🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐
🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋
◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉
🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర - 234* 🛐🕋☪🕌
🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 149* 🇸🇦🇸🇦
◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉
🛡⚔ *ఉహద్ పోరాటం : - 6*⚔🛡
*జెండాను రక్షించే హోదా : - - : తన ఎత్తుగడలో సఫలీకృతుడైన అబూ సుఫ్'యాన్*
యుద్ధ పతాకం 'బనూ అబ్దుద్దార్' తెగవారికి చెందిన ఓ చిన్న వర్గం చేతిలో ఉంది. ఈ జెండాను రక్షించే హోదా, బనూ అబ్దె మునాఫ్, ఖుస్సై నుండి వారసత్వంలో పొందిన హోదాలను పంచినప్పటి నుండే వారికి దక్కి ఉంది. తాతముత్తాతల నుండి వచ్చే సంప్రదాయం ప్రకారం ఇంకెవ్వరూ ఈ హోదా గురించి కలహించుకోడానికి కూడా వీల్లేదు.
కాని, అబూ సుఫ్'యాన్, బద్ర్ యుద్ధం రోజున జరిగిన సంఘటనను మననం చేసుకున్నాడు. ఆరోజు ఆ జెండా ఎత్తుకొని ఉన్న 'నజ్ర్ బిన్ హారిస్' బంధీ అయితే, ఖురైష్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చిందో అతనికి కళ్ళకు కట్టినట్లు అగుపించింది. ఈ విషయం గుర్తుకురాగానే, 'బనూ అబ్దుద్దార్' తెగవారి కోపాన్ని మరింత రెచ్చగొట్టడానికి అబూ సుఫ్'యాన్ ఇలా అన్నాడు....; ↓
*"ఓ అబ్దుద్దార్ సంతానమా! బద్ర్ రోజున మీరు మన జెండాను ఎత్తుకొని ఉండగా, మనం ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వచ్చిందో మీకు బాగా తెలుసు. యదార్థం ఏమిటంటే, సేనపై పతాకం మాధ్యమంగానే దెబ్బపడుతుంది. జెండా పడిపోతే సేన చెల్లాచెదురైపోతుంది. కాబట్టి, ఈసారి అయినా మీరు జెండాను సక్రమంగా రక్షించండి. లేదంటారా, ఈ జెండాను వదిలేసి వైదొలగండి. దీన్ని ఎవరికివ్వాలో మేము ఆలోచిస్తాము."* అని అన్నాడు.
ఈ సంభాషణ ద్వారా అబూ సుఫ్'యాన్ లక్ష్యం నెరవేరినట్లయింది. అతను తన ఎత్తుగడలో సఫలీకృతుడయ్యాడు. అబూ సుఫ్'యాన్ మాటలు విని వారు మండిపోయారు. అతణ్ణి బెదిరిస్తూ అతనిపై పడి కొట్టేటంత పౌరుషంతో ఊగిపోయారు. ఆ తెగవారు అతణ్ణి సంబోధిస్తూ...., *"ఏమిటీ! జెండాను నీకివ్వడమా? రేపు యుద్ధం జరగనీ చూద్దువు గాని మా తడాఖా."* అని ప్రతిజ్ఞ చేశారు. యుద్ధం ప్రారంభం అయిన తరువాత నిజంగానే వారు తమ ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నారు. వారిలోని ఒక్కొక్కడూ ప్రాణాలు వదిలినంత మట్టుకు ఆ జెండాను క్రింద పడనీయలేదు.
*ఖురైషుల రాజకీయ ఎత్తుగడ : -*
యుద్ధం ఆరంభానికి ముందు ఖురైషులు ముస్లిములను చీల్చడానికిగాను, వారిలో మనస్పర్థలు ఏర్పడడానికిగాను ప్రయత్నం చేయడం జరిగింది. దీని కోసం అబూ సుఫ్'యాన్ అన్సారుల వద్దకు తన ఈ సందేశాన్ని పంపించాడు....; ↓
*"మీరు, మాకు, మా పినతండ్రి కుమారుడు అయిన ముహమ్మద్ (సల్లం)కు నడుమన అడ్డులేకుండా తొలగిపోండి. అలా చేస్తే మేము మీ జోలికి రాము. మీతో యుద్ధం చేసే అవసరం మాకు లేదు."* అనే సందేశాన్ని పంపించాడు.
కాని, ఏ విశ్వాసం ముందు పర్వతాలు సైతం నిలువలేవో, ఆ విశ్వాసం ముందు ఈ ఎత్తుగడ ఎలా పారుతుంది? కాబట్టి అన్సారులు దానికి ధీటైన సమాధానం చెప్పి ఆ సందేశాన్ని ఖండించిపారేశారు.
*ఖురైషుల మరో ఎత్తుగడ : -*
ఇక యుద్ధ సమయం రానే వచ్చింది. ఇరుపక్షాల సైన్యాలు మరీ దగ్గరకు వచ్చేశాయి. అప్పుడు ఖురైషులు మరో ఎత్తుగడ పన్నారు. అంటే, వారిలోని ఓ నీచుడు "అబూ ఆమిర్" ముస్లిముల ఎదురుగా వచ్చాడు. అతని అసలు పేరు 'అబ్దె అమ్రూ ఇబ్నె సైఫీ'. అతణ్ణి 'రాహిబ్' అని కూడా పిలిచేవారు. అయితే, మహాప్రవక్త (సల్లం) అతని పేరు 'ఫాసిఖ్'గా పెట్టి ఉన్నారు.
ఇతను అజ్ఞాన కాలంలో అవస్ తెగకు సర్దారుగా ఉండేవాడు. కాని, ఇస్లాం ప్రాభవం తరువాత ఇతనికి ఇది కంటకంగా తయారయింది. మహాప్రవక్త (సల్లం)కు వ్యతిరేకంగా బహిరంగ ప్రచారం చేయనారంభించినవాడు. అతను మదీనా నుండి బయలుదేరి ఖురైషుల వద్దకు వచ్చాడు. వారిని, దైవప్రవక్త (సల్లం)కు వ్యతిరేకంగా పురికొల్పి యుద్ధానికి సన్నద్ధం చేసిన వ్యక్తి ఇతను. యుద్ధ సమయంలో అతని జాతి అతణ్ణి చూడగానే ముస్లిం సేనను వదిలేసి తనను వచ్చి కలుస్తుందని వారికి నమ్మబలికినవాడు. కాబట్టి, అతను ఉహద్ యుద్ధం మైదానంలో నీగ్రోలు మరియు మక్కా బానిసలను వెంటబెట్టుకొని వచ్చి ముస్లిములకు ఎదురుగా నిలబడి తన జాతికి తన పరిచయం చేస్తూ...., *"ఓ అవస్ తెగ ప్రజలారా! నేను అబూ ఆమిర్''* ని అని అన్నాడు.
దానికి సమాధానంగా వారు...., *"ఓ ఫాసిఖ్! అల్లాహ్ నీకు ఆనందం కలుగ చేయకుండుగాక!"* అని జవాబిచ్చారు.
ఇది విన్న అతను...., *"ఓహో! నేను వెళ్లిపోయిన తరువాత నా జాతి మార్గం తప్పినట్లుందే."* అనుకుంటూ వెనక్కు వెళ్లిపోయాడు. _(యుద్ధం ప్రారంభం అయిన తరువాత అతను ఖురైషుల వైపు నుండి భీకరంగా పోరాడాడు. ముస్లిములపై రాళ్ళూ రువ్వాడు)._
ఇలా ఖురైషులు, ముస్లిములను చీల్చడానికి చేసిన రెండో ప్రయత్నం కూడా విఫలం అయిపోయింది. ఈ సంఘటన ద్వారా సైనిక సంఖ్యలోనూ, ఆయుధ సంపత్తిలోనూ, ముస్లిముల కంటే ఎన్నో రెట్లు ఆధిక్యతలో ఉన్న ముష్రిక్కులు ఎంత భయోత్పాతానికి గురిఅయి ఉన్నారన్న విషయం తెలిసిపోతోంది.
*ఖురైష్ సైన్యానికి ధైర్యం నూరిపోయడంలో ఖురైష్ స్త్రీల పాత్ర : -*
ఇటు, ఖురైషులకు చెందిన స్త్రీలు కూడా యుద్ధంలో తమవంతు పాత్రను పోషించడానికి లేచి నిలబడ్డారు వీరికి అబూ సుఫ్'యాన్ భార్య 'హింద్' నాయకత్వం వహిస్తోంది. వీరు సైనిక వరుసల్లో తిరిగి డప్పు వాయిస్తూ సైనికులను ఉత్సాహపరచనారంభించారు. యుద్ధం కోసం పురికొల్పుతూ వారి పౌరుషాన్ని ఇనుమడింపజేస్తున్నారు. బరిశెల పోరాటం, ఖడ్గయుద్ధం, ముష్టిఘాతాలు మరియు శరపరంపరలను ఉధృతం చేయడానికి వారి ఉద్రేకాలను హెచ్చింప ప్రయత్నం చేస్తున్నారు. జెండా పట్టుకున్న వారిని సంబోధిస్తూ...., ↓
*"చూడండి! అబ్దుద్దార్ సంతానమా! చూడండి! మీరు వెనుక వైపున ఉండి సైన్యాన్ని రక్షించేవారు. ఖడ్గ ప్రహారాల్లో వెనుకాడబోకండి."* అని ఉత్సాహపరిచారు. మరోవైపు జాతికి పౌరుషాన్ని నూరిపోస్తూ...., *"మీరే గనక ముందుకు వెడితే, మేము మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటాం. నడువడానికి తివాచీలు పరుస్తాం. వెనక్కు మళ్ళారా! గుర్తుంచుకోండి. మేము మీ దగ్గరకు కూడా వచ్చేవారంకాము. వేరుబడిపోతాము సుమా."* అని అంటున్నారు.
*యుద్ధాగ్నికి ఆహుతి అయిన మొదటి సమిధ : -*
ఇరుపక్షాలు ఎదురెదురుగా మరీ దగ్గరకు వచ్చేశాయి. యుద్ధం ప్రథమ దశ ప్రారంభం అయింది. యుద్ధపు ప్రథమ సమిధ ముష్రిక్కుల ధ్వజవాహకుడు 'తల్హా బిన్ అబీ తల్హా అబ్దరీ'.
ఇతను ఖురైషులకు చెందిన అతి ధైర్యవంతుడైన యోధుడు. ముస్లిములు అతణ్ణి 'కబ్షుల్ కతీబా(సేన పొట్టేలు)' అనే పేరుతో పిలిచేవారు. ఇతను ఓ ఒంటెనెక్కి బయటకు వచ్చాడు. వ్యక్తిగత పోరాటం కోసం రమ్మని ముస్లిములకు సవాలు విసిరాడు.
అతని మితిమీరిన ధైర్యసాహసాలకు సాధారణ ముస్లిములు అతనికి ఎదురుగా రావడానికి జంకారు. కాని 'హజ్రత్ జుబైర్ (రజి)' ముందుకు ఉరికి అతనిని ఒక్క క్షణం కూడా తెములుకోనివ్వకుండా పులిలా అతని ఒంటెపైకి లంఘించి దానిపైకి చేరారు. అతణ్ణి తన బాహుబంధాల్లో బిగించి ఒంటెపై నుండి క్రిందికి దుమికి తన కరవాలంతో గొంతుకోసివేశారు.
భయం కలిగించే ఈ శౌర్యప్రతాప దృశ్యాన్ని చూసి మహాప్రవక్త (సల్లం) ఆనందంతో *అల్లాహు అక్బర్* అని అరిచారు. ముస్లిములంతా తిరిగి ఆ తక్బీర్ నినాదం చేశారు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లం), జుబైర్ (రజి)ను మెచ్చుకుంటూ...., *"ప్రతి ప్రవక్తకు ఓ హవారీ ఉంటాడు. నా హవారీ జుబైర్ (రజి)."* అన్నారు ★.
_(★→ ఈ సంఘటనను సీరతె హల్బియా చరిత్రకారుడు వివరించారు. హదీసుల్లో ఈ వాక్యం మరో సందర్భంగా పలికినట్లుగా ఉంది.)_
*ప్రధాన యుద్ధ కేంద్రం మరియు యుద్ధ పతాకధారుల వధ : -*
ఆ తరువాత అన్నివైపుల నుండి యుద్ధ జ్వాలలు మిన్నుముట్టాయి. యుద్ధరంగం అంతటా వధ ప్రారంభం అయింది. ముష్రిక్కుల యుద్ధ పతాకం యుద్ధకేంద్రంగా మారింది.
బనూ అబ్దుద్దార్, తమ కమాండరు 'తల్హా బిన్ అబీ తల్హా' వధ తరువాత ఒక్కొక్కరుగా యుద్ధ పతాకాన్ని కాపాడనారంభించారు. కాని వారంతా వధించబడ్డారు.
*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగములో....; →*
✍🏻✍🏻 *®@£€€q* *+97433572282* ✍🏻✍🏻
*(rafeeq)*
✍🏻✍🏻 *Salman* *+919700067779* ✍🏻✍🏻
*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*
💎💎 *మా సలాం* 💎💎
─┄┅━═══✦═══━┅┄─
No comments:
Post a Comment