🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐
🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋
◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉
🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర - 220* 🛐🕋☪🕌
🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 135* 🇸🇦🇸🇦
◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉
*యూదుల జాత్యాహంకారం : -*
దైవప్రవక్త (సల్లం) మదీనా వచ్చిన తొలిరోజుల్లో యూదులు ఆయన (సల్లం) ప్రతిపాదించిన శాంతి ఒప్పందంతో ఏకీభవించి సంతోషంగానే ఉన్నారు. కాని ఆయన (సల్లం)కు తమ మతరంగు పూసి తమ జాతిప్రాభవాన్ని ద్విగుణీకృతం చేసుకోవాలన్న దుష్టపథకం ఎంతకూ నెరవేరకపోగా, దైవప్రవక్త (సల్లం) తన సందేశామృతంతో ప్రజాబాహుళ్యాన్ని ఆకట్టుకోవడం చూసి యూదులు మండిపోయారు. అప్పటి నుంచి వారు దైవప్రవక్త (సల్లం)కు, సత్యధర్మానికి ఆగర్భ శత్రువులుగా మారి అసహ్యంగా ప్రవర్తించసాగారు.
*"(ముస్లింలారా!) గ్రంథప్రజలలో (అంటే యూదుల్లో) కొందరు మిమ్మల్ని రుజుమార్గం నుండి తప్పించగోరుతున్నారు. నిజానికి వారు తమను తాము తప్ప మరెవరినీ దారి తప్పించలేరు. కాని ఆ సంగతి వారు గ్రహించలేకపోతున్నారు."*
*"గ్రంథప్రజలారా! మీరు దేవుని సూక్తులను, సూచనలను గుర్తించినప్పటికీ వాటిని ఎందుకు నిరాకరిస్తున్నారు? గ్రంథప్రజలారా! మీరు సత్యాసత్యాలను కలగాపులగం చేసి సత్యాన్ని ఎందుకు అనుమానాస్పదం చేస్తున్నారు? వాస్తవం తెలిసి కూడా సత్యాన్ని ఎందుకు దాస్తున్నారు? గ్రంథప్రజలలో (యూదులలో) కొందరు పరస్పరం కూడబలుక్కుంటూ "విశ్వాసులపై అవతరించిన దాన్ని మీరు ఉదయం విశ్వసించి (నట్లు నటించి) సాయంత్రానికల్లా తిరస్కరించండి. ఈవిధంగా వారిని మనం మార్గభ్రష్టులయ్యేలా చేయగలం" అని చెప్పుకుంటారు." (72).*
*"అంతేకాదు, "మన మతస్థుల్ని తప్ప మరెవరినీ మనం నమ్మకూడదు" అని కూడా వారు పరస్పరం చెప్పుకుంటారు (ముహమ్మద్!) వారికి చెప్పు: "మార్గదర్శకత్వమంటే అసలు దేవుని మార్గదర్శకత్వమే. ఆయన చూపేదే రుజుమార్గం. గతంలో మీకు ఇవ్వబడిన (తౌరాత్, ఇంజీల్) వంటిదే (ఇప్పుడు) ఇతరులక్కూడా ఇవ్వబడిందంటే అది దేవుని అనుగ్రహం. మీకు వ్యతిరేకంగా మీ ప్రభువు సన్నిధిలో సమర్పించడానికి ఇతరులకు బలమైన సాక్ష్యం (దివ్య ఖుర్ఆన్) లభించిందంటే అదీ దేవుని అనుగ్రహమే."" (ఖుర్ఆన్ 3:69-70).*
ఒకసారి కొందరు యూదులు దైవప్రవక్త (సల్లం) సన్నిధికి వచ్చి...., *"మా జాతిలో ఒక స్త్రీ, ఒక పురుషుడు వ్యభిచారం చేశారు."* అని అన్నారు.
దైవప్రవక్త (సల్లం) ఈ మాట విని...., *"తౌరాత్ లో ఈ నేరం గురించి ఎలాంటి ఆదేశం ఉంది?"* అని ప్రశ్నించారు.
*"మేము వ్యభిచారి ముఖానికి మసిబూసి ఊరేగించి అవమానపరుస్తాము; కొరడా దెబ్బలు విధిస్తాం."* అన్నారు యూదులు.
యూద మతం వదలి ముస్లిం అయిన 'అబ్దుల్లా బిన్ సలాం (రజి)' ఈ మాట వినగానే...., *"మీరు అబద్ధమాడుతున్నారు. (ఖుర్ఆన్ లో ఉన్నట్లే) తౌరాత్ లో (కూడా) వ్యభిచార నేరానికి రాళ్ళు విసిరి హతమార్చే శిక్షే ఉంది."* అన్నారు.
అప్పుడు యూదులు తౌరాత్ తెచ్చి చూపించారు. వారిలో ఒకతను శిలాశిక్ష ఉన్న సూక్తి కనపడకుండా దానిపై వ్రేలు పెట్టి, దానికి పైనా, క్రింద ఉన్న సూక్తులు పఠించడం మొదలెట్టాడు.
అబ్దుల్లా బిన్ సలాం (రజి)...., *"నీ చెయ్యి తీసెయ్ అక్కడ్ననుంచి"* అన్నారు.
ఆ యూదుడు వేరే మార్గంలేక చెయ్యి తీశాడు. చూస్తే అక్కడ శిలాశిక్ష గురించిన సూక్తి స్పష్టంగా కనిపించింది. దాంతో యూదులు వాస్తవాన్ని ఒప్పుకుంటూ...., *"అబ్దుల్లా బిన్ సలాం చెబుతున్నదే నిజం. తౌరాత్ శిలాశిక్ష ఆదేశం ఉంది."* అన్నారు. దాని ప్రకారమే దైవప్రవక్త (సల్లం) తీర్పు చేసి శిక్ష విధించారు.
*"వీరు చెవియొగ్గి అబద్ధాలు వినేవారు. నిషిద్ధమైన సొమ్ము (హరాం) చాలా ఎక్కువగా తినేవారు. ఒకవేళ వారు (తమ గొడవలను) నీ వద్దకు తీసుకువస్తే, నీకిష్టముంటే వారి మధ్య తీర్పు చెప్పు, లేదంటే విముఖతను తెలుపు. ఒకవేళ నువ్వు వారినుంచి ముఖం త్రిప్పుకున్నా వారు నీకెలాంటి హాని కలిగించలేరు. ఒకవేళ నువ్వు (వారి వ్యవహారాలపై), తీర్పు చెబితే వారిమధ్య న్యాయసమ్మతంగా తీర్పు చెప్పు. నిస్సందేహంగా అల్లాహ్ న్యాయశీలురను ప్రేమిస్తాడు." (ఖుర్ఆన్ 5:42).*
*"దైవాదేశాలు పొందుపరచబడి వున్న తౌరాతు గ్రంథం తమ వద్ద ఉన్నప్పటికీ వారు నిన్ను ఎట్లా న్యాయనిర్ణేతగా చేసుకుంటున్నారు? (ఇది ఆశ్చర్యకరం కదూ?!) ఆ తరువాత మళ్ళీ తిరిగిపోతున్నారు. యదార్థమేమిటంటే వారసులు విశ్వాసులే కారు." (ఖుర్ఆన్ 5:43).*
తాము ఎంతో భక్తిపరాయణులమని, తాము తప్ప మరెవరూ మోక్షానికి అర్హులు కారని చెప్పుకునే ఈ జాతిలోని పెద్దలు, పండితులు సైతం దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వచ్చినప్పుడల్లా *"అస్సలాము అలైకుం"* అనే పదాన్ని దాని అసలుభావం మారి చెడుభావం వచ్చేవిధంగా కొంచెం వత్తి పలికేవారు. అలాగే ఇతర సంభాషణల్లోనూ కొన్నిటి ఉచ్చారణ తారుమారుచేసి సామాన్య జనానికి అర్థం కానివిధంగా తప్పుడు మాటలు పలికేవారు.
*"కొంతమంది యూదులు పదాలను వాటి నిజస్థానం నుంచి తారుమారు చేస్తారు. "మేము విన్నాము, అవిధేయులం అయ్యాము" అని వారంటారు. అంతే కాదు - "విను. నీకేమీ వినపడకూడదు. రాయినా" అని పలుకుతారు. అలా అనేటప్పుడు వారు తమ నాలుకను మెలితిప్పుతారు. (ఇస్లాం) ధర్మాన్ని ఎగతాళి చేయాలన్నది అసలు వారి ఉద్దేశ్యం. ఇలా అనే బదులు వారు "మేము విన్నాము. విధేయులమయ్యాము" అనీ, "వినండి. మా వంక చూడండి" అని పలికి ఉంటే అది వారికొరకు ఎంతో శ్రేయస్కరంగా, సమంజసంగా ఉండేది. కాని అల్లాహ్ వారి అవిశ్వాసం మూలంగా వారిని శపించాడు. ఇక వారిలో విశ్వసించేది బహుకొద్దిమంది మాత్రమే." (ఖుర్ఆన్ 4:46).*
అంతేకాదు, దైవమార్గంలో ధనాన్ని వెచ్చించమంటూ, *"మీలో దేవునికి మంచి అప్పు ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా?"* అనే ఖుర్ఆన్ సూక్తి విని, *"ఓహో! దేవుడు కూడా ఇప్పుడు పేదవాడైపోయి తన దాసుల దగ్గర అప్పు అడుక్కోవడం మొదలుపెట్టాడన్న మాట!!"* అని దైవాన్ని కూడా ఎగతాళి చేసేవారు.
ఖుర్ఆన్ లో దేవుడిచ్చిన ఈగ, దోమల దృష్టాంతాలు విని, *"ఆహా! ముస్లింల దేవుడు చాలా వింత దేవుడు. దృష్టాంతం ఇవ్వడానికి ఆయనకు ఈగలు, దోమలు వంటి అల్ప ప్రాణులు తప్ప మరేమీ దొరకలేదు కాబోలు!"* అని పరిహసించేవారు.
*"ఓ విశ్వాసులారా! మీరు మీ వారిని తప్ప వేరితరులను మీ ఆంతరంగికులుగా చేసుకోకండి. ఇతరులు మీకు నష్టం కలిగించటానికి తమకు దొరికే ఏ అవకాశాన్నీ విడిచిపెట్టరు. మీరు కష్టాల్లో పడాలన్నదే వారి కోరిక. వారిలోని అక్కసు స్వయంగా వారి నోట వెల్లడయింది. ఇక వారు తమ ఆంతర్యాల్లో దాచి ఉంచినది మరింత తీవ్రమైనది. మేము మీ కొరకు సూచనలను స్పష్టం చేశాము. మీరు బుద్ధిమంతులే అయితే (వీటిపై యోచన చేయండి)." (ఖుర్ఆన్ 3:118).*
*"మీరైతే వారిని ప్రేమిస్తున్నారు. కాని వారు మాత్రం మిమ్మల్ని ప్రేమించటం లేదు. మీరు గ్రంథాన్నంతటినీ విశ్వసిస్తున్నారు (కాని వారు విశ్వసించటం లేదు. మరలాంటప్పుడు వారు మీకు స్నేహితులెలా అవుతారు?). వారు మిమ్మల్ని కలసినప్పుడు తాము విశ్వసించామని చెబుతారు, కాని మీ దగ్గరి నుంచి తప్పుకున్నప్పుడు మీపై కోపం కొద్దీ తమ వ్రేళ్ళను కసిగా కొరుక్కుంటారు. "మీరు మీ కోపావేశంలోనే చావండి. నిశ్చయంగా అల్లాహ్ గుండెల్లోని గుట్టును గురించి బాగా తెలిసినవాడు" అని వారికి చెప్పండి." (ఖుర్ఆన్ 3:119).*
*"మీకేదైనా మేలు కలిగితే వారు బాధపడతారు. అదే మీకేదైనా హాని జరిగితే మాత్రం ఆనందిస్తారు. మీరే గనక సహనంతో, భయభక్తులతో వ్యవహరించినట్లయితే వారి కుట్ర మీకెలాంటి నష్టమూ చేకూర్చదు. ఎందుకంటే వారి కార్యకలాపాలన్నింటినీ అల్లాహ్ ముట్టడించి ఉన్నాడు." (ఖుర్ఆన్ 3:120).*
*మిగిలినది In Sha Allah రేపటి భాగములో....;*
✍🏻✍🏻 *®@£€€q* *+97433572282* ✍🏻✍🏻
*(rafeeq)*
✍🏻✍🏻 *Salman* *+919700067779* ✍🏻✍🏻
*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*
💎💎 *మా సలాం* 💎💎
─┄┅━═══✦═══━┅┄─
No comments:
Post a Comment