🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐
🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋
◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉
🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర - 218* 🛐🕋☪🕌
🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 133* 🇸🇦🇸🇦
◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉
*దైవప్రవక్త (సల్లం) ఇంటికి ఆయిషా (రజి) రాక : -*
మహాప్రవక్త (సల్లం) జీవితం, నిరంతర సంఘర్షణలకు ప్రతీక. దైవసందేశ వ్యాప్తి కోసం ఆయన (సల్లం) ఎన్నో త్యాగాలు చేశారు. దుష్ట శక్తులతో పోరాటం కూడా జరిపారు. బద్ర్ యుద్ధం తరువాత ఏదో కాస్తంత విశ్రాంతి లభించిందంటే, యూదుల బెడద ఎక్కువైంది. ఈ పనులన్నింటినీ నెరవేరుస్తూ మధ్యలో ఎప్పుడైనా కాస్త విరామం లభిస్తే ఆ సమయంలో సైతం ఆయన (సల్లం) ఇతర ఉద్యమ కార్యకలాపాలలో నిమగ్నులయ్యేవారు.
ముఖ్యంగా ముస్లిములను సంఘటిత పరచడం, వారిని సుశిక్షితుల్ని చేయడం, బలహీనుల బాగోగుల్ని విచారించడం, వారి అవసరాలు తీర్చే ఏర్పాట్లు చెయ్యడం, అనుయూయలతో తన సంబంధాలను మరింత పటిష్ఠపరుచుకోవడం పట్ల శ్రద్ధ చూపేవారు ఆయన (సల్లం).
'హజ్రత్ ఖదీజా (రజి)' చనిపోయిన తర్వాత దైవప్రవక్త (సల్లం) యాభై ఏళ్ళ వయసున్న 'హజ్రత్ సౌదా (రజి)'ని మక్కాలో వివాహమాడారు. 'హజ్రత్ అబూ బక్ర్ (రజి)' కుమార్తె 'ఆయిషా (రజి)'ను కూడా మక్కాలో ఉన్నప్పుడే వివాహం చేసుకున్నారు. మదీనాలో కాస్త స్థిమితం లభించిన తరువాత హజ్రత్ 'అబూ బక్ర్ (రజి)' దైవప్రవక్త (సల్లం) సన్నిధికి వచ్చి...., *"దైవప్రవక్తా! ఇక ఆయిషాను మీ దగ్గరికి పంపిస్తాను."* అన్నారు. దానికి దైవప్రవక్త (సల్లం)...., *"మహర్ ఇంకా మిగిలి ఉంది కదా!"* అన్నారు.
ఆ తరువాత కొన్నాళ్ళకు మహర్ చెల్లింపు జరిగిపోయింది. 'హజ్రత్ అబూ బక్ర్ (రజి)' కూతుర్ని దైవప్రవక్త (సల్లం) ఇంటికి పంపదలచి తన భార్యతో...., *"మన ఆయిషా, దైవప్రవక్త (సల్లం)తో సంసారం చేసే సమయం ఆసన్నమయింది. వెంటనే ఆమెను పంపే ఏర్పాటు చెయ్యి."* అన్నారు.
'హజ్రత్ ఆయిషా (రజి)' అప్పుడు స్నేహితురాళ్ళతో కలసి ఉయ్యాలలో ఊగుతున్నారు. తల్లి పిలిపుతో ఆమె ఇంట్లోకి పరుగెత్తుకొచ్చారు. తల్లి ఆమెకు స్నానం చేయించి పరిశుభ్రమైన బట్టలు తొడిగించారు. తల దువ్వి ముస్తాబు చేశారు. ఆ సమయంలో కొందరు అన్సార్ మహిళలు కూడా వచ్చారు. వారంతా 'హజ్రత్ ఆయిషా (రజి)'ను మరింత అందంగా ముస్తాబు చేశారు. ఆ తరువాత ఆమెను దైవప్రవక్త (సల్లం) ఇంటికి పంపడం జరిగింది.
*హజ్రత్ అలీ (రజి), హజ్రత్ ఫాతిమా (రజి)ల వివాహం : -*
ఓ రోజు 'హజ్రత్ అలీ (రజి)' దైవప్రవక్త (సల్లం) సన్నిధికి వచ్చి తలొంచుకొని మౌనంగా కూర్చున్నారు. ఏదో చెప్పాలనుకున్నారు గాని, నోట మాట పెగలడం లేదు. దైవప్రవక్త (సల్లం) కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నారు. ఆయన (రజి) ముఖారవిందం ఒక విధమైన బిడియంతో ముడుచుకొని పోతోంది. దైవప్రవక్త (సల్లం) విషయం పసిగట్టి చిరునవ్వు నవ్వారు.
*"అలీ! నువ్వు బహుశా 'ఫాతిమా'ను వివాహమాడదలిచానని చెప్పడానికి వచ్చావనుకుంటున్నాను, ఔనా?"* అన్నారు ఆయన (సల్లం) వాత్సల్యంతో చూస్తూ.
*"ఆ.... ఔను దైవప్రవక్తా!"* అన్నారు హజ్రత్ అలీ (రజి) సిగ్గు పడుతూనే.
*"సరే, నీ దగ్గర మహర్ కోసం ఏదైనా ఉందా?"* అడిగారు దైవప్రవక్త (సల్లం).
*"నా దగ్గర ఒక గుర్రం, కవచం మాత్రమే ఉన్నాయి."* అని అన్నారు అలీ (రజి).
*"గుర్రం, కవచం యుద్ధ సమయాల్లో పనికి వస్తాయి. కాని, గుర్రం చాలా అవసరం అంచేత నువ్వు కవచం అమ్మెయ్యి."* అన్నారు మహాప్రవక్త (సల్లం).
ఈ మాట వినగానే అలీ (రజి) ముఖం ఒక్కసారిగా తామరపువ్వులా వికసించింది. సిగ్గుదొంతర నుండి ఆనందకుసుమాలు రాలిపడ్డాయి. సంతోష కెరటాలతో హృదయ సాగరం పరవళ్ళు తొక్కింది. వెంటనే ఆయన బయటికి వెళ్ళారు. కవచాన్ని 'ఉస్మాన్ (రజి)'కు నాలుగు వందల దిర్హమ్ లకు అమ్మి డబ్బు తెచ్చారు మహర్ సొమ్ము చెల్లించడానికి.
అటు అందంతో పాటు ఆత్మసౌందర్యంలో అందర్నీ మించిపోయి "స్వర్గ మహిళ"గా పేరుపడ్డ 'హజ్రత్ ఫాతిమా (రజి)' ఈ శుభవార్త వినగానే సిగ్గుతో కుంచించుకుపోయారు. ఆమె మానసాకాశంలో కొన్ని క్షణాలపాటు హజ్రత్ అలీ (రజి) రెక్కలు కట్టుకొని ఎగురుతూ పొగరుబోతు గోరింకలా విహరించారు.
ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) దగ్గరుండి హజ్రత్ అలీ (రజి), ఫాతిమా (రజి)ల వివాహం జరిపించారు. ఆయన (సల్లం) తన ముద్దుల కుమార్తె సంసారానికి ఒక మంచం, ఒక తోలు పరుపు, ఖర్జూరపు ఆకులతో నింపిన ఒక తలగడ, ఓ చిన్న తోలుసంచి, రెండు మట్టి కుండలు, రెండు తిరగళ్ళు ఇచ్చారు. అల్లుడి దగ్గర ఒక గొర్రె చర్మం, ఓ చినిగిన దుప్పటి మాత్రమే ఉన్నాయి. ఇవీ, ఆ కొత్త దంపతుల కొత్త కాపురానికి సమకూరిన వస్తువులు. ఇవే వారి మొత్తం ఆస్తి పాస్తులు.
అత్తవారింటికి వెళ్ళే సమయం రాగానే 'హజ్రత్ ఫాతిమా (రజి)'కు అప్రయత్నంగా దుఃఖం పెల్లుబికింది. నాన్నగారి ఇంటిని, దాని పరిసరాలను మాటిమాటికి వెనక్కి తిరిగి చూస్తూ, ఇకముందు కొత్త ఇంట్లో, కొత్త పరిసరాల మధ్య మనుగడ సాధించవలసి ఉందన్న సంగతి గుర్తుకు తెచ్చుకొని ఆమె పసిపిల్లలా విలపించారు.
కూతురి చెక్కిళ్ళపై కన్నీటి ధారా చూడగానే కారుణ్యమూర్తి (సల్లం) చలించిపోయారు. కాని, అంతలోనే గుండెను రాయి చేసుకొని లాలిస్తూ...., *"ఫాతిమా! ఏడవకు తల్లీ! నీ పెళ్ళి సామాన్య వ్యక్తితో కాలేదు. విద్యాజ్ఞానాల్లో, విశ్వాస సహనాల్లో అందరికంటే గొప్పవాడయిన అలీతో నీ వివాహం జరిపించానమ్మా!"* అన్నారు ఆయన (సల్లం).
ప్రపంచంలోని భార్యాభర్తలందరికీ అలీ (రజి), ఫాతిమా (రజి)లు ఆదర్శ దంపతులనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే, భార్యభర్తలు అన్నాక ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక సందర్భంలో వారి మధ్య కీచులాట రాకుండా ఉండదు. ఒక రోజు ఫాతిమా (రజి) ఏదో విషయంలో భర్త మీద అలిగి తండ్రి ఇంటికి వెళ్ళిపోయారు. కాస్సేపటికి అలీ (రజి) కూడా ఆమె వెనకాల దైవప్రవక్త (సల్లం) ఇంటికి వెళ్ళారు.
హజ్రత్ ఫాతిమా (రజి) చేసిన ఆరోపణల్ని దైవప్రవక్త (సల్లం) ఓపికగా విన్నారు. కాని అంతమాత్రాన ఆయన (సల్లం) కూతుర్ని వెనకేసుకొని రాలేదు. పైగా కూతురికి గుణపాఠం గరిపే విధంగా మాట్లాడుతూ...., *"లోకంలో ఏ భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు రాకుండా ఉంటాయమ్మా! అయినా, ప్రతి విషయంలోనూ భర్త భార్య మాట వినాల్సిన అవసరం ఏముంది?"* అన్నారు.
తలుపు చాటున నిల్చోని, తండ్రీ కూతుళ్ళ సంభాషణ విన్న అలీ (రజి)ని ఈ మాటలు ఎంతో ప్రభావితం చేశాయి. తానిక ఎన్నటికీ ఫాతిమా (రజి) మనసు నొప్పించనని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. ఫాతిమా (రజి) కూడా తండ్రి మాటలు విన్న తరువాత ఇక ముందు ఏ విషయంలో కూడా భర్తకు ఎదురుచెప్పకుండా మసులుకుంటానని నిశ్చయించుకున్నారు.
*మిగిలిన In Sha Allah రేపటి భాగములో....;*
✍🏻✍🏻 *®@£€€q* *+97433572282* ✍🏻✍🏻
*(rafeeq)*
✍🏻✍🏻 *Salman* *+919700067779* ✍🏻✍🏻
*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*
💎💎 *మా సలాం* 💎💎
─┄┅━═══✦═══━┅┄─
No comments:
Post a Comment