🕌🕌🕌 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕌🕌🕌
🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు 🛐🛐
🤚🏻✋🏻 అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను 🤚🏻✋🏻
~~~~~
🕋🕋🕋 ఇస్లాం చరిత్ర - 212 🕋🕋🕋
■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■
*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 127*
*బద్ర్ సంగ్రామంలో విశ్వాసాన్ని ఇనుమడింపజేసే సంఘటనలు : - 1*
"హజ్రత్ ఉమైర్ బిన్ హమామ్" మరియు "హజ్రత్ ఔఫ్ బిన్ అఫ్రా"ల ఉజ్వలమైన విశ్వాస ఘనకార్యాలను గురించి మనకు తెలిసిందే. యధార్థం ఏమిటంటే, ఈ యుద్ధంలో అడుగడుగునా, విశ్వాస పటిమ, సిద్ధాంత ధృడత్వానికి సంబంధించిన అనేక సంఘటనలు జరిగాయి.
ఈ యుద్ధంలో, తండ్రి తన కుమారునికి విరుద్ధంగా, సోదరుడు తన సోదరునికి వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొనడం జరిగింది. సైద్ధాంతిక విభేదం వల్ల వారు ఒకరిపై మరొకరు తమ కరవాలాలను దూసి నిలబడ్డారు. పీడితులు మరియు దౌర్జన్యానికి బలి అయిన వారు, ఆ రోజు తమపై జులుమ్ చేసిన వారితో, తమను దౌర్జన్యానికి గురిచేసిన వారితో తలపడి తమ ఆగ్రహాగ్నిని చల్లార్చుకున్నారు.
_(ఇందులో ముఖ్యంగా 9 సంఘటనల గురించి తెలుసుకుందాం)_
*»-----» 1. ఇబ్నె అబ్బాస్ (రజి) గారి ఉల్లేఖనం ఇలా ఉంది....; ↓*
మహాప్రవక్త (సల్లం) తమ అనుచరగణంతో ఇలా అన్నారు....; ↓
*"బనూ హాషిమ్ తెగకు చెందిన కొందరిని, ఖురైషులు బలవంతంగా యుద్ధరంగానికి ఈడ్చుకొని వచ్చిన విషయం నాకు తెలుసు. వారికి మా ఈ యుద్ధంతో ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి బనూ హాషిమ్ తెగకు చెందిన వ్యక్తి ఎవరైనా మీకు తారసపడితే అతణ్ణి చంపొద్దు. అలాగే, అబుల్ బక్తరీ బిన్ హష్షామ్ ఎవరికైనా ఎదురుపడితే అతణ్ణి సంహరించవద్దు. అలాగే, అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ కూడా ఎదురుపడితే ఆయననూ చంపవద్దు. ఎందుకంటే వారంతా బలవంతంగా యుద్ధానికి తీసుకొని రాబడినవారు."*
ఈ మాటలు విన్న "ఉత్బా" కుమారుడు "హజ్రత్ అబూ హుజైఫా (రజి)"...., *"ఏమిటీ! మేమైతే మా తండ్రుల్ని, సోదరులని, కుమారులని మరియు మా కుటుంబాలకు చెందిన వారిని సంహరించాలి. అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ ను మాత్రం వదిలివేయాలి. దైవసాక్షి! ఇది జరిగే పని కాదు. ఒకవేళ అతను గనక నాకు ఎదురైతే, అతనికి నా కరవాలం రుచి చూయిస్తాను."* అన్నారు.
ఈ వార్త దైవప్రవక్త (సల్లం) గారికి చేరింది. అప్పుడు అక్కడున్న హజ్రత్ ఉమర్ (రజి)తో దైవప్రవక్త (సల్లం)...., *"ఏమిటీ! దైవప్రవక్త (సల్లం) పినతండ్రి ముఖంపై కత్తితో కొడతాడా?"* అని అన్నారు.
ఇది విన్న హజ్రత్ ఉమర్ (రజి)...., *"ఓ మహాప్రవక్తా! నన్నొదలండి. నేనా వ్యక్తి తలను నా కరవాలంతో ఎగురవేస్తాను. దైవసాక్షి! అతను మునాఫిక్ (వంచకుడు) అయిపోయినట్లయింది."* అన్నారు.
ఆ రోజు తరువాత "హజ్రత్ హుజైఫా (రజి)" తరచూ ఇలా అంటూ ఉండేవారు....; ↓
*"ఆ రోజు నేను అన్న మాటలకు మనస్తాపపడుతూనే ఉన్నాను. సతతం నన్ను భయం వెంటాడుతూనే ఉంది. దీనికి పరిహారం కేవలం నేను దైవమార్గంలో ప్రాణాలిచ్చి అమరగతి పొందడం ఒక్కటే."*
చివరికి ఆయన (రజి) యమామా యుద్ధంలో పోరాడుతూ షహీద్ (అమరులు) అయ్యారు.
*»-----» 2. "అబుల్ బక్తరీ"ని చంపకూడదు అన్న విషయంలోని వివరణ : -*
"అబుల్ బక్తరీ"ని చంపొద్దని ఎందుకు చెప్పడం జరిగిందంటే, మక్కాలో ఈ ఒక్క వ్యక్తే దైవప్రవక్త (సల్లం)ను బాధించకుండా ఉన్న వ్యక్తి. దైవప్రవక్త (సల్లం)కు ఎలాంటి బాధను కలిగించడం గాని, ఆయన (సల్లం)కు వ్యతిరేకంగా ఎలాంటి దుర్భాషలాడడం గాని అతను చేయలేదు. బనీ హాషిమ్ మరియు బనీ ముత్తలిబ్ తెగలను బాయ్'కాట్ చేసినప్పుడు, కాబా గృహంలో వ్రేలాడదీసిన ఒప్పంద పత్రాన్ని చింపిపారేసిన వ్యక్తి కూడా ఇతనే గనక.
కాని, ఇంత జరిగినా అతను చంపబడ్డాడు. జరిగిందేమిటంటే, "హజ్రత్ మున్జిర్ బిన్ జయ్యాద్ బల్'వీ (రజి)"కి అతను యుద్ధరంగంలో ఎదురుపడ్డాడు. అబుల్ బకర్తీ వెంట అతని సహచరుడు కూడా ఉన్నాడు. ఇద్దరు కలిసే యుద్ధం చేస్తున్నారు.
*"హజ్రత్ మున్జిర్ (రజి)", అతణ్ణి చూడగానే ఇలా అన్నారు....; ↓*
*మున్జిర్ (రజి) : -* ఓ అబుల్ బక్తరీ! దైవప్రవక్త (సల్లం) నిన్ను చంపోద్దని ఆదేశించారు.
*అబుల్ బకర్తీ : -* నా వెంట నా సహచరుడు కూడా ఉన్నాడు మరి.
*మున్జిర్ (రజి) : -* లేదు దైవసాక్షి! మేము నీ సహచరున్ని మాత్రం వదిలేసేవారం కాదు.
*అబుల్ బకర్తీ : -* దైవసాక్షి! మేమిద్దరం కలిసే చనిపోతాం.
ఆ ఇద్దరు కలసి ఆయన (రజి)పై విరుచుకుపడ్డారు. విధి లేక మున్జిర్ (రజి) అతణ్ణి చంపవలసి వచ్చింది.
*»-----» 3. బిలాల్ (రజి) ప్రతీకారం : -*
ఇస్లాం స్వీకరించక ముందు మక్కాలో, "హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి)" మరియు "ఉమయ్యా బిన్ ఖల్ఫ్" మధ్య స్నేహ సంబంధాలుండేవి. బద్ర్ యుద్ధం రోజున ఉమయ్యా, తన కుమారుడు "అలీ" చేయి పట్టుకొని నిలబడి ఉన్నాడు. అటు నుండే అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి) వెళ్ళడం తటస్థించింది. ఆయన (రజి) శత్రువుల నుండి కొన్ని కవచాలు హస్తగతం చేసుకొని మోసుకు వెళుతున్నారు.
ఆయన (రజి)ను చూసి ఉమయ్యా...., *"అబ్దుర్రహ్మాన్! బహుశా నీకు నా అవసరం ఉందనుకుంటాను? నేను నీ ఈ కవచాలకంటే మేలైనవాణ్ణి. ఈ రోజు కనిపించిన దృశ్యం లాంటిది నేనిది వరకు ఎన్నడూ చూడలేదు. నీకు పాల అవసరం లేదా?"* అని అన్నాడు. _(అంటే నన్ను ఖైదు చేసిన వానికి పరిహారంగా బాగా పాలిచ్చే ఒంటెల్ని ఇస్తాను అని అర్థం)_
ఈ మాటలు విన్న హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి) కవచాలన్నిటిని క్రిందపడవేసి, ఆ ఇద్దరిని బంధీలుగా పట్టుకొని ముందుకు సాగారు.
●*అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి) గారి కథనం ప్రకారం....; ↓*
"నేను ఆ ఇద్దరిని పట్టుకొని వారి మధ్య నడుస్తున్నాను. అప్పుడు ఉమయ్యా నన్ను...., *"తన వక్షస్థలంపై ఉష్ట్రపక్షి ఈకలను అలంకరించుకొని యుద్ధం చేసిన వ్యక్తి ఎవరయ్యా?"* అని అడిగాడు.
*"ఆయన హజ్రత్ హమ్'జా (రజి)"* అని బదులిచ్చాను నేను.
*"ఆయనేనయ్యా మా నడుమ భయం సృష్టించి యుద్ధం చేసింది."* అన్నాడు ఉమయ్యా.
వారిద్దరిని పట్టుకుని నేను వెడుతూ ఉండగా, హఠాత్తుగా హజ్రత్ బిలాల్ (రజి) నా వెంట ఉన్న ఉమయ్యా బిన్ ఖల్ఫ్ ను చూశారు. _(ఉమయ్యా బిన్ ఖల్ఫ్ మక్కాలో హజ్రత్ బిలాల్ (రజి)ను హింసించిన తన మాజీ యజమాని అన్న విషయం ఇక్కడ గమనార్హం. ← మరింత అర్థవంతం కోసం చదవండి ఇస్లాం చరిత్ర : 132 వ భాగము)_
ఉమయ్యాను చూడగానే హజ్రత్ బిలాల్ (రజి)...., *"ఓహో! దైవధిక్కార నాయకుడవా? ఓ ఉమయ్యా బిన్ ఖల్ఫ్! ఇక నేనైనా బ్రతికుంటాను లేదా నీవైనా బ్రతికి ఉంటావు కాచుకో."* అని ఆరిచారు.
దానికి నేను...., *"ఓ బిలాల్! ఇప్పుడితను నా ఖైదీ."*అని గుర్తు చేశాను.
కాని, బిలాల్ (రజి) వినిపించుకోకుండా...., *"ఇప్పుడు నేనైనా మిగిలి ఉంటాను లేదా ఇతనైనా బ్రతికి ఉంటాడు."* అని బిగ్గరగా అరుస్తూ...., "ఓ అన్సారుల్లారా! ఇదిగో దైవధిక్కారుల నాయకుడు ఉమయ్యా బిన్ ఖల్ఫ్! చూడండి, నేనైనా ఉండాలీ లేదా ఇతనైనా ఉండాలి."* అన్నారు.
ఇంతలోనే ముస్లింలు మమ్మల్ని చుట్టుముట్టి వలయాకారంగా నిలబడ్డారు. నేను ఉమయ్యాను రక్షించనారంభించాను. కాని, అందులో ఒకడు కరవాలం లాగి, ఉమయ్యా కుమారుని కాళ్ళపై వేసి కొట్టాడు. అతను నిలువునా క్రింద పడిపోయాడు.
ఇటు ఉమయ్యా అరచిన అరుపును నేనెప్పుడూ వినలేదు. నేను అతనితో, *"పారిపో"* అని చెప్పాను. కాని, ఈ రోజు పారిపోవడానికి కూడా అవకాశం లేదు. *"దైవసాక్షి! నేను నీకు ఎలాంటి సహాయం చేయలేకపోతున్నాను."* అన్నాను.
ఆ తరువాత ముస్లిములు, ఉమయ్యాను అతని కుమారుణ్ణి తమ ఖడ్గాలతో నరికిపారేసారు. అల్లాహ్, బిలాల్ (రజి)ను కరుణించుగాక. నా కవచాలు పోయాయి. నా ఖైదీని ఆయన (రజి) బాధించారు."●
*"జాదుల్ ముఆద్"లో, "ఇబ్నె ఖైమ్" ఇలా రాస్తున్నారు....; ↓*
"హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్, ఉమయ్యా బిన్ ఖల్ఫ్ తో...., *"నీవు మోకాళ్ళ మీద కూర్చో"* అనగా, అతను అలా కూర్చుండిపోయాడు. హజ్రత్ అబ్దుర్రహ్మాన్ డాలులా ఉమయ్యాపై వంగిపోయారు రక్షించడానికి. కాని, ప్రజలు క్రింది వైపు నుండి ఖడ్గ ప్రహారాలు చేసి అతణ్ణి చంపివేశారు. కొన్ని దెబ్బలు "హజ్రత్ అబ్దుర్రహ్మాన్ (రజి) బిన్ ఔఫ్" గారికి తగిలాయి. ఆయన (రజి) కాలుకు గాయం అయింది.
*»-----» 4. "హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజి)" తన మేనమామ "ఆస్ బిన్ హష్షామ్ బిన్ ముగైరా"ను హతమార్చారు.*
*మిగిలిన సంఘటనలను In Sha Allah రేపటి భాగములో....;*
No comments:
Post a Comment