232

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉

🕌☪🕋🛐      *ఇస్లాం చరిత్ర - 232*       🛐🕋☪🕌

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 147*      🇸🇦🇸🇦

◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉

          🛡⚔ *ఉహద్ పోరాటం : - 4*⚔🛡

*మహాప్రవక్త (సల్లం), సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించిన తరువాత....; ↓*

సైన్యం పూర్తి సంఖ్య ఒక వేయి మంది యోధులతో కూడుకొని ఉంది. వారిలో ఒకే ఒక కవచధారుడు, యాభై మంది గుర్రపు రౌతులు ఉన్నారు★. మరో ఉల్లేఖనంలో గుర్రపు రౌతే లేడని ఉంది.

_(★→ ఈ విషయం 'ఇబ్నె ఖైమ్', జాదుల్ ముఆద్ - 2/92లో చెప్పింది. 'హాఫిజ్ బిన్ హిజ్ర్' ఇది పెద్ద పొరపాటని అంటారు. 'మూసా బిన్ అక్బా' పూర్తి నమ్మకంగా చెప్పిన విషయం ఏమిటంటే, ముస్లిముల వద్ద ఉహద్ యుద్ధం సందర్భంగా ఏ ఒక్క గుర్రమూ లేదన్నది. 'వాఖిదీ' కథనం ప్రకారం, రెండే రెండు గుర్రాలున్నాయని, వాటిలో ఒకటి దైవప్రవక్త (సల్లం) గారి వద్ద మరొకటి 'అబూ బర్దా (రజి)' గారి దగ్గర ఉంది. ఫత్'హుల్ బారి - 7/350.)_

'హజ్రత్ ఇబ్నె ఉమ్మెమక్తూమ్ (రజి)'కు మదీనాలో ఉన్నవారికి నమాజు చేయించే పనిని అప్పగించారు. ఆ తర్వాత సైన్యం బయలుదేరే ఆదేశం ఇవ్వబడింది. ఇస్లామీయ సైన్యం ఉత్తరదిశ వైపునకు బయలుదేరింది. 'హజ్రత్ సఅద్ బిన్ ముఆజ్ (రజి)' మరియు 'హజ్రత్ సఅద్ బిన్ ఉబాదా (రజి)'లు కవచధారులై దైవప్రవక్త (సల్లం)గారికి ముందు నడుస్తున్నారు.

'సనీయతుల్ వదా' అనే ప్రదేశానికి చేరగానే ఓ సైనిక దళం, ఎంతో మేలైన ఆయుధాలు ధరించి ఇస్లామీయ సైన్యానికి పూర్తిగా ఎడంగా ఉన్నట్లు అగుపడింది. దైవప్రవక్త (సల్లం) దాన్ని చూసి...., *"ఇదేమి సైన్యం?"* అని అడిగారు.

*"వీరు ఖజ్రజ్ తెగకు మిత్రపక్షమైన యూదులు☆, వీరు ముష్రిక్కులకు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొనడానికి వచ్చారు."* అని చెప్పడం జరిగింది.

*"వీరు ఇస్లాం స్వీకరించారా?"* అని అడిగారు దైవప్రవక్త (సల్లం).

*"లేదు, ఇంకా ఇస్లాం స్వీకరించలేదు."* అని కొందరు పలకగా;

*"బహుదైవారాధకులతో జరుగుతున్న యుద్ధంలో, మనం దైవతిరస్కారుల మద్దతు పొందకూడదు."* అని వారి సాయాన్ని నిరాకరించారు ప్రవక్త (సల్లం).

_(☆→ ఈ సంఘటన 'ఇబ్నె సఅద్' ఉల్లేఖించినది. ఇందు, వీరు 'బనీ ఖునైజా'కు చెందిన యూదులని కూడా ఉంది (2/34). కాని ఇది సరియైనది కాదు. ఎందుకంటే, 'బనీ ఖునైజా'ను బద్ర్ యుద్ధం తరువాత కొన్ని రోజులకే దేశ బహిష్కరణ జరిగింది.)_

*సైన్యాన్ని మరోమారు పరికించిన మహాప్రవక్త (సల్లం) : -*

షైకాన్ అనే ప్రదేశానికి చేరిన తరువాత దైవప్రవక్త (సల్లం) తన ఇస్లామీయ సేనను మరోసారి పరికించి చూశారు. మరీ వయసు తక్కువగా ఉన్నవారు మరియు యుద్ధానికి పనికిరాని వారిని ఏరి వెనక్కు పంపించారు. ఆ వెనక్కు పంపించిన వారిలో 'హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రజి)', 'ఉసామా బిన్ జైద్ (రజి)', 'అసీద్ బిన్ జహీర్ (రజి)' మరియు 'సఅద్ బిన్ హబ్బా (రజి)'లు ఉన్నారు. ఈ జాబితాలోనే 'హజ్రత్ బరా బిన్ ఆజిబ్ (రజి)', పేరు కూడా ఉంది అని చెప్పుకోవడం జరుగుతోంది. కానీ, సహీ బుఖారీలో ఉల్లేఖించబడిన ఉల్లేఖనం ద్వారా ఆయన బద్ర్ యుద్ధంలో పోరాడారని ఉంది.

కాని, పిన్న వయస్కులైనప్పటికీ 'హజ్రత్ రాఫె బిన్ ఖదీజ్ (రజి)' మరియు 'హజ్రత్ సమా బిన్ జుందుబ్ (రజి)'లు ఈ యుద్ధంలో పాల్గొనే అనుమతి పొందారు. విషయం ఏమిటంటే, 'హజ్రత్ రాఫె బిన్ ఖదీజ్ (రజి)' ఓ మంచి విలుకాడు. అందుకని ఆయనకు అనుమతి లభించింది. ఆయనకు అనుమతి లభించగానే, 'హజ్రత్ సమా బిన్ జుందుబ్ (రజి)' అందుకొని...., *"(దైవప్రవక్తా!) నేను రాఫె కంటే బలవంతుణ్ణి, అతణ్ణి నేను ఎత్తి క్రిందపడవేయగలను."* అని అన్నారు.

దైవప్రవక్త (సల్లం)కు ఈ మాట చెప్పగా ఆయన (సల్లం)...., *"వీరిద్దరినీ కుస్తీ పట్టించండి."* అని ఆదేశించారు. నిజంగానే 'సమ్రా (రజి)', 'రాఫె (రజి)'ను క్రిందపడవేయగలిగారు. కాబట్టి ఆయనకు కూడా యుద్ధంలో పాల్గొనే అనుమతి లభించింది.

*ఉహద్ మరియు మదీనాకు నడిరేయి గడపడం : -*

ఇక్కడనే ప్రొద్దుగ్రుంకింది. కాబట్టి, దైవప్రవక్త (సల్లం) అక్కడనే 'మగ్రిబ్' నమాజు ఆ తరువాత 'ఇషా' నమాజు చేశారు. ఈ ప్రదేశంలోనే రాత్రి గడిపేందుకు తీర్మానించుకున్నారు. పహారా కోసం యాభై మంది సహాబా (రజి)లు ఎంపికయ్యారు. వీరు శిబిరం చుట్టూ తిరిగి పహారా కాశారు. ఈ పహారా దళానికి సారధి 'ముహమ్మద్ బిన్ ముస్లిమా (రజి) అన్సారీ'. ఈయన 'కఅబ్ బిన్ అష్రఫ్'ను అంతమొందించిన సైనిక పటాలానికి సారధిగా ఉండినవారు. 'ఊక్వాన్ బిన్ అబ్దుల్లా బిన్ ఖైస్ (రజి)' మహాప్రవక్త (సల్లం)కు దాపుగా ఉండి పహారా కాశారు.

*అబ్దుల్లా బిన్ ఉబై మరియు అతని అనుచరుల విద్రోహచర్య : -*

మహాప్రవక్త (సల్లం) 'ఫజ్ర్' నమాజుకు కొంత ముందే లేచి మళ్ళీ బయలుదేరారు. 'షౌత్' అనే ప్రదేశానికి చేరి అక్కడ 'ఫజ్ర్' నమాజు చేశారు. ఇప్పుడు శత్రువు దరిదాపులకు చేరినట్లయింది. ఒక వర్గం మరో వర్గాన్ని బాగా చూడగలుగుతోంది. ఇక్కడకు చేరగానే 'అబ్దుల్లా బిన్ ఉబై' విద్రోహం తలపెట్టాడు. దాదాపు మూడింట ఒక వంతు సైనికుల్ని తీసుకొని...., *"అనవసరంగా మేమెందుకు ప్రాణాలను అర్పించాలి."* అంటూ వెళ్ళిపోనారంభించాడు. తాను వెళ్ళిపోతూ...., *"దైవప్రవక్త (సల్లం) నా మాట వినలేదు. ఇతరుల మాట విని మదీనా వదిలారు."* అని నిరసన కూడా వ్యక్తపరిచాడు.

అతను వేరుబడటానికి కారణం యదార్థంగా, దైవప్రవక్త (సల్లం) అతని మాట వినలేదనేందుకు కాదు, అలా అయితే దైవప్రవక్త (సల్లం) గారి సేనతో కలిసి ఇక్కడి వరకు వచ్చే ఆస్కారమే ఉండకపోయేది. అతను బయలుదేరిన వెంటనే అలా చేసేవాడు. కానీ అలా జరగలేదు. అసలు యదార్థం ఏమిటంటే, ఈ క్లిష్టపరిస్థితులో వేరుబడి ఇస్లామీయ సేనలో భయోత్పాతాన్ని సృష్టించడం అతని ఉద్దేశ్యం. అతను శత్రుసేన కదలికలను గమనించి తాను వెనక్కు వెళ్ళిపోవడం వలన సాధారణ సైనికులు ప్రవక్త (సల్లం)ను విడిచిపెట్టి వెనక్కి మరలిపోవాలని, మిగిలిన వారి ధైర్యం సన్నగిల్లిపోవాలన్నదే. అంతేకాకుండా మరోవంక ఈ పరిస్థితిని చూసి శత్రు సైనికుల సాహసం మరింత పెరిగి, వారు యుద్ధంలో విజయం పొందాలన్నదే. 

కాబట్టి, ఈ ప్రవర్తన మహాప్రవక్త (సల్లం) మరియు ఆయన అనుచరగణాన్ని అంతమొందించే ఓ రకమైన ఎత్తుగడే అనాలి. ఈ కపటి, ఆ తరువాత తనకు, తన మిత్రబృందానికి మదీనా పెత్తనం చెలాయించే అవకాశం లభిస్తుందని తలచడమే.

ఈ మునాఫిక్ మాటలు విని మరి రెండు వర్గాలు అంటే అవస్ తెగకు సంబంధించిన 'బనూ హారిసా' మరియు ఖజ్రజ్ తెగకు సంబంధించిన 'బనూ సల్మా' వారు కూడా వెనక్కు మరలడానికి సిద్ధపడ్డారు. కాని అల్లాహ్, ఈ రెండు వర్గాల్లో చోటుచేసుకున్న భయోత్పాతాన్ని తొలగించి ఆదుకోవడం జరిగింది. వారు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. వారి గురించే అల్లాహ్ దివ్య గ్రంథంలో ఇలా సెలవిస్తున్నాడు....; ↓

*"మీలోని రెండు సమూహాల వారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లినప్పుడు అల్లాహ్ వారికి అండగా ఉన్నాడు. విశ్వాసులైనవారు సదా అల్లాహ్ నే నమ్ముకోవాలి." (ఖుర్ఆన్ 3:122).*

ఏది ఏమైనా మునాఫిక్ లు వెనక్కు మరలే నిర్ణయం గైకొనగానే ఈ క్లిష్టపరిస్థితిలో 'హజ్రత్ జాబిర్ (రజి)' గారి తండ్రి 'హజ్రత్ అబ్దుల్లా బిన్ హిరామ్ (రజి)' వారికి వారి బాధ్యత ఏమిటో గుర్తు చేశారు. వారిని హెచ్చరిస్తూ వెనక్కు మరలమని వారి వెంటే కొంత దూరం నడిచారు. అలా నడుస్తూనే...., *"రండి! దైవమార్గంలో పోరాడండి లేదా రక్షణకు నిలబడండి."* అన్నారు. కానీ, వారు దానికి సమాధానం ఇస్తూ...., *"మీరే గనక యుద్ధం చేస్తారని అనుకుంటే మేము వెనక్కు మరలేవారం కాము."* అన్నారు. ఈ సమాధానం విన్న 'హజ్రత్ అబ్దుల్లా బిన్ హిరామ్ (రజి)'...., *"ఓ దైవ విరోధుల్లారా! మీపై అల్లాహ్ శాపం పడుగాక. గుర్తు రాసుకోండి! అల్లాహ్, తన ప్రవక్త (సల్లం)కు మీ అవసరం లేకుండానే చేస్తాడు."* అని వెనక్కు మరలి వచ్చారు.

_ఈ మునాఫిక్ ల గురించే అల్లాహ్ ఈ ఆయత్ ను అవతరింపజేశాడు....; ↓_

*"దగాకోరులెవరో కూడా ఆయన తెలుసుకోవాలనుకున్నాడు. “రండి, దైవమార్గంలో పోరాడండి లేదా అవిశ్వాసులను ఎదుర్కోండి” అని వారితో (కపటులతో) అన్నప్పుడు, “యుద్ధం జరగబోతుందని మాకు తెలిసి ఉంటే తప్పకుండా మీ వెంట వచ్చేవాళ్ళమే” అని వారు బదులిచ్చారు. ఆనాడు వాళ్ళు విశ్వాసం కన్నా అవిశ్వాసానికి బహు చేరువలో ఉన్నారు. తమ మనసుల్లో లేని దాన్ని నోటితో పలుకుతున్నారు. వారు దాచి ఉంచే దానిని అల్లాహ్ బాగా ఎరుగు." (ఖుర్ఆన్ 3:167).*

*తక్కిన ఇస్లామీయ సేన ఉహద్ ముంగిట్లో : -*

ముస్లింలకు విద్రోహం తలపెడుతూ వారు వెనక్కు వెళ్ళిపోయిన తర్వాత మహాప్రవక్త (సల్లం) మిగిలిన ఇస్లామీయ సేనను వెంటబెట్టుకొని శత్రువు వైపునకు కదిలారు. అప్పుడు ఇస్లామీయ సైన్యంలో ఏడు వందల మంది సైనికులు మాత్రమే ఉన్నారు.

దైవప్రవక్త (సల్లం) గారి సైన్యానికీ, ఉహద్ కొండకూ నడుమ శత్రువుల సైనిక శిబిరం విస్తరించి ఉంది. ఇది గమనించిన దైవప్రవక్త (సల్లం)...., *"శత్రువు దాపునకు పోకుండా సైన్యాన్ని ఉహద్ కొండకు చేర్చే దగ్గరి మార్గాన్ని ఎవరైనా చూయించగలరా?"* అని అడిగారు.

సమాధానంగా 'అబూ ఖైస్మా'...., *"దైవప్రవక్తా! నేను ఈ సేవకు సిద్ధంగా ఉన్నాను."* అంటూ, ముష్రిక్కుల సేనను పశ్చిమ దిశగా వదలి 'బనూ హారిసా'కు చెందిన పొలాల్లో నుండి బయలుదేరి అక్కడికి చేరుకున్నారు.

ఆ మార్గాన వెడుతూ ఇస్లామీయ సేన "మర్'బా బిన్ ఖన్తీ" తోట గుండా పోవడం జరిగింది. ఈ వ్యక్తి ఓ మునాఫిక్ (కపటి). అదేకాకుండా అంధుడు కూడా.

అతను, ఇస్లామీయ సేన రాకను గమనించి ముస్లింల వైపు మట్టి విసురుతూ...., *"మీరే గనక దైవప్రవక్త (సల్లం) అయితే జ్ఞాపకముంచుకోండి. మీరు నా తోట గుండా వెళ్ళే అనుమతి ఇవ్వను."* అని అనసాగాడు.

ఇది చూసిన కొందరు అతణ్ణి చంపడానికి ముందుకు ఉరకగా, దైవప్రవక్త (సల్లం) వారిని వారిస్తూ...., *"అతణ్ణి చంపవద్దు. అతని హృదయం మరియు కళ్ళు రెంటికీ అంధుడే."* అన్నారు.

ఆ తరువాత ప్రవక్త (సల్లం) ముందుకు కదిలి ఆ మైదానానికి చివరగా ఉన్న కొండలోయలో ప్రవేశించారు. అక్కడే తన సేనకు శిబిరం ఏర్పాటు చేశారు. ఇప్పుడు, ముస్లిములకు ముందు మదీనా నగరం, వెనుక వైపు ఎత్తైన ఉహద్ పర్వతమూ ఉంది. ఇలా శత్రుసేన ముస్లింలకు, మదీనాకు నడుమ అడ్డుగా నిలబడి ఉంది.

*రక్షణ వ్యూహం : - ↓*

*In Sha Allah రేపటి భాగములో....; →*

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment