209

🕌🕌       బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్        🕌🕌🕌

🛐🛐   అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు   🛐🛐
🤚🏻✋🏻     అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను      🤚🏻✋🏻

 ~~~~~ 

🕋🕋🕋             ఇస్లాం చరిత్ర - 209            🕋🕋🕋
 ■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■
  
*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 124*      

🛡⚔ *ఇస్లామీయ ప్రథమ నిర్ణయాత్మక సంగ్రామం* ⚔🛡

🛡⚔ *బద్ర్ సంగ్రామం : - 8* ⚔🛡

*భీకరంగా జరుగుతున్న యుద్ధం : -*

ఖురైష్ సైన్యం నుంచి "ఉబైదా బిన్ సయీద్" గాండ్రిస్తూ రంగంలోకి దూకాడు. అతడ్ని ఎదుర్కోవడానికి ముస్లిముల నుంచి "హజ్రత్ జుబైర్ (రజి)" వచ్చారు.

ఉబైదా శరీరమంతా ఇనుప కవచంతో కప్పబడి ఉంది. ఒక కన్ను మాత్రమే కనిపిస్తోంది. జుబైర్ (రజి), ఉబైదా ను ఓసారి ఆపాదమస్తకం పరికించి చూశారు. ఆ వెనువెంటనే కంటికి గురి చూసి చేతిలోని బల్లెం పైకెత్తి బలంగా విసిరికొట్టారు. ఆ దెబ్బకు ఉబైదా గిలగిల కొట్టుకొని ఊపిరి వదిలాడు.

ఉభయపక్షాల సైనికులు హోరా హోరీగా పోరాడుతున్నారు. దైవప్రవక్త (సల్లం) ముస్లిములకు సమయానుకూలంగా తగిన ఆదేశాలిస్తూ సమరదృశ్యం వీక్షిస్తున్నారు. ఆయన (సల్లం) తన అనుచరుల్ని ఉద్దేశించి...., *"బహుదైవారాధకుల వెంట వచ్చిన హాషిమ్ సంతతి వాళ్ళు మనస్పూర్తిగా యుద్ధానికి రాలేదు. గత్యంతరంలేక రావలసి వచ్చింది. అంచేత వారితో చూసి చూడనట్లు యుద్ధం చేయండి."* అని చెప్పారు.

*ఈ యుద్ధాగ్నికి మరో సమిధ : -*

ఈ యుద్ధాగ్నికి మరో సమిధ "అస్వద్ బిన్ అబ్దుల్ అసద్ మగ్జూమీ". ఇతను తలబిరుసుగల దుష్టుడు. అతను బయలుదేరడమే ఓ ప్రమాణం చేసి బయలుదేరాడు. *"అల్లాహ్ పై ఒట్టేసుకొని వెడుతున్నాను. ముస్లిములు కట్టిన నీటి తొట్టె నీళ్ళు త్రాగుతాను లేదా దాన్ని కూల్చేస్తాను, అదీకాని పక్షంలో నా ప్రాణాలైనా అర్పిస్తాను."* అని ప్రమాణం చేసి, వెంటనే ఆ నీటి చెలమ వైపు పరుగుతీశాడు.

అతను అటు నుండి ముందుకు వచ్చాడో లేదో, ఇటు ముస్లిం సైన్యం నుండి హజ్రత్ హమ్'జా (రజి) బయటకు వచ్చారు. ఇద్దరూ నీటి చెలమకు ఈవలనే ఎదురుపడ్డారు. ఆ వెంటనే హమ్'జా (రజి), మెరుపువేగంతో అతడ్ని ఢీకొని ఒక్క వ్రేటు వేశారు. హమ్'జా (రజి) వేసిన ఖడ్గం వ్రేటుకు "అస్వద్" కాలు పిక్క నుండి తెగి వేరైపోయింది. అతను వెల్లకిలా పడిపోయాడు. అతని కాలి నుండి రక్తం ధారగా చిందనారంభించింది. అయినా అతను మోకాళ్ళపై ప్రాకుతూ నీటి చెలమ వైపునకు వెడుతున్నాడు. ఆ చెలమలోనికి పడిపోయి తన ప్రమాణాన్ని నిలబెట్టుకునే లోపునే హజ్రత్ హమ్'జా (రజి) మరో వ్రేటు వేశాడు. దాంతో అతను అక్కడే ప్రాణాలు వదిలేశాడు.

*మహాప్రవక్త (సల్లం) గారు వేడుకోలు (దుఆ) : -*

ఇటు దైవప్రవక్త (సల్లం) వరుసలను క్రమంగా తీర్చిదిద్ది, పందిరి క్రిందికి చేరారు. అల్లాహ్ ముందు మోకరిల్లి, తన వర్గానికి సహాయపడమని, చేసిన వాగ్దానాన్ని నెరవేర్చమని "దుఆ" చేయనారంభించారు. ఆ "దుఆ" ఇది....; ↓

*"ఓ అల్లాహ్! నీవు నాతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చు. ఓ ప్రభూ! నేను ఇప్పుడు నీ వాగ్దానం, నీ ప్రమాణం గురించి అడుగుతున్నాను."*

భీకర యుద్ధం ప్రారంభమై, పోరు ఉధృతమైపోగా ఇలా దుఆ చేశారు....; ↓

*"ఓ అల్లాహ్! ఈ రోజు ఈ వర్గం తుడుచుకుపోతే, ఇక ముందు నీ ఆరాధన చేసేవాడే ఉండడు. ఓ ప్రభూ ! ఈ రోజు తరువాత నీ ఆరాధన ఇక జరుగకూడదని తలుస్తున్నవా?"*

మహాప్రవక్త (స) ఎంతో వినమ్రులై ఈ "దుఆ"ను చేసేటప్పుడు ఆయన భుజం మీద ఉన్న దుప్పటి క్రిందపడిపోయింది. "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" ఆ దుప్పటిని ఆయన (సల్లం) భుజాలపై కప్పుతూ...., *"ఓ మహాప్రవక్తా! తమరు తమ దైవంతో వినయంగా వేడుకున్నారు కదా! వాగ్దానం చేసిన విజయాన్ని ఆయన తప్పక ప్రసాదిస్తాడు. విజయం తప్పక మీకు వశమవుతుంది."* అన్నారు.

ఇటు అల్లాహ్ దైవదూతలకు ఇలా సంజ్ఞ చేశాడు: ఆ సంజ్ఞ "దివ్యఖుర్ఆన్"లో ఇలా ఉంది....; ↓

*"(ఆ సందర్భాన్ని కూడా ఓ సారి జ్ఞాపకం చేసుకోండి) నీ ప్రభువు దూతలను ఇలా ఆదేశించాడు: "నేను మీ వెంటే ఉన్నాను. కాబట్టి మీరు విశ్వాసులకు ధైర్యాన్ని కలిగించండి. నేను ఇప్పుడే అవిశ్వాసుల గుండెల్లో దడ పుట్టిస్తాను. మీరు వారి మెడలపై కొట్టండి. వారి వ్రేళ్ల కణుపులపై కొట్టండి." (ఖుర్ఆన్ 8:12).*

వెంటనే మహాప్రవక్త (సల్లం) వద్దకు దివ్యావిష్కృతిని పంపుతూ....; ↓

*"సహాయం కోసం మీరు మీ ప్రభువును మొరపెట్టుకున్న ఆ సందర్భాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి - మరి అల్లాహ్ మీ మొరను ఆలకించి, "నేను వెయ్యిమంది దూతలతో మీకు సహాయం చేస్తాను. వారు ఎడతెగకుండా - ఒకరి వెనుక ఒకరు - వస్తుంటారు" అని చెప్పాడు." (ఖుర్ఆన్ 8:9).*

*దైవదూతల అవతరణ : -*

అయినా ప్రవక్త (సల్లం) అలాగే ప్రభువు సన్నిధిలో విధేయతతో కూలబడి ప్రార్థిస్తూ చివరకు నిద్రలోకి జారుకున్నారు. నిద్రలో, ముస్లిములు విజయం సాధించడాన్ని ఆయన (సల్లం) చూశారు. ఆ తరువాత ఆయన (సల్లం) తలపైకెత్తి, *"అబూ బక్ర్ (రజి) సంబరపడండి! ఈయన జిబ్రీల్ (అలైహి), దుమ్ము, ధూళి మయమై వస్తున్నారు"* అని చెప్పారు. 

*"ఇబ్నె ఇస్'హాక్" ఉల్లేఖనం ఇలా ఉంది....; ↓*

*"అబూ బక్ర్ (రజి) సంబరపడండి! మీ వద్దకు అల్లాహ్ సహాయం వచ్చేసింది. ఈయన జిబ్రీల్ (అలైహి). తన గుర్రం కళ్ళెం పట్టుకొని వస్తున్నారు. శరీరం అంతా దుమ్ము, ధూళితో నిండి ఉంది."*

● _(మరొక ఉల్లేఖనంలో....; ↓_

_యుద్ధం హోరాహోరీగా జరుగుతోంది. కాస్సేపటికి ఆకాశంలో వారిపై నుండి ఒక మబ్బుతునక, గుర్రాల సకిలింపులు మరియు గిట్టల చప్పుళ్లతో రివ్వున యుద్ధమైదానం వైపు దూసుకుపోయింది. అందులో నుండి *"తొందరగా ముందుకు సాగండి."* అనే ఓ కంఠస్వరం విన్పించింది.)_ ●

అనంతరం మహాప్రవక్త (సల్లం) పందిరి నుండి బయటకు వచ్చారు. అప్పుడాయన (సల్లం) కవచాన్ని ధరించి ఉన్నారు. ఉద్వేగంగా గుమ్మం వైపునకు నడుస్తూ ఇలా సెలవిస్తున్నారు....; ↓

*"(బాగా తెలుసుకోండి) త్వరలోనే ఆ వర్గం ఒడిపోతుంది. వారు వెన్ను చూపి పారిపోతారు." (ఖుర్ఆన్ 54:45).*

ఆ తరువాత ఆయన (సల్లం) పిడికెడు గులకరాళ్ళు గల మట్టిని తీసుకొని ఖురైషుల వైపునకు మళ్ళారు. *"షాహ్హతిల్ వుజూహ్, షాహ్హతిల్ వుజూహ్"* _(ముఖాలు వికృతంగా మారిపోవుగాక, ముఖాలు వికృతమై పోవుగాక)_ అని చెబుతూ, ఆ మట్టిని వారి ముఖాలపై విసరికొట్టారు.

బహుదైవారాధకులు, ఎవ్వరూ తమ కళ్ళల్లో, ముక్కుల్లో, నోటిలో ఆ మట్టి పడకుండా మిగల్లేదు. ఈ దృశ్యాన్నే వివరిస్తూ "దివ్య ఖుర్ఆన్" ఇలా సెలవిస్తోంది....; ↓

*"వాళ్ళను మీరు చంపలేదు. కాని అల్లాహ్ వాళ్ళను చంపాడు. (గుప్పెడు మన్నును) నువ్వు విసరలేదు, దాన్ని అల్లాహ్ విసిరాడు. విశ్వాసులు శ్రమకు తన తరఫున మంచి ప్రతిఫలం ఇచ్చేందుకు అల్లాహ్ ఇలా చేశాడు. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు." (ఖుర్ఆన్ 8:17).*

*ఎదురుదాడి : -*

ఇది జరిగిన వెంటనే మహాప్రవక్త (సల్లం) ఎదురుదాడి చేయమని ఆదేశిస్తూ, ముస్లిములను ఉత్సాహపరచడానికి...., *"షద్దూ (వారిలోకి చొరబడండి), ఎవరి చేతిలోనైతే ముహమ్మద్ (సల్లం) ప్రాణాలున్నాయో, ఆయన సాక్షిగా చెబుతున్నాను! ఏ వ్యక్తి అయినా సరే స్థిరంగా నిలబడి, పుణ్యకార్యంగా భావించి ముందుకురికి, వెనక్కు మరలకుండా పోరాడి ప్రాణాలొదుల్తాడో, అతణ్ణి అల్లాహ్ తప్పకుండా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు."* అని పలికారు.

ఆయన (సల్లం) యుద్ధం చేయడానికి పురికోల్పుతూ...., *"ఆ స్వర్గం వైపునకు కదలడానికి లేచి నిలబడండి, ఏ స్వర్గం వైశాల్యమైతే ఈ భూమ్యాకాశాలకు సమానమైందో (దాన్ని పొందడానికి పరుగిడండి)."* అని కూడా అన్నారు.

దైవప్రవక్త (సల్లం) గారి ఈ మాటలు విన్న "ఉమైర్ (రజి) బిన్ హమ్మామ్"...., *"ఓహో! ఓహో!"* అనటం ప్రారంభించారు.

*"నీవు ఎందుకిలా అంటున్నావు?"* అని దైవప్రవక్త (సల్లం) అడగగా,

*"కాదు! దైవసాక్షి! ఓ అల్లాహ్ ప్రవక్త! ఏమీ లేదు, నాకు కూడా ఆ స్వర్గంలో ప్రవేశించాలనే కాంక్ష తప్ప మరే కోరికా లేదు."* అన్నారాయన.

*"ఔను, నీవు కూడా ఆ స్వర్గవాసుల్లోని వారిలో ఒకడివే!"* అన్నారు. దైవప్రవక్త (సల్లం).

_(↑ ఇదే విషయం వేరొక ఉల్లేఖనం ప్రకారం ↓)_

దైవప్రవక్త (సల్లం), తన ప్రియసహచరులను ఉద్దేశించి...., *"భూమ్యాకాశాలంతా వెడల్పు గల స్వర్గంలోనికి ప్రవేశించటానికి సిద్ధంగా ఉండండి."* అని చెప్పారు.

ఈ మాటలు విన్న "ఉమైర్ (రజి) బిన్ హమ్మామ్" ఆశ్చర్యపోతూ...., *"ఏమిటీ! అది భూమ్యాకాశాలంతా వెడల్పు ఉంటుందా?"* అని ప్రశ్నించారు.

*"అవును"* అని ప్రవక్త (సల్లం) బదులిచ్చారు.

ఇది విని ఆయన (రజి) అమితానందానికి లోనయ్యారు. *"మరి నేను కూడా ఆ స్వర్గంలోనికి ప్రవేశించగలనా?"* అని ఆశగా అడిగారు.

*"నీకూ ఆ స్వర్గ భాగ్యం ప్రాప్తిస్తుంది."* అని పలికారు మహాప్రవక్త (సల్లం).

అంతే! ఆయన (రజి) తన ఖడ్గం ఒరను తుంచివేశారు. తన చద్ది మూట నుండి ఖర్జూరాలు తీసి తినటం ఆరంభించారు. ఆ తరువాత ఆయనకు ఏదో గుర్తుకువచ్చి...., *"నేను ఈ ఖర్జూరాలు తిన్నంతవరకు బ్రతికి ఉండాలంటే అది ఓ సుదీర్ఘ కాలమే అవుతుంది."* అనుకొని వాటిని నేలమీద విసిరికొట్టి బహుదైవారాధకులతో పోరాడేందుకు కదన రంగంలోనికి దూకారు. వీరోచితంగా పోరాడుతూ అమరగతిని ఆస్వాదించారు.

అలాగే పేరు మోసిన ఓ మహిళ "అఫ్రా" కుమారుడు "ఔఫ్ బిన్ హారిస్" కూడా మహాప్రవక్త (సల్లం) దగ్గరకి వచ్చి...., *"దైవప్రవక్తా! అల్లాహ్ తన దాసుని ఏ సత్కార్యాన్ని చూసి (ఆనందంతో) దరహాసం చేస్తాడు?"* అని అడగగా....;

*"తన దాసుడు తన శరీరంపై ఎలాంటి రక్షక సాధనం లేకుండా యుద్ధరంగంలోకి దుమికి శత్రువుతో తలపడతాడో, అల్లాహ్ అతణ్ణి చూసి ఆనందంతో చిరునవ్వు నవ్వుతాడు."* అని చెప్పారు మహాప్రవక్త (సల్లం).

ఆ మాటలు విన్న "హజ్రత్ ఔఫ్" తన శరీరంపై ఉన్న కవచాన్ని తీసి పారవేసి కేవలం ఒక ఖడ్గాన్నే చేతబట్టి శత్రుమూకపై విరుచుకుపడ్డారు. అలా యుద్ధం చేస్తూనే ప్రాణాలను ధారపోసి అమరులైపోయారు.

మహాప్రవక్త (సల్లం) ఎదురుదాడికి ఆదేశం ఇచ్చినప్పుడు, శత్రువు చేసే దాడుల్లో తీవ్రత తగ్గిపోయి ఉంది. వారి ధైర్యాలు సన్నగిల్లుతున్నాయి. అందుకనే వివేచనతో కూడిన యుద్ధ కౌశల్యాన్నుపయోగించి తీసుకున్న నిర్ణయం, ముస్లిముల పరిస్థితికి మరింతగా బలం చేకూర్చింది. కారణం ఏమిటంటే, సహాబా (రజి)కు ఎదురు దాడి చేయమనే ఆదేశం అందినప్పుడు వారి జిహాద్ చేసే ఉద్రేకం, ఉద్వేగం, ఉత్సాహం ఉచ్ఛస్థాయిలోనే ఉన్నాయి.

*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగములో....;*

No comments:

Post a Comment