222

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉

🕌☪🕋🛐      *ఇస్లాం చరిత్ర - 222*       🛐🕋☪🕌

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 137*      🇸🇦🇸🇦

◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉

*❖ దైవప్రవక్త (సల్లం)ను హతమార్చడానికి పన్నిన కుట్ర : -*

బద్ర్ యుద్ధంలో పరాజయం పాలైన మక్కా ముష్రిక్కుల రక్తం ఉడుకెత్తి పోతుంది. మక్కా మొత్తమే కోపంతో గంగెర్లెత్తుతోంది. చివరికి మక్కాకు చెందిన ఇద్దరు యువకులు, మహాప్రవక్త (సల్లం)ను అంతమొందించడానికి నిర్ణయించుకున్నారు.

*బద్ర్ యుద్ధం తరువాత కొన్ని రోజుల్లోనే జరిగిన ఓ సంఘటన ఇలా ఉంది....; ↓*

'ఉమైర్ బిన్ వహబ్ హుమజీ' - _ఇతను ఖురైష్ రాక్షస మూకల్లో ఒకడు_ - మక్కాలో దైవప్రవక్త (సల్లం)ను, ఆయన అనుచరుల్ని నానా హింసలకు గురి చేసి ఉన్నాడు. అతని కుమారుడు 'వహబ్ బిన్ ఉమైర్' ఇప్పుడు దైవప్రవక్త (సల్లం)కు బంధీ అయి చెరసాలలో ఉన్నాడు.

ఈయనకు తోడు "సుఫ్'వాన్ బిన్ ఉమయ్యా". సుఫ్'వాన్ తండ్రి మరియు సోదరుడు, బద్ర్ యుద్ధంలో చనిపోయున్నారు.

ఉమైర్ బిన్ వహబ్, ఓ రోజు తానూ "సుఫ్'వాన్ బిన్ ఉమయ్యా"తో కలిసి కాబా ప్రక్కనే ఉన్న హాతీమ్ లో కూర్చుని, బద్ర్ బావిలో పడవేసిన వారి గురించిన వారి ప్రస్తావన తీశాడు.

అంతలో సుఫ్'వాన్ అందుకొని...., *"దైవసాక్షి! వారు పోయిన తరువాత బ్రతికి ఉండడం వ్యర్థమే."* అన్నాడు.

దానికి ఉమైర్...., *"నీవు నిజమే చెబుతున్నావు. చూడు! దైవసాక్షి! నా పైన్నే రుణభారం లేకపోతే ఎంత బావుండు. నా దగ్గర అప్పు తీర్చడానికి చిల్లీ గవ్వ కూడా లేదు. నా భార్యాపిల్లలు కూడా ఉన్నారు. నా తరువాత వారి గతి ఏమవుతుందో అనే బెంగ కూడా ఉంది. ఈ ఝంజాటాలే లేకపోతే నేను వాహనమెక్కి ముహమ్మద్ (సల్లం) దగ్గరకు వెళ్ళి ఆయన (సల్లం)ను చంపివేసేవాణ్ణే. నేను అక్కడికి వెళ్ళడానికి మార్గం కూడా ఉంది సుమా! నా కుమారుడు వారి ఖైదీలలో ఉన్నాడు."* అని అన్నాడు.

సుఫ్'వాన్ ఈ మాటలను ఆసరాగా తీసుకొని...., *"సరే ! నీ అప్పునంతా నేను తీర్చేస్తాను. నీ భార్యాపిల్లలు కూడా నా భార్యాపిల్లల్లాంటివారే. వారున్నంత కాలం వారి బాగోగుల్ని చూస్తూ ఉంటాను. నా దగ్గర ఉన్నది వారి దగ్గర ఉండకుండా ఉండదు. నీవు ఏదైతే చేయాలనుకున్నావో, అనుకున్నది అనుకున్నట్టుగా చేసెయ్యి."* అన్నాడు.

*"సరే, ఈ విషయం నీకు నాకు మధ్యనే రహస్యంగా ఉండాలి."* అని అన్నాడు ఉమైర్.

దానికి, *"సరే"* అన్నాడు సుఫ్'వాన్.

ఆ తరువాత ఉమైర్ తన కత్తి పదును పెట్టాడు. ఆ కత్తిని విషంలో ముంచి తీసుకొని మదీనా బయలుదేరాడు. మదీనా వెళ్ళి మస్జిద్ ముందు తన ఒంటెను కూర్చుండబెట్టాడో లేదో 'హజ్రత్ ఉమర్ (రజి)' దృష్టి ఉమైర్ పై పడింది. _(ఆ సమయంలో ఉమర్ (రజి), ముస్లిములతో కలసి కూర్చోని, బద్ర్ నాడు అల్లాహ్ బహుకరించిన గౌరవం గురించి ముచ్చటిస్తున్నారు)._

ఉమర్ (రజి), ఉమైర్ ను చూడగానే...., *"ఈ కుక్క, దైవవిరోధి అయిన ఉమైర్. ఏదో చెడు ఉద్దేశ్యంతోనే ఇక్కడికి వచ్చాడు."* అన్నారు.

ఆ వెంటనే మహాప్రవక్త (సల్లం) గారి దగ్గరకు వెళ్ళి...., *"ఓ దైవప్రవక్తా! ఈ దైవవిరోధి కరవాలాన్ని చేతపట్టుకొని వచ్చాడు చూడండి."* అన్నారు.

*"అతన్ని నా వద్దకు తీసుకురండి."* అని ఆదేశించారు మహాప్రవక్త (సల్లం).

ఉమైర్ రాగానే, కరవాలం పిడితో సహా అతని మెడ దగ్గర పట్టుకున్నారు ఉమర్ (రజి). ఆ తరువాత ఉమర్ (రజి) అన్సారులతో...., *"మీరు దైవప్రవక్త (సల్లం) దగ్గరకు వెళ్ళి అక్కడనే కూర్చొని ఉండండి. మహాప్రవక్త (సల్లం)ను ఈ నీచుడి బారి నుండి రక్షించడానికి సిద్ధంగా ఉండండి. ఇతను నమ్మదగినవాడు కాదు."* అని చెప్పారు.

అలా ఉమర్ (రజి), ఉమైర్ ను పట్టుకొని దైవప్రవక్త (సల్లం) దగ్గరకు లాక్కొని వచ్చారు.

కరవాలం పిడితో సహా ఉమైర్ మెడను, ఉమర్ (రజి) పట్టుకొనే ఉండటాన్ని చూసిన దైవప్రవక్త (సల్లం)...., *"ఉమర్, అతణ్ణి వదిలిపెట్టండి. ఉమైర్! నీవు ముందుకు రా...."* అని అన్నారు.

ఉమైర్ ముందుకు వచ్చి...., *"మీరందరికీ శుభోదయం."* అన్నాడు.

ఇది విన్న దైవప్రవక్త (సల్లం) అతనితో...., *"అల్లాహ్ మాకు శుభాశ్శీస్సులు పలకడానికి ఇంతకంటే మేలైన పదాన్ని బహుకరించాడు. అదీ సలాం. ఇది స్వర్గంలో ఉండే వారికి ఇవ్వబడ్డ శుభప్రదమైన పదం."* అన్నారు. ఆ తరువాత మహాప్రవక్త (సల్లం), ఉమైర్ ని ఇలా అడిగారు....,

*ముహమ్మద్ (సల్లం) : -* ఓ ఉమైర్ ! నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు?

*ఉమైర్ : -* మీ చెరలో ఉన్న ఖైదీని విడిపించుకొని వెళ్ళడానికి ఇక్కడకు వచ్చాను. తమరు ఈ విషయంలో నాపై కరుణ చూపండి.

*ముహమ్మద్ (సల్లం) : -* మరి ఈ కరవాలం నీ వెంట ఎందుకు ఉంది?

*ఉమైర్ : -* అల్లాహ్ ఈ కరవాలాలను నాశనం చేయుగాక. ఇవి మాకు ఏమైనా పనికి వచ్చాయా చెప్పండి?

*ముహమ్మద్ (సల్లం) : -* నిజం చెప్పు! ఎందుకు వచ్చావో?

*ఉమైర్ : -* కేవలం ఒక్క ఖైదీ కోసమే వచ్చాను.

*ముహమ్మద్ (సల్లం) : -* లేదు! నీవూ, సుఫ్'వాన్ బిన్ ఉమయ్యా హాతీమ్ లో కూర్చోలేదా ఆనాడు? ఖురైష్ హతుల శవాలను బద్ర్ బావిలో పడవేసిన విషయం అతనితో నీవు చెప్పలేదా? పిదప నాపై రుణభారం, నా ఆలుబిడ్డలు గనకా లేకపోతే ఇక్కడి నుండి మదీనాకు వెళ్ళి ముహమ్మద్ (సల్లం)ను హతమారుస్తాను అని చెప్పలేదా అతనితో? దీనికి సుఫ్'వాన్, నీ రుణాన్ని తీర్చే బాధ్యతను, నీ ఆలుబిడ్డల్ని పోషించే పూచీని తీసుకొని నన్ను చంపమని పంపించాడు ఔనా? గుర్తుంచుకో! నాకూ నీకు నడుమ అల్లాహ్ ఉన్న సంగతి గుర్తుంచుకో!

ఈ మాటలు విన్న ఉమైర్ వెంటనే...., *"తమరు అల్లాహ్ ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఓ ప్రవక్తా ! తమరు మా వద్దకు ఆకాశ వార్తలను ఏవైతే తెచ్చి వినిపించేవారో వాటిని, తమపై అవతరించే దివ్యవాణిని మేము తిరస్కరించేవాళ్ళం. ఇది, నాకూ సుఫ్'వాన్ కు నడుమ జరిగిన రహస్య ఒడంబడిక. అక్కడ మూడో వాడు మరెవ్వడూ లేదు. అందుకని దైవసాక్షి! నాకు పూర్తి విశ్వాసం ఏర్పడింది, ఈ విషయాన్ని అల్లాహ్ తప్ప మీకు మరెవ్వరూ అందించలేదని. కాబట్టి నన్ను ఇస్లాం ధర్మం వైపునకు మార్గం చూపుతూ ఇక్కడి వరకు తీసుకొని వచ్చిన ఆ అల్లాహ్ కు స్తోత్రాలు."* అన్నాడు.

ఆ పిదప ఉమైర్, షహాదత్ కలిమా పఠించి ముస్లిం అయిపోయారు. 

మహాప్రవక్త (సల్లం), సహబీలనుద్దేశించి...., *"మీ సోదరునికి ధర్మం ఏమిటో నేర్పండి, ఖుర్ఆన్ చదివించండి. అతని ఖైదీని విడిచిపెట్టండి."* అని ఆదేశించారు.

ఇటు మక్కాలో సుఫ్'వాన్ ప్రజలతో...., *"చూడండి ఓ శుభవార్త! కొద్ది రోజుల్లోనే ఓ అసాధారణ సంఘటన జరగబోతోంది. బద్ర్ యుద్ధంలో మనం అనుభవించిన కష్టాలను, నష్టాలను ఆ సంఘటన మరచిపోయేటట్లు చేస్తుంది. వేచి ఉండండి."* అని చెబుతున్నాడు. వచ్చిపోయే వారిని 'ఉమైర్' బాబతు ఆచూకీ కూడా తెలుసుకుంటున్నాడు. చివరికి ఓ ఉష్ట్రారోహి వచ్చి, ఉమైర్ ఇస్లాం స్వీకరించిన వివరాలను తెలుపడం జరిగింది.

ఇది విన్న సుఫ్'వాన్...., *"ఉమైర్ విషయంలో ఇక నేను ఎన్నిటికీ పెదవి విప్పబోను, ఉమైర్ కు ఎలాంటి సహాయ సహకారాలను అందించను."* అని ప్రతిజ్ఞ చేశాడు.

'హజ్రత్ ఉమైర్ (రజి)', ఇస్లాం ధర్మాన్ని బాగా అధ్యయనం చేసి మక్కాకు వచ్చేశారు. అక్కడ ఉంటూ ఆయన (రజి) మక్కా ప్రజల్లో ఇస్లాం ధర్మాన్ని ప్రచారం చేయనారంభించారు. ఆయన (రజి) చేతి మీదుగా అనేక మంది ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం జరిగింది.

ఇదీ, 'హజ్రత్ ఉమైర్ (రజి)' గారి ఇస్లాం స్వీకార ఉదంతం.

*❖బనీ ఖైనుఖా పోరాటం (గజ్వయె బనీ ఖైనుఖా) : - ↓*

*In Sha Allah రేపటి భాగములో....;*

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment