225

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉

🕌☪🕋🛐      *ఇస్లాం చరిత్ర - 225*       🛐🕋☪🕌

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 140*      🇸🇦🇸🇦

◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉

*❖ గజ్వయె సవీఖ్ : - ↓*

ఓ వైపు "సుఫ్'వాన్ బిన్ ఉమయ్యా", యూదులు మరియు మునాఫిక్ లు తమ తమ కుట్రలు పన్నుతూనే ఉన్నారు. మరో వైపు "అబూ సుఫ్'యాన్" కూడా మరో పన్నాగంలో ఉన్నాడు. దానివల్ల పని తక్కువై ప్రభావం మాత్రం అధికంగా పడాలనే కుతంత్రాలు పన్నుతున్నాడు. అతను తన జాతి గౌరవాన్ని తిరిగి నిలబెట్టి, తన బలాన్ని చాటే సైనికచర్య ఒక దాన్ని చేపట్టాలని ఎదురు చూస్తున్నాడు.

అతను, ముహమ్మద్ (సల్లం)తో యుద్ధం చేయనంత వరకు భార్యతో సంభోగించనని ప్రతిజ్ఞ కూడా చేశాడు. కనుక అతడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకునే ఉద్దేశ్యంతో రెండు వందల మంది ఉష్ట్రారోహుల్ని వెంటబెట్టుకొని బయలుదేరి 'ఖనాత్' లోయ అంచున ఉన్న 'నైబ్' అనే ప్రదేశానికి వచ్చి అక్కడి పర్వత సానువుల్లో విడిది చేశాడు. మదీనాకు అది పన్నెండు మైళ్ళ దూరాన ఉంది.

అయితే అబూ సుఫ్'యాన్ మాత్రం మదీనాపై బాహాటంగా దాడి చేయడానికి జంకాడు. అందుకని అతను చేబట్టిన విధానం ఓ దోపిడిగాళ్ళ విధానం లాంటిది. ఈ సైనికచర్య వివరాలు ఇలా ఉన్నాయి....; ↓

అతను రాత్రి పూట బాగా చీకటి పడిన తరువాత మదీనా పరిసరాల్లో నివసిస్తున్న 'హుయయ్ బిన్ అక్తబ్' అనే యూదుని ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. హుయయ్, రాబోయే దుష్పరిణామాలను దృష్టిలో ఉంచుకొని భయంతో అతని మాటను నిరాకరించాడు.

అబూ సుఫ్'యాన్, అక్కడి నుండి 'బనూ నజీర్' తెగకు చెందిన మరో సర్దారు 'సలామ్ బిన్ ముష్కమ్' వద్దకు వెళ్ళాడు. అతను, బనూ నజీర్ తెగ కోశాధికారి.

అబూ సుఫ్'యాన్ లోనికి ప్రవేశించే అనుమతి కోరగా, అతను అతణ్ణి సాదరంగా లోనికి పిలిచి అతిథి మర్యాదలు చేశాడు. భోజనాలే కాకుండా సారాయి కూడా అందిస్తూ పరిస్థితులేమిటో వివరించాడు.

రాత్రి చివరి ఝామున అబూ సుఫ్'యాన్ ఆ ఇంటి నుండి బయలుదేరి తన అనుచరుల వద్దకు వెళ్ళాడు. ఓ పటాలాన్ని పంపి మదీనా పరిసర ప్రాంతంలో ఉన్న 'ఉరైజ్' అనే ఓ ప్రదేశం పై దాడి చేయించాడు. ఈ పటాలం అక్కడి కొన్ని ఖర్జూరపు చెట్లను నరికి కాల్చివేసింది. ఓ అన్సారీ మరియు అతని మిత్రపక్షానికి చెందిన ఓ వ్యక్తిని హతమార్చింది. ఆ తరువాత అబూ సుఫ్'యాన్ మక్కా వైపునకు వేగంగా ప్రయాణించి పారిపోయాడు.

దైవప్రవక్త (సల్లం)కు ఈ సంఘటనా వార్త అందగానే మరింత వేగంగా అబూ సుఫ్'యాన్ ను వెంటాడారు. కాని, అతను మరింత వేగంగా పరుగు లంకించుకున్నాడు. కనుక వారు దైవప్రవక్త (సల్లం)కు అందలేకపోయారు. కాని, తమ ఒంటెలపై ఉన్న భారాన్ని తగ్గించడానికి 'సత్తూ (పేలప్పిండి)', తినుబండారాలు, ఇంకా ఇతర సామాగ్రిని క్రింద పడేసి పారిపోయాడు. అది ముస్లిముల చేత చిక్కింది.

మహాప్రవక్త (సల్లం), ''కుద్'కరతుల్ కద్ర్'' వరకు అతణ్ణి వెంబడించి తిరిగి మదీనాకు ఆ సత్తూను, ఇతర సామాగ్రిని తమ ఒంటెల పై వేసుకొని బయలుదేరి వచ్చారు. ఈ సైనిక చర్య పేరు "గజ్వయె సవీఖ్" గా పడిపోయింది (సవీఖ్ అరబీ భాషాపదం. దానికి అర్థం పేలప్పిండి అని).

ఈ పోరాటం, బద్ర్ యుద్ధం జరిగిన రెండు నెలల తరువాత జిల్ హజ్జా మాసం, హిజ్రీ శకం - 2 లో సంభవించింది. ఈ గజ్వాకు వెళ్ళేటప్పుడు దైవప్రవక్త (సల్లం) మదీనా పాలనా బాధ్యతను 'అబూ లుబాబా బిన్ మున్జిర్ (రజి)' గారికి అప్పజెప్పడం జరిగింది.

*❖ గజ్వయె జీఅమ్ర్ : -*

బద్ర్ యుద్ధం మరియు ఉహద్ యుద్ధానికి మధ్య కాలంలో జరిగిన పోరాటం ఇది. దైవప్రవక్త (సల్లం) గారి నాయకత్వంలో వెళ్ళిన అతి పెద్ద సైనిక దళం. ఇది ముహర్రం నెల, హిజ్రీ శకం - 3 లో సంభవించింది.

ఈ పోరాటం జరగడానికి కారణం ఏమిటంటే, మదీనా వార్తాహరుల ద్వారా మహాప్రవక్త (సల్లం)కు, బనూ సఅలబా మరియు యుద్ధయోధుల ఓ పెద్ద సమూహం మదీనాపై దండెత్తడానికి మోహరిస్తూ ఉందని తెలియడమే. ఈ వార్త అందగానే దైవప్రవక్త (సల్లం) ముస్లిములను కూడా దానికి వ్యతిరేకంగా పోరాడడానికి సంసిద్ధం కావాలని ఆదేశమిచ్చారు. ఉష్ట్రారోహులు మరియు పదాతి దళానికి చెందిన నాలుగు వందల మంది యోధుల్ని వెంటబెట్టుకొని ఆయన (సల్లం) బయలుదేరారు. 'హజ్రత్ ఉస్మాన్ బిన్ అప్ఫాన్ (రజి)'కు మదీనా బాధ్యతలను అప్పగించారు.

మార్గమధ్యంలో సహాబా (రజి), 'బనూ సఅలబా'కు చెందిన ఓ వ్యక్తిని బంధించి దైవప్రవక్త (సల్లం) గారి ఎదుట హాజరుపరిచారు. దైవప్రవక్త (సల్లం) మొదట ఇస్లాం సందేశాన్ని అతనికి అందించగా, అతను ముస్లిం అయిపోయాడు. ఆ తరువాత ఆయన (సల్లం), అతనిని 'హజ్రత్ బిలాల్ (రజి)'కు సహచరుడుగా చేశారు. ఆ వ్యక్తి మార్గం చూపే బాధ్యతను స్వీకరించి ముస్లిములను శత్రువు భూభాగానికి చేర్చడం జరిగింది.

ఇటు శత్రువుకు మదీనా సైన్యం వస్తున్న విషయం తెలిసి అది చుట్టుప్రక్కల కొండల్లోనికి చెల్లాచెదరైపోయింది. కాని, మహాప్రవక్త (సల్లం) మాత్రం ఆగకుండా ముందుకే వెళుతున్నారు. తమ సైన్యంతో ఆయన (సల్లం), శత్రువు తన శిబిరం కోసం ఎంపిక చేసిన ప్రదేశానికి వెళ్ళి ఆగారు. ఒక విధంగా చెప్పాలంటే, ఆ ప్రదేశంలో ఓ నీటి చెలమ ఉంది. అది 'జీఅమ్ర్' పేరున పిలువబడే నీటి చెలమ. అక్కడ ఆయన (సల్లం), బద్దూలపై తమ ప్రభావాన్ని, శక్తిని ప్రదర్శించడానికి సఫర్ మాసం పూర్తిగా లేదా దాదాపుగా ఉండిపోయారు. ఆ తరువాత ఆయన (సల్లం) మదీనాకు తిరిగి వచ్చేశారు.

*❖ కఅబ్ బిన్ అష్రఫ్ సంహారం : -*

ముస్లిములు మరియు ఇస్లాం ధర్మం ఎడల శత్రుత్వం వహించిన యూదుల్లో ఇతనే ప్రముఖుడు. ఇతను దైవప్రవక్త (సల్లం)ను అనేక రకాలుగా హింసించేవాడు. ఆయన (సల్లం)కు వ్యతిరేకంగా బాహాట యుద్ధం కోసం పురికొలిపేవాడు. దైవప్రవక్త (సల్లం) పేరు వింటేనే 'కఅబ్' ఆపాదమస్తకం మండిపడేవాడు. 

ఇతను 'తై' వంశానికి చెందిన ''బనూ నిబ్'హాన్'' తెగకు చెందినవాడు. అతని తల్లి 'బనీ నజీర్' తెగకు చెందిన ఆడపడుచు. ఇతను గొప్ప ధనవంతుడేకాక అరేబియాలోనే అందమైన వ్యక్తి. అదే కాదు, అతను సుపరిచితుడైన కవి కూడాను. ఇతని కోట మదీనాకు దక్షిణంగా ఉన్న 'బనీ నజీర్' ఆవాస ప్రాంతం వెనుక భాగంలో ఉంది.

బద్ర్ యుద్ధంలో ముస్లిములకు లభించిన విజయం మరియు ఖురైష్ సర్దారుల ఘోర పరాజయ వార్త వినగానే అతను అన్న మాటలు ఇవి....; ↓

*In Sha Allah రేపటి భాగములో....;*

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment