🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐
🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋
◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉
🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర - 230* 🛐🕋☪🕌
🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 145* 🇸🇦🇸🇦
◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉
🛡⚔ *ఉహద్ పోరాటం : - 2*⚔🛡
*యుద్ధానికి బయలుదేరిన మక్కా సైన్యం : -*
యుద్ధానికి అన్ని రకాలుగా సిద్ధం అయిన మక్కా సైన్యం, ముస్లిముల ఎడల కోపతాపాల్ని ప్రదర్శిస్తూ, వారికి బుద్ధిచెప్పే తలంపుతో, తమ ప్రతీకారాగ్నిని చల్లార్చుకోవడానికి బయలుదేరింది. మునుముందు జరగబోయే ఓ భయంకర యుద్ధాన్ని ఆహ్వానిస్తుందా అన్నట్లుంది వీరి వాలకం.
ధగధగ మెరిసే ఉక్కు కవచాలు ధరించి రకరకాల ఆయుధాలు చేతబూనిన మూడు వేల మంది సిపాయీలు దైవప్రవక్త (సల్లం)ను, ముస్లింలను చీల్చి చెండాడటానికి తహతహ లాడుతున్నారు. సైన్యంలో ఇతరత్రా పనుల కోసం పదిహేను మంది స్త్రీలు కూడా ఉన్నారు. వీరికి అబూ సుఫ్'యాన్ భార్య 'హింద్' నాయకురాలు. అంతా సిద్ధమైన తర్వాత పెద్ద పెట్టున కోలాహలంతో సైనికవాహిని బయలుదేరింది.
ఖురైషీయులు సైనికులు ఉరకలు వేస్తున్న ఉత్సాహంతో అనేక మజిలీలు దాటుకుంటూ, తింటూ, త్రాగుతూ, ఆవేశంలో విర్రవీగుతూ పోతున్నారు. వారి వెంటవున్న స్త్రీలు దారి పొడుగుతూ బద్ర్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరయోధుల విషాద గేయాలు ఉత్తేజంతో పాడుతున్నారు. గత సంఘటనలు గుర్తుచేస్తూ సైనికుల పౌరుషాన్ని రెచ్చగొడుతున్నారు. గుండెలను పిండే పాటలు పాడుతూ, ముస్లింలపై ప్రతీకార చర్య కోసం ఉసిగొల్పుతున్నారు.
*మక్కా వాసులు యుద్ధానికి బయలుదేరారని దైవప్రవక్త (సల్లం)కు అందిన వార్త : - ↓*
దైవప్రవక్త (సల్లం) గారి పెదనాన్న 'హజ్రత్ అబ్బాస్ (రజి)' ఇది వరకే ఇస్లాం స్వీకరించి ఉన్నారు. అయితే ఆయన ఇంకా మదీనాకు వలసపోకుండా మక్కాలోనే ఉన్నారు.
హజ్రత్ అబ్బాస్ (రజి), ఖురైషుల ప్రతి కదలికను, వారి యుద్ధ సన్నాహాల్ని ఎంతో లోతుగా అధ్యయనం చేస్తూనే ఉన్నారు మక్కాలో ఉండి. మక్కా సైన్యం యుద్ధానికి బయలుదేరగానే అబ్బాస్ (రజి), దైవప్రవక్త (సల్లం)కు వివరాలతో కూడిన ఓ లేఖను పంపించారు.
హజ్రత్ అబ్బాస్ (రజి) గారి దూత ఈ వార్తను ఎంతో వేగంగా తెచ్చి మదీనాలో ఉన్న మహాప్రవక్త (సల్లం)కు అందించాడు. అతను మక్కా నుండి మదీనా వరకు గల ఐదు వందల కిలోమీటర్ల దూరాన్ని కేవలం మూడు రోజుల్లోనే అధిగమించి మదీనా చేరుకున్నాడు. అపుడు దైవప్రవక్త (సల్లం) 'మస్జిదె ఖుబా'లో ఉన్నారు.
ఆ లేఖను 'హజ్రత్ ఉబై బిన్ కఅబ్ (రజి)', దైవప్రవక్త (సల్లం)కు చదివి వినిపించారు. ఆ లేఖ సారాంశం ఇలా ఉంది....; ↓
*"నా ప్రియకుమారా! నువ్వు ఇప్పటికన్నా తెలుసుకుంటావు. నీ ముసలి పెదనాన్న మోసగాడు కాడని. ఇది చాలా ముఖ్యమైన విషయం. నేను ఆషామాషిగా రాయటం లేదు. మక్కావాసులు మూడు వేల మంది సైన్యంతో మీతో యుద్ధం చేయడానికి బయలుదేరారు. బహుశా ఇప్పుడు ఆ సైన్యం మదీనా దరిదాపులకు చేరుకొని ఉంటుంది. మిమ్మల్ని ముందుగా హెచ్చరించడానికే ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకు వచ్చాను. విజయం మిమ్మల్ని వరించుగాక!"*
ఈ వార్త విని ప్రవక్త (సల్లం)...., *"అలాగా! సరే ఈ విషయం ఇంకెవరి ముందూ ప్రస్తావించకండి."* అని అక్కడున్న వారికి తాకీదు చేసి, అన్సారుల మరియు ముహాజిర్ల సర్దారులతో సంప్రదింపులు జరిపేందుకు వెంటనే మదీనాకు బయలుదేరారు.
*మదీనా ముంగిట నిలిచిన మక్కా సైన్యం : -*
మక్కా సైన్యం అందరికి తెలిసిన వ్యాపార మార్గం గుండా పయనిస్తోంది. ఈ సైన్యం 'అబ్వా' అనే ప్రదేశానికి చేరుకుంది. దైవప్రవక్త (సల్లం) గారి మాతృమూర్తి 'హజ్రత్ ఆమినా' అక్కడే సమాధి చేయబడ్డారు. ఆ సమాధిని చూడగానే అబూ సుఫ్'యాన్ భార్య 'హింద్'...., *"అక్కడ చూడండి, ముహమ్మద్ (సల్లం) తల్లి సమాధి ఉంది. ఇదే మంచి అవకాశం. ఆ సమాధిని పెకిలించి చిన్నాభిన్నం చేద్దాం పదండి."* అని అన్నది.
అయితే అలా చేయడం వల్ల ఎదురయ్యే దుష్పరిణామాల్ని దృష్టిలో ఉంచుకొని ఖురైష్ సర్దారులు ఆమె సలహాను త్రోసిపుచ్చారు.
*"వద్దు వద్దు. అలా పొరపాటున కూడా చేయకూడదు. అలా చేశారా బనీ ఖుజాఆ, బనీ బకర్ తెగవాళ్ళు మన వాళ్ళ సమాధులన్నిటినీ తవ్విపారేసి శవాల్ని బయటకు లాగేస్తారు."* అని హెచ్చరించారు. ఈ హెచ్చరికతో మిగిలిన సైనికులెవరూ ఆ సమాధి జోలికి పోవడానికి సాహసించలేదు.
ఆ సైన్యం అలా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఎట్టకేలకు మదీనా దాపున ఉన్న 'వాదియె అతీక్ (అతీక్ లోయ)' ప్రక్కగా సాగింది. ఆ తరువాత కొంత కుడి ప్రక్కగా మళ్ళి ఉహద్ కొండ దాపున 'అయినైన్' పేరుగల ప్రదేశంలో విడిది చేసింది. ఈ ప్రదేశం మదీనాకు ఉత్తరంగా ఉన్న 'ఖనాత్' అనే ఊసర క్షేత్రం.
*అత్యవసర పరిస్థితిని ఎదుర్కునేందుకు సిద్ధపడడం : -*
దైవప్రవక్త (సల్లం), ఖుబా నుంచి మదీనా చేరుకొని నేరుగా 'సఅద్ బిన్ రబీ (రజి)' ఇంటికి వెళ్ళారు. అక్కడ 'సఅద్ (రజి)'కు ఈ సంగతి తెలిపి...., *"దీన్ని గురించి ముఖ్య అనుచరులతో సంప్రదించవలసి ఉంది. కనుక మీరు ఈ విషయం ఎక్కడా పొక్కనీకుండా రహస్యంగా ఉంచండి."* అని అన్నారు.
దైవప్రవక్త (సల్లం), సఅద్ (రజి)లు మాట్లాడుకున్న విషయాలు, అక్కడే ఉన్న సఅద్ (రజి) శ్రీమతి కూడా విన్నారు. కానీ ఆమె ఈ వార్తను రహస్యంగా ఉంచలేకపోయారు. మెల్లగా అది కొందరి చెవిన పడింది. ముఖ్య అనుచరులతో ఇంకా సలహా సంప్రదింపులు కూడా జరపలేదు. అప్పుడే ఈ వార్త నగరమంతా వ్యాపించింది.
(ఆ తరువాత మదీనాలో సార్వత్రికంగా సైనిక భర్తీ ప్రారంభం అయింది. ప్రజలు సంసిద్ధులై, ఏ క్షణంలోనైనా పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆయుధధారులై మెలుకువగా ఉన్నారు. చివరికి, నమాజు చేసే సమయంలో కూడా ఆయుధాలను వారు తమ నుండి వేరు చేయలేదు.)
దైవప్రవక్త (సల్లం) ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా 'హజ్రత్ అనస్ (రజి)'ను, 'హజ్రత్ మూనిస్ (రజి)'ను శత్రుసైన్యాన్ని గురించి సమాచారం తెలుసుకొని రమ్మని పంపించారు. వారిద్దరు తక్షణమే పోయి తిరిగివచ్చారు. *"ఖురైష్ సైన్యం మదీనాకు అతి సమీపంగా వచ్చేసింది. వారి ఒంటెలు, గుర్రాలు మన పొలాలన్నిటిని మేసి ధ్వంసం చేశాయి. మదీనా పచ్చికబయళ్ళు కూడా పూర్తిగా తుడిచి పెట్టుకపోయాయి."* అనే వార్త విన్పించారు.
దైవప్రవక్త (సల్లం) ఈసారి, సైనిక బలం ఎంత ఉందో తెలుసుకొని రమ్మని 'హజ్రత్ హుబాబ్ బిన్ మున్జిర్ (రజి)'ని పంపించారు. ఆయన రహస్యంగా శత్రుశిబిరాలకు సమీపంగా పోయి సైనికులు, వాహనాలు, ఆయుధాలను ఒకసారి జాగ్రత్తగా కలియజూశారు. తిరిగివచ్చి దైవప్రవక్త (సల్లం)కు పూర్తి సమాచారం అందించారు.
అప్పటికి సూర్యాస్తమయం అయింది. మస్జిద్ నుంచి ముఅజ్జిన్, అల్లాహ్ ఔన్నత్యం కొనియాడుతూ దేవదాసుల్ని నమాజు కోసం పిలుస్తున్నాడు. ముఅజ్జిన్ పిలుపుతో దైవభక్తులు మస్జిద్ లోకి ప్రవేశించి ప్రార్థనలో లీనమయ్యారు. అల్లాహ్ యే తమ రక్షకుడనే విశ్వాసాన్ని మరొక్కసారి దృఢంగా తమ హృదయాల్లో ధృవపరుచుకొని బయటికి వచ్చారు.
చీకటి తెరలు మదీనా నగరాన్ని దట్టంగా కప్పివేస్తున్నాయి. నగరం బయటినుంచి ఉపద్రవం ఉప్పెనలా ముంచుకొస్తోంది. భయంకరమైన ఆ రాత్రి శత్రువులు ఏ క్షణాన ఎటువైపు నుంచి దాడిచేస్తారో తెలియకుండా ఉంది. ఒక్కొక్క ఘడియ ఒక్కొక్క యుగంలా గడుస్తోంది. కొందరు ముస్లింలు సైనిక దుస్తులు వేసుకొని ఖడ్గధారులై రాత్రంతా నగర సరిహద్దుల్ని కాపలా కాస్తూ జాగరణ చేస్తున్నారు.
ఇటు అన్సారులకు చెందిన ఓ చిన్న దళం దైవప్రవక్త (సల్లం) సంరక్షణ కోసం నియమించబడింది. అందు 'హజ్రత్ సఅద్ బిన్ ముఆజ్ (రజి)', 'ఉసైద్ బిన్ హుజైర్ (రజి)' మరియు 'సఅద్ బిన్ ఉబాద్ (రజి)'లు ఉన్నారు. వీరు ఆయుధధారులై రాత్రంతా మహాప్రవక్త (సల్లం) గారి గుమ్మం ముందు పహారా కాస్తున్నారు.
ఇంకొన్ని సైనిక దళాలు శత్రువుల కదలికలను పసిగట్టడానికి, శత్రువు మదీనాపై దాడి చేసే ఆస్కారం ఉన్న ప్రతి మార్గంపై గస్తీ తిరుగుతూ ఉన్నాయి. అయితే, ఆ రాత్రి శత్రువుల నుండి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా క్షేమంగా గడిచిపోయింది.
*శుక్ర వారం, షవ్వాల్ నెల - 6వ తేది, హిజ్రీ శకం - 3.*
తెల్లవారింది. ఉదయభానుడు తన సువర్ణకాంతులతో మదీనా నగరాన్ని పులకింపజేశాడు.
*మదీనాను సంరక్షించేందుకు సలహా సంఘ సమావేశం : -*
మదీనా వేగులు, మక్కా సైన్యానికి చెందిన ఒక్కొక్క వార్తను మదీనాకు చేరవేస్తున్నారు. సైన్యం విడిది చేసిన స్థలం గురించిన చివరి సమాచారం కూడా దైవప్రవక్త (సల్లం)కు అందింది. ఈ సమాచారం అందగానే దైవప్రవక్త (సల్లం) సైనిక హైకమాండ్ కు చెందిన సలహా సంఘాన్ని సమావేశపరచి, సరియైన విధానాన్ని అవలంబించడానికి వారి సలహాలను అడిగారు.
మహాప్రవక్త (సల్లం), తాను కన్న ఓ కలను ప్రస్తావిస్తూ...., *"దైవసాక్షి! నేను ఓ ఉత్తమమైన దృశ్యాన్ని చూశాను. ఆ దృశ్యం ఏమిటంటే, కొన్ని ఆవులు జిబహ్ చేయబడుతున్నాయి. అలానే, నా కరవాలం చివర కొంత మొక్కబోయి ఉంది. నేను నా చేతిని ఓ సురక్షితమైన కవచంలో దూర్చడం చూశాను."* అని అన్నారు.
మహాప్రవక్త (సల్లం), తను కన్న ఆ కలలోని దృశ్యానికి అర్థం చెబుతూ...., *"ఆవులు జిబహ్ చేయబడటం అంటే, కొందరు సహాబాలు హతులవుతారు. కరవాలం మొక్కబోవడమంటే, నా కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి షహీద్ అవుతాడు (అమరగతి నొందుతాడు), సురక్షిత కవచానికి మదీనా నగరం."* అని అర్థం చెప్పారు.
పిదప ఆయన (సల్లం), సహాబా (రజి) గార్లకు యుద్ధం చేసే విధానాన్ని సూచిస్తూ ఓ సలహా ఇచ్చారు. ↓
*In Sha Allah రేపటి భాగములో....; →*
✍🏻✍🏻 *®@£€€q* *+97433572282* ✍🏻✍🏻
*(rafeeq)*
✍🏻✍🏻 *Salman* *+919700067779* ✍🏻✍🏻
*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*
💎💎 *మా సలాం* 💎💎
─┄┅━═══✦═══━┅┄─
No comments:
Post a Comment