217

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉

🕌☪🕋🛐      *ఇస్లాం చరిత్ర - 217*       🛐🕋☪🕌

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 132*      🇸🇦🇸🇦

◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉

*మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) కుమార్తె "హజ్రత్ జైనబ్ (రజి)" మక్కా నుండి మదీనాకు హిజ్రత్ : -*

ఖురైషీయులు, ప్రవక్త (సల్లం) కుమార్తె హజ్రత్ జైనబ్ (రజి)ను వదిలేయమని ఆమె భర్త 'అబుల్ ఆస్'ను అడిగినప్పుడు, *"ఆమె నా ప్రాణం, నా హృదయేశ్వరి. ఆమెను వదిలి నేను ఎలా బ్రతకగలను? నా ప్రాణాన్ని నేనెలా తీసుకోను?"* అన్నాడు.

అయితే 'అబుల్ ఆస్' ఇంకా ఇస్లాం స్వీకరించక పోవడమే గాకుండా, బద్ర్ యుద్ధంలో దైవప్రవక్త (సల్లం)కు ఎదురు నిలిచినందున ఇప్పుడతను 'జైనబ్ (రజి)'ను వదలి పెట్టక తప్పలేదు. యుద్ధఖైదీగా పట్టుబడినప్పుడు అతన్ని దైవప్రవక్త (సల్లం) విడిచిపెడుతూ, *"మక్కా వెళ్ళగానే జైనబ్ (రజి)ను శాశ్వతంగా మదీనా పంపివేయాలి."* అనే షరతు విధించారు. ఎందుకంటే, ఇప్పుడు ఈ సంబంధం తెగిపోయింది. ఇస్లాం వారిద్దరినీ వేరుచేసింది.

దైవప్రవక్త (సల్లం) ఆజ్ఞ ప్రకారం జైనబ్ (రజి)ను మక్కా సమీపంలో ఉన్న ఒకచోట వదలిపెట్టాలని, అక్కడనుంచి ఆమెను హజ్రత్ జైద్ (రజి) మదీనా తీసుకువస్తారని ముందే నిర్ణయించబడింది. అబుల్ ఆస్ ఈ విషయం హజ్రత్ జైనబ్ (రజి)కు వివరించాడు. ఆ తరువాత అతను తన తమ్ముడు 'కనానా'తో జైనబ్ (రజి)ను తీసికెళ్ళి మక్కా వెలుపల నిర్ణీత ప్రదేశంలో దిగబెట్టి రమ్మని చెప్పాడు.

జైనబ్ (రజి) మదీనా వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అంతలో 'అబూ సుఫ్'యాన్' భార్య 'హిందా' వచ్చి...., *"ఏం చెల్లీ! నువ్వు మీనాన్న దగ్గరకి వెళ్ళిపోతున్నావట, నిజమేనా ?"* అన్నది.

ఈ మాట విని హజ్రత్ జైనబ్ (రజి) నివ్వెరపోయారు. ఇంత రహస్యంగా ఉంచిన సంగతి 'హిందా'కు ఎలా తెలిసిందో ఆమెకు బోధపడలేదు. ఇప్పుడేం చెయ్యాలి? ఒకవేళ ఔనంటే 'హిందా' తనకేదైనా కీడు తలపెడుతుందేమో! అసలే ఆమెకు దైవప్రవక్త (సల్లం) అంటే మంట. ఈ ఆలోచనతో జైనబ్ (రజి) ఎటూ తేల్చుకోలేక మౌనంగా ఉండిపోయారు.

*"ఏదైనా అవసరమైతే సంకోచం లేకుండా చెప్పెయ్యి. నేను ప్రతి వస్తువూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మన స్నేహసంబంధాలకు ఎలాంటి లోటు రాకూడదు. మగవాళ్ళ వ్యవహారాలు వేరు; ఆడవాళ్ళ వ్యవహారాలు వేరు. మగవాళ్ళు పరస్పరం ఏదయినా చేసుకోవచ్చు. వాళ్ళతో ఆడవాళ్ళయిన మనకు పనేమిటి?"* అన్నది హిందా.

ఎంత మధురంగా ఉన్నాయి ఈ మాటలు! వాటిలో ఎంత పరోపకారం వ్యక్తమవుతోంది!! అయినా హజ్రత్ జైనబ్ (రజి) మనస్సు కుదుటపడలేదు. ఏమైనా, ఆమె 'హిందా' నుంచి ఎలాంటి సహాయం కోరలేదు.

జైనబ్ (రజి) ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అది ప్రభాత సమయం. 'కనాన' ఆమె కోసం ఒక ఒంటె తెచ్చి, ఆమెను ఒంటె మీద ఎక్కించి బయలుదేరాడు. దారిలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే దాన్ని ఎదుర్కోవడానికి కావలసిన ధనుర్భాణాలు కూడా వెంట తీసుకున్నాడు.

హజ్రత్ జైనబ్ (రజి), మదీనా వెళ్తున్న సంగతి మక్కాలో అందరికి తెలిసిపోయింది. దైవప్రవక్త (సల్లం) మనస్సు బాధించాలన్న దుర్భుద్ధితో కొందరు ఖురైషీయులు ఆమెను మదీనా పోకుండా అడ్డుకోవాలనుకున్నారు. వారిలో 'అబూ సుఫ్'యాన్' కూడా ఉన్నాడు. వారంతా ఆయుధాలు తీసుకొనివెళ్ళి 'జైనబ్ (రజి)'ను, 'కనానా'ను వెంబడించారు. వారిని చూడగానే జైనబ్ (రజి) కంగారు పడిపోయారు.

ఖురైషీయులు వారిద్దరిని సమీపించారు. వారిలో ఒకడు వేగంగా జైనబ్ (రజి) ఒంటె దగ్గరకి వచ్చాడు. అతను, ఒంటెపై జైనబ్ (రజి) చుట్టూ కట్టిన పరదా తొలగించి కత్తి చూపిస్తూ...., *"మర్యాదగా వెనక్కి పద. లేదంటావా...."* అని గదమాయించాడు. దాంతో హజ్రత్ జైనబ్ (రజి) నిలువునా కంపించిపోయారు.

ఆమె (రజి) దయనీయ స్థితి చూసేటప్పటికి 'కనానా'కు పౌరుషం పూరి విప్పింది. తక్షణమే అతను విల్లు ఎక్కుపెట్టి చూపిస్తూ...., *"ఎవడైనా సరే, అడుగు ముందుకు వేశాడా.... వాడి గుండెల్లో నుంచి ఈ బాణం దూసుకుపోవడం ఖాయం."* అన్నాడు ఉరిమిచూస్తూ.

అతని రౌద్రాకారం చూసి ఖురైషీయులు చల్లబడిపోయి పక్కకు తప్పుకున్నారు.

*"ఆగవయ్యా బాబు ! బాణం విడువకు, కాస్త మా మాట విను."* అన్నాడు అబూ సుఫ్'యాన్.

*"సరే ఏమిటో చెప్పు."* అన్నాడు కనాన ధనుస్సు క్రిందకి దించుతూ.

*"ఇలా నువ్వు, ఈమె (రజి)ను బహిరంగంగా తీసుకెళ్ళడం ఏమంత బాగాలేదు. ముహమ్మద్ (సల్లం) వల్ల మనం ఇప్పటికే అనేక కష్టాలతో సతమతమైపోతున్న సంగతి నీకూ తెలుసు. ఇలాంటి పరిస్థితిలో నువ్వు అతని (సల్లం) కూతుర్ని ఇలా తీసుకెళ్తే జనం చూసి మనల్ని గురించి ఏమనుకుంటారు? మనం ఓడిపోయామని, మన జాతి ఢీలా పడిపోయిందని అనుకోరా? ఈమె (రజి)ను పోకుండా ఆపినందువల్ల మనకు ఒరిగేది లేదు. అంచేత ఓ పని చెయ్యి. ప్రజల్లో రేగిన చర్చ అణగిపోయి ప్రశాంత పరిస్థితి నెలకొన్న తరువాత ఈమె (రజి)ను తీసుకెళ్ళవచ్చు. అప్పటిదాకా ఈమె (రజి)ను మక్కాలోనే ఉంచుదాం."* అన్నాడు అబూసుఫ్'యాన్.

అబూసుఫ్'యాన్ చెప్పినమాట బాగానే ఉంది. 'కనాన' దానికి ఒప్పుకున్నాడు. జైనబ్ (రజి)ను తిరిగి మక్కా తీసుకువచ్చాడు.

కొన్నాళ్ళకు జనంలో చర్చ తగ్గిపోయింది. అప్పుడతను ఓ రోజు రాత్రి వేళ జైనబ్ (రజి)ను తీసుకెళ్ళి నిర్ణీత ప్రదేశానికి చేర్చాడు. అక్కడ జైనబ్ (రజి) కోసం ఎదురుచూస్తున్న హజ్రత్ జైద్ (రజి), ఆయన సహచరులు ఈమెను తీసుకొనిపోయి దైవప్రవక్త (సల్లం) సన్నిధికి చేర్చారు.

_ఇది, బహు బాధాకరంగా, సుదీర్ఘంగా సాగిన "హజ్రత్ జైనబ్ (రజి)" గారి హిజ్రత్._
__________________________

*"దివ్య ఖుర్ఆన్" వాక్యాల పునర్విమర్శ : -*

ఈ (బద్ర్) యుద్ధానికి సంబంధించే "ఖుర్ఆన్"లో 'అన్'ఫాల్' అధ్యాయం (సూరా) అవతరించింది. ఇది యదార్థంగా ఈ యుద్ధం గురించి అల్లాహ్ చేసిన సమీక్ష అని చెప్పవచ్చు - ఇదే నిజమైతే ఈ పునర్విమర్శ రాజులు, కమాండర్ల విజయాలపై చేసే సమీక్షకు పూర్తిగా భిన్నమైన సమీక్ష. ఈ సమీక్షలోని కొన్ని అంశాలు ఇవి....; ↓

అల్లాహ్ మొట్టమొదట ముస్లిముల్లో మిగిలిపోయిన తప్పుల్ని, వారి నైతిక లోపాలను చూపెట్టడం జరిగింది. ఆ తప్పులు ఈ సందర్భంలో వారి ద్వారా దొరలిపోతాయి. ఈ హెచ్చరికను చేసి అల్లాహ్ వారిలో ఉన్న బలహీనతల్ని తొలగించి, సంపూర్ణ వ్యక్తిత్వం గలవారుగా మలచదలచుకున్నాడు.

ఆ తరువాత ఈ విజయంలో అల్లాహ్ చేసిన సహాయాన్ని, పరోక్షంగా వారికి అందించిన సహకారాన్ని గుర్తుచేస్తూ, ముస్లిములు తమ ధైర్యశౌర్యాలను చూసి విర్రవీగకూడదు అని చెప్పడం. అప్పుడప్పుడు వారి మనస్సుల్లో గర్వం ఏర్పడవచ్చు. కాబట్టి, ఇక నుండి వారు అల్లాహ్ నే నమ్ముకుని దైవప్రవక్త (సల్లం)కు విధేయత చూపుతూ ఉండాలి.

ఆ పిదప దైవప్రవక్త (సల్లం) ఏ మహోన్నతమైన లక్ష్యాలను, అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ యుద్ధ రంగంలో కాలిడారో, ఆ లక్ష్యాలు మరియు అవసరాలు ఏమై ఉంటాయో, అవి ఇలాంటి యుద్ధాలలో ఎలా విజయాన్ని చేకూర్చి పెడతాయో చెప్పడం జరిగింది.

ఆ తరువాత ముష్రిక్కులను, యూదుల్ని మరియు యుద్ధ ఖైదీలను సంభోదిస్తూ, వారు సత్యం ముందు వంగిపోయి దాన్నే అనుసరించాలని హితవు చెప్పడం జరిగింది.

ఆ పిదప ముస్లిములను సంబోధిస్తూ, లభించిన యుద్ధ ధన సమస్యను పరిష్కరించుకోడానికి అవసరమైన మౌలిక సూత్రాలను, విధానాలను బోధించడం జరిగింది.

అదే కాదు, ఇస్లామీయ సందేశ ప్రచారంలో అవలంబించవలసిన యుద్ధం మరియు సంధికి అవసరమైన చట్టాలను చెప్పడం జరిగింది. ఈ చట్టాలు, విధానాలను ఉపయోగించుకొని అజ్ఞానులు (అంటే ఇస్లాం ధర్మాన్ని కాదని తమ తాతముత్తాతల మార్గంపై నడిచేవారు) మరియు ముస్లిములలో గల తేడా ప్రస్ఫుటంగా అగుపడాలని చెప్పడం జరిగింది. నైతికతా విలువల్లో మరియు నడవడికలో ముస్లిములకే ఆధిక్యత ఉండాలి, ఇస్లాం కేవలం ఒక సైద్ధాంతిక మతం కాదు, ఏ సిద్ధాంతాల వైపునకు, సూత్రాల వైపునకు అయితే అది ఆహ్వానిస్తుందో దాన్ని పూర్తిగా ఆచరించి చూపెట్టే ధర్మం అని ప్రపంచానికి తెలిసిపోవాలి. అది నమ్మిన సూత్రాలకు అనుగుణంగా నడవడానికి ప్రతి ముస్లింకు శిక్షణ కూడా ఇస్తుందని ప్రపంచం గ్రహించాలి.

ఈ అధ్యాయంలో ఇస్లామీయ చట్టానికి సంబంధించిన అనేక అధికరణలను కూడా తెలుపుతూ, దీని ద్వారా ఇస్లామీయ ప్రభుత్వ పరిధిలో నివసించే ముస్లిములకు, దానికి వెలుపల నివసించే ముస్లిములకు గల తేడా ఏమిటో విడమర్చి చెప్పడం జరిగింది.

*పరోక్ష సంఘటనలు : -*

*హిజ్రీ శకం రెండులో, "రమజాన్ ఉపవాస దీక్ష" మరియు "సద్'ఖయె ఫిత్ర్ (ఫిత్రా దానం)" విధిగా చేయడం జరిగింది.* అదేకాకుండా, జకాత్ దానానికి సంబంధించిన పరిణామాలు ఏమిటో తెలుపడం జరిగింది. ఫిత్రా దానం మరియు జకాత్ చెల్లించే కనీస ఆదాయ పరిధిని నిర్ణయించడం వలన అనాధలు, నిస్సహాయులు, ముహాజిర్లు అనుభవిస్తున్న కష్టాల భారం కొంత తగ్గిపోయింది. ఎందుకంటే, వీరు తమ ఉపాధిని పొందేందుకు మార్గాలులేక బాధపడుతుండేవారప్పుడు.

*ఓ శుభ సందర్భంలో సంభవించిన మరో ఆసక్తికరమైన సంఘటన ఏమిటంటే, ముస్లిములు తమ జీవితంలోనే మొట్టమొదటి "ఈద్" ఏదైతే జరుపుకున్నారో అది షవ్వాల్ మాసం రెండవ హిజ్రీ శకంలో జరుపుకున్న "ఈద్". అది 'బద్ర్ యుద్ధ' విజయం తరువాత వచ్చిన పర్వదినం. ఎంత ఆనందమయమైనదీ ఆ సుదినం! ఆ సంతోష సమయంలోనే అల్లాహ్ వారి తలలపై విజయ కిరీటాన్ని అలంకరించింది. ఆ పండుగ వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా, విశ్వాసాన్ని ఇనుమడింపజేసేదిగా ఉంది! ముస్లిములు తమ ఇళ్ళ నుండి బయటకు వచ్చి దైవ నామస్మరణ చేస్తూ "ఈద్'గాహ్"కు వెళ్ళి "ఈద్ నమాజు"ను చేసిన ఆ దృశ్యం ఎంత ఆహ్లాదాన్ని కలిగించిందో.*

ఆ సందర్భంలో ముస్లిముల హృదయాలు, అల్లాహ్ ఒసగిన వరాలు, ఆయన అందించిన సహాయం వల్ల భారంగా అణిగిపోతున్నాయి. వారి నొసళ్ళు ఆయన కృతజ్ఞతకు భూమిపై ఆని ఉన్నాయి.

🌹🌹 *"రమజాను నెల - ఖుర్ఆన్ అవతరింపజేయబడిన నెల. అది మానవులందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతో పాటు, సత్యసత్యాలను వేరుపరచే, స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. కనుక మీలో ఎవరు ఈ నెలను చూస్తారో వారు ఉపవాసాలుండాలి. అయితే రోగగ్రస్తునిగానో, ప్రయాణీకునిగానో ఉన్నవారు ఇతర దినాలలో ఈ లెక్కను పూర్తిచేయాలి. అల్లాహ్ మీకు సౌలభ్యాన్ని సమకూర్చదలుస్తున్నాడే గాని మిమ్మల్ని కష్టపెట్టదలచటం లేదు. మీరు (ఉపవాసాల) నిర్ణీత సంఖ్యను పూర్తిచేసుకోవాలన్నదీ, తాను అనుగ్రహించిన సన్మార్గ భాగ్యానికి ప్రతిగా ఆయన గొప్పతనాన్ని కీర్తించి, తగురీతిలో మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నది అల్లాహ్ అభిలాష!" (ఖుర్ఆన్ 2:185).*🌹🌹

*మిగిలినది In Sha Allah రేపటి భాగములో....;*

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment