🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐
🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋
◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉
🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర - 223* 🛐🕋☪🕌
🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 138* 🇸🇦🇸🇦
◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉
*❖బనీ ఖైనుఖా పోరాటం (గజ్వయె బనీ ఖైనుఖా) : - ↓*
మహాప్రవక్త (సల్లం), మదీనాకు అరుదెంచిన తరువాత యూదులతో ఏ ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగిందో, ఆ ఒప్పందంలోని షరతులు ఏవో మనం వెనుకటి పుటల్లో చెప్పుకున్నవే. ఆ ఒప్పందం ప్రకారమే నడుచుకోవాలని దైవప్రవక్త (సల్లం) ఎప్పుడూ కాంక్షిస్తూనే ఉన్నారు. కాబట్టి, ఇప్పటివరకు ఆ ఒప్పందాన్ని భగ్నం చేసే ఏ ప్రయత్నమూ జరగకుండా మహాప్రవక్త (సల్లం), ముస్లిములను నిలువరిస్తూ వచ్చారు.
కాని, యూదులు మాత్రం తాము చేసిన ఒప్పందంపై నిలువలేకపోయారు. వారి వైఖరే అలాంటిది మరి. యూదుల చరిత్ర పూర్తిగా విద్రోహం, అసత్యం, దగా మరియు చేసిన వాగ్దానంపై నిలకడలేని దుర్గుణాల పుట్ట. వారు త్వరలోనే తమ పురాతన వైఖరి వైపునకు మళ్ళారు. ముస్లిముల్లో కుట్రలు, కుతంత్రాలు, వారిని పరస్పరం కలహాలకు గురిచేయడం, అశాంతిని రేకెత్తించడం లాంటి కార్యకలాపాలకు పాల్పడనారంభించారు. వారి ఈ ప్రవృత్తికి ఓ మచ్చుతునక ఇది. ↓
*యూదుల ఎత్తుగడకు సంబంధించిన ఓ ఉదాహరణ : -*
*ఇబ్నె ఇస్'హాక్ కథనం ప్రకారం...., ↓*
ఓ వృద్ధ యూదుడు "షాష్ బిన్ ఖైస్" కరుడు కట్టిన దైవతిరస్కారి, ముస్లిములంటే గిట్టనివాడు. అతను ఓ రోజు సహాబా (రజి) ఓ చోట కూర్చుని మాట్లాడుకోవడం చూశాడు. ఆ సమావేశంలో 'అవస్' మరియు 'ఖజ్రజ్' తెగలకు చెందిన వారు ఎంతో కలుపుగోలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ దృశ్యాన్ని చూసిన అతనికి, అజ్ఞానకాలంలో ఆ రెండు తెగల నడుమ రగిలిన వైషమ్యం గుర్తుకు వచ్చింది. ఆ వైషమ్యానికి బదులు ఇప్పుడు వారిలో ఇస్లాం ధర్మం బోధించిన ప్రేమానురాగాలు, సామూహికత కానవస్తున్నాయి. వారి పాత కక్షలన్నీ మటుమాయమైపోవడాన్ని చూసి అతను ఓర్వలేకపోయాడు, అమితంగా బాధపడ్డాడు.
*"ఓహో! ఇక్కడ 'బనూ ఖైలా'కు చెందిన పెద్ద మనుషులందరూ సమైక్యంగా కూర్చుని ఉన్నారా? దైవసాక్షి! వీరి ఈ సమైక్యత వల్ల మనం ఇక్కడ మనుగడ సాగించలేం"* అంటూ తనకు తోడుగా వస్తున్న ఓ యువ యూదునితో...., *"నీవు వారు కూర్చుని ఉన్న చోటికి వెళ్ళి వారితో పాటు కూర్చో. ఆ తరువాత 'బుఆస్' యుద్ధం మరియు దానికి పూర్వపు పరిస్థితులను గూర్చి వివరించి చెప్పు. ఆ కాలంలో ఇరుపక్షాలు పలికిన బీరాలను వారికి గుర్తు చెయ్యి."* అని పంపించాడు.
ఆ యూద యువకుడు, ఆ వృద్ధుడు చెప్పినట్లుగానే చేశాడు.
దీని ప్రభావం వల్ల 'అవస్' మరియు 'ఖజ్రజ్' తెగల్లో వాగ్వివాదం చెలరేగింది. పరస్పరం ఒకరి మాటలను ఒకరు ఖండించుకోవటం ప్రారంభించారు. వారిలో ఒకడు తమ ప్రత్యర్థులు ముందుకు వచ్చి...., *"మీరనుకుంటే ఆ యుద్దాగ్నిని తిరిగి రాజేద్దాం. సిద్ధమేనా!"* అని కూడా అనేశాడు. దీనికి రెండు తెగలకు పౌరుషం హెచ్చింది. *"సరే, దానికి మేం సిద్ధమే పదండి. 'హర్రా' అనే ప్రదేశంలో తలపడదాం."* అంటూ ఆయుధాలు సమకూర్చుకొని 'హర్రా'కు బయలుదేరారు.
ఓ భీకర యుద్ధం జరిగే లోపునే దైవప్రవక్త (సల్లం)కు ఈ విషయం తెలిసింది. ఆయన (సల్లం) ముహాజిర్లను వెంటబెట్టుకొని వెంటనే ఆ ప్రదేశానికి వెళ్ళారు. వారిని సంబోధిస్తూ...., *"ఓ ముస్లిం వర్గమా! నేను బ్రతికి ఉండగానే మీ నోట వెలువడుతున్న ఈ అజ్ఞానపు మాటలు ఏమిటి? అది కూడా, అల్లాహ్ మీకు ఇస్లాం లాంటి రుజుమార్గం చూపించిన తరువాతనా? ఆ ఇస్లాం ధర్మమే కదా మీ నుండి అజ్ఞానాన్ని తుడిచేసి మీ దైవతిరస్కార వైఖరిని మటుమాయం చేసింది? మిమ్మల్ని ఏకం చేసింది?"* అని అడిగారు.
ఈ మాటలు విన్న సహాబా (రజి)కు, ఇది షైతాన్ పన్నిన పన్నాగమని, అతను వారిని అలా చేయడానికి పురికోల్పాడన్న విషయం అర్థం అయిపోయింది. వారు అవలంభించిన వైఖరికి పశ్చాత్తాపపడుతూ రోదించనారంభించారు. 'అవస్' మరియు 'ఖజ్రజ్' తెగవారంతా తిరిగి ఒకరినొకరు ప్రేమతో కౌగిలించుకో నారంభించారు. దైవప్రవక్త (సల్లం)కు విధేయత చూపే మార్గం వైపునకు మరలిపోయారు.
*ఈ విధంగా అల్లాహ్, వారి శత్రువు అయిన "షాష్ బిన్ ఖైస్" పన్నిన కుట్రను భగ్నం చేశాడు.*
యూదులు, ముస్లిముల నడుమ అశాంతిని, కలహాన్ని రేకెత్తించడానికి చేసిన ప్రయత్నానికి, వారు ఇస్లామీయ సందేశ ప్రచార మార్గంలో కలిగించే అడ్డంకులకు ఇదో ఉదాహరణ. దీనికోసం వారు అనేక ప్రణాళికల్ని కూడా రూపొందించుకున్నారు. వాటిలో ముస్లిములకు వ్యతిరేకంగా అసత్య ప్రచారం చేయడం, ఉదయం ముస్లిములుగా మారి సాయంత్రం అయ్యేసరికల్లా 'ఇస్లాం'ను తిరస్కరించడం, అమాయకుల్లో అనుమానాలను రేకెత్తించడం లాంటివి కొన్ని.
తాము అందించిన ఆర్థిక సాయం పొందిన వ్యక్తి ఎవరైనా ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తే, అతణ్ణి అప్పు తీర్చమని అతని నెత్తికెత్తి కూర్చునేవారు. ఒకవేళ వారే ఓ ముస్లిముకు రుణగ్రస్తులై ఉంటే, దాన్ని ఎగ్గోట్టేవారు, అన్యాయంగా ఆ సొమ్మును కాజేసేవారు. ఆ అప్పును అడిగినప్పుడు వారు...., *"మీరు మీ తాతముత్తాతల ధర్మంపై ఉన్నంత వరకు దాన్ని తీర్చే బాధ్యత మాపై ఉండింది. ఇప్పుడు మీరు ఆ ధర్మాన్ని మార్చుకున్నారు కాబట్టి అది తీర్చే సమస్యే లేదు."* అని అనేవారు.
యూదులు, ఈ వైఖరిని బద్ర్ పోరాటానికి పూర్వమే అవలంబించి ఉన్నారన్న విషయం గమనించతగినది. ఇదంతా వారు మహాప్రవక్త (సల్లం) గారితో కుదుర్చుకున్న ఒప్పందానికి పూర్తిగా వ్యతిరేకమైన వైఖరి. కాని దైవప్రవక్త (సల్లం)గాని, ఆయన అనుచరగణం గాని యూదులు మార్గదర్శకత్వం పొందుతారేమో అనే ఆశతో ఈ వైఖరిని సహనంతో భరిస్తూ వచ్చారు. ఇదే కాదు, ఈ ప్రాంతంలో శాంతి విలసిల్లాలని కూడా ఆకాక్షించేవారు.
*బనీ ఖైనుఖా తెగ ఉల్లంఘించిన ఒప్పందం షరతులు : - ↓*
అల్లాహ్, బద్ర్ యుద్ధ మైదానంలో ముస్లిములకు గొప్ప సహాయం అందించి వారికి గౌరవం కలగజేసినందుకు వారి ఈర్ష్య, విరోధం మరింత పెరిగిపోయింది. వారు బాహాటంగా దుశ్చర్యకు దిగి శత్రుత్వాన్ని ప్రకటించుకున్నారు. బాహాటంగా విద్రోహ చర్యలను చేబడుతూ ముస్లిములను బాధింపజొచ్చారు.
*మిగిలినది In Sha Allah రేపటి భాగములో....;*
✍🏻✍🏻 *®@£€€q* *+97433572282* ✍🏻✍🏻
*(rafeeq)*
✍🏻✍🏻 *Salman* *+919700067779* ✍🏻✍🏻
*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*
💎💎 *మా సలాం* 💎💎
─┄┅━═══✦═══━┅┄─
No comments:
Post a Comment