🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐
🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋
◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉
🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర - 227* 🛐🕋☪🕌
🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 142* 🇸🇦🇸🇦
◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉
*❖ కఅబ్ బిన్ అష్రఫ్ సంహారం : - 2*
ఇటు ఈ చిన్న పటాలం, 'కఅబ్ బిన్ అష్రఫ్' ఉండే దివాణం గుమ్మం వరకు వెళ్ళి, అబూ నాయిలా అంటూ బిగ్గరగానే అతణ్ణి పిలిచారు. ఆ పిలుపు విని 'కఅబ్' వారి దగ్గరకు రావాలని. ఈ పిలుపు విని 'కఅబ్' లేచి నిలబడగానే, క్రొత్తగా పెళ్ళి అయి వచ్చిన 'కఅబ్' భార్య అతణ్ణి అడ్డుకుంటూ...., *"మీరెక్కడికి వెళుతున్నారు? నాకు వినవచ్చే శబ్దాలను బట్టి చూస్తే ఏదో రక్తం చిందినట్లుగా అనిపిస్తోంది."* అని అన్నది.
*"ఓ అతనా, నా సోదరుడు 'ముహమ్మద్ బిన్ ముస్లిమా'. మరొకడు నా చిన్ననాటి నాతో పాలు త్రాగిన మిత్రుడు 'అబూ నాయిలా'".* అంటూ బయటకు వచ్చేశాడు. ఆయన, నిలువెల్ల సువాసన పులుముకొని ఉన్నాడు. తల నుండి అత్తరు వాసన గుబాళింపు తెరలు తెరలుగా వ్యాపిస్తుంది.
*అబూ నాయిలా, కఅబ్ ను చంపే పథకాన్ని తన అనుచరులకు ఇలా సూచించాడు....; ↓*
*"అతను బయటకు వచ్చిన తరువాత, నేను అతని వెంట్రుకలు పట్టి వాసన చూస్తాను. నేను గట్టిగా అతని తల పట్టుకొని నా నియంత్రణలోనికి తీసుకోగానే మీరు అతనిపై పడి వధించాలి."* అని చెప్పారు.
'కఅబ్', ఇంటి నుండి బయటకు వచ్చిన తరువాత కొంతసేపు మాట్లాడుకోవడం జరిగింది, ఆ తరువాత 'అబూ నాయిలా' ఇలా అన్నాడు....; ↓
*"అబూ అష్రఫ్ ! మనం 'షీబె అజూజ్' వరకు వెళ్ళి కూర్చొని ఎందుకు మాట్లాడుకోకూడదు?"* అని అనగా; అతను సంతోషంగా అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు.
అందరూ కలసి 'షీబె అజూజ్' వరకు వెడుతూ ఉన్నారు. దారిలో అబూ నాయిలా, కఅబ్ ను ఉద్దేశించి...., *"కఅబ్, ఈ రోజు వచ్చే అత్తరు సువాసనను నేను ఎప్పుడూ ఆఘ్రాణించలేదే!"* అని ఆశ్చర్యం ప్రకటించారు.
ఇది విన్న కఅబ్ వక్షస్థలం గర్వంతో పొంగిపోయింది.
*"అదా, నా దగ్గర ఇప్పుడు అరేబియాలోనే సువాసన గల మహిళ ఉంది తెలుసా?"* అని అన్నాడు కఅబ్.
*"అనుమతిస్తే నీ తలను వాసన చూస్తాను."* అన్నారు అబూ నాయిలా.
*"ఎందుకు చూడకూడదు, చూడండి."* అని అనగా; తలలో చేయిపెట్టి తీసి తానూ వాసన చూశారు, తన వెంట ఉన్న వారికి ఆ వాసనను చూయించారు అబూ నాయిలా.
మరికొంత దూరం వెళ్ళిన తరువాత అబూ నాయిలా, కఅబ్ తో...., *"మరోసారి వాసన చూడనివ్వరా!"* అని మళ్ళీ అడిగారు.
*"చూడండి, దానికేముంది?"* అని అనగా; తిరిగి అబూ నాయిలా ఇదివరకు వాసన చూసినట్లే వాసన చూశారు.
ఇంకొంత దూరం వెళ్ళిన తరువాత మళ్ళీ అబూ నాయిలా అదే కోరిక కోరారు. ఈసారి కూడా అతను గర్వపడుతూ వాసన చూసుకొమ్మని తలను అందించాడు.
ఈసారి అబూ నాయిలా అతని తలలో చెయ్యిదూర్చిపెట్టి గట్టిగా పట్టుకొని, *"ఇదిగో అల్లాహ్ విరోధి!"* అనగానే, అతనిపై ఎన్నో కరవాలాలు విరుచుకుపడ్డాయి. అయినా అవి అతనిపై పనిచేయలేదు. ఇది చూసిన 'ముహమ్మద్ బిన్ ముస్లిమా' తన పిక్కాసును 'కఅబ్' పొత్తికడుపుపై వేసి బలంగా గుద్దారు. అది అతని కడుపులోనికి దూరి శరీరం నుండి బయటికి వచ్చింది. ఈ దైవవిరోధి అక్కడనే అంతమైపోయాడు.
ఆ దాడి జరిగినప్పుడు 'కఅబ్' పెట్టిన కేక చుట్టుపట్ల సంచలనం సృష్టించింది. కాగడాలు ముట్టించకుండా ఉండని ఏ కోట కూడా మిగల్లేదు (అయినా ఏమీ జరగలేదు).
ఈ చర్య సందర్భంగా 'హజ్రత్ హారిస్ (రజి) బిన్ అవస్' గారికి కొందరు సహచరుల కరవాలపు మొన తగిలి గాయమైంది. ఆయన శరీరం నుండి రక్తం కారనారంభించింది. ఈ సైనిక పటాలం తిరిగి 'హుర్రయె అరీజ్'కు చేరి చూసుకుంటే 'హజ్రత్ హారిస్ (రజి) బిన్ అవస్' వారి వెంట లేరు. అందరూ అక్కడనే ఆగిపోయారు. కొంచెం సేపైన తరువాత 'హారిస్ (రజి)', వీరి అడుగుజాడల్ని గుర్తిస్తూ అక్కడకు వచ్చి చేరారు.
ఆ తర్వాత, అక్కడ నుండి ఆయనను ఎత్తుకొని 'బకీయె గర్ఖద్' వరకు వెళ్ళి *"అల్లాహు అక్బర్"* అంటూ పెద్ద పెట్టున నినదించారు. ఈ నినాదం మహాప్రవక్త (సల్లం)కు కూడా వినబడింది. వీరు అతణ్ణి చంపేశారని వెంటనే గ్రహించి ఆయన (సల్లం) కూడా *"అల్లాహు అక్బర్"* అని అన్నారు.
వీరంతా కలసి దైవప్రవక్త (సల్లం) సన్నిధికి వచ్చిన తరువాత ఆయన (సల్లం)...., *"ఈ ముఖాలు విజయంతో కూడుకున్న ముఖాలు."* అన్నారు.
వచ్చిన వారు కూడా అందుకొని...., *"మీ వదనం కూడాను ఓ మహాప్రవక్తా (సల్లం)!"* అన్నారు.
ఆ వెంటనే ఆ దైవధిక్కారి తల ఆయన (సల్లం) ముందు ఉంచడం జరిగింది. ఆయన (సల్లం), అతని మరణానికి అల్లాహ్ ను స్తుతించారు. దైవప్రవక్త (సల్లం), 'హజ్రత్ హారిస్ (రజి)' గారి గాయంపై తన ఉమ్మిని ఊయగా ఆయనకు బాధ పోయింది. ఆ తరువాత ఆ గాయం మానిపోయింది. ఇంకెప్పుడు ఆ గాయం 'హారిస్ (రజి)'ను బాధించలేదు.
ఇటు యూదులకు, తమ నాయకుడు 'కఅబ్ బిన్ అష్రఫ్' హత్యోదంతం తెలిసినప్పుడు, వారి మొండి హృదయాల్లో భయాందోళనలు రేకెత్తాయి. శాంతి వాతావరణాన్ని భగ్నం చేస్తూ, కల్లోలాల్ని రేకెత్తించి, ప్రజల్లో అశాంత వాతావరణాన్ని సృష్టించేవారిపై, ఒప్పందాన్ని భగ్నం చేసేవారిపై, తన ప్రబోధం పనిచేయడం లేదని తెలిస్తే, దైవప్రవక్త (సల్లం) బలప్రయోగం చేసి వారిని అణచడానికి వెనుకాడబోరన్న విషయం వారికి తెలిసిపోయింది. అందుకనే వారు ఆ యూద నాయకుని హత్య విషయంలో నోరు మెదపలేకపోయారు. అప్పటి నుండి దైవప్రవక్త (సల్లం)తో జరిగిన ఒప్పందానికి కట్టుబడి మిన్నకుండ ఉండిపోయారు.
ఇలా దైవప్రవక్త (సల్లం)కు మదీనాకు వెలుపల జరిగే కుట్రలను ఎదుర్కొనడానికి అవకాశం లభించింది. ముస్లిములకు కూడా మదీనాలో అంతర్గతంగా పొడసూపే ప్రమాదాల నుండి కొంత ఊరట కలిగినట్లయింది.
*❖ గజ్వయె బహ్రాన్ : -*
దైవప్రవక్త (సల్లం) సైనిక కార్యంలో నిమగ్నమైవున్న ఓ పెద్ద సైన్యాన్ని తీసుకొని, రబీ ఉల్ ఉఖ్రా మాసం, హిజ్రీ శకం - 3లో బహ్రాన్ పేరుగల ఓ ప్రాంతానికి బయలుదేరారు. మొత్తం సైనికుల సంఖ్య మూడు వందలు. ఇది 'హిజూజ్'లో 'ఫరా' అనే ప్రదేశంలో ఉన్న ఖనిజ ప్రాంతం - రబీ ఉల్ ఉఖ్రా మరియు జమాదిల్ ఊలా రెండు నెలల వరకు అక్కడనే ఉండిపోయారు. ఆ తరువాత మదీనాకు తిరిగి వచ్చారు. ఎలాంటి యుద్ధం జరగలేదు.★
*మిగిలినది In Sha Allah రేపటి భాగములో....;*
🛡⚔ *ఉహాద్ సంగ్రామం మరో రెండు రోజుల్లో....;* ⚔🛡
✍🏻✍🏻 *®@£€€q* *+97433572282* ✍🏻✍🏻
*(rafeeq)*
✍🏻✍🏻 *Salman* *+919700067779* ✍🏻✍🏻
*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*
💎💎 *మా సలాం* 💎💎
─┄┅━═══✦═══━┅┄─
No comments:
Post a Comment