215

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉

🕌☪🕋🛐      *ఇస్లాం చరిత్ర - 215*       🛐🕋☪🕌

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 130*      🇸🇦🇸🇦

◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉

*మదీనాకు అందిన విజయ శుభవార్త : -*

ఇటు ముస్లిములకు పూర్తి విజయం లభించగా దైవప్రవక్త (సల్లం) మదీనా ప్రజలకు ఈ శుభవార్తను త్వరగా అందించడానికి ఇద్దరు మనుషుల్ని పంపించారు. పంపబడిన వారిలో "హజ్రత్ అబ్దుల్లా బిన్ రవాహా (రజి)" ఒకరు. ఈయన, ఎగువ మదీనాలో ఉన్న వారి కోసం ఈ శుభవార్తను తీసుకువెళ్ళారు. రెండవ వారు "హజ్రత్ జైద్ బిన్ హారిసా (రజి)". ఈయన్ను, దిగువ మదీనా ప్రజల వద్దకు పంపడం జరిగింది.

ఈ లోపు యూదులు మరియు మునాఫిక్ లు (కపట ముస్లిములు), మదీనాలో ప్రాపగండ ద్వారా ప్రజల్ని భయభీతులుగా చేస్తున్నారు. చివరికి దైవప్రవక్త (సల్లం)కూడా యుద్ధంలో హతులయ్యారని కూడా ప్రచారం చేశారు. ఓ మునాఫిక్, మహాప్రవక్త (సల్లం) గారి ఒంటె పై ఎవరో వ్యక్తి ఎక్కి వస్తుండగా చూసి...., *"ఇంకేముందీ! ముహమ్మద్ (సల్లం) యుద్ధంలో చంపబడ్డారు. అదిగో చూడండి, అది ఆయన (సల్లం) ఒంటె! మేము దాన్ని గుర్తించగలం. ఆ వ్యక్తి జైద్ బిన్ హారిసా (రజి), యుద్ధంలో ఓడిపోయి పారిపోయి వస్తున్నాడు, ఏం చెప్పాలో పాలుపోక దిక్కులు చుస్తున్నాడంటూ."* సంబరపడిపోతూ అరిచాడు.

మొత్తానికి, ఆ ఇద్దరు వార్తాహరులు మదీనా చేరగా ముస్లిములు వారిని చుట్టుముట్టారు. వివరాలను తెలుసుకున్న తరువాత - ముస్లిములు ఘనవిజయాన్ని సాధించారని తెలిసిపోయింది. ఎటు చూసినా ఆనందమే. మదీనా ఇళ్ళు, వాడలు అన్నీ దైవనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. మదీనాలోనే ఉండిపోయిన పెద్దలు, దైవప్రవక్త (సల్లం)కు శుభాకాంక్షలు తెలుపడానికి మదీనా నుండి బయలుదేరి "బద్ర్" మార్గం పట్టారు.

_హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రజి) గారి కథనం ఇలా ఉంది....; ↓_

*"మాకు విజయ శుభవార్త, మహాప్రవక్త (సల్లం) గారి కుమార్తె హజ్రత్ రుఖయ్యా (రజి) గారిని ఖననం చేసేటప్పుడు తెలిసింది. ఈమె హజ్రత్ ఉస్మాన్ (రజి) గారికి సతీమణి. ఆమె (రజి) వ్యాధిగ్రస్తులుగా ఉన్న కారణంగా పరిచర్యలు చేయడానికి గాను హజ్రత్ ఉస్మాన్ (రజి)ను దైవప్రవక్త (సల్లం) మదీనాలోనే వదిలిపెట్టి వెళ్ళారు."*

*యుద్ధంలో లభించిన యుద్ధధనం సమస్య : -*

మహాప్రవక్త (సల్లం) యుద్ధం ముగిసిన తరువాత మూడు రోజుల వరకు "బద్ర్"లోనే ఉండిపోయారు. ఆయన (సల్లం), బద్ర్ మైదానం నుండి బయలుదేరడానికి సిద్ధపడుతున్నప్పుడే, యుద్ధధనం విషయంలో అభిప్రాయ భేదాలు పొడసూపాయి సైన్యంలో. ఈ విబేధాలు తీవ్రస్థాయికి చేరగానే, దైవప్రవక్త (సల్లం), ఎవరి వద్ద ఏ సొత్తు అయితే ఉందో తనకు అప్పగించమని ఆదేశించారు. సహాబా (రజి), ఆయన (సల్లం) ఆదేశాలను వెంటనే అమలు చేశారు. ఆ తరువాత అల్లాహ్, వహీ (దివ్యవాణి) ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టాడు.

*హజ్రత్ ఉబాదా బిన్ సామత్ (రజి) గారి ఉల్లేఖనం ఇలా ఉంది....; ↓*

మేము మదీనా నుండి బయలుదేరి "బద్ర్"కు చేరుకున్నాం. అక్కడ సంకుల సమరం జరిగింది. అల్లాహ్, శత్రువుకు అపజయాన్ని కలిగించాడు.

ఆ తరువాత, మాలోని ఓ వర్గం, శత్రువులను వెన్నాడుతూ వారి వెనుకగా వెళ్ళింది. వారిని వెంటాడి తరిమికొట్టి చంపింది.

మరో వర్గం, ఖురైష్ కు సంబంధించిన సొమ్మును లూటీ చేసి ప్రోగు చేయడంలో నిమగ్నమైంది.

ఇంకొక వర్గం, మహాప్రవక్త (సల్లం)ను చుట్టుముట్టి, శత్రువు తిరిగి దాడి చేయకుండా కాపాడనారంభించింది.

రాత్రి బాగా ప్రోద్దుపోయినప్పుడు అందరూ ఒక చోట చేరగానే, ధనాన్ని ప్రోగుచేసిన వర్గం వారు...., *"ఈ ధనాన్ని మేమే ప్రోగు చేశాం, ఇందులో మరెవ్వరికీ వాటా లేదు."* అని అన్నారు.

శత్రువును వెన్నాడిన వర్గం వారు...., *"మీరు మా కంటే ఎక్కువ హక్కుదారులు కారు. మేము శత్రువును పారద్రోలడంలోనూ, మీ దగ్గర చేరకుండా ఉండడంలోనూ సహాయపడ్డాం."* అన్నారు.

దైవప్రవక్త (సల్లం) గారి చుట్టూ చేరి, ఆయన (సల్లం) ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేసిన వర్గం వారు...., *"శత్రువు ఏమరుపాటులో వచ్చి దైవప్రవక్త (సల్లం)పై దాడిచేసే భయం ఉన్నందువల్లనే మేము ఆయన (సల్లం) చుట్టూ చేరి పహారా కాశము."* అని అన్నారు.

ఈ జగడం గురించే అల్లాహ్ ఈ ఆయత్ లను అవతరింపజేసి, ఈ వివాదాన్ని పరిష్కరించాడు. ↓

*"వారు నిన్ను యుద్ధప్రాప్తి (అన్'ఫాల్) గురించి అడుగుతున్నారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : "ఈ యుద్ధప్రాప్తి (అన్'ఫాల్) అల్లాహ్ కు, ప్రవక్తకు చెందినవి. కాబట్టి మీరు అల్లాహ్ కు భయపడండి. మీ పరస్పర సంబంధాలను చక్కదిద్దుకోండి. మీరు విశ్వసించినవారే అయితే అల్లాహ్ కూ, ఆయన ప్రవక్తకూ విధేయత చూపండి."" (ఖుర్ఆన్ 8:1).*

ఆ తరువాత దైవప్రవక్త (సల్లం), అల్లాహ్ ఆదేశం మేరకు ఆ యుద్ధధనాన్ని ముస్లిములకు పంచిపెట్టారు.

*మదీనాకు పయనమైన ఇస్లామీయ సైన్యం : -*

దైవప్రవక్త (సల్లం), మూడు రోజుల అనంతరం 'బద్ర్' నుండి మదీనాకు బయలుదేరారు. ఆయన (సల్లం) వెంట ముష్రిక్కు ఖైదీలు కూడా ఉన్నారు. వారితో పాటు, యుద్ధంలో వారి నుండి హస్తగతం చేసుకున్న ధనసంపద కూడా ఉంది. ఆ సంపద పరిరక్షణ బాధ్యత "హజ్రత్ అబ్దుల్లా బిన్ కఅబ్ (రజి)" గారికి అప్పగించడం జరిగింది.

మహాప్రవక్త (సల్లం), 'సఫా' లోయ నుండి బయటకు వచ్చి కనుమకు మరియు కనుమకు నడుమన గల ఓ ఎత్తయిన దిబ్బపై మకాం వేశారు. అక్కడే 'ఖమ్స్' (అయిదింట ఒక భాగం యుద్ధధనం) వేరు చేశారు. తక్కిన నాలుగు భాగాలను ముస్లిముల్లో సమానంగా పంచిపెట్టారు.

"నజ్ర్ బిన్ హారిస్"ను చంపేయమని ఆ ప్రదేశంలోనే ఆదేశం ఇవ్వడం జరిగింది. కారణం ఏమిటంటే, అతను "బద్ర్" యుద్ధంలో ముష్రిక్కుల పతాకాన్ని ఎత్తుకొని ఉన్న వ్యక్తి. అంతేకాదు, ఖురైషులకు సంబంధించిన గొప్ప నేరగాళ్ళలో ఒకడు కూడా. ఇస్లాం ధర్మాన్ని వ్యతిరేకించడంలోనూ, మహాప్రవక్త (సల్లం)ను బాధించడంలోనూ అందరికంటే ముందుండేవాడు. మహాప్రవక్త (సల్లం) గారి ఆదేశంపై, హజ్రత్ అలీ (రజి) అతని మెడను నరికివేశారు.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లం), "అర్కుజ్ జబియా" అనే ప్రదేశానికి చేరగానే "ఉత్బా బిన్ ముఅయిత్"ను చంపేయమని ఆదేశించారు. ఇతను దైవప్రవక్త (సల్లం)ను హింసిస్తూ ఉండేవాడు. ఇతని గురించి ఇదివరకే చెప్పుకున్నాం. మహాప్రవక్త (సల్లం) నమాజు చేసేటప్పుడు ఆయన వీపుపై ఒంటె పొట్ట ప్రేగుల్ని పడవేసింది కూడా ఇతనే. అంతే కాదు, తన దుప్పటిని ఆయన (సల్లం) మెడకు చుట్టి ఆయన్ను చంపే ప్రయత్నం కూడా చేశాడు. ఆ సమయంలో హజ్రత్ అబూ బక్ర్ (రజి) వచ్చి మహాప్రవక్త (సల్లం)ను రక్షించకపోతే (తాను తలచినట్లు) గొంతు నులిమి చంపేసేవాడే.

మహాప్రవక్త (సల్లం), ఇతని తలను తొలగించమని ఆదేశించినప్పుడు అతను...., *"ఓ ముహమ్మద్ (సల్లం)! నా పిల్లల గతేమిటి?"* అని అడగగా; *"అగ్నే"* అని బదులిచ్చారు దైవప్రవక్త (సల్లం). ఆ తరువాత "హజ్రత్ ఆసిమ్ బిన్ సాబిత్ (రజి)" లేదా "హజ్రత్ అలీ (రజి)" అతని తలను నరికేశారు.

యుద్ధనీతి దృష్ట్యా ఆ ఇద్దరి తలలను ఖండిచవలసిన అవసరం ఎంతైనా ఉంది. వారు కేవలం ఖైదీలు మట్టుకే కాదు, నేటి ఆధునిక పదజాలం ప్రకారం యుద్ధ నేరస్తులు.

*శుభాకాంక్షలు చెబుతూ ఎదురుగా వచ్చిన బృందాలు : -*

మహాప్రవక్త (సల్లం), "రౌహా" అనే ప్రదేశానికి చేరగానే, ఆ ఇద్దరు వార్తాహరుల ద్వారా అందిన శుభవార్తలు విని, దైవప్రవక్త (సల్లం)ను ఆహ్వానించడానికి, ఆయనకు శుభాభినందనలు తెలుపడానికి, మదీనా నుండి బయలుదేరి వచ్చినవారు ఎదురయ్యారు.

వారు ప్రవక్త (సల్లం)ను చూడగానే అభినందనలు తెలుపుతూ ఉండగా, హజ్రత్ "సల్మా బిన్ సలామా (రజి)" వారిని ఉద్దేశించి...., *"మీరు మాకు అభినందనలు తెలుపుతున్నారా? ఎందుకు? మేము ఢీకొన్నది బట్టతల వృద్ధ యోధుల్ని, వారి తలలు ఒంటె తలల్లా అగుపడ్డాయి మాకు."* అని అన్నారు.

ఇది విన్న మహాప్రవక్త (సల్లం) చిరునవ్వు నవ్వుతూ...., *"సోదర కుమారా! వీరేనయ్యా వారి జాతిలోని గొప్ప యోధానయోధులు."* అన్నారు.

ఆ తరువాత "హజ్రత్ అసీద్ బిన్ హజీర్ (రజి)", దైవప్రవక్త (సల్లం)తో...., *"దైవప్రవక్తా! స్తోత్రాలన్నీ అల్లాహ్ కే. ఆయనే తమకు విజయాన్ని చేకూర్చింది. తమ కళ్ళు చల్లబడ్డాయి. దైవసాక్షి! మీరు శత్రువులను ఢీకొంటారని నేను అనుకోలేదు. అది కేవలం ఓ వర్తక బిడారం వ్యవహారమే కదా అని నేను మదీనాలో ఉండిపోయాను. శత్రువుతో ఢీకొనవలసి ఉంటుందని నేననుకుంటే, నేను వెనుకబడి ఉండేవాణ్ణి కాదు."* అని విన్నవించుకున్నారు.

మహాప్రవక్త (సల్లం)...., *"అవును మీరు చెప్పేదే సరియైనది."* అని బదులిచ్చారు.

దైవప్రవక్త (సల్లం), దైవ సహాయంతో విజేతలై మదీనా నగరంలో కాలుపెట్టారు. ఆ పట్టణం మరియు చుట్టుపట్ల ప్రాంతాల్లో ఉన్న ఆయన శత్రువులపై ఆయన ప్రభావం ప్రాభవం కూడా పడింది. విజయ ప్రభావం కారణంగా మదీనాకు చెందిన అనేక మంది ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. ఈ సందర్భంలోనే "అబ్దుల్లా బిన్ ఉబై" మరియు అతని అనుచరులు కూడా విధిలేక అందరికి తెలియాలనే ఉద్దేశ్యంతో ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు.

దైవప్రవక్త (సల్లం) మదీనా చేరిన మరునాడు గాని ఖైదీలు మదీనాకు రాలేకపోయారు. ఆయన (సల్లం) వారిని సహాబా (రజి)కు పంచి పెడుతూ, వారి పట్ల సత్ప్రవర్తనతో మెలగాలి అని ఉద్బోధించారు. వారికి ఆహార, వస్త్రాల లోటు రానీయకుండా చూడాలని, జబ్బు పడితే చికిత్స చేయించాలని, ఇతర ముఖ్యావసరాలు కూడా స్తోమతను బట్టి తీర్చాలని నొక్కి చెప్పారు.

ఈ ఉద్బోధ ఫలితంగా సహాబా (రజి) తాము స్వయంగా ఖర్జూరాలు తిని, తమ ఖైదీలకు రొట్టె తినిపించేవారు. (మదీనాలో ఖర్జూరానికి అంత విలువ లేదు. రొట్టె ఎంతో ప్రియమైన వంటకం అనేది గమనార్హం).

*ఖైదీల సమస్య - దాని పరిష్కారం : - ↓*

*In Sha Allah రేపటి భాగములో....; →*

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment