228

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉

🕌☪🕋🛐      *ఇస్లాం చరిత్ర - 228*       🛐🕋☪🕌

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 143*      🇸🇦🇸🇦

◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉

*❖ గజ్వయె బహ్రాన్ : -*

దైవప్రవక్త (సల్లం) సైనిక కార్యంలో నిమగ్నమైవున్న ఓ పెద్ద సైన్యాన్ని తీసుకొని, రబీ ఉల్ ఉఖ్రా మాసం, హిజ్రీ శకం - 3లో బహ్రాన్ పేరుగల ఓ ప్రాంతానికి బయలుదేరారు. మొత్తం సైనికుల సంఖ్య మూడు వందలు. ఇది 'హిజూజ్'లో 'ఫరా' అనే ప్రదేశంలో ఉన్న ఖనిజ ప్రాంతం - రబీ ఉల్ ఉఖ్రా మరియు జమాదిల్ ఊలా రెండు నెలల వరకు అక్కడనే ఉండిపోయారు. ఆ తరువాత మదీనాకు తిరిగి వచ్చారు. ఎలాంటి యుద్ధం జరగలేదు.★

_(★→ ఇబ్నె హష్షామ్ - 2/50,51; జాదుల్ ముఆద్ - 2/91. ఈ గజ్వాకు సంబంధించిన కారణాలను నిర్ణయించడంలో అభిప్రాయ భేదాలున్నాయి. ఓ ఉల్లేఖనం ప్రకారం, బనూ సులైమ్ తెగవారు మదీనాపై దాడి చేయడానికి మదీనా పరిసర ప్రాంతాల్లో ఓ పెద్ద సైన్యాన్ని మోహరిస్తున్నారన్న వార్త విని బయలుదేరారని; మరో ఉల్లేఖనంలో...., → దైవప్రవక్త (సల్లం) ఖురైష్ వర్తక బిడారాన్ని పట్టుకోడానికి బయలుదేరారని చెప్పుకోవడం జరుగుతోంది. ఇబ్నె హష్షామ్ ఈ కారణాన్నే ఉటంకించారు. ఇబ్నె ఖైమ్ కూడా దాన్నే అనుసరించారు. బనూ సులైమ్ తెగ ప్రస్తావనే అక్కడ లేదు. ఇదే సరైందని చెప్పవచ్చు కూడా. ఎందుకంటే బనూ సులైమ్ 'ఫరా' చుట్టుపట్ల కాకుండా నజద్ లో నివాసమున్నవారు. ఇది 'ఫరా'కు చాలా దూరాన ఉన్న ప్రదేశం.)_

*❖ సరియ్యా జైద్ బిన్ హారిసా : -*

ఉహద్ యుద్ధానికి పూర్వం ముస్లిముల చిట్టచివరి మరియు విజయవంతమైన సైనిక చర్య ఇది. ఇది జమాదిల్ ఆఖిరా, హిజ్రీ శకం - 3 లో సంభవించింది.

*ఆ సంఘటన జరిగిన తీరు ఇది....; ↓*

ఖురైషీయులు, బద్ర్ యుద్ధం తరువాత అవమానానికీ, అసంతృప్తికీ గురి అయ్యే ఉన్నారు. అంతలోనే వేసవికాలం కూడా వచ్చేసింది. సిరియాకు వ్యాపార బిడారం వెళ్ళే సమయం కూడా ఆసన్నమైంది. కనుక వారికి మరో బెంగ పట్టుకుంది. ఈ సంవత్సరం "సుఫ్'వాన్ బిన్ ఉమయ్యా", ఖురైష్ వర్తక బిడారం వెంట సిరియాకు వెళ్ళవలసి ఉంది. అతను ఖురైషులతో...., *"ముహమ్మద్ (సల్లం) మరియు అతని అనుయాయులు మన వర్తక రహదారిని కష్టతరం చేసి ఉన్నారు. మనం ఎటు నుండి వెళ్ళాలో అర్థం కావడం లేదు. వారిని ఎలా ఎదుర్కోవాలో తోచడం లేదు. వారు సముద్ర తీరం వదిలి ఎటూ పోవడం కూడా లేదు. అక్కడ నివసించే తెగలతో సంధి కూడా కుదుర్చుకొని ఉన్నారు. సాధారణ ప్రజలు సైతం వారి వెంటే ఉన్నారు. ఏ మార్గాన్ని అవలంబించాలో అర్థం కావడం లేదు. మనం ఇలానే ఇంట్లో కూర్చుని ఉంటే మన అసలు సొమ్మును కూడా తినేయగలం. ఇక మనకు ఏమీ మిగలదు. మక్కాలో మన జీవన మనుగడ ఈ వ్యాపారమే మరి. వేసవిలో సిరియాకు, చలికాలంలో అబీసీనియాకు వెళ్ళి వ్యాపారం చేయడమే మన వృత్తి కదా!"* అన్నాడు.

సుఫ్'వాన్ లేవనెత్తిన ఈ ప్రశ్నకు ఖురైషులు ఆలోచనలో పడిపోయారు. చివరికి 'అస్వద్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్', సుఫ్'వాన్ ను ఉద్దేశించి...., *"నీవు సముద్ర మార్గం వెంట వెళ్ళే రహదారిని వదిలేసి ఇరాక్ మార్గాన బయలుదేరు."* అన్నాడు

ఈ మార్గం చాలా పొడుగైనది. 'నజద్' నుండి వెళ్ళవలసి ఉంటుంది. మదీనాకు తూర్పున చాలా ఎడంగా వెళ్ళే మార్గమిది - _ఖురైషులకు ఈ మార్గం గురించి ఏమీ తెలియదు అనేది ఇక్కడ గమనించవలసిన విషయం_ - అందుకని 'అస్వద్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్', సుఫ్'వాన్ కు సలహా ఇస్తూ...., *"'ఫరాత్ బిన్ హయ్యాన్★'ను వెంటబెట్టుకు వెళ్ళు. అతను మార్గం చూపడానికి సహాయపడతాడు."* అన్నాడు.

_(★→ ఈయన 'బక్ర్ బిన్ వాయిల్' తెగకు చెందినవాడు.)_

చివరికి ఖురైషుల వర్తక బిడారం, "సుఫ్'వాన్ బిన్ ఉమయ్యా" సారథ్యంలో క్రొత్త మార్గం గుండా బయలుదేరింది. అయితే, ఈ వర్తక బిడారం ఎటు వెడుతుందో దైవప్రవక్త (సల్లం)కు వార్త అందనే అందింది. జరిగినదేమిటంటే, 'సులైత్ బిన్ నోమాన్' అనే వ్యక్తి రహస్యంగా ఇస్లాం స్వీకరించి ఉన్నారు. 'సులైత్', ఇంకా ఇస్లాం స్వీకరించని 'నుఅయిమ్ బిన్ మస్ఊద్'తో కలిసి మధుశాలలో సారా త్రాగుతున్నారు. _(ఇది సారాయి హరాం కాక పూర్వంనాటి మాట)_ 'నుఅయిమ్'కు బాగా మత్తు వచ్చినప్పుడు, ఆయన ఆ వర్తక బిడారం వెళ్ళే పథకాన్ని 'సులైత్'కు చెప్పేశాడు. 'సులైత్' ఆఘమేఘాల మీద దైవప్రవక్త (సల్లం) దగ్గరకు వెళ్ళి విషయమంతా చెప్పేశారు.

మహాప్రవక్త (సల్లం) వెంటనే దాడికి సిద్ధం కావలసిందిగా ముస్లిములను ఆదేశించారు. వందమంది ఉష్ట్రారోహుల ఓ పటాలాన్ని 'హజ్రత్ జైద్ బిన్ హారిసా (రజి)'కు ఇచ్చి పంపించారు. 'హజ్రత్ జైద్ బిన్ హారిసా (రజి)' ఎంతో వేగంగా ఖురైషుల వర్తక బిడారానికి ఈ విషయం తెలియకుండా పయనించి 'ఖిర్దా' అనే నీటి చెలమ వద్దకు వెళ్ళి దాడి చేశారు. హఠాత్తుగా తమపై జరిగిన ఈ దాడికి ఆ బిడారంవారు పారిపోయారు. ఆ వర్తక సామాగ్రినంత హస్తగతం చేసుకున్నారు 'హజ్రత్ జైద్ (రజి)'.

ముస్లిములు, ఆ బిడారానికి మార్గం చూపుతున్న 'ఫరాత్ బిన్ హయ్యాన్'ను మరో ఇద్దరిని కూడా బంధించారు. బిడారానికి సంబంధించిన పాత్రలు, వెండి, మరి ఇతర సామగ్రి ఖరీదు మొత్తం ఒక లక్ష దిర్హమ్ ల వరకు ఉంటుంది. ఈ యుద్ధధనం నుండి 'ఖమ్స్' తీసి దైవప్రవక్త (సల్లం) మిగిలినదాన్ని ఆ సైనిక చర్యలో పాల్గొన్న వారికి పంచిపెట్టారు. 'ఫరాత్ బిన్ హయ్యాన్', దైవప్రవక్త (సల్లం) గారి చేతి మీదుగా ఇస్లాం స్వీకరించారు.

బద్ర్ అపజయం తరువాత ఇది ఖురైషుల పాలిట గొప్ప బాధాకరమైన ఓటమి. ఇది వారి బాధను మరింత పెంచేసింది.

ఇక వారి ముందు రెండే రెండు మార్గాలు మిగిలిపోయాయి. ఒకటవది; తమ గర్వాన్ని, బింకాన్ని వీడి ముస్లిములతో సంధి కుదుర్చుకోవడం. రెండవది; శక్తి మేరకు యుద్ధం చేసి తాము పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి నిలబెట్టుకోవడం, ముస్లిములు తిరిగి తల ఎత్తకుండా వారిని అణచివేయడం.

మక్కా ఖురైషీయులు ఈ రెండవ మార్గాన్నే అవలంబించారు. ఈ సంఘటన జరిగిన తరువాత ఖురైషుల ప్రతీకారేచ్ఛ మరింత ఉగ్రరూపం దాల్చింది. ముస్లిములను, వారి స్వస్థలంలోకే చొరబడి వారిపై దాడి చేయడానికి పూర్తి సన్నాహాలు చేయడంలో నిమగ్నమైపోయారు. ఇలా గతంలో జరిగిన సంఘటనలే కాకుండా ఈ సంఘటన కూడా *"ఉహద్ యుద్ధం"*ను పురికొల్పడానికి కారణభూతమైంది.

*In Sha Allah రేపటి భాగములో....; ↓*

🛡⚔ *ఉహద్ యుద్ధం* ⚔🛡

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment