216

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉

🕌☪🕋🛐      *ఇస్లాం చరిత్ర - 216*       🛐🕋☪🕌

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 131*      🇸🇦🇸🇦

◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉

*ఖైదీల సమస్య - దాని పరిష్కారం : -*

దైవప్రవక్త (సల్లం) మదీనాకు చేరగానే, ఖైదీల సమస్యను గురించి చర్చించడానికి సహాబా (రజి)లను సమావేశపరిచారు. ఖైదీలపై ఎలాంటి చర్య తీసుకోవాలో చెప్పమని వారి అభిప్రాయాలు అడిగారు. ఈ విషయంలో "హజ్రత్ అబూ బక్ర్ సిద్దిఖ్ (రజి)" ఇలా అన్నారు....; ↓

*"ఓ మహాప్రవక్తా (సల్లం)! వీరు దాయాదులు (అంటే పినతండ్రుల కుమారులు). మన కుటుంబాలకు, మన వంశానికి చెందినవారు. నా సలహా ప్రకారం, తమరు వీరి నుండి ఫిదియా (పరిహారం) తీసుకొని వదిలేయండి. మనం వారి నుండి పొందిన ధనం, ఈ దైవధిక్కారులకు వ్యతిరేకంగా మనకు బలం చేకూర్చుతుంది. బహుశా అల్లాహ్ మునుముందు వారికి మార్గదర్శన భాగ్యం కలిగిస్తాడేమో. అప్పుడు వారు మనకు అండగా నిలుస్తారేమో."*

ఆ తరువాత "హజ్రత్ ఉమర్ (రజి)" గారిని ఉద్దేశించి దైవప్రవక్త (సల్లం)...., *"ఓ ఉమర్ (రజి)! నీ సలహా ఏమిటి?"* అని అడిగారు. దానికి "హజ్రత్ ఉమర్ (రజి)" ఇచ్చిన సలహా ఇది....; ↓

*"దైవసాక్షి! నా సలహా హజ్రత్ అబూ బక్ర్ (రజి) ఇచ్చిన సలహాకు పూర్తిగా వ్యతిరేకం. నా సలహా ఏమిటంటే, తమరు ఫలానా వ్యక్తిని - ఎవరైతే ఉమర్ కు దగ్గరి బంధువో - నాకు అప్పగించండి. నేను అతని తలను ఖండిస్తాను. "అకీల్ బిన్ అబీ తాలిబ్" - (ఈయన అలీ (రజి) సోదరుడు) - అలీ (రజి)కి అప్పజెప్పండి. ఆయన అతని తలను నరికేస్తాడు. హమ్'జా (రజి)కు సోదరుడైన ఫలానా వ్యక్తిని హమ్'జా (రజి)కు అప్పజెప్పండి. ఆయన అతని తలను ఖండిస్తారు. చివరికి, అల్లాహ్ కు తెలిసిపోవాలి మా హృదయంలో ముష్రిక్కుల కోసం ఎలాంటి దయ లేదని. వీరంతా ముష్రిక్కుల సర్దారులు, నాయకులూను."*

*హజ్రత్ ఉమర్ (రజి) గారి ఉల్లేఖనం ఇలా ఉంది....; ↓*

మహాప్రవక్త (సల్లం) నా సలహాకు విలువ ఇవ్వకుండా "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" గారి సలహాకే విలువనిచ్చారు. కాబట్టి, ఖైదీల నుండి ఫిదియా తీసుకోడానికే నిర్ణయం అయింది.

ఆ తరువాత మరుసటి రోజు నేను ఉదయాన్నే దైవప్రవక్త (సల్లం) గారి సన్నిధికి రాగా, మహాప్రవక్త (సల్లం) మరియు అబూ బక్ర్ (రజి) ఇద్దరు కలిసి రోదించడం చూశాను. నేను...., *"దైవప్రవక్తా! విషయం ఏమిటో నాకు చెప్పండి. మీరూ, మీ స్నేహితుడు ఇద్దరూ కలిసి ఎందుకు రోదిస్తున్నారో. ఆ కారణం ఏదో తెలిస్తే నేను మీతో పాటు ఏడుస్తాను. ఆ కారణం తెలియకపోయినా మీరిద్దరు కలిసి రోదిస్తున్నారు కాబట్టి నేను రోదిస్తాను."* అన్నాను.

దానికి దైవప్రవక్త (సల్లం)...., *"ఫిదియా తీసుకునే నిర్ణయం కారణంగా, మీ మిత్రులకు పడబోయే శిక్షణ చూసి రోదిస్తున్నాను"* అంటూ దగ్గరలో ఉన్న ఓ చెట్టును చూపిస్తూ...., *"నాకు వారిపై పడనున్న శిక్షను, ఆ చెట్టుకంటే దగ్గరగా చూపించడం జరిగింది. అల్లాహ్ ఈ ఆయత్ ను అవతరింపజేశాడు."* అన్నారు.

*"రాజ్యంలో బాగా రక్తపాతంతో కూడిన యుద్ధం జరగనంతవరకూ యుద్ధ ఖైదీలను తన వద్ద ఉంచుకోవటం ఏ ప్రవక్తకూ తగదు. మీరు ప్రాపంచిక సంపదలను కోరుకుంటున్నారు. కాని అల్లాహ్ (మీ కోసం) పరలోకాన్ని కోరుకుంటున్నాడు. అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేకవంతుడు. ఒకవేళ ముందు నుంచే అల్లాహ్ వద్ద ఆ విషయం రాసి ఉండకపోతే, మీరు తీసుకున్న దానిపై మీకు పెద్ద శిక్షపడి ఉండేది. (ఖుర్ఆన్ 8:67,68).*

ముందే వచ్చిన ఆ ఫర్మానా ఇది : కనుక మీరు అవిశ్వాసులతో తలపడినప్పుడు, వారి మెడలను ఖండించడమే మీరు చేయవలసిన మొదటి పని. చివరకు మీరు వారిని పూర్తిగా అణచివేసిన తరువాత ఖైదీలను గట్టిగా బంధించండి. ఆ తరువాత (మీకు ఇలా చేసే అధికారం ఉంది)

*"మరి మీరు అవిశ్వాసులను (రణరంగంలో) ఎదుర్కొనప్పుడు వారి మెడలపై వ్రేటు వేయండి. వారిని బాగా అణచిన తరువాత గట్టిగా బంధించండి. పిదప మీరు వారిని (పరిహారం తీసుకోకుండా) వదలిపెట్టి మేలు చేసినా లేక పరిహారం పుచ్చుకుని వదలినా (అది మీ ఇష్టం). యుద్ధం ఆయుధాలను పడవేసే దాకా (ఈ పోరు సాగాలి). (ఆజ్ఞాపించబడినది మాత్రం) ఇదే. అల్లాహ్ గనక తలచుకుంటే (స్వయంగా) తానొక్కడే ప్రతీకారం తీర్చుకునేవాడు. కాని మీలో ఒకరిని ఇంకొకరి ద్వారా పరీక్షించాలన్నది ఆయన అభిమతం. అల్లాహ్ మార్గంలో చంపబడినవారి కర్మలను ఆయన వృధా కానివ్వడు." (ఖుర్ఆన్ 47:4).*

ఈ ఫర్మానాలో యుద్ధ ఖైదీల నుండి ఫిదియా (పరిహారం) తీసుకునే అనుమతి ఇవ్వడం జరిగింది గనుక, సహాబా (రజి)కు ఫిదియా తీసుకున్నందుకు శిక్షించడం జరగలేదు. అది కేవలం ఓ హెచ్చరిక మాత్రమే. ఆ హెచ్చరికైనా ఎందుకు చేయడం జరిగిందంటే, వారు దైవ తిరస్కారుల్ని బాగా అణచకముందే యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నందుకు. అదే కాదు, వారు ఫిదియా తీసుకొని వదిలివేసిన యుద్ధ ఖైదీలు మామూలు యుద్ధ ఖైదీలు కాదు, యుద్ధంలో ఓడిన గొప్ప యుద్ధనేరస్తులు కూడా. ఏ ఆధునిక చట్టం అయినా, వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టకుండా వదిలివేసే నేరస్తులు కారు. ఏ న్యాయస్థానం అయినా వారికి మరణదండన విధించనిదే వదిలిపెట్టే అవకాశమే లేదు.

ఏది ఏమైనా, 'హజ్రత్ అబూ బక్ర్ (రజి)' గారి సలహా ప్రకారమే వ్యవహారం పరిష్కరించడం జరిగింది. ముష్రిక్కుల నుండి ఫిదియా తీసుకొని వారిని వదిలి వేయడమూ జరిగింది. ఫిదియా పరిమాణం, నాలుగు వేలు మరియు మూడు వేల దిర్హముల నుండి ఒక వెయ్యి దిర్హముల వరకు నిర్ణయించడం జరిగింది. మదీనావాసులు చదువుకున్నవారు కారు. అందుకని, ఎవరైతే ఫిదియా చెల్లించలేదో వారు, మదీనాలోని పదేసి మంది పిల్లలకు చదువు చెప్పాలనే షరతు విధించడం జరిగింది. ఆ పిల్లలు బాగా చదవనూ రాయనూ నేర్చుకుంటే అదే వారి ఫిదియా అవుతుంది అని ప్రకటించడం జరిగింది.

మహాప్రవక్త (సల్లం) అనేక మంది యుద్ధ ఖైదీలను కరుణించి ఫిదియా లేకుండానే వదిలివేశారు. ఈ జాబితాలో 'ముతల్లిబ్ బిన్ హన్తిబ్', 'సైఫీ బిన్ రిఫాఆ', 'అబూ ఉజ్జా హమ్జీ'ల పేర్లు కూడా ఉన్నాయి. 'అబూ ఉజ్జా హమ్జీ' ఉహాద్ యుద్ధంలో బంధీ అయి చంపబడ్డాడు. (వివరాలు ముందు రాబోతున్నాయి).

యుద్ధ ఖైదీలలో దైవప్రవక్త (సల్లం) అల్లుడు 'అబుల్ ఆస్' కూడా ఉన్నాడు. కాని, అల్లుడని నష్టపరిహారం వసులుచేయకుండా విడిచిపెట్టలేదు. ఇతర ఖైదీలకు మాదిరిగానే నష్టపరిహారం తెప్పించి విడుదలకమ్మని చెప్పారు ఆయన (సల్లం).

దైవప్రవక్త (సల్లం) కుమార్తె హజ్రత్ జైనబ్ (రజి), తన భర్త 'అబుల్ ఆస్'ను విడిపించుకోవడానికి దైవప్రవక్త (సల్లం) గారి వద్దకు ఒక కంఠహారాన్ని పంపించారు. ఈ హారం, అసలు హజ్రత్ ఖదీజా (రజి) గారి కంఠహారం. వివాహం అయిన తర్వాత హజ్రత్ జైనబ్ (రజి)ను అత్తవారింటికి పంపించేటప్పుడు ఆమె మెడలో అలంకరించి పంపించారు.

తన శ్రీమతి హారాన్ని చూడగానే, మహాప్రవక్త (సల్లం)కు దుఃఖం ఆగలేదు. ఆయన (సల్లం), ఈ హారానికి బదులు 'అబుల్ ఆస్'ను వదిలిపెట్టే అనుమతిని కోరారు సహాబా (రజి)ను. సహాబా (రజి) సంతోషంగా అంగీకరించిన మీదట దైవప్రవక్త (సల్లం), 'అబుల్ ఆస్'ను వదిలిపెట్టడానికి ఓ షరతు పెట్టారు. ఆ షరతు ప్రకారం, అతను హజ్రత్ జైనబ్ (రజి)ను వదిలిపెట్టడం.

ఆ షరతును అనుసరించి అబుల్ ఆస్, ఆమె దారికి అడ్డు తొలగిపోయాడు. అప్పుడుగాని హజ్రత్ జైనబ్ (రజి) హిజ్రత్ చేయలేదు. దైవప్రవక్త (సల్లం), హజ్రత్ జైద్ బిన్ హారిసా (రజి) మరియు మరో అన్సారీ సహాబీని పంపిస్తూ...., *"మీరు 'బత్న్' లేదా 'జజ్' అనే ప్రదేశంలో ఆగండి. జైనబ్ (రజి) అక్కడకు రాగానే ఆమెను తోడ్కొని మదీనాకు తీసుకురండి."* అని ఆదేశించారు.

వారిద్దరు వెళ్ళి హజ్రత్ జైనబ్ (రజి)ను మదీనాకు తోడ్కొని వచ్చారు. హజ్రత్ జైనబ్ (రజి)గారి హిజ్రత్ సంఘటన బహు బాధాకరమైనది, సుదీర్ఘమైనదీను.

_(హజ్రత్ జైనబ్ (రజి) గారి హిజ్రత్ గురించి రేపటి భాగములో మరింత వివరంగా తెలుసుకుందాం.)_

యుద్ధ ఖైదీల్లో 'సుహైల్ బిన్ అమ్రూ' అనేవాడు కూడా ఉన్నాడు. అతను మంచి వక్త కూడా. 'హజ్రత్ ఉమర్ (రజి)', అతని విషయంలో మహాప్రవక్త (సల్లం)కు ఇచ్చిన సలహా ఏమిటంటే, అతని ముందటి రెండు పళ్ళను విరగగొట్టమని. తద్వారా అతని ఉచ్ఛారణ సరిగా ఉండదు, ఆపై మహాప్రవక్త (సల్లం)కు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇవ్వకుండా ఉంటాడని. కాని, దైవప్రవక్త (సల్లం) ఆయన ఈ అభ్యర్థనను త్రోసిపుచ్చుతూ, ఇది 'ముస్లా' (ముఖాన్ని చెడగొట్టడం) క్రిందికి వస్తుందని, ఇలా చేసినందుకు అల్లాహ్ ప్రళయం రోజున తనను ప్రశ్నిస్తాడని చెప్పారు.

'హజ్రత్ సఅద్ బిన్ నోమాన్ (రజి)' ఉమ్రా చేయడానికి బయలుదేరినప్పుడు 'అబూ సుఫ్'యాన్' ఆయన్ను బంధీగా చేశాడు. 'అబూ సుఫ్'యాన్' కుమారుడు 'అమ్రూ' కూడా బద్ర్ యుద్ధ ఖైదీల్లో ఉన్నాడు. అందుకని 'అమ్రూ'ను 'అబూ సుఫ్'యాన్'కు అప్పజెప్పి 'హజ్రత్ సఅద్ (రజి)'ను అతని చెర నుండి విడిపించుకున్నారు.

*మిగిలినది In Sha Allah రేపటి భాగములో....;*

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment