🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐
🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋
◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉
🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర - 233* 🛐🕋☪🕌
🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 148* 🇸🇦🇸🇦
◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉
🛡⚔ *ఉహద్ పోరాటం : - 5*⚔🛡
(నిన్నటి భాగం కొనసాగింపుతో....)
ఆ తరువాత ప్రవక్త (సల్లం) ముందుకు కదిలి ఆ మైదానానికి చివరగా ఉన్న కొండలోయలో ప్రవేశించారు. అక్కడే తన సేనకు శిబిరం ఏర్పాటు చేశారు. ఇప్పుడు, ముస్లిములకు ముందు మదీనా నగరం, వెనుక వైపు ఎత్తైన ఉహద్ పర్వతమూ ఉంది. ఇలా శత్రుసేన ముస్లింలకు, మదీనాకు నడుమ అడ్డుగా నిలబడి ఉంది.
*రక్షణ వ్యూహం : - ↓*
ఇక్కడికి చేరిన తరువాత దైవప్రవక్త (సల్లం) తమ సైన్యాన్ని ఒక క్రమపద్ధతిలో నిలబెట్టారు. యుద్ధ వ్యూహాన్ని బట్టి దాన్ని అనేక వరుసలుగా తీర్చిదిద్దారు. నిపుణులైన ఓ యాభై మంది విలుకాండ్ర ఓ పటాలాన్ని కూడా ఎంపిక చేశారు. ఆ దళానికి 'హజ్రత్ అబ్దుల్లా బిన్ జుబైర్ బిన్ నోమాన్ అన్సారి (రజి)'ని సారథిగా నియమించారు.
'హజ్రత్ అబ్దుల్లా (రజి)'కు, ఖనాత్ మైదానానికి ప్రక్కన ఉన్న ఓ చిన్న కొండను★ రక్షించే బాధ్యతను అప్పగించారు. అది ఇస్లామీయ శిబిరానికి నూట యాభై మీటర్ల దూరాన తూర్పు వైపున ఉంది. ఇప్పుడు దానిని 'జబ్లె రమాత్'గా పిలుస్తున్నారు.
_(★→ సైన్యాలకు తూర్పువైపు కొండల్లో ఓ చిన్న సందు ఉంది. అటునుంచి శత్రువులు వచ్చి దాడిచేసే ప్రమాదం ఉంది. అంచేత, కీలకమైన ఆ ప్రదేశంలో దైవప్రవక్త (సల్లం) యాభైమంది విలుకాండ్రలను నియమించారు.)_
ఆ నియామకం ప్రాముఖ్యత ఏమిటో మహాప్రవక్త (సల్లం) ఆ విలుకాండ్రకు ఇచ్చిన ఆదేశాల ద్వారా తెలుస్తోంది. ఆయన (సల్లం) పటాలం సారథి 'హజ్రత్ అబ్దుల్లా (రజి)'ని సంబోధిస్తూ...., *"(అబ్దుల్లా!) వచ్చే అశ్విక దళాన్ని, వారు వెనుకవైపు నుండి మాపై దాడి చేయకుండా మీ శరపరంపరతో అడ్డుకోండి. మేము గెలిచినా, ఓడిపోయే పరిస్థితి ఏర్పడినా, ఏ సందర్భంలోనూ మీరు, మీరు నిలుచున్న చోటు నుండి మాత్రం కదలవద్దు."* అని ఆదేశించారు.
ఆ తరువాత మహాప్రవక్త (సల్లం) విలుకాండ్రను ఉద్దేశించి...., *"మీరు మా వెనుక భాగాన ఉండి మమ్మల్ని రక్షించండి. చూడండి! మేము చంపబడుతూ ఉన్నా సరే మీరు మా సహాయం కోసం రావద్దు, అలాగే మేము యుద్ధ ధనాన్ని ప్రోగు చేస్తున్నా సరే మీరు మాత్రం ఆ ప్రదేశాన్ని వదిలి మా దగ్గరకు రావద్దు."* అని చెప్పారు.
_'సహీ బుఖారి'లో గ్రంథస్థమై ఉన్న ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త (సల్లం)గారి ప్రవచనం ఇలా ఉంది....; ↓_
*"చూడండి! మమ్మల్ని పక్షులు పీక్కుతింటున్నా సరే చూసి, మీరు మీ ప్రదేశాన్ని వదిలిపెట్టకూడదు. నేను మిమ్మల్ని వెనక్కు పిలిచితే తప్ప. అలాగే, మేము జాతిని ఓడించి దానిని అణిచివేస్తున్నా తిరిగి నేను మిమ్మల్ని వెనక్కు పిలిపించనంతమట్టుకు మీ ప్రదేశం నుంచి వదిలిరాకూడదు."*
ఈ గంభీరమైన సైనిక ఆదేశాలు ఇచ్చిన తరువాత దైవప్రవక్త (సల్లం) ఆ విలుకాండ్ర సైనిక పటాలాన్ని ఆ కొండపై నియమించి అక్కడ ఉన్న ఒకే ఒక మార్గాన్ని మూసివేశారు. ఇక దానిని దాటి ముష్రిక్కులు ముస్లింలపై దాడి చేయలేరు, వారిని చుట్టుముట్టనూ లేరు.
తక్కిన సేన ఈ విధంగా తీర్చిదిద్దడం జరిగింది. 'మైమనా (కుడి పార్శ్వం)' కమాండరుగా 'హజ్రత్ మున్జిర్ బిన్ అమ్రూ (రజి)' నియమించబడ్డారు. 'మైసరా (ఎడమ పార్శ్వం)'కు 'హజ్రత్ జుబైర్ బిన్ అవామ్ (రజి)' కమాండరుగా నియమించబడ్డారు. ఈయనకు సహాయకునిగా 'హజ్రత్ మిఖ్దాద్ బిన్ అస్వద్ (రజి)'ను నియమించడం జరిగింది. 'హజ్రత్ జుబైర్ (రజి)'కు, 'ఖాలిద్ బిన్ వలీద్' నియంత్రించే అశ్విక దళాన్ని నిలువరించే కార్యభారాన్ని అప్పగించారు.
ఇలా ఎవరి బాధ్యతలను వారికి అప్పజెప్పడమే కాకుండా సైన్యం ముందు భాగంలో, పరాక్రమశీలురైన ముస్లిం యోధుల్ని నియమించారు. ఈ యోధులు, ధైర్య స్థయిర్యాలు, పరాక్రమాల్లో ఒక్కొక్కరు వేయి మందికి సమాధానం చెప్పేటంతటివారు.
ఈ పథకం ఎంతో వివేచనతో కూడుకున్న పథకం. ఇది దైవప్రవక్త (సల్లం) గారి యుద్ధకౌశల్యాన్ని చాటి చెబుతోంది. యుద్ధ కౌశల్యం మరియు వివేచనతో కూడిన ఎంతటి సైనిక కమాండరు అయినా, దైవప్రవక్త (సల్లం) అనుసరించిన ఇంత తెలివిగల పథకంను సైతం తయారు చేయలేడనే విషయం ఆయన (సల్లం) అవలంబించిన విధానాన్ని బట్టి రుజువు అవుతోంది.
ఎందుకంటే, మహాప్రవక్త (సల్లం) మదీనాను వదిలి శత్రుసైన్యం దాపుకు వచ్చినా, ఆయన (సల్లం) తన సేన కోసం యుద్ధం చేసే ఈ విధానాన్ని అనుసరించి, యుద్ధరంగానికి సంబంధించిన అతి ఉత్తమమైన ప్రదేశాన్ని ఎన్నుకోవడమే అందుకు తార్కాణం.
అంటే ఆయన (సల్లం), పర్వతశ్రేణిని మాటుగా చేసుకొని తన సేన వెనుక భాగాన్ని మరియు కుడి పార్శ్వాన్ని సురక్షితం చేసుకున్నారు. ఎడమ పార్శ్వాన ఉన్న ఏకైక మార్గం ద్వారా ఈ సేనపై వెనుక భాగం నుండి దాడి చేసే అవకాశం ఉంది. దానిని కూడా ఆయన (సల్లం) విలుకాండ్రను నియమించి పూడ్చివేశారు.
ప్రవక్త (సల్లం), తన విడిది కోసం ఓ ఎత్తయిన ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఒకవేళ అపజయాన్నే చవిచూడవలసివస్తే, వెనుక్కు మరలి పారిపోవడం లేదా శత్రువుకు చిక్కి ఖైదు అయ్యే బదులు ఇస్లామీయ శిబిరంలో రక్షణ తీసుకోవడానికి అవకాశం లభిస్తుంది. శత్రువే గనక ఆ శిబిరంను హస్తగతం చేసుకునే ప్రయత్నంచేస్తే దానికి ఎనలేని నష్టాన్ని కలిగించవచ్చు.
ఈ వ్యూహాన్ని అలా ఉంచి, దైవప్రవక్త (సల్లం), శత్రువును విధిలేక, అది విజయం సాధించినా ఏమంత ప్రయోజనం పొందకుండా ఉండేందుకు పల్లపు ప్రాంతంలో శిబిరం ఏర్పాటు చేసుకునేటట్లు చేశారు. ముస్లిములే విజయం సాధిస్తే శత్రువును వెంటాడి పట్టుకోవచ్చు. అదేకాకుండా ఆయన (సల్లం) యోధుల ఓ పటాలాన్ని కూడా నియమించి సైనిక లోటును భర్తీ చేయగలిగారు.
దైవప్రవక్త (సల్లం), షవ్వాల్ మాసం - 7వ తేదీన, హిజ్రీ శకం - 3న శనివారం నాడు చేసిన ముస్లిం సేన ఏర్పాటు ఇది.
*ఇస్లామీయ సేనలో ధైర్యోత్సాహాలతో రేకెత్తించిన మహాప్రవక్త (సల్లం) : -*
సేన సన్నద్ధమైన తరువాత దైవప్రవక్త (సల్లం) ఓ ప్రకటన చేస్తూ, తాము ఆదేశించనంత వరకు యుద్ధం ప్రారంభించవద్దని చెప్పారు. ఆయన (సల్లం) ఒకదానిపై మరొకటి రెండు కవచాలను ధరించి ఉన్నారు. అనుచరగణానికి యుద్ధోత్సాహాన్ని కలిగిస్తూ, శత్రువును ఢీకొన్నప్పుడు ధైర్యంగా, కార్యాన్ని సాధించే దృఢచిత్తంతో యుద్ధం చేయాలని తాకీదు చేశారు. ఆ తరువాత ప్రవక్త (సల్లం) తన ఒరలో నుంచి కరవాలాన్ని లాగి...., *"ఈ కరవాలాన్ని తీసుకొని దీని హక్కును నెరవేర్చే వారెవరు?"* అని పైకెత్తారు.
సహాబాల్లో చాలా మంది దాన్ని అందుకోడానికి ముందుకు వచ్చారు. వారిలో 'హజ్రత్ అలీ (రజి)', 'జుబైర్ బిన్ అవామ్ (రజి)', 'ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజి)' ప్రముఖులు. అయినా 'అబూ దుజానా సిమాక్ బిన్ ఖర్షా (రజి)' ముందుకొచ్చి...., *"దైవప్రవక్తా! దీని హక్కు ఏమిటి?"* అని అడిగారు.
*"ఈ కరవాలంతో, ఇది వంకరబోయినంత వరకు శత్రువు ముఖంపై కొట్టడమే దీని హక్కు."* అని సెలవిచ్చారు ఆయన (సల్లం).
దానికి 'అబూ దుజానా'...., *"దైవప్రవక్తా (సల్లం)! ఈ కరవాలం చేతబూని నేను దీని హక్కును నెరవేర్చదలుచుకున్నాను."* అని అనగా, మహాప్రవక్త (సల్లం) ఆ కరవాలాన్ని 'అబూ దుజానా' చేతికి అందించారు.
'అబూ దుజానా' ప్రాణాలనైనా లెక్కచేయని యోధుడు, యుద్ధ సమయంలో నిట్టనీల్గి నడిచే అలవాటుంది ఆయనకు. ఆయన దగ్గర ఓ ఎరుపురంగు రుమాలు ఉండేది. దాన్ని తలపై కట్టుకున్నప్పుడు, ప్రజలు, *"ఇక ఆయన ప్రాణం వదిలేవరకు పోరాడుతూనే ఉంటారు."* అని అనేవారు.
'అబూ దుజానా' ఆ కరవాలాన్ని దైవప్రవక్త (సల్లం) గారి చేతి నుండి అందుకొని తలపై ఆ ఎరుపు రంగు రుమాలును చుట్టుకున్నారు. ఇరు సేనలు చూస్తూ ఉండగా ఆయన నీల్గుతూ నడుస్తూ ఉండగా దైవప్రవక్త (సల్లం) చూసి...., *"ఈ నీల్గి నడవడం అల్లాహ్ కు ఇష్టమైనది కాదు, కాని ఈ సమయంలో మాత్రం కాదు."* అని అన్నారు.
*మక్కా సేన బారులు తీరి నిలబడడం : -*
ముష్రిక్కులు కూడా బారులు తీరి యుద్ధం చేసే విధానాన్నే అవలంబిస్తూ తమ సేనను నిలబెట్టారు. వారి సైన్యాధ్యక్షుడు "అబూ సుఫ్'యాన్''. ఇతను సేన మధ్యలో తన స్థానాన్ని కేటాయించుకున్నాడు. 'మైమనా' కమాండరుగా 'ఖాలిద్ బిన్ వలీద్' ఉన్నారు _(ఇంకా ఆయన ఇస్లాం స్వీకరించలేదు అప్పటివరకు)_. 'మైసరా' కమాండరుగా 'ఇక్రమా బిన్ అబూ జహల్' ఉన్నాడు. పదాతిదళం "సుఫ్'వాన్ బిన్ ఉమయ్యా" ఆధీనంలో ఉంది. విలుకాండ్రకు కమాండరుగా 'అబ్దుల్లా బిన్ రబీయా' నియమించబడి ఉన్నారు.
*జెండాను రక్షించే హోదా : - - : తన ఎత్తుగడలో సఫలీకృతుడైన అబూ సుఫ్'యాన్*
యుద్ధ పతాకం 'బనూ అబ్దుద్దార్' తెగవారికి చెందిన ఓ చిన్న వర్గం చేతిలో ఉంది. ఈ జెండాను రక్షించే హోదా, బనూ అబ్దె మునాఫ్, ఖుస్సై నుండి వారసత్వంలో పొందిన హోదాలను పంచినప్పటి నుండే వారికి దక్కి ఉంది. తాతముత్తాతల నుండి వచ్చే సంప్రదాయం ప్రకారం ఇంకెవ్వరూ ఈ హోదా గురించి కలహించుకోడానికి కూడా వీల్లేదు.
కాని, అబూ సుఫ్'యాన్, బద్ర్ యుద్ధం రోజున జరిగిన సంఘటనను మననం చేసుకున్నాడు. ఆరోజు ఆ జెండా ఎత్తుకొని ఉన్న 'నజ్ర్ బిన్ హారిస్' బంధీ అయితే, ఖురైష్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చిందో అతనికి కళ్ళకు కట్టినట్లు అగుపించింది. ఈ విషయం గుర్తుకురాగానే, 'బనూ అబ్దుద్దార్' తెగవారి కోపాన్ని మరింత రెచ్చగొట్టడానికి అబూ సుఫ్'యాన్ ఇలా అన్నాడు....; ↓
*మిగిలినది In Sha Allah రేపటి భాగములో....; →*
✍🏻✍🏻 *®@£€€q* *+97433572282* ✍🏻✍🏻
*(rafeeq)*
✍🏻✍🏻 *Salman* *+919700067779* ✍🏻✍🏻
*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*
💎💎 *మా సలాం* 💎💎
─┄┅━═══✦═══━┅┄─
No comments:
Post a Comment