231

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉

🕌☪🕋🛐      *ఇస్లాం చరిత్ర - 231*       🛐🕋☪🕌

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 146*      🇸🇦🇸🇦

◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉

       🛡⚔ *ఉహద్ పోరాటం : - 3*⚔🛡

  *శుక్రవారం, షవ్వాల్ నెల - 6వ తేది, హిజ్రీ శకం - 3.*

దైవప్రవక్త (సల్లం) అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అనుచరులతో సహా అనేకమంది సమావేశానికి హాజరయ్యారు. దైవప్రవక్త (సల్లం) పరిస్థితిని సభికుల ముందుంచి ఇలా అన్నారు....; ↓

*"ఖురైష్ సైన్యం నగర శివార్లలో మోహరించి ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇక ఏమాత్రం ఆలస్యం చేసిన పరిస్థితి విషమించేలా ఉంది. శత్రువుని ఎలా ఎదుర్కుందామో ఆలోచించండి. నగరం వెలుపలున్న శత్రువు జోలికి పోకుండా, మనం మదీనాలోనే ఉండిపోతేనే మంచిదని నా అభిప్రాయం. శత్రువు మదీనాపై దాడి చేయకుండా అక్కడే ఆగిపోతే మనకు ఎలాంటి చిక్కు లేదు. మదీనా సంధులు, వీధులు మనకు తెలిసినంత వివరంగా వారికి తెలియవు. అంచేత శత్రువులు మన మీదికి దాడి చేయడానికి వస్తే, మనం నగరంలోనే ఉండి వారిని ఎదుర్కోవచ్చు. అనేకమందిని అవలీలగా పట్టి హతమార్చవచ్చు. మరి మీ ఉద్దేశ్యం ఏమిటో తేల్చి చెప్పండి."* అని అన్నారు ప్రవక్త (సల్లం).

_(మరొక ఉల్లేఖనంలో....; → దైవప్రవక్త (సల్లం), సహాబా (రజి) గార్లకు యుద్ధం చేసే విధానాన్ని సూచిస్తూ ఓ సలహా ఇచ్చారు. ↓_

_*"శత్రువుతో యుద్ధం చేయడానికి, మదీనా నుండి బయటకు వెళ్ళకుండా మనం లోపలే ఉండి కాచుకోవాలి. ముష్రిక్కులు వారి శిబిరాల్లోన్నే ఉండిపోతే అది వారి లక్ష్యాన్ని నెరవేర్చజాలదు మరియు వారు అక్కడనే ఉండిపోవడం వారికి చేటుతెస్తుంది. అలా కాకుండా వారే మదీనా నగరంలోకి చొరబడి వస్తే ముస్లిములు వారిని సందుగొందుల మూలల్లో నిలువరించి యుద్ధం చేసి చంపేయవచ్చు. స్త్రీలు, ఇళ్ళ కప్పులపై నుండి వారిపై రాళ్ళ వర్షం కూడా కురిపించవచ్చు."* అని అన్నారు. ఇదే సరియైన సలహా కూడా.)_

దైవప్రవక్త (సల్లం) కంటే ఎక్కువ విజ్ఞతకల అభిప్రాయం ఎవరు వ్యక్తపరచగలరు? ప్రధాన సహచరులంతా సంతోషంతో దైవప్రవక్త (సల్లం) అభిప్రాయంతో ఏకీభవించారు.

దైవప్రవక్త (సల్లం) సలహాతో మునాఫిక్ ల నాయకాగ్రేసరుడైన 'అబ్దుల్లా బిన్ ఉబై' కూడా ఏకీభవించాడు. అతను 'ఖజ్రజ్' తెగ తరఫున సమావేశానికి హాజరైన ప్రతినిధి. అయితే, అతను ఈ సలహాతో ఏకీభవించడానికి గల కారణం, యుద్ధవ్యూహం దృష్ట్యా ఇదే సరైన సలహా అని మాత్రం కాదు. అతని ధ్యేయం వేరు. అతను యుద్ధానికి దూరంగా ఉండాలని, ఎవరి కంటపడకుండా ఉండాలన్నదే అది.

కానీ, అల్లాహ్ చేయదలచుకున్నది మాత్రం మరొకటి. అల్లాహ్ తలచుకున్నది ఏమిటంటే, ఈ వ్యక్తి తన మిత్రులతో సహా అందరిముందు అగౌరవంపాలు కావాలన్నదే. వారి దైవతిరస్కార వైఖరి, కపట నాటకంపై పడి ఉన్న తెర తొలగిపోయి, సంకట సమయంలో వీరు ఎంత ద్రోహానికి పాల్పడతారో ముస్లిములకు తెలిసిరావాలన్నదే.

దైవప్రవక్త (సల్లం) సలహాకు 'అబ్దుల్లా బిన్ ఉబై' సమాధానం....; ↓

*"దైవప్రవక్తా! మీ అభిప్రాయం అమోఘంగా ఉంది. మనం కదలకుండా నగరంలోనే ఉందాం. ఈ విషయంలో మాకు చాలా అనుభవం ఉంది. గతంలో నగరం వదిలిపెట్టి బయట యుద్ధం చేసినప్పుడల్లా మేము అవమానానికే గురయ్యాం. శత్రువులు నగరం మీద ఎప్పుడు దండెత్తినా ఘోరంగా ఓడిపోవడం జరిగింది. అంచేత శత్రువుల్ని అక్కడే పడి ఉండనివ్వండి. అంతగా నగరంలోకి వస్తే రానివ్వండి. మనం వాళ్ళను చుట్టుముట్టి సంహరిద్దాం."* అని అన్నాడు.

అయితే, బద్ర్ యుద్ధంలో పాల్గొనకుండా మదీనాలోనే ఉండిపోయిన కొందరు ప్రవక్త (సల్లం) గారి అనుచరులు మాత్రం, మదీనా నగరాన్ని వదిలి బయట మైదానంలో వారిని మార్కొనాలని సలహాలిచ్చారు. వారు తమ ఈ సలహాపై గట్టిగా అమలు చేస్తూ దైవప్రవక్త (సల్లం)ను బలవంతపెట్టనారంభించారు.

*"ఓ దైవప్రవక్తా! మేము ఈ రోజు కోసమే ఎదురు చూసేవాళ్ళం. ఇలాంటి అవకాశం కల్పించమని అల్లాహ్ ని వేడుకునేవారం. ఇప్పుడు అల్లాహ్ మాకు ఈ అవకాశాన్ని కల్పించాడు. యుద్ధరంగంలోనికి వెళ్ళే సమయం కూడా ఆసన్నమైంది. తమరు శత్రువును ఢీకొనడానికి బయలుదేరండి. అలా జరగకపోతే, మనం భయపడిపోయామని శత్రువులు అనుకుంటారు."* అన్నాడు ఓ అనుచరుడు.

*"దైవప్రవక్తా! శత్రువులు మన నగరం పొలిమేర్లలోకి వచ్చి మన పొలాలను సర్వనాశనం చేశారు కదా? ఇంకా మనం ఏ సమయం కోసం వేచివుండాలి?"* అన్నాడు మరో యువకుడు.

*"నేను ఎంత ప్రయత్నించినా బద్ర్ యుద్ధంలో పాల్గొనలేకపోయాను. నా కొడుకు పాల్గొని అమరగతుడయ్యాడు. ఎంతో అదృష్టవంతుడు. రాత్రి నా కలలోకి వచ్చి...., _"నాన్నా! మీరు కూడా రండి. స్వర్గంలో మాతోపాటు హాయిగా ఉండవచ్చు. ప్రభువు మనకు చేసిన వాగ్దానాన్ని నేను ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాను."_ అని చెప్పాడు. అంచేత దైవప్రవక్తా! నగరం బయటికు వెళ్ళి శత్రువుల్ని ఢీకొందాం."* అన్నాడు వేరొక అనుచరుడు.

యుద్ధోత్సాహంతో ఉరకలేసే ఈ వ్యక్తుల్లో దైవప్రవక్త (సల్లం) గారి పినతండ్రి "హజ్రత్ హమ్'జా (రజి)" ప్రముఖ పాత్రను పోషించారు. ఆయన (రజి) బద్ర్ యుద్ధంలో తన ఖడ్గ నైపుణ్యాన్ని ప్రదర్శించినవారు. ఆయన (రజి) దైవప్రవక్త (సల్లం) ఎదుట ప్రమాణం చేస్తూ...., *"ఓ ప్రవక్తా! ఎవరైతే తమరిపై గ్రంథాన్ని అవతరింపజేశాడో ఆ దైవసాక్షిగా చెబుతున్నాను, మదీనాకు వెలుపల నా కరవాలం ఝళిపించనంత వరకు ఏమీ తినేదే లేదు."* అని అన్నారు.

వీరి వాదనలతో మిగిలిన ముస్లింలలో కూడా నూతనోత్సాహం పెల్లుబికింది. అనేకమంది నగరం బయటికెళ్ళే యుద్ధం చేయడానికి తహతహలాడసాగారు. వీళ్ళను బద్ర్ వీరులు కూడా బలపరిచారు. నిజానికి అందరి హృదయాల్లోనూ, ఇస్లాంపై ఏమాత్రం మచ్చ రానీయకూడదనే తపన, దైవమార్గంలో ప్రాణాలు అర్పించాలనే బలమైన కోరిక ఉన్నాయి. ప్రతిఒక్కడూ అల్లాహ్ ప్రసన్నతకు పాత్రుడు కావాలనే తాపత్రయపడుతున్నాడు.

మహాప్రవక్త (సల్లం), చాలా మంది చేసిన బలవంతం మీద తన సలహాను రద్దు చేసుకోవడం జరిగింది.

ఇక నగరం నుంచి బయటికెళ్ళి యుద్ధం చేయక తప్పదు. దైవప్రవక్త (సల్లం) పరిస్థితిని అర్థం చేసుకొని సమావేశాన్ని ముగిస్తూ...., *"అధికసంఖ్యాక సభ్యుల అభిప్రాయం ప్రకారమే నగరం బయటకు వెళ్ళి శత్రువులతో పోరాడదాం."* అని తీర్మానించారు.

ఆ రోజు శుక్రవారం. జుమా నమాజు కోసం వచ్చిన భక్తులతో మస్జిదె నబవి నిండిపోయింది. ఇస్లామీయ ఉద్యమ సారథి (సల్లం) జుమా ప్రసంగం చేయడానికి వేదికనెక్కారు. మదీనా శివార్లలో శత్రువులు మోహరించి ఉండడంవల్ల ఈరోజు జుమా ప్రసంగం వినడానికి జనం తహతహలాడుతున్నారు.

*ఇస్లామీయ సేన క్రమబద్ధీకరణ - యుద్ధరంగానికి బయలుదేరడం : -*

ఆపై దైవప్రవక్త (సల్లం) జుమా నమాజు చేయించినప్పుడు వారికి హితోపదేశం చేశారు. అవిరామ కృషి సల్పమని ప్రోత్సహించారు. సహనం, స్థయిర్యం ద్వారానే ఆధిక్యత సంపాదించగలమని చెబుతూ, శత్రువుకు వ్యతిరేకంగా సంసిద్ధులుకండని ఆదేశించారు. ఇంకేముంది ప్రజల్లో ఆనందాతిరేకం వెల్లివిరిసినట్లయింది ప్రవక్త (సల్లం) గారి ఉద్బోధతో.

మహాప్రవక్త (సల్లం) అసర్ నమాజు చేసేటప్పటికి ప్రజలు ఓ చోటికి చేరిపోయారు. అంతలోనే 'అవాలీ' అనే ప్రదేశానికి చెందినవారు కూడా వీరిలో వచ్చి చేరారు. నమాజు చేసిన తర్వాత దైవప్రవక్త (సల్లం) తన ఇంటిలోనికి ప్రవేశించారు. ఆయన (సల్లం) వెంట 'హజ్రత్ అబూ బక్ర్ (రజి)' మరియు 'హజ్రత్ ఉమర్ (రజి)'లు కూడా ఉన్నారు. వారిద్దరు దైవప్రవక్త (సల్లం) తలపై అమామా కట్టి వస్త్రాలను తొడిగారు. మహాప్రవక్త (సల్లం) క్రింద ఒకటి, పైన ఒకటిగా ఒకదానిపై ఒకటి రెండు కవచాలను ధరించారు. కరవాలాన్ని కట్టుకొని ఆయుధధారులై యుద్ధం కోసం సిద్ధమయ్యారు.

దైవప్రవక్త (సల్లం) ఇంటిముందు గుమిగూడిన యువకులు, నగరం వెలుపలే యుద్ధం జరుగుతుందని భావించి ఆనందంతో గంతులేస్తున్నారు. కానీ, కొంతమంది మాత్రం నగరం వెలుపల యుద్ధం చేయడంలో నష్టం ఉందనే భావనతో సంతోషంగా లేరు. అంచేత ఈ రెండు వర్గాల వారు పరస్పరం వాదించుకోసాగారు. బయటికెళ్ళి యుద్ధం చేయాలని పట్టుబట్టిన వారితో 'హజ్రత్ సఅద్ బిన్ ముఆజ్ (రజి)', 'హజ్రత్ ఉసైద్ బిన్ హుజైర్ (రజి)'లు ఇలా అన్నారు....; ↓

*"మీరు దైవప్రవక్త (సల్లం) అభిప్రాయంతో ఏకీభవించకుండా బయటికి పోయి యుద్ధం చేయాలని ఆయన (సల్లం)పై ఒత్తిడి తెచ్చారు. ఆయన (సల్లం) దగ్గరకు దైవసందేశం వస్తోందని తెలిసి కూడా మీరు ఇలా ప్రవర్తించడం ఏమీ బాగోలేదు. ఈ వ్యవహారాన్ని దైవప్రవక్త (సల్లం)కు వదిలేసి ఆయన (సల్లం) చెప్పినట్లు నడుచుకోండి. ఆయన (సల్లం) ఏది తీర్మానిస్తారో దాన్ని అనుసరించడంలోనే మనందరి క్షేమం ఉంది."*

లోపలినుంచి ఈ మాటలు వింటున్న దైవప్రవక్త (సల్లం) బయటికి వచ్చారు. ఆయన (సల్లం) వేషం, వాలకం చూసి, బయటికెళ్ళి యుద్ధం చేయాలని పట్టుబట్టిన వారంతా సిగ్గుతో తలదించుకున్నారు. *"దైవప్రవక్తా! మేము మీ మాట వినకుండా చాలా తప్పుచేశాం. మమ్మల్ని క్షమించండి. మీరు ఏది  మంచిదని తలిస్తే అదే చేయండి."* అన్నారు వారు.

*"నేను ముందే చెప్పాను. కానీ మీరు నా మాట వినలేదు. కానీ ఇప్పుడు కరవాలం చేపట్టిన తరువాత దానిని క్రింద పడవేయడం దైవప్రవక్తల లక్షణం కాదు. అంచేత ఇక బయలుదేరక తప్పదు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి. అల్లాహ్ పేరుతో బయలుదేరండి. ఓర్పు వహిస్తే విజయం మీదే అవుతుంది."* అన్నారు దైవప్రవక్త (సల్లం).

ఆ తరువాత మహాప్రవక్త (సల్లం) సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించారు.

*❥❥ ముహాజిర్ల పటాలం : - :* దీని పతాకాన్ని 'హజ్రత్ ముస్అబ్ బిన్ ఉమైర్ అబ్దరీ (రజి)'కు అందజేశారు.

*❥❥ అవస్ తెగ (అన్సార్ ల) పటాలం : - :* ఈ పటాలనికి సంబంధించిన జెండాను 'హజ్రత్ ఉసైర్ బిన్ హుజైర్ (రజి)'గారి చేతికందించారు.

*❥❥ ఖజ్రజ్ తెగ (అన్సార్) పటాలం : - :* దీని జెండాను 'హబ్బాబ్ బిన్ మున్జిర్ (రజి)'కు అప్పజెప్పారు.

*మిగిలినది In Sha Allah రేపటి భాగములో....;*

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment