214

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉

🕌☪🕋🛐      *ఇస్లాం చరిత్ర - 214*       🛐🕋☪🕌

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 129*      🇸🇦🇸🇦

◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉

*మక్కాకు అందిన పరాజయం కబురు : -*

బహుదైవారాధకులు, బద్ర్ మైదానం నుండి అస్తవ్యస్త రీతిలో పరుగెడుతూ భయభీతులై మక్కాకు పారిపోనారంభించారు. ఎదురైన పరాజయానికి కుచించుకుపోయి తల ఎత్తలేని స్థితిలో సిగ్గుపడుతూ వస్తున్నారు. మక్కాలోకి ఎలా ప్రవేశించాలో వారికి అర్థం కావడం లేదు.

*"ఇబ్నె ఇస్'హాక్" కథనం ప్రకారం....; ↓*

అందరికంటే ముందు ఏ వ్యక్తి అయితే మక్కాకు పరాజయం కబురు తెచ్చాడో, అతడు "హైస్మాన్ బిన్ అబ్దుల్లా ఖుజాయి". అతణ్ణి చూడగానే ప్రజలు ఎగబడి యుద్ధ వార్తలేమిటో చెప్పమని అడిగారు. అతను నోరు విప్పుతూనే, *"ఉత్బా బిన్ రబీయా, షైబా బిన్ రబీయా, అబుల్ హకం బిన్ హష్షామ్, ఉమయ్యా బిన్ ఖల్ఫ్ - ఇంకా కొందరు సర్దారుల పేర్లు చెబుతూ - వీరంతా వధించబడ్డారు."* అని అన్నాడు.

అతను చెప్పిన జాబితాలో అందరూ ఖురైష్ కు చెందిన గౌరవనీయులైన సర్దారుల పేర్లే ఉన్నాయి. "సుఫ్'వాన్ బిన్ ఉమయ్యా" అనేవాడు అక్కడనే హతీమ్ గోడపై కూర్చుని ఉన్నాడు. అది విన్నతోడనే, *"దైవసాక్షి! ఇతనే గనక స్పృహలో ఉంటే నా గురించి అడిగి చూడండి తెలుస్తుంది."* అని అన్నాడు.

ప్రజలు నిజంగానే, *"సుఫ్'వాన్ బిన్ ఉమయ్యా ఏమయ్యాడూ?"* అని అడగగా; *"అతను అదిగో ! హాతీమ్ గోడపై కూర్చొని ఉన్నాడు. దైవసాక్షి! అతని తండ్రి, అతని సోదరుడు చంపబడుతుండగా నేను స్వయంగా నా కళ్ళతో చూసొచ్చాను."* అన్నాడు హైస్మాన్.

● *మహాప్రవక్త (సల్లం) గారి ద్వారా బానిస సంకెళ్ళ నుండి విముక్తులైన "హజ్రత్ అబూ రాఫె (రజి)" కథనం ఇలా ఉంది....; ↓*

"నేను ఆ రోజుల్లో హజ్రత్ అబ్బాస్ (రజి) గారి బానిసగా ఉన్నాను. మా ఇంట్లో ఇస్లాం ప్రవేశించింది. హజ్రత్ అబ్బాస్ (రజి) ఇస్లామ్ స్వీకరించి ఉన్నారు. "ఉమ్ముల్ ఫజ్ల్" కూడా ముస్లిముగా మారిపోయారు. నేను కూడా ఇస్లాం స్వీకరించే ఉన్నాను. అయితే హజ్రత్ అబ్బాస్ (రజి) మాత్రం, తమ ఇస్లాం స్వీకారాన్ని రహస్యంగానే ఉంచారు.

ఇటు "అబూ లహబ్" బద్ర్ యుద్ధంలో పాల్గొనలేదు. అతనికి ఈ కబురు అందగానే అతను సిగ్గుపడిపోయాడు. అతణ్ణి అవమానం ఆవహించింది. మాకు మాత్రం సంతోషం కలిగి, మాలో ఓ క్రొత్త బలం వచ్చినట్లు అయింది. నేను ఓ బలహీన్నుణ్ణి, బాణాలు (అంబులు) తయారు చేయడం నా వృత్తి. జమ్ జమ్ బావి వద్ద ఉన్న గుడారంలో కూర్చుని అంబుల పుల్లల్ని చెక్కేవాణ్ణి. ఆ సమయంలో ఆ గుడారంలో కూర్చుని వాటిని చెక్కుతున్నాను. నా ప్రక్కన ఉమ్ముల్ ఫజ్ల్ కూడా కూర్చుని ఉన్నారు. ఈ వార్త అప్పుడే మా చెవిన పడగా మేము ఆనందంతో సతమతమవుతున్నాము.

అప్పుడే అబూ లహబ్ కాళ్ళీడ్చుకుంటూ మా దగ్గరకు వచ్చి ఆ గుడారంలో ఓ మూలన కూర్చున్నాడు. అతని వీపు నా వీపు వైపున ఉంది. కూర్చున్నాడో లేదో ఒక్కసారే గోల వినిపించింది. *"అదిగో! అబూ సుఫ్'యాన్ బిన్ హారిస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ వచ్చాడు."* అనే మాటలు వినబడ్డాయి. అబూ లహబ్, అబూ సుఫ్'యాన్ ను తన వద్దకు పిలిపించుకొని, *"ఇటురా! నా వయస్సు సాక్షిగా చెప్పు. ఏం వార్తలో"* అని అడిగాడు. 

అబూ సుఫ్'యాన్, అబూ లహబ్ వద్ద కూర్చున్నాడు. జనం అంతా నిలబడే ఉన్నారు. అంతలో అబూ లహబ్ అందుకొని, *"కుమారా! చెప్పు వారి పరిస్థితి ఎలా ఉంది?"* అని మళ్ళీ అడిగాడు.

*"ఏమీ లేదు! వారికి మాకు నడుమ యుద్ధం జరిగింది. మేము మా భుజాల్ని వారికి అందించాం. వారు మమ్మల్ని ఎలా చంపాలో అలా చంపేశారు. ఎలా బంధీలుగా పట్టుకోవాలో వారిష్టమోచ్చినట్లు మమ్మల్ని బంధీలుగా పట్టుకున్నారు. దైవసాక్షి! అయినా నేను వారిని తూలనాడడం లేదు. యదార్థం ఏమిటంటే, మేము ఎదుర్కొన్నది ఎర్రగా, ఎత్తుగా ఉన్న స్ఫురద్రూపుల్ని. వీరు, భూమికీ ఆకాశానికి నడుమ విచిత్రమైన మచ్చలుగల గుర్రాలపై ఎక్కి ఉన్నారు. దైవసాక్షి! వారు దేన్నీ వదల్లేదు, మరేదీ వారికి ధీటుగా రాలేకపోయింది."* అని వివరించాడు అబూ సుఫ్'యాన్.

నేను (అబూ రాఫె - రజి) వెంటనే గుడారం పరదాను పైకెత్తి, *"ఇంకెవరు? దైవసాక్షి! వారు దైవదూతలే"* అని అన్నాను.

ఆ మాట విన్న అబూ లహబ్ తన చేయి పైకెత్తి నా చెంప పగిలేటట్లు కొట్టాడు. నాకూ కోపం వచ్చింది. అతణ్ణి ఎదుర్కొన్నాను. అయితే అతను నన్ను పైకెత్తి భూమ్మీద పడేశాడు. ఆ తరువాత తన మోకాలిపై కూర్చుని నన్ను కొట్టనారంభించాడు. ఇంతలోనే ఉమ్ముల్ ఫజ్ల్ గుడారపు ఓ గడను పీకి అతని తలపై పగిలేటట్లు కొట్టారు. అతని తల పగిలి రక్తం కారసాగించి. వెంటనే ఆమె అతణ్ణి ఉద్దేశించి, *"అతని యజమాని ఇక్కడ లేనందుకే గదా బలహీనుడనుకొని కొట్టావు."* అని అనగా, అతను సిగ్గుతో తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

అల్లాహ్, ఓ వారం తిరగక మునుపే అబూ లహబ్ కు ఓ భయంకరమైన 'అద్'సా' అనే వ్యాధికి గురి చేశాడు. (అద్'సా ప్లేగు లాంటి ఓ వ్యాధి). ఆ వ్యాధితోనే అతను అంతమైపోయాడు. అద్'సా బొబ్బల్ని అరబ్బులు పెద్ద అపశకునంగా భావించేవారు. కాబట్టి, (అబూ లహబ్ చనిపోయిన తరువాత) అతని కుమారులు కూడా అతని శవం వద్దకు వెళ్ళలేదు. రెండు మూడు రోజులు అలాగే గడచిపోయాయి. అతని దగ్గరకు పోవడంగాని, అతణ్ణి పూడ్చి పెట్టడానికిగాని వారికి ధైర్యం చాలడం లేదు. అలా వదిలి పెట్టడం వల్ల ప్రజలు తమను తూలనాడగలరనే భయంతో అక్కడనే ఓ గోతి తీసి ఆ శవాన్ని అందులోని కర్రల సహాయంతో నెట్టి పడవేశారు. దూరం నుండే రాళ్ళు రువ్వి ఆ గోతిని పూడ్చివేశారు."●

మొత్తానికి మక్కావాసులకు బద్ర్ మైదానంలో ఘోర అపజయం ఎదురైన కారణంగా వారిపై పడిన దుష్ప్రభావం అంతా ఇంతా కాదు. వారు చనిపోయిన వారిని గురించి "నౌహా" (ఏడ్వడం) చేయడానికి కూడా అనుమతించలేరు. ఇలా "నౌహా" చేయడం వలన ముస్లిములకు తమ విజయంపై పొంగిపోయే అవకాశం లభిస్తుంది అని వారి అనుమానం.

దీనికి సంబంధించిందే ఆసక్తికరమైన సంఘటన ఒకటి జరిగింది. బద్ర్ యుద్ధంలో, "అస్వద్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్" అనే ఆయన ముగ్గురు కుమారులు హతులయ్యారు. వారి కోసం అతను రోదించదలిచాడు. అతను గ్రుడ్డివాడు. ఓ రాత్రి అతను ఓ ఏడ్చే మహిళ గొంతు విని, తన బానిసను విషయం తెలుసుకురమ్మని అక్కడికి పంపించాడు, ఏడ్చే అనుమతి లభించిందేమో అనే ఆశతో. ఖురైషులకు, తమ హతులను గురించి "నౌహా" చేసే అనుమతి లభించిందేమో, ఆ మహిళ అందుకే ఏడుస్తుందేమో కూడా తన కుమారుడు "అబూ హకీమా"ను తలచుకుని ఏడ్వవచ్చని అతని ఆశ.

ఇంతలో ఆ బానిస తిరిగి వచ్చి, *"ఆ స్త్రీ జాడలేకుండా పోయిన తన ఒంటెను తలచుకొని ఏడుస్తోంది."* అని సమాచారం అందించాడు.

"అస్వద్" ఇది విని, తనను తాను సంభాళించుకోకుండా ఇలా అన్నాడు.

*"ఏమిటీ! ఆమె తన ఒంటె పోయిందని ఏడుస్తూ ఉందా? దాని కోసం నిద్రను పాడుచేసుకుంటుందా? (ఆమెతో చెప్పు,) పోయిన ఒంటె కోసం ఏడ్వవద్దని. అదృష్టాలు మట్టిలో కలసిపోయిన ఆ బద్ర్ కోసం ఏడ్వమను. అవును! ఆ బద్ర్ యుద్ధాన్ని తలచుకొని ఏడ్వమను. ఎక్కడైతే బనీ హసీస్, బనీ మగ్జూమ్ మరియు అబుల్ వలీద్ కు చెందిన తెగల సర్దారులు, వ్యక్తులు చనిపోయారో. ఏడ్వదలచుకుంటే అకీల్ కోసం ఏడ్వమను, హారిస్ కోసం ఏడ్వమను. అతను పులులకు పులి. వారి కోసమే ఏడ్వమను. అందరి పేర్లు చెప్పి మరీ ఏడ్వమను. అబూ హకీమా? అతనికి సాటి ఎవరూ లేరు. చూడు! అతని తరువాత అందరూ సర్దారులై పోతున్నారు. బద్ర్ యుద్ధం జరగకుండా ఉండి ఉంటే, వారిలో ఏ ఒక్కడూ సర్దారు కాకపోయేవాడు."* అని అన్నాడు.

*మదీనాకు అందిన విజయ శుభవార్త : -*

ఇటు ముస్లిములకు పూర్తి విజయం లభించగా దైవప్రవక్త (సల్లం) మదీనా ప్రజలకు ఈ శుభవార్తను త్వరగా అందించడానికి ఇద్దరు మనుషుల్ని పంపించారు. పంపబడిన వారిలో "హజ్రత్ అబ్దుల్లా బిన్ రవాహా (రజి)" ఒకరు. ఈయన, ఎగువ మదీనాలో ఉన్న వారి కోసం ఈ శుభవార్తను తీసుకువెళ్ళారు. రెండవ వారు "హజ్రత్ జైద్ బిన్ హారిసా (రజి)". ఈయన్ను, దిగువ మదీనా ప్రజల వద్దకు పంపడం జరిగింది.

*↑ ఇందులోని మరింత వివరణ In Sha Allah రేపటి భాగములో....;*

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment