతితో పైకెత్తుకొని పరుగులు తీస్తున్నారు. వారిని బంధించడం అప్పుడు సులభం."*

_సహీ బుఖారీలో 'హజ్రత్ బరా బిన్ ఆజిబ్ (రజి)' గారి ఓ ఉల్లేఖనం ఇలా ఉంది....; ↓_

*"ముష్రిక్కులతో మాకు పోరు జరిగినప్పుడు వారి సైన్యంలో త్రొక్కిసలాట ప్రారంభం అయింది. చివరికి స్త్రీలు కూడా తమ వస్త్రాలను చేత్తో పైకెత్తుకొని వేగంగా పరిగెడుతున్నారు. వారు పరుగెత్తేటప్పుడు వారి కాళ్ళ పట్టీలు అగుపడుతున్నాయి."*

ఎటూ పాలుపోక శత్రుసైన్యం పారిపోతున్న ఆ తరుణంలో ముస్లిములు వారిపై ఖడ్గ ప్రహారాలు చేస్తూ, వారి సొమ్మును పోగుచేస్తూ వెంటాడుతున్నారు.

*విలుకాండ్ర ఘోర తప్పిదం : - - : అపజయంగా మారిన విజయం*

ఈ పరిమిత ఇస్లామీయ పటాలం, మక్కా పౌరులకు వ్యతిరేకంగా చరిత్ర పుటల్లో బద్ర్ యుద్ధ విజయానికి తీసిపోని మరో మహోన్నత విజయాన్ని నమోదు చేస్తున్న శుభ తరుణంలోనే, దైవప్రవక్త (సల్లం)చే 'జబ్లె రమాత్' పై నియమించబడిన విలుకాండ్ర అధిక సంఖ్య ఓ తప్పిదానికి పాల్పడింది. ఈ తప్పిదం వల్ల యుద్ధ ఫలితమే తారుమారైపోయింది. ముస్లిములు తీరని నష్టానికి గురైపోయారు. బద్ర్ యుద్ధం కారణంగా ముష్రిక్కుల గుండెల్లో ముస్లిములంటే ఏర్పడ్డ భయోత్పాతం, అఘోరం, విలువ అన్నీ విలుకాండ్ర ఈ తప్పిదం వల్ల తుడుచుకు పోయినట్లయింది.

వెనుకటి పుటల్లో దైవప్రవక్త (సల్లం), విలుకాండ్రను నియమిస్తూ, *"విజయం పొందినా, అపజయం పాలైనా అన్ని పరిస్థితుల్లోనూ (మీరు) ఆ కొండను వదిలిపెట్టి పోవద్దు."* అని తాకీదు చేయడం మనకు గుర్తు ఉండే ఉంటుంది. అయినా, ఇన్ని ఆదేశాలు ఇచ్చినప్పటికీ వారు, ముస్లిములు యుద్ధ ధనాన్ని ప్రోగుచేసుకోవడం చూసి వారిలో ప్రపంచ వ్యామోహం కొంత పొడసూపింది. వారిలో కొందరు మరికొందరితో...., *''యుద్ధధనం, యుద్ధధనం! మనమే గెలిచాం. ఇక మనకు ఇక్కడేం పని. (అదిగో అటు చూడండి. మన సైనికులు యుద్ధధనాన్ని ఎలా ప్రోగుచేస్తున్నారో. అవిశ్వాసులు ఓడిపోయారు కదా! ఇక మనం ఎందుకు ఇక్కడ అకారణంగా పడి ఉండటం? పదండి, మనం కూడా సమరసొత్తును సేకరిద్దాం.)"* అని చెప్పనారంభించారు.

ఈ మాటలు విన్నంతనే ఆ పటాలం కమాండరు వారిని వారించడానికి ప్రయత్నం చేశారు. అయినా కూడా ఆయన హితవుల్ని చాలా మంది పట్టించుకోకుండా, కొద్దిమంది తప్ప అందరూ ఆ కీలక స్థానం వదిలిపెట్టి సమరసొత్తు కోసం పరుగెత్తారు.

ఇలా ముస్లిముల వెనుక భాగం (కొండల్లో సందు) అంతా ఖాళీ అయిపోయింది.

ఆ తరువాత, యుద్ధమైదానం వదిలి పారిపోతున్న అవిశ్వాసుల్లో 'ఖాలిద్ బిన్ వలీద్' కూడా ఉన్నాడు. అలా పారిపోతుంటే కాకతాళీయంగా అతని దృష్టి, ఖాళీ అయిన ఆ కనుమపై పడింది. ఈ దారి గుండా ముస్లిం సేనలోకి ప్రవేశించి, దాడి చేయాలన్న సంకల్పంతో ముందుకు కదిలాడు.

*↑ ఇందులోని వివరణను, ఆ తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగములో....; →*

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment