229

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉

🕌☪🕋🛐      *ఇస్లాం చరిత్ర - 229*       🛐🕋☪🕌

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 144*      🇸🇦🇸🇦

◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉

      🛡⚔ *ఉహద్ పోరాటం : - 1⚔🛡*

*ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ఖురైష్ చేస్తున్న యుద్ధ సన్నాహాలు : -*

మక్కావాసులు, బద్ర్ యుద్ధంలో తమకు సంభవించిన ఘోర పరాజయం, తమ నాయకులు, గౌరవనీయుల సంహారం విషయంలో ఏ బాధను అయితే అనుభవిస్తున్నారో దాన్ని మరచిపోలేకపోతున్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా పగ తీర్చుకోవడానికి ఒంటికాలిపై నిలబడ్డారు. ఆ ప్రతీకారాన్ని చివరకు, ముస్లిములకు తమ బాధ తెలిసిపోతే వారు పులులైపోతారేమో అనే భయంతో హతుల గురించి ఏడ్వడం, పెడబొబ్బలు పెట్టడాన్ని కూడా అడ్డుకున్నారు. అదేకాదు, యుద్ధఖైదీలను విడిపించుకోవడానికి 'ఫిదియా' చెల్లించడంలో తొందరపడవద్దని హితవులు చేశారు.

మక్కా బహుదైవారాధకులందరూ కలిసి, బద్ర్ యుద్ధానికి ప్రతీకారంగా ఓ గొప్ప యుద్ధం చేసి తమ కోపాగ్నిని చల్లార్చుకుందామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలా ఈ నిర్ణయం అయిపోగానే యుద్ధ సన్నాహాలకు నడుం బిగించారు. ఈ విషయంలో, ఖురైష్ సర్దారుల్లో 'ఇక్రమా బిన్ అబూ జహల్', "సుఫ్'వాన్ బిన్ ఉమయ్యా", ''అబూ సుఫ్'యాన్ బిన్ హరబ్" మరియు 'అబ్దుల్లా బిన్ రబీయా'లు ఉత్సాహంగా పాల్గొని తతంగం నడపనారంభించారు.

ఈ యుద్ధం కోసం వారు చేసిన మొట్టమొదటి పని, బద్ర్ యుద్ధానికి దారితీసిన ఏ వర్తక బిడారాన్నయితే అబూ సుఫ్'యాన్ రక్షించుకొని తన స్వస్థలానికి చేర్చాడో, ఆ వర్తక బిడారానికి సంబంధించిన పూర్తి వర్తక సామగ్రి, యుద్ధసామగ్రిని కొనుగోలు చేయడానికి, యుద్ధ ఖర్చుల కోసమే కేటాయించడం.

ముస్లింల బారిన పడకుండా సురక్షితంగా తప్పించుకున్న వర్తక బిడారాన్ని, ఖురైషీయులు 'దారున్నద్వా'లో ఉంచారు. ఒంటెల మీద విలువగల వ్యాపార సామగ్రి కిటకిటలాడుతోంది. ఇంకా దాన్ని భాగస్తుల్లో పంచలేదు. ఖురైష్ నాయకులంతా సమావేశమై, మక్కా ప్రజల ఏ సరుకు అయితే ఆ బిడారం వెంట ఉందో వారిని పిలిపించారు. అప్పుడు ఖురైష్ నాయకులు, వారిని ఉద్దేశించి ఇలా అన్నారు....; ↓

*"ఓ ఖురైష్ ప్రజలారా! మీకు ముహమ్మద్ (సల్లం) గొప్ప దెబ్బ కొట్టాడు. మీరు ఏరి కోరిన సర్దారులందరిని చంపివేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు తిరిగి యుద్ధం చేయడానికి మీ సరుకును మాకు ఇవ్వండి. బహుశా దాన్ని మేము మీకు తీర్చేయనూ వచ్చు."* అని నచ్చజెప్పారు.

ఇందుకు, ఆ వర్తక బిడారంలోని భాగస్తులందరూ తమ సమ్మతిని తెలపడం జరిగింది.

ఈ పూర్తి వ్యాపార సామగ్రి విలువ ఒక వెయ్యి ఒంటెలు మరియు యాభై వేల దీనార్లు. ఈ పూర్తి సామగ్రిని యుద్ధం కోసం అమ్మేయడం జరిగింది. ఈ సందర్భంగానే అల్లాహ్, దివ్య ఖుర్ఆన్ లోని ఈ వాక్యాన్ని అవతరింపజేశాడు....; ↓

*"నిశ్చయంగా ఈ సత్య తిరస్కారులు ప్రజలను అల్లాహ్ మార్గంలోకి రాకుండా అడ్డుకోవటానికి తమ సంపదలను ఖర్చు పెడుతున్నారు. వారు తమ సొమ్ములను ఇలా ఖర్చు పెడుతూనే ఉంటారు. అయితే ఆ సొమ్ములే వారి పాలిట దుఃఖదాయకంగా పరిణమిస్తాయి. ఆ తరువాత వారు ఓడిపోతారు. సత్యతిరస్కారులు నరకం వైపుకు ప్రోగు చేయబడతారు." (ఖుర్ఆన్ 8:36).*

*యుద్ధ సన్నాహాలలో నిమగ్నమైపోయిన ఖురైషీయులు : -*

బద్ర్ యుద్ధంలో, ఖురైషీయులు చాలా మంది తమ ఆప్తుల్ని పోగొట్టుకున్నారు. అబూ సుఫ్'యాన్ కొడుకు కూడా వధించబడ్డాడు. ఆ యుద్ధంలో అవిశ్వాసుల అంచనాలన్నీ తారుమారయ్యాయి. అందువల్ల ఈ సారి భారీ ఎత్తున సైనికులను, ఆయుధాలను సమీకరించాలని తహతహలాడిపోతున్నారు.

ఖురైషీయులు రాత్రింబవళ్ళు యుద్ధసన్నాహాలలో నిమగ్నులైపోయారు. ఆయుధాలు, ఆహారపదార్థాలు సేకరిస్తున్నారు. ఎక్కడెక్కడినుంచో పేరుమోసిన వీరులు, పహిల్వానులు వచ్చి సైన్యంలో భర్తీ అవుతున్నారు. దానికోసం ఖురైషీయులు, మక్కా చుట్టుప్రక్కల ఉన్న ఎన్నో తెగలను ప్రేరేపించి యుద్ధ ఒడంబడికలు చేసుకున్నారు. స్వచ్ఛందంగా యుద్ధంలో పాల్గొనేందుకు పిలుపునిస్తూ, అహాబీష్ (నీగ్రోలు), కనానా మరియు తెహామా వారెవరైతే ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడదలచుకున్నారో వారంతా, ఖురైష్ పతాకం క్రిందికి వచ్చి చేరమని ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి వారు ప్రోత్సాహం, ఆశలను రేకెత్తించేందుకు అనేక మార్గాలను అవలంబించడం జరిగింది.

చివరికి, బద్ర్ యుద్ధంలో బంధీ అయి, ఇక ఎన్నడూ దైవప్రవక్త (సల్లం)కు వ్యతిరేకంగా నిలబడను అని ప్రతిజ్ఞ చేసి 'ఫిదియా' లేకుండానే విడుదల అయిన 'అబూ ఉజ్జా' అనే కవిని కూడా, సుఫ్'వాన్ బిన్ ఉమయ్యా అరబ్బు తెగలను, ముస్లిములకు వ్యతిరేకంగా ఉసికొల్పమని ఆశ చూపాడు. అతను అలా చేసి యుద్ధం నుండి బ్రతికి బయటపడి వస్తే అతనికి ధనసహాయం చేస్తానని, చనిపోతే అతని కుమార్తెలను సంరక్షిస్తానని మాట ఇచ్చాడు అబూ ఉజ్జా. దైవప్రవక్త (సల్లం) గారితో చేసిన ప్రతిజ్ఞను ధిక్కరించి అరబ్బు తెగల భావోద్రేకాలను, పౌరుషాన్ని, ఆత్మాభిమానాన్ని రెచ్చగొట్టే కవితలు వినిపించి వారిని యుద్ధానికి సంసిద్ధులుగా మార్చాడు. ఇలాగే ఖురైషులకు చెందిన మరో కవి 'ముసాఫె బిన్ అబ్దె మునాఫ్ జుహమి'ని కూడా ఈ కార్యం కోసం సన్నద్ధం చేశాడు.

మరికొంతమంది కవులు, ఉపన్యాసకుల్ని రప్పించి ముస్లింలకు వ్యతిరేకంగా బాగా నూరిపోశారు. తరువాత వారంతా వివిధ తెగల్లోకి పోయి తమ కవితానైపుణ్యంతో, వాగ్ధాటితో యువకుల పౌరుషాన్ని రెచ్చగొట్టి యుద్ధంలో పాల్గొనేలా చేశారు.

ఇటు అబూ సుఫ్'యాన్ 'గజ్వయె సవీఖ్'లో అపజయం పొంది, ఆహార పదార్థాలను పెద్ద మొత్తంలో నష్టపోయి తిరిగివచ్చిన తరువాత, ముస్లింలకు వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టడంలో మరింత చురుకుదనాన్ని చూపిస్తున్నాడు.

చివరగా జరిగిన 'సరియ్యయె జైద్ బిన్ హారిసా' సంఘటన అయితే, ఖురైషులను ఏ గడ్డు పరిస్థితులకు లోను చేసిందో, ఆర్థికంగా వారి నడ్డిని ఎంతగా విరిచిందో మనకు తెలిసిందే. దీనివల్ల వారికి కలిగిన మనస్థాపం అగ్నికి ఆజ్యం పోసింది. ఆ తరువాతనే వారు ముస్లింలతో నిర్ణయాత్మకమైన యుద్ధం చేయడానికి త్వరితగతిన సంసిద్ధులవడం మొదలుపెట్టారు.

*ఖురైషుల సైన్యం, యుద్ధ సామగ్రి మరియు నాయకత్వం : -*

ఆ సంవత్సరం పూర్తయ్యే సరికి ఖురైషుల యుద్ధ సన్నాహాలు కూడా ఓ కొలిక్కి వచ్చాయి. అనుకున్న పనులు చకచక జరిగినందున, కొన్నాళ్ళలోనే ఖురైషీయులు ఓ పెద్ద సైనిక పటాలం తయారు చేశారు.

మక్కా సైన్యమే కాకుండా మిత్రపక్షాలైన అహాబీస్ (నీగ్రోలు)లను కలుపుకొని మొత్తం సైనికబలం మూడు వేలకు చేరింది. ఖురైష్ నాయకులు తమ వెంట స్త్రీలను కూడా తీసుకొని వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. ఇలా స్త్రీలను తమవెంట తీసుకొని వెళ్ళడంలోని గుడార్థం ఏమిటంటే, ఆ స్త్రీల మాన పరిరక్షణా భావంతో సైనికులు మరింత తెగించి పోరాడగలరనే తలంపుతో వారిని వెంటబెట్టుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఆ సైన్యంలో కొందరు స్త్రీలను కూడా వెంట తీసుకొని వెళ్ళడం జరిగింది. వారి సంఖ్య మొత్తం పదిహేను మంది వరకు ఉంటుంది.

ఈ స్త్రీలలో అనేకమంది, బద్ర్ యుద్ధంలో తండ్రులను, కొడుకులను పోగొట్టుకున్నవారు ఉన్నారు. అంచేత వారు కూడా ముస్లింల మీద పట్టరాని ఆగ్రహంతో ఉన్నారు. ఈ స్త్రీలకు, అబూ సుఫ్'యాన్ భార్య 'హింద్ బిన్తె ఉత్బా' నాయకురాలు. బద్ర్ యుద్ధంలో ఈమె తండ్రి, పినతండ్రి, అన్న ముగ్గురూ వధించబడటంతో ఆమె కసి తారాస్థాయికి చేరింది. ముస్లింల మీద ప్రతీకారం తీర్చుకునేదాకా ఎలాంటి పరిమళద్రవ్యాలు వాడనని భీష్మించింది.

ఖురైషీయులు, స్వారీ చేసేందుకు మరియు తమ సామానులు మోయడానికి వెంట మూడు వేల ఒంటెలు, సైనికుల కోసం రెండు వందల గుర్రాలు కూడా ఉన్నాయి. ఈ గుర్రాలు అలసిపోకుండా ఉండడానికిగాను వాటిపై స్వారీ చేయకుండా ప్రక్కన నడిపించుకొని వెళ్ళారు. రక్షణ ఆయుధాల్లో ఏడు వందల కవచాలు కూడా ఉన్నాయి.

అబూ సుఫ్'యాన్ సైన్యానికి సర్వసైన్యాధిపతిగా నియమించడం జరిగింది. సైన్యం కమాండరుగా 'ఖాలిద్ బిన్ వలీద్' నియమించబడ్డాడు. 'ఇక్రమా బిన్ అబూ జహల్' అతనికి సహాయ కమాండరు. అక్కడి సంప్రదాయం ప్రకారం, వారి జెండా 'బనీ అబ్దుద్దార్' తెగ చేతికి ఇవ్వడం జరిగింది.

*"వహ్'షీ"ని ప్రలోభానికి గురిచేసిన ఖురైషీయులు : -*

'హరబ్' కుమారుడు "వహ్'షీ" బరిశె విసరడంలో సిద్ధహస్తుడు. ఈయన 'నీగ్రో' బానిస అయినందున, నీగ్రోల మాదిరిగా బరిశె విసరడంలో మంచి నైపుణ్యం కలవాడు. ఈయన బరిశె విసిరాడంటే అది గురి తప్పడం చాలా అరుదు.

''వహ్'షీ బిన్ హరబ్'', 'జుబైర్ బిన్ ముత్యిమ్'కు బానిసగా ఉండేవాడు. జుబైర్ పినతండ్రి 'తుఅయిమా బిన్ అద్దీ' బద్ర్ యుద్ధంలో చంపబడ్డాడు. ఖురైషీయులు, ఉహద్ యుద్ధం కోసం బయలుదేరి వెళుతున్న ఈ సమయంలోనే 'జుబైర్', తన బానిస "వహ్'షీ బిన్ హరబ్"ను పిలిపించి...., *"వహ్'షీ! నా పినతండ్రి చావుకు బదులుగా నీవు ముహమ్మద్ (సల్లం) పినతండ్రి హమ్'జా (రజి)ను చంపితే, నిన్ను బానిసత్వం నుంచి విముక్తి కలిగించి స్వతంత్రుణ్ణి చేస్తాను."* అని అన్నాడు.

జుబైర్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవడానికి వహ్'షీ, ఖురైష్ సైన్యంతో బయలుదేరడానికి సిద్ధమయ్యాడు.

*యుద్ధానికి బయలుదేరిన మక్కా సైన్యం : -*

ధగధగ మెరిసే ఉక్కు కవచాలు ధరించి రకరకాల ఆయుధాలు చేతబూనిన మూడు వేల మంది సిపాయీలు దైవప్రవక్త (సల్లం)ను, ముస్లింలను చీల్చి చెండాడటానికి తహతహ లాడుతున్నారు. సైన్యంలో ఇతరత్రా పనుల కోసం పదిహేను మంది స్త్రీలు కూడా ఉన్నారు. వీరికి అబూ సుఫ్'యాన్ భార్య 'హింద్' నాయకురాలు. అంతా సిద్ధమైన తర్వాత పెద్ద పెట్టున కోలాహలంతో సైనికవాహిని బయలుదేరింది.

*మక్కా వాసులు యుద్ధానికి బయలుదేరారని దైవప్రవక్త (సల్లం)కు అందిన వార్త : - ↓*

*In Sha Allah రేపటి భాగములో....; →*

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment