🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐
🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋
◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉
🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర - 221* 🛐🕋☪🕌
🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 136* 🇸🇦🇸🇦
◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉
*'బద్ర్' తరువాయి యుద్ధ సన్నాహాలు*
బద్ర్ పోరాటం ముస్లిములకు ముష్రిక్కులకు మధ్య జరిగిన నిర్ణయాత్మకమైన సాయుధ పోరాటం. ఆ పోరాటంలో ముస్లిములకు ఘనవిజయం లభించింది. దీన్ని అరేబియా మొత్తం గమనించింది కూడా. దీని దుష్పరిణామాన్ని అధికంగా అనుభవించిన వారు ముష్రిక్కులు. ఎందుకంటే, ఈ యుద్ధంలో వారికే గొప్ప నష్టం వాటిల్లింది కనుక.
అంతే కాకుండా, ఆ తరువాత బాధపడింది యూదులు. వీరు ముస్లిముల ఆధిక్యతను, ఔన్నత్యాన్ని తమ ఆర్థిక మనుగడకు ప్రమాదంగా తలచినవారు. కాబట్టి బద్ర్ మైదానంలో ముస్లిములకు లభించిన విజయం కారణంగా, ముస్లిములకు విరుద్ధంగా కారాలు మిరియాలు నూరనారంభించారు. ఆ ఆగ్రహంలో ముస్లిములపై పగ తీర్చుకోవాలని ప్రయత్నం మొదలెట్టారు. దైవగ్రంథం వారి గురించి ఇలా సెలవిస్తుంది....; ↓
*"విశ్వాసుల పట్ల శత్రుత్వంలో అందరికన్నా ఎక్కువగా కరడుగట్టినవారు యూదులు మరియు ముష్రిక్కులని నీవు తెలుసుకుంటావు. ఇక విశ్వాసులతో స్నేహం విషయానికి వస్తే "మేము సహాయకులం (నసారా లేక క్రైస్తవులం)" అని చెప్పుకునే వారిని నీవు ఎక్కువ సన్నిహితులుగా చూస్తావు. ఎందుకంటే వారిలో పండితులు, భవబంధాలకు దూరంగా ఉండే మతాచార్యులు ఉన్నారు. ఇంకో విషయం ఏమిటంటే వారు అహంకారం చూపరు." (ఖుర్ఆన్ 5:82).*
మదీనాలో కొందరు ఈ ఇరువర్గాలకు సన్నిహితులు, మిత్రులుగా ఉండేవారు. తమ గౌరవాన్ని కాపాడుకోవాలని ఎలాంటి మార్గం కనబడకపోయేసరికి వారు, అందరికి తెలిసినట్లు బూటకపు ముస్లిములుగా మారారు. వీరు "అబ్దుల్లా బిన్ ఉబై" మరియు అతని అనుచరగణం. వీరు కూడా ముస్లిములకు వ్యతిరేకంగా యూదులు మరియు ముష్రిక్కుల్లా లోలోన వారికి వ్యతిరేకంగా కుతకుతలాడుతున్నవారే.
వీరే కాకుండా మరో నాలుగో వర్గం కూడా ఉంది. అంటే 'బద్దూ'ల వర్గం. ఇది మదీనా పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఉండేది. వారికి ఇస్లాంతో గానీ, అవిశ్వాసంతో గానీ ఎలాంటి సంబంధం లేదు. వీరు దోపిడీ దొంగలు. అందువల్ల బద్ర్ విజయం వారికీ కంటగింపుగానే ఉంది. మదీనాలో ఓ ధృఢమైన, పటిష్ఠమైన ప్రభుత్వం ఏర్పడితే వారి ఈ దారిదోపిడి మార్గం మూసుకుపోతుందనే భయం పట్టుకుంది వారికి. ఆ కారణం చేత ఇస్లాం అంటే వారి మనస్సుల్లో వైషమ్యం పొడసూపనారంభించింది. వీరూ ముస్లిములకు బద్ధ శత్రువులుగా మారిపోయారు.
ఇలా, ముస్లిములు నలువైపులా నుండి ప్రమాదంలో చిక్కుకున్నట్లయింది. అయితే ముస్లిముల విషయంలో ఆ వర్గాల వైఖరి పూర్తిగా భిన్నంగా ఉండేది. ప్రతి వర్గం తన స్వప్రయోజనం, స్వార్థాన్నే దృష్టిలో ఉంచుకొని పని చేయనారంభించింది. కాబట్టి, మదీనాలో ఉన్న వర్గం, ఇస్లాం ధర్మం స్వీకరించి చాటుమాటుగా కుట్రలు, కుతంత్రాలు పన్ని ముస్లిముల్లో పరస్పరం మనస్పర్థలు సృష్టించనారంభించింది. యూదులకు చెందిన ఓ వర్గం, బాహాటంగా ముస్లిములపై తన కోపతాపాలను ప్రదర్శించనారంభించింది. మక్కాకు చెందిన వర్గం, ముస్లిముల నడ్డి విరిచేస్తామని బెదిరించనారంభించింది. ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి బాహాటంగా ప్రకటనలు కూడా వెలువరించింది. వీరు యుద్ధ సన్నాహాల్లో నిమగ్నమైపోయి ముస్లిములను హెచ్చరించడం ఆరంభించింది.
ఒక సంవత్సరం గడిచిందో లేదో పెద్ద సైన్యంతో మదీనాపై దండెత్తి వచ్చారు. చరిత్రలో ఆ యుద్ధం *"ఉహద్ యుద్ధం" లేదా "గజ్వయె ఉహద్"* గా పేరుగాంచింది. ఈ యుద్ధంలో ముస్లిముల కీర్తి బాగా దెబ్బతిన్నది.
ఈ ప్రమాదాలను ఎదుర్కోడానికి ముస్లిములు కీలకమైన నిర్ణయాలు గైకొనవలసి వచ్చింది. ఈ నిర్ణయాలలో మహాప్రవక్త (సల్లం) గారి నాయకత్వపు చతురత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దీని ద్వారా మనకు మదీనా నాయకత్వం, తన పరిసరాలలో తలెత్తిన ప్రమాదాల గురించి ఎంత జాగురూకత వహించిందో తెలుస్తుంది. ఆ ప్రమాదాలను అడ్డుకోవడానికి ఎలాంటి ప్రణాలికలను సిద్ధం చేసిందో అవగతం అవుతుంది. వచ్చే పంక్తుల్లో ఈ వివరాలే విశదంగా చర్చించబడతాయి.
*❖ గజ్వయె బనీ సులైమ్ (కుద్ర్ ప్రదేశం) : -*
గజ్వయె బద్ర్ తరువాత వేగుల వారి ద్వారా తెలిసిన మొట్టమొదటి వార్త, గత్పాన్ తెగకు చెందిన ఓ శాఖ 'బనూ సులైమ్', మదీనాపై దండెత్తడానికి సైన్యాన్ని సమీకరిస్తుంది అన్నది. దీన్ని అణచడానికి దైవప్రవక్త (సల్లం) రెండు వందల ఉష్ర్ణారోహులతో స్వయంగా వారి ప్రాంతాలపై హఠాత్తుగా విరుచుకుపడ్డారు. 'కుద్ర్' అనే ప్రదేశంలో వారి శిబిరాల వరకు చొచ్చుకు వెళ్ళారు. హఠాత్తుగా సంభవించిన ఈ పరిణామానికి 'బనూ సులైమ్' సైన్యంలో భయభీతులు చెలరేగాయి. హఠాత్పరిణామానికి వారు ఆ లోయలో తమ ఐదు వందల ఒంటెల్ని వదిలేసి పారిపోయారు. దైవప్రవక్త (సల్లం) అందులో ఖమ్స్ తీసి మిగతా ఒంటెల్ని ముజాహిద్ లలో పంచిపెట్టారు. ప్రతి వాని వాటాకు రెండు ఒంటెల చొప్పున వచ్చాయి.
ఈ యుద్ధంలో 'యసార్' పేరుగల ఓ బానిస దైవప్రవక్త (సల్లం) చేతికి చిక్కాడు. అతన్ని దైవప్రవక్త (సల్లం) స్వతంత్రునిగా చేసి వదిలేశారు. ఆ తరువాత ఆయన (సల్లం), 'బనూ సులైమ్' నివాస స్థలంలో మూడు రోజులు ఉండి మదీనా తిరిగి వచ్చేశారు.
ఈ పోరాటం హిజ్రీ శకం - 2, షవ్వాల్ మాసంలో బద్ర్ నుండి తిరిగి వచ్చిన ఏడు రోజుల తరువాత జరిగిన పోరాటం. ఈ గజ్వాకు వెళ్ళేటప్పుడు దైవప్రవక్త (సల్లం) మదీనా ఆజమాయిషీని 'సబా బిన్ అరఫ్తా'కు, మరో ఉల్లేఖనం ప్రకారం, 'ఇబ్నె ఉమ్మె మక్తూమ్'కు అప్పగించి వెళ్ళారు.
*❖ దైవప్రవక్త (సల్లం)ను హతమార్చడానికి పన్నిన కుట్ర : -*
బద్ర్ యుద్ధంలో పరాజయం పాలైన మక్కా ముష్రిక్కుల రక్తం ఉడుకెత్తి పోతుంది. మక్కా మొత్తమే కోపంతో గంగెర్లెత్తుతోంది. చివరికి మక్కాకు చెందిన ఇద్దరు యువకులు, మహాప్రవక్త (సల్లం)ను అంతమొందించడానికి నిర్ణయించుకున్నారు.
*బద్ర్ యుద్ధం తరువాత కొన్ని రోజుల్లోనే జరిగిన ఓ సంఘటన ఇలా ఉంది....; ↓*
*In Sha Allah రేపటి భాగములో....;*
✍🏻✍🏻 *®@£€€q* *+97433572282* ✍🏻✍🏻
*(rafeeq)*
✍🏻✍🏻 *Salman* *+919700067779* ✍🏻✍🏻
*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*
💎💎 *మా సలాం* 💎💎
─┄┅━═══✦═══━┅┄─
No comments:
Post a Comment