🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐
🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋
◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉
🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర - 219* 🛐🕋☪🕌
🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 134* 🇸🇦🇸🇦
◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉
*హజ్రత్ హఫ్సా (రజి)తో దైవప్రవక్త (సల్లం) వివాహం : -*
బద్ర్ యుద్ధంలో 'హజ్రత్ ఉమర్ (రజి)' అల్లుడు 'ఖునైస్ (రజి)' తీవ్రంగా గాయపడి ఆ తరువాత చనిపోయారు. అందువల్ల 'హజ్రత్ ఉమర్ (రజి)', కుమార్తె 'హఫ్సా (రజి)' దుస్థితి పట్ల చాలా విచారంగా ఉన్నారు. ఆమెకు పునర్వివాహం చేయడానికి సరైన సంబంధం ఇంకా లభించలేదు.
ఓ రోజు ఉమర్ (రజి), ఉస్మాన్ (రజి) దగ్గరకి పోయి ఈ విషయం గురించి ప్రస్తావించారు.
'హజ్రత్ ఉస్మాన్ (రజి)' గారి అర్థాంగి 'రుఖియ్యా (రజి) బిన్తే ముహమ్మద్ (సల్లం)' కూడా ఈ మధ్యనే చనిపోయారు. అంచేత హజ్రత్ ఉమర్ (రజి), తన కుమార్తె హఫ్సా (రజి)ను ఉస్మాన్ (రజి) చేసుకుంటాడేమోనని భావించి వచ్చారు.
కాని ఉస్మాన్ (రజి), తాను ఈ విషయం గురించి ఆలోచించి చెబుతానని విషయం దాటవేయడానికి ప్రయత్నించారు. హజ్రత్ ఉమర్ (రజి) ఈ మాట విని నిరాశతో వెళ్ళిపోయారు.
మరొక రోజు ఆయన (రజి), 'హజ్రత్ అబూ బక్ర్ (రజి)' దగ్గరికి వెళ్ళి ఈ విషయమే ప్రస్తావించారు. కాని, ఆయన దగ్గర నుంచి కూడా ఆశించిన సమాధానం ఏదీ రాలేదు. దాంతో ఉమర్ (రజి) మరింత విచారంతో కృంగిపోయారు.
ఆ తరువాత హజ్రత్ ఉమర్ (రజి) సలహా కోసం దైవప్రవక్త (సల్లం) సన్నిధికి వెళ్ళారు. దైవప్రవక్త (సల్లం), ఉమర్ (రజి) విచారవదనం చూసి...., *"ఉమర్! ఏమిటి ఈ రోజు నువ్వు చాలా విచారంగా ఉన్నట్లు కన్పిస్తున్నావు?"* అని అడిగారు.
*"దైవప్రవక్తా! నా కూతురు హఫ్సా పునర్వివాహ విషయం నన్ను కృంగదీస్తోంది. నేను ఉస్మాన్ దగ్గరకు వెళ్ళి అడిగితే, ఆయనగారు ఆలోచించి చెబుతానని చెప్పి నన్ను పంపివేశారు. అబూ బక్ర్ దగ్గరికి వెళ్తే ఆయన దగ్గరనుంచి కూడా నాకు సరైన సమాధానం రాలేదు."* అన్నారు హజ్రత్ ఉమర్ (రజి) విచారంతో.
దైవప్రవక్త (సల్లం), ఈ మాట విని చిరునవ్వు నవ్వుతూ...., *"ఉమర్! అల్లాహ్, ఉస్మాన్ కు నీ కూతురి కంటే మంచి భార్యను ప్రసాదించాడు. నీ కూతురికి ఉస్మాన్ కంటే మంచి భర్తను ప్రసాదించాడు."* అన్నారు.
హజ్రత్ ఉమర్ (రజి)కు దైవప్రవక్త (సల్లం) మాటల్లోని గుడార్థం తెలియక కాస్సేపు తికమకపడుతూ ఆశ్చర్యపోయారు. తరువాత దైవప్రవక్త (సల్లం) విషయం వివరంగా తెలియజేశారు. అప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు.
ఆ తరువాత ఆయన (సల్లం), హజ్రత్ ఉమర్ (రజి) కుమార్తె హఫ్సా (రజి)ను వివాహమాడారు. అప్పటికి హఫ్సా (రజి) వయస్సు ఇరవై సంవత్సరాలే. ఇలా, ఆయన (సల్లం) తన అనుచరులతో సంబంధాలను పటిష్ఠపరచుకున్నారు.
మహాప్రవక్త (సల్లం) వితంతువుల విషయమై తన అనుచరుల్ని ఉపదేశిస్తూ...., *"మీరు వితంతువుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోండి. వారి పట్ల సానుభూతి చూపండి. అవసరమైతే వితంతు స్త్రీని వివాహమాడి ఆమెను, ఆమె పిల్లలను చేరదీయండి. మీరు ఆ విధంగా చేయకపోతే ఆమె దిక్కులేనిదైపోయి దారిద్ర్యానికి గురవుతుంది. ఆమె పిల్లలు ఆమెకు భారమైపోతారు. ఆ విధంగా ఆమె అనేక కష్టాలకు గురవుతుంది."* అని చెప్పారు.
*హజ్రత్ జైనబ్ (రజి)తో దైవప్రవక్త (సల్లం) వివాహం : -*
'హజ్రత్ ఖుజైమా (రజి)' కుమార్తె 'హజ్రత్ జైనబ్ (రజి)' ఎంతో సుగుణవతి. దానధర్మాలు చెయ్యడమంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఈ కారణంగా ఆమె, జనంలో *"ఉమ్ముల్ మసాకీన్" (పేదల మాతృమూర్తి)* అని పేరు పడ్డారు. బద్ర్ యుద్ధంలో ఆమె భర్త 'అబ్దుల్లా బిన్ జహష్ (రజి)' అమరగతులయ్యారు. ఆమె దీనావస్థ చూసి దైవప్రవక్త (సల్లం) ఎంతో జాలి పడ్డారు. అంచేత ఆయన (సల్లం), ఆమెను కూడా వివాహమాడారు. ఇలా ఆయన (సల్లం) వితంతువుల్ని వివాహమాడి, వారికి సమాజంలో తగిన గౌరవప్రదమైన స్థానం కల్పించారు.
*హజ్రత్ ఉమ్మె కుల్సూమ్ (రజి)తో ఉస్మాన్ (రజి) వివాహం : -*
దైవప్రవక్త (సల్లం), బద్ర్ యుద్ధం నుండి తిరిగిరాగానే తన కుమార్తె రుఖియా (రజి) మరణవార్త వినవలసి వచ్చింది. భార్య మరణం పట్ల హజ్రత్ ఉస్మాన్ (రజి) ఎంతో తల్లడిల్లి పోయారు.
"దైవప్రవక్తా ! మీతో ఏర్పడిన ఈ ప్రత్యేక సంబంధం కాస్తా ఇప్పుడు లేకుండా పోయింది." అన్నారు ఆయన (రజి) ఎంతో ఆవేదనతో.
మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం), హజ్రత్ ఉస్మాన్ (రజి)ని అమితంగా అభిమానించేవారు. ఆయన సుగుణ సంపత్తి వల్ల కూడా దైవప్రవక్త (సల్లం) ఎంతో ప్రభావితులయ్యారు. అంచేత కొన్నాళ్ళకు ఆయన (సల్లం) తన రెండో కుమార్తె 'హజ్రత్ ఉమ్మె కుల్సూమ్ (రజి)'ని ఉస్మాన్ (రజి)కు ఇచ్చి వివాహం చేశారు.
*మిగిలినది In Sha Allah రేపటి భాగములో....;*
✍🏻✍🏻 *®@£€€q* *+97433572282* ✍🏻✍🏻
*(rafeeq)*
✍🏻✍🏻 *Salman* *+919700067779* ✍🏻✍🏻
*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*
💎💎 *మా సలాం* 💎💎
─┄┅━═══✦═══━┅┄─
No comments:
Post a Comment