213

🕌🕌🕌       బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్        🕌🕌🕌

🛐🛐   అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు   🛐🛐
🤚🏻✋🏻     అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను      🤚🏻✋🏻

 ~~~~~ 

🕋🕋🕋             ఇస్లాం చరిత్ర - 213            🕋🕋🕋
 ■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■

*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 128*  

*బద్ర్ సంగ్రామంలో విశ్వాసాన్ని ఇనుమడింపజేసే సంఘటనలు : - 2*

*»-----» 4. "హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజి)" తన మేనమామ "ఆస్ బిన్ హష్షామ్ బిన్ ముగైరా"ను హతమార్చారు.*

*»-----» 5.* హజ్రత్ అబూ బక్ర్ (రజి) తన సొంత కుమారుడు "అబ్దుర్రహ్మాన్"ను చంపారు. అప్పుడు ఈయన బహుదైవారాధకులతో ఉన్నాడు. అతనితో పోరాడుతూ అబూ బక్ర్ (రజి)...., *"ఓరీ దుష్టుడా! నా సంపద ఏదీ?" అని అడగగా; అబ్దుర్రహ్మాన్...., "ఆయుధాలు, బాగా పరుగెత్తే గుర్రాలు మరియు ఈ కరవాలం తప్ప మరేదీ లేదు. ఇది వృద్ధాప్యాన్ని అంతమొందిస్తుంది."* అన్నాడు.

*»-----» 6.* ముస్లిములు, ముష్రిక్కులను బంధించేటప్పుడు దైవప్రవక్త (సల్లం) పందిరిలో ఉన్నారు. "హజ్రత్ సఅద్ బిన్ ముఆజ్ (రజి)" కరవాలం చేతపట్టుకొని పహారా కాస్తున్నారు. ప్రజల ఈ ప్రవర్తనను చూసినప్పుడు "సఅద్ (రజి)" గారి ముఖంపై అసహనం గోచరించింది. దీన్ని చూసిన మహాప్రవక్త (సల్లం)...., *"సఅద్! దైవసాక్షి! ముస్లిముల ఈ ఉదార ప్రవర్తన మీకు నచ్చడం లేదట్లుందే?"* అని అడిగారు.

*"అవును దైవప్రవక్తా! దైవసాక్షిగా! ఇది బహుదైవారాధకులతో జరిగిన మొదటి యుద్ధం. ఈ అవకాశాన్ని అల్లాహ్ మనకు కల్పించాడు. అందుకని, ఈ ముష్రిక్కులను మిగిలి ఉండకుండా, మూకుమ్మడిగా సంహరించడమే నాకు నచ్చిన పని. వారిని పూర్తిగా అణగద్రొక్కాలి."* అన్నారు.

*»-----» 7.* ఈ యుద్ధంలో "హజ్రత్ అక్కాషా బిన్ ముహ్'సిన్ అసదీ (రజి)" కరవాలం విరిగిపోయింది. ఆయన, దైవప్రవక్త (సల్లం) గారి దగ్గరకు వచ్చి ఈ విషయాన్ని చెప్పారు. దైవప్రవక్త (సల్లం), ఆయన చేతికి ఓ కర్రబద్దను అందిస్తూ...., *"అక్కాషా! దీనితోనే యుద్ధం చేయండి."* అన్నారు.

ఆ కర్రబద్దను దైవప్రవక్త (సల్లం) గారి చేతి నుండి తీసుకొని ఊపగానే, అది ఓ పొడవాటి ధృడమైన తళతళలాడే తెల్ల కరవాలంగా మారిపోయింది. దాన్ని తీసుకొని వెళ్ళి యుద్ధరంగంలో చొరబడ్డారు. అల్లాహ్ ముస్లిములకు విజయాన్ని చేకూర్చేంత వరకు దానితోనే యుద్ధం చేశారు. ఆ కరవాలం పేరు "ఔన్" (అంటే సహాయం) అని పెట్టడం జరిగింది. ఈ కరవాలం శాశ్వతంగా "అక్కాషా (రజి)" దగ్గరే ఉండిపోయింది. దాన్ని ఆయన పోరాటాల్లో ఉపయోగించేవారు. చివరికి సిద్ధిఖీ శకంలో "ముర్తిద్ (ధర్మభ్రష్టులు)"లకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తూ అమరగతిని పొందారు. అప్పుడు ఆ కరవాలం ఆయన దగ్గరే ఉంది. 

*»-----» 8.* యుద్ధం ముగిసిన తరువాత "ముస్అబ్ బిన్ ఉమైర్ అబ్'దరీ (రజి)" తన సోదరుడైన "అబూ అజీజ్ బిన్ ఉమైర్ అబ్దరీ" ముందు నుండి వెళ్ళడం జరిగింది. "అబూ అజీజ్" ముస్లిములకు వ్యతిరేకంగా ఆ యుద్ధంలో పాల్గొన్నవాడు. అలా వెడుతూ ఉండగా ఓ అన్సారీ అతని చేతుల్ని త్రాళ్ళతో కడుతున్నారు. ఇది చూసిన "ముస్అబ్ బిన్ ఉమైర్ (రజి)", ఆ అన్సారీ సహాబీతో...., *"ఈ వ్యక్తి ద్వారా నీవు నీ చేతుల్ని పటిష్టపరచుకో (అంటే ప్రయోజనం పొందు), ఇతని తల్లి గొప్ప ధనవంతురాలు. బహుశా ఆమె ఇతణ్ణి విడిపించుకోడానికి గొప్ప పరిహారమే చెల్లించుకోగలదు."* అని అన్నారు.

ఇది విన్న ఆయన సోదరుడు అబూ అజీజ్, హజ్రత్ ముస్అబ్ ను ఉద్దేశించి...., *"ఏమిటీ, నా విషయంలో నీవు ఈయనకు చెప్పే విషయం ఇదా?"* అని అడిగాడు.

*"(ఔను) నీకు బదులు - ఈ అన్సారీయే - నాకు సోదరుడు."* అని బదులిచ్చారు ఆయన.

*»-----» 9.* బహుదైవారాధకుల శవాలను బావిలో పడవేసే ఆదేశం ఇవ్వబడినప్పుడు "ఉత్బా బిన్ రబీయా" శవాన్ని బావి వైపునకు ఈడ్చుకుపోవడం జరిగింది. అప్పుడు మహాప్రవక్త (సల్లం), అతని తనయుడైన "అబూ హుజైఫా (రజి)" ముఖం వైపు జూసారు. ఆయన (రజి) విచారంతో నిలబడి ఉన్నారు. ముఖకవలికలు మారిపోయి ఉన్నాయి. ఇది చూసిన మహాప్రవక్త (సల్లం), ఆయన (రజి)ను ఉద్దేశించి...., *"అబూ హుజైఫా! బహుశా మీ తండ్రి విషయమై మీ మనస్సులో ఏవో భావోద్రేకాలు ఉత్పన్నమవుతున్నట్లున్నాయే?"* అని అన్నారు.

*"కాదు, దైవసాక్షిగా! ఓ ప్రవక్తా! నా మనస్సులో నా తండ్రి మరణం గురించి గాని, ఆయన విషయం గురించి గాని ఎలాంటి సందిగ్ధం లేదు. అయితే నాకు తెలుసు. ఆయన ఎంతో వివేచన గలవారని, దూరదృష్టి గలవారని. అందుకనే ఆయన ఇస్లాం ధర్మం స్వీకరిస్తారేమో అని అనుకునేవాణ్ణి. కాని, ఇప్పుడు ఆయన అంతం చూసి ఆ ఆశ కూడా సన్నగిల్లింది. దైవధిక్కార వైఖరిపైన్నే ఆయన ప్రాణాలు వదిలాడని విచారంగా ఉంది."* అన్నారు. మహాప్రవక్త (సల్లం), ఆయన (రజి)ను దీవించి మెచ్చుకున్నారు.

           *యుద్ధంలో హతులైన ఇరుపక్షాల సైనికులు*

ఈ యుద్ధం, ముష్రిక్కుల ఘోర పరాజయం మరియు ముస్లిముల ఘన విజయంతో పరిసమాప్తమైంది. ఇందులో పద్నాలుగు మంది ముస్లిములు షహీద్ అయ్యారు (అమరగతిని పొందారు). వారిలో ఆరు మంది ముహాజిర్లు, ఎనిమిది మంది అన్సారులు. కాని, బహుదైవారాధకులకు మాత్రం పెద్ద నష్టమే జరిగింది. వారిలో డెబ్భై మంది హతులయ్యారు. మరి డెబ్భై మంది బంధీలుగా చిక్కారు. వీరంతా ముష్రిక్కుల నాయకులు, సర్దారులు, పేరుమోసిన యోధానయోధులే. పెద్ద పెద్ద నాయకులతో సహా ఖురైష్ సైనికులు కూడా అనేకమంది వధించబడ్డారు.

యుద్ధం ముగిసిన తరువాత మహాప్రవక్త (సల్లం) ముష్రిక్కు హతుల వద్ద నిలబడి...., *"మీరు మీ ప్రవక్తకు చెందిన ఎంత పెద్ద కుటుంబమో! మీరు నన్ను తిరస్కరించారు, ఇతరులు నన్ను ధృవపరిచారు. మీరు నన్ను నిస్సహాయకునిగా వదిలేశారు, ఇతరులు నన్ను ఆదుకొని సహాయపడ్డారు. మీరు నన్ను వెడలగొట్టారు, ఇతరులు నాకు రక్షణ కల్పించారు."* అని చెబుతూ, *"వీరందరిని ఈడ్చుకువెళ్ళి బద్ర్ లోని ఫలానా బావిలో పడవేయండి."* అని ఆదేశించారు. వారందరినీ అలానే ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ బావిలో పడవేయడం జరిగింది.

*"హజ్రత్ అబూ తల్హా (రజి)" గారి ఉల్లేఖనం ప్రకారం : - ↓*

దైవప్రవక్త (సల్లం) ఆదేశం మేరకు బద్ర్ రోజున, ఖురైషులకు చెందిన ఇరవై నాలుగు మంది గొప్ప సర్దారుల శవాలను "బద్ర్"లోని ఓ కంపుకొట్టే బావిలో పడవేయడం జరిగింది.

ఈ పోరాటంలోనైనా నెగ్గినప్పుడు, ఆ యుద్ధ మైదానంలో మూడు రోజుల వరకు ఆగి ఉండడం దైవప్రవక్త (సల్లం) గారి అలవాటు. కాబట్టి "బద్ర్"లో మూడో రోజు రాగానే ఆయన ఆదేశం మేరకు ఆయన వాహనంపై అంబారీ కట్టబడింది. ఆ తరువాత ఆయన (సల్లం) కాలినడకన నడుస్తూ ఆ బావి ఒడ్డుకు వచ్చి నిలబడ్డారు. వెంట సహాబా (రజి) కూడా నడిచారు. అక్కడ నిలబడి ఆ హుతుల పేరు పేరున, వారి తండ్రి పేర్లతో సహా ఒక్కొక్కరినే పిలుస్తూ...., *"మీరే గనక అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విధేయించి ఉంటే నాకు సంతోషం కలిగి ఉండకపోయేదా? ఎందుకంటే మాతో మా ప్రభువు చేసిన వాగ్దానాన్ని సత్యమైనట్లు కనుగొన్నాము. మరి మీతో మీ ప్రభువు చేసిన వాగ్దానం నెరవేరిందా?"* అని అనడం ప్రారంభించారు.

ఇది విన్న "హజ్రత్ ఉమర్ (రజి)"...., *"దైవప్రవక్తా! ఆత్మలు లేని ఈ శరీరాలతోనా తమరు మాట్లాడుతూ ఉన్నది?"* అని అడగగా; *"ముహమ్మద్ (సల్లం) ప్రాణం ఎవరి చేతిలోనైతే ఉందో ఆ దైవం సాక్షి! నేను చెప్పిన దానికంటే అధికంగా మీరు మరే విషయాన్నీ వినలేరు."* అన్నారు ప్రవక్త (సల్లం). మరో ఉల్లేఖనంలో...., *"మీరు ఇంతకంటే మరేమీ వినలేరు. కాని, వీరు సమాధానం ఇవ్వలేరు అంతే"* అని ఉంది.

*మక్కాకు అందిన పరాజయం కబురు : -*

బహుదైవారాధకులు, బద్ర్ మైదానం నుండి అస్తవ్యస్త రీతిలో పరుగెడుతూ భయభీతులై మక్కాకు పారిపోనారంభించారు. ఎదురైన పరాజయానికి కుచించుకుపోయి తల ఎత్తలేని స్థితిలో సిగ్గుపడుతూ వస్తున్నారు. మక్కాలోకి ఎలా ప్రవేశించాలో వారికి అర్థం కావడం లేదు.

*మిగిలినది In Sha Allah రేపటి భాగములో....;*

No comments:

Post a Comment