🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐
🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋
◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉
🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర - 226* 🛐🕋☪🕌
🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 141* 🇸🇦🇸🇦
◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉
*❖ కఅబ్ బిన్ అష్రఫ్ సంహారం : - 1*
ముస్లిములు మరియు ఇస్లాం ధర్మం ఎడల శత్రుత్వం వహించిన యూదుల్లో ఇతనే ప్రముఖుడు. ఇతను దైవప్రవక్త (సల్లం)ను అనేక రకాలుగా హింసించేవాడు. ఆయన (సల్లం)కు వ్యతిరేకంగా బాహాట యుద్ధం కోసం పురికొలిపేవాడు. దైవప్రవక్త (సల్లం) పేరు వింటేనే 'కఅబ్' ఆపాదమస్తకం మండిపడేవాడు.
ఇతను 'తై' వంశానికి చెందిన ''బనూ నిబ్'హాన్'' తెగకు చెందినవాడు. అతని తల్లి 'బనీ నజీర్' తెగకు చెందిన ఆడపడుచు. ఇతను గొప్ప ధనవంతుడేకాక అరేబియాలోనే అందమైన వ్యక్తి. అదే కాదు, అతను సుపరిచితుడైన కవి కూడాను. ఇతని కోట, మదీనాకు దక్షిణంగా ఉన్న 'బనీ నజీర్' ఆవాస ప్రాంతం వెనుక భాగంలో ఉంది.
బద్ర్ యుద్ధంలో ముస్లిములకు లభించిన విజయం మరియు ఖురైష్ సర్దారుల ఘోర పరాజయ వార్త వినగానే అతను అన్న మాటలు ఇవి....; ↓
*"ఏమిటీ! నిజంగానే అలా జరిగిందా? వీరు అరబ్బుల గౌరవనీయులు మరియు అరేబియా ప్రజలకే రాజులు కదా! ఒక వేళ ముహమ్మదే వారిని ఓడిస్తే ఇక వారు ఈ భూమిపై బ్రతికి బట్టకట్టడం కంటే చనిపోయి భూమిలో ఖననం అయిపోవడమే మేలు."*
ఈ వార్త పూర్తి రుజువులతో అతని ముందుకు వచ్చిన తరువాత ఈ దైవవిరోధి ముస్లిములను హజ్జో చేయడం _(అంటే కవనంలో ముస్లిములను తూలనాడడం)_ మరియు ఇస్లాం విరోధుల్ని పొగుడుతూ, వారిని ముస్లిములకు వ్యతిరేకంగా ఉసికొల్పనారంభించాడు.
అప్పటికి అతనికి సంతృప్తి కలగక ఒక ఒంటెను అధిరోహించి మక్కా కు వెళ్ళాడు. మక్కాలో, 'ముత్తలిబ్ బిన్ అబీ వదాఆ సహ్మీ'కి అతిథి అయ్యాడు.
ఆ తరువాత ముష్రిక్కుల పౌరుషాన్ని, ఆత్మాభిమానాన్ని రెచ్చగొట్టి, వారి ప్రతీకారేచ్ఛను ఇనుమడింపజేస్తూ దైవప్రవక్త (సల్లం)కు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కవన భాషలో, బద్ర్ యుద్ధంలో వారి సర్దారులు హతులై బావిలో పడవేయబడ్డ దృశ్యాన్ని చిత్రీకరిస్తూ నౌహా _(హతుల గురించి రోదించే విధానం)_ ను ప్రారంభింపజేశాడు.
మక్కాలో మకాం వేసిన కాలంలో అతనితో ''అబూ సుఫ్'యాన్" మరియు ఇతర ముష్రిక్కులు...., *"మా మతం మీ దృష్టిలో మేలైనదా లేదా ముహమ్మద్ (సల్లం) మరియు అతని అనుచరులు అవలంబిస్తున్న మతమా? మా రెండు మతాల్లో ఏ మతం రుజుమార్గంపై ఉంది?"* అని అడగనారంభించారు.
దానికి కఅబ్ బిన్ అష్రఫ్...., *"అదేమిటీ, మీరే వారికంటే సన్మార్గంపై ఉన్నవారు. మీరు అవలంబించే మతమే వారి మతం కంటే మేలైనది."* అని అన్నాడు.
*↑ ఇదే సంఘటన వేరొక సీరత్ కితాబ్ ప్రకారం : - ↓*
●బద్ర్ యుద్ధంలో అనేకమంది ఖురైషీయులు చంపబడ్డారన్న వార్త నిజమేనని నమ్మకం కుదరగానే 'కఅబ్ బిన్ అష్రఫ్' అసహనంతో అరుస్తూ, గుండెలు బాదుకుంటూ మక్కా పరుగెత్తాడు.
కఅబ్ మక్కా వెళ్ళగానే, మక్కా ప్రజల ముందు ముస్లింలను నిందిస్తూ, వారిపై దుష్ప్రచారం మొదలెట్టాడు. అవిశ్వాసుల భావోద్రేకాలను రెచ్చగొడుతూ ప్రసంగాలు చేశాడు. దైవప్రవక్త (సల్లం)కు వ్యతిరేకంగా బహుదైవారాధకుల్ని ఉసిగొల్పాడు. బద్ర్ లో మరణించిన ఖురైష్ నాయకుల పేర్లను ప్రస్తావిస్తూ విషాదగీతాలు ఆలపించాడు.
మక్కా ఖురైషీయులు, 'కఅబ్'ను తెగపొగిడి ఆకాశానికి ఎత్తారు. అమితమైన గౌరవమర్యాదలు జరిపారు. ఘనంగా అతిథ్యమిచ్చారు. మక్కాలో 'కఅబ్' పలికే ఉద్రేకపూరితమైన మాటలకు వంతపాడే స్వార్థపరులైన కవులు కూడా కొందరు అతని చుట్టూ చేరారు. 'కఅబ్' లాగానే వీరు కూడా తమ గేయాలు, కవితల ద్వారా జనాన్ని రెచ్చగొట్టసాగారు.
ఈ విధంగా 'కఅబ్' ముస్లింల పట్ల ఖురైషీయుల గుండెల్లో అమితమైన ద్వేషాగ్ని జ్వాలలు రేకెత్తించాడు. చివరికి స్త్రీలు కూడా కసి, ద్వేషాలతో కుతకుతలాడిపోయారు. వారు బద్ర్ యుద్ధంలో హతులైన వారి గురించి హృదయాన్ని కలచివేసే విషాద గీతాలు ఆలపించేవారు. అదీకాక, దైవప్రవక్త (సల్లం)ను నిందిస్తూ, విషం వెదజల్లే పాటలు కూడా పాడి ఖురైషీయుల గుండెల్లో ప్రతీకారాగ్నిని మరింత ప్రజ్వరిల్లజేసేవారు.●
ఇలా కఅబ్ బిన్ అష్రఫ్, మక్కాలో ముష్రిక్కుల మనస్సుల్లో విషబీజాలు నాటి మదీనాకు వచ్చేశాడు. అప్పటికి అతని గుండెల్లో రగిలిన మంటలు చల్లారలేదు. అతను ద్వేషాగ్నితో మండిపోతూ, మదీనా వచ్చిన తర్వాత, మహాప్రవక్త (సల్లం)గారి అనుచరుల స్త్రీలను గురించి అవమానకరమైన కవితలు అల్లి చెప్పనారంభించాడు. ముస్లిం మహిళలపై బురద చల్లడానికి పాల్పడి, వారి పవిత్ర శీలంపై అపనిందలు వేయడానికి పూనుకున్నాడు. వారిని తన తిట్లు, దుర్భాషలతో తీవ్రంగా బాధింపసాగాడు.
ఆ కర్కోటకుడి చేష్టలను ముస్లింలు చాలా కాలం సహించారు. కాని, ఎంత కాలమని అలా సహిస్తూ ఊరుకుంటారు? అతని దుష్ట చేష్టలు హద్దుమీరిపోయాయి. ముస్లింలలో ఓర్మి నశించింది.
ఈ పరిస్థితులను సహించలేకనే మహాప్రవక్త (సల్లం) తన అనుచరులను ఉద్దేశించి...., *"'కఅబ్ బిన్ అష్రఫ్' పని పట్టేవారు మీలో ఎవ్వరూ? అతను అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను బాధిస్తున్నాడు."* అని అడిగారు.
సమాధానంగా 'ముహమ్మద్ బిన్ సల్మా', 'అబ్బాద్ బిన్ బ్రష్', 'అబూ నాయిలా'★, 'హారిస్ బిన్ అవస్' మరియు 'అబూ అబస్ బిన్ జబ్ర్' లేచి ముందుకు వచ్చారు. ఈ చిన్నపాటి బృందానికి నాయకునిగా 'ముహమ్మద్ బిన్ సల్మా' నియమితులైనారు. ఈయనకు, 'కఅబ్'కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. కాని, 'ముహమ్మద్ బిన్ సల్మా' ముస్లిం అయిన సంగతి 'కఅబ్'కు తెలియదు.
_(★→ఈయన మరో పేరు 'సల్కాన్ బిన్ సలామా' కూడాను. ఆయన 'కఅబ్'కు అతని తల్లి పాలు త్రాగడం రీత్యా సోదరుడు)_
*'కఅబ్ బిన్ అష్రఫ్' హత్యకు సంబంధించిన ఉల్లేఖనాలన్నిటినీ జోడిస్తే, అతని హత్య జరిగిన తీరు ఎలాంటిదో తెలుస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి....; ↓*
దైవప్రవక్త (సల్లం), తమ అనుచరులను ఉద్దేశించి...., *"అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లం)ను నొప్పించిన ఆ 'కఅబ్ బిన్ అష్రఫ్' పని ఎవరు పడతారు."* అని అనగానే, 'ముహమ్మద్ బిన్ సల్మా' లేచి నిలబడి ఇలా విన్నవించుకున్నారు....; ↓
*ముహమ్మద్ బిన్ సల్మా : -* దైవప్రవక్తా! నేను దానికి సిద్ధం. అతణ్ణి చంపేయమంటారా?
*ముహమ్మద్ (సల్లం) : -* అవును.
*ముహమ్మద్ బిన్ సల్మా : -* నాకు అతనితో మాట్లాడే అనుమతి ఇవ్వగలరా?
*ముహమ్మద్ (సల్లం) : -* అవును. అతనితో సంభాషించవచ్చు.
_ఆ తరువాత ముహమ్మద్ బిన్ సల్మా (రజి), కఅబ్ బిన్ అష్రఫ్ వద్దకు వెళ్ళారు. అప్పుడు వారిద్దరి మధ్య సంభాషణ ఇలా జరిగింది....; ↓_
*ముహమ్మద్ బిన్ సల్మా : -* అతను చూశావా! (అంటే దైవప్రవక్త (సల్లం) అన్నమాట) మా నుండి సదఖా వసూలు చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే ఆయన (సల్లం) మమ్మల్ని కష్టాలకడలిలో ముంచాడనుకో.
*కఅబ్ : -* దైవసాక్షి! అప్పుడే ఏమైంది! ముందుంది ముసళ్ళ పండుగ.
*ముహమ్మద్ బిన్ సల్మా : -* మేము అతని (సల్లం) విధేయులమైపోయాము కాబట్టి పర్యవసానం ఏమవుతుందో చూడందే వదిలిపెట్టేవాళ్ళం కాము. సరే, మీరు మాకు ఒకటి లేదా రెండు వస్క్ ల ధాన్యం (ఓ రకం కొలత) ఇవ్వాలి సుమా.
*కఅబ్ : -* దానికి ఏదైనా కుదవ పెట్టాలి కదా!
*ముహమ్మద్ బిన్ సల్మా : -* మీరు ఏం కోరుతారో చెప్పండి, కుదవపెడతాం.
*కఅబ్ : -* మీ స్త్రీలను నా వద్దకు పంపించి కుదువ పెట్టండి.
*ముహమ్మద్ బిన్ సల్మా : -* అదేమిటి! మేము మా స్త్రీలను మీ దగ్గర ఎలా కుదవపెట్టగలం? మీరు అరేబియాలోనే అందమైన వారు కదా?
*కఅబ్ : -* సరే, మీ కుమారుల్నే కుదవపెట్టండి.
*ముహమ్మద్ బిన్ సల్మా : -* మేము మా కుమారులను ఎలా కుదువపెడతాం ? అలా జరిగితే మీరు, ఒకటి లేదా రెండు వస్క్ ల ధాన్యం కోసం కుదవపడ్డవారని వారిని ఎత్తి పొడవారా? అది మాకు సిగ్గుచేటైన విషయం అవుతుంది. ఆ ధాన్యానికి మా నుండి మీరు మా ఆయుధాలను పొంది కుదవపెట్టుకోవచ్చు. ఏమంటారు?
దానికి *"సరే"* అన్నాడు 'కఅబ్ బిన్ అష్రఫ్'.
ఆ పిదప వారిద్దరి నడుమ జరిగిన ఒప్పందం ప్రకారం 'ముహమ్మద్ బిన్ ముస్లిమా' ఆయుధాలు తీసుకొని 'కఅబ్' దగ్గరకు వస్తారు.
ఇటూ, 'అబూ నాయిలా (రజి)' కూడా ఒంటరిగా 'కఅబ్ బిన్ అష్రఫ్' దగ్గరికి వచ్చారు. కొంతసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్న తరువాత కఅబ్ కవనాన్నీ విన్నారు. తాను కొన్ని పద్యపాదాలను అతనికి వినిపించారు. ఆ తరువాత అతనిని ఉద్దేశిస్తూ...., *"ఇబ్నె అష్రఫ్! నేను నీ దగ్గరకు ఓ అవసరం ఉండి వచ్చాను. దాన్ని నీ ముందు ఉంచుతానుగాని, నీవు దాన్ని రహస్యంగా ఉంచుతానని మాట ఇవ్వాలి."* అని అడిగారు.
*"సరే, నేను దాన్ని రహాస్యంగానే ఉంచుతాను. అదేమిటో చెప్పు."* అన్నాడు కఅబ్.
*"ఏమీ లేదు. ఆ వ్యక్తి (అంటే దైవప్రవక్త - సల్లం) రాక మా కోసం ఓ చిక్కు తెచ్చిపెట్టింది. అరేబియా అంతా మాకు శత్రువు అయిపోయింది. అందరూ కలసి మమ్మల్ని సంహరింపజూస్తున్నారు. మాకు వేరే మార్గాలు లేవు. మా పిల్లాజల్లా సర్వనాశనమైపోతున్నారు. మా ప్రాణాలపైకి వచ్చింది."* అంటూ 'ముహమ్మద్ బిన్ ముస్లిమా' చెప్పినట్లుగానే చెప్పారు. ఇలా మాట్లాడుకుంటూనే మరో విషయం చెప్పారు 'అబూ నాయిలా'.
*"నా వెంట ఇంకొందరు మిత్రులున్నారు. నా భావాలే వారి భావాలు కూడా. వారిని నీ వద్దకు తీసుకురాదలిచాను. వారికి కూడా ఏదైనా అమ్మి సహాయపడు."* అన్నారు.
'ముహమ్మద్ బిన్ ముస్లిమా' మరియు 'అబూ నాయిలా' ఈ చర్చ ద్వారా తమ లక్ష్యం నెరవేర్చుకోగలిగారు. దీని తరువాత ఇలా ఆయుధాలు మరియు సహాయకులతో రావడం వల్ల 'కఅబ్'కు అనుమానం ఏమాత్రం కలగదు. ఈ ప్రాథమిక ఘట్టం పూర్తియిన తదుపరి రబీ ఉల్ అవ్వల్ - 14, హిజ్రీ శకం - 3న పున్నమి రాత్రి ఓ చిన్న సైనిక పటాలం మహాప్రవక్త (సల్లం) దగ్గరకు వచ్చింది.
దైవప్రవక్త (సల్లం) కూడా వారి వెంట "బకియె గర్'ఖద్" వరకు తోడుగా వెళ్ళారు. ఆ తరువాత ఆయన (సల్లం) వారితో...., *"వెళ్ళండి! బిస్మిల్లాహ్! ఓ అల్లాహ్ వీరికి సహాయపడు!"* అని దీవించి ఇంటికి తిరిగి వచ్చి నమాజు మరియు వేడుకోలులో నిమగ్నమైపోయారు.
ఇటు ఈ చిన్న పటాలం, 'కఅబ్ బిన్ అష్రఫ్' ఉండే దివాణం గుమ్మం వరకు వెళ్ళి, అబూ నాయిలా అంటూ బిగ్గరగానే అతణ్ణి పిలిచారు. ఆ పిలుపు విని 'కఅబ్' వారి దగ్గరకు రావాలని. ఈ పిలుపు విని 'కఅబ్' లేచి నిలబడగానే, క్రొత్తగా పెళ్ళి అయి వచ్చిన 'కఅబ్' భార్య అతణ్ణి అడ్డుకుంటూ...., *"మీరెక్కడికి వెళుతున్నారు? నాకు వినవచ్చే శబ్దాలను బట్టి చూస్తే ఏదో రక్తం చిందినట్లుగా అనిపిస్తోంది."* అని అన్నది.
*"ఓ అతనా, నా సోదరుడు 'ముహమ్మద్ బిన్ ముస్లిమా'. మరొకడు నా చిన్ననాటి నాతో పాలు త్రాగిన మిత్రుడు 'అబూ నాయిలా'".* అంటూ బయటకు వచ్చేశాడు. ఆయన, నిలువెల్ల సువాసన పులుముకొని ఉన్నాడు. తల నుండి అత్తరు వాసన గుబాళింపు తెరలు తెరలుగా వ్యాపిస్తుంది.
*అబూ నాయిలా, కఅబ్ ను చంపే పథకాన్ని తన అనుచరులకు ఇలా సూచించాడు....; ↓*
*In Sha Allah రేపటి భాగములో....; →*
✍🏻✍🏻 *®@£€€q* *+97433572282* ✍🏻✍🏻
*(rafeeq)*
✍🏻✍🏻 *Salman* *+919700067779* ✍🏻✍🏻
*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*
💎💎 *మా సలాం* 💎💎
─┄┅━═══✦═══━┅┄─
No comments:
Post a Comment