200


🕌🕌🕌       బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్        🕌🕌🕌

🛐🛐   అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు   🛐🛐
🤚🏻✋🏻     అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను      🤚🏻✋🏻

 ~~~~~ 

🕋🕋🕋             ఇస్లాం చరిత్ర - 200            🕋🕋🕋
 ■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■
  
*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 115*      

_(నిన్నటి భాగము కొనసాగింపు)_

ఇక సిరియాలో వ్యాపారం చేయడం శాశ్వతంగా ప్రమాదంతో కూడుకున్న విషయమని ముష్రిక్కులు గ్రహించారు. అయినప్పటికీ, ఇంకనూ వారు తమ తలబిరుసుతనాన్ని వదల్లేదు. "జుహైనా" మరియు "బనూ జమ్రా" తెగలతో జరిగిన సంధికి దిగిరావడానికి బదులు, వారు తమ పౌరుషం, రౌద్రం మరియు వైషమ్యాల్లో మరికొంత ముందుకే అడుగు వేశారు. వారి సర్దారులు, మేధావులు, ముస్లిముల ఇండ్లలో దూరి వారిని తుదముట్టిస్తామన్న బెదిరింపును అమలు చేయడానికే నిర్ణయించుకున్నారు. ఈ ఉద్వేగమే వారిని "బద్ర్" యుద్ధ మైదానానికి చేర్చింది.

ఇక ముస్లిముల విషయానికి వస్తే, హజ్రత్ అబ్దుల్లా బిన్ హజష్ (రజి) గారి సరియ్యా తరువాత అల్లాహ్, షాబాన్ నెల హిజ్రీ శకం - 2 లో యుద్ధం "ఫర్జ్ (విధిగా)" చేశాడు. ఈ సందర్భంగా అనేక "ఖుర్ఆన్" ఆయత్ లు అవతరించనారంభించాయి. ఆ "ఖుర్ఆన్" వాక్యాలు ఇవి....; ↓

*"మీతో పోరాడే వారితో మీరు కూడా దైవమార్గంలో పోరాడండి. కాని మితిమీరకండి. మితిమీరి పోయేవారిని అల్లాహ్ ఇష్టపడడు. వారు ఎక్కడ ఎదురైనా మీరు వారితో తలపడండి, మిమ్మల్ని ఎక్కడినుంచి వారు తరిమికొట్టారో, అక్కడి నుంచి మీరు కూడా వారిని తరిమికొట్టండి. ఫిత్నా (కుఫ్ర్, షిర్క్, పీడన) అనేది చంపటం కన్నా తీవ్రమైనది. 'మస్జిదె హరాం' వద్ద వారు మీతో యుద్ధం చేయనంతవరకూ మీరు వారితో పోరాడకండి. వారు గనక మిమ్మల్ని హతమార్చడానికి యత్నిస్తే మీరు కూడా ధీటైన జవాబు ఇవ్వండి. అవిశ్వాసులకు సరైన సమాధానం ఇదే. ఒకవేళ వారు గనక (తమ దమన నీతిని) మానుకుంటే నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. పీడన (ఫిత్నా) సమసిపోనంత వరకూ, దైవధర్మానిది పైచేయి కానంత వరకూ వారితో పోరాడుతూనే ఉండండి. ఒకవేళ వారు యుద్ధాన్ని విరమిస్తే (మీరు విరమించండి). మెడలు వంచవలసింది దౌర్జన్య పరులవే." (ఖుర్ఆన్ 2:190-193).*

ఆ తరువాత వెనువెంటనే మరో రకమైన ఆయత్ లు అవతరించబడ్డాయి. ఈ ఆయత్ లలో యుద్ధం ఎలా చేయాలో తెలుపుతూ దాని కోసం ప్రోత్సహించడం జరిగింది. అదేకాకుండా కొన్ని ఆదేశాలు కూడా ఉన్నాయి వాటిలో.

*"మరి మీరు అవిశ్వాసులను (రణరంగంలో) ఎదుర్కొనప్పుడు వారి మెడలపై వ్రేటు వేయండి. వారిని బాగా అణచిన తరువాత గట్టిగా బంధించండి. పిదప మీరు వారిని (పరిహారం తీసుకోకుండా) వదలిపెట్టి మేలు చేసినా లేక పరిహారం పుచ్చుకుని వదలినా (అది మీ ఇష్టం). యుద్ధం ఆయుధాలను పడవేసే దాకా (ఈ పోరు సాగాలి). (ఆజ్ఞాపించబడినది మాత్రం) ఇదే. అల్లాహ్ గనక తలచుకుంటే (స్వయంగా) తానొక్కడే ప్రతీకారం తీర్చుకునేవాడు. కాని మీలో ఒకరిని ఇంకొకరి ద్వారా పరీక్షించాలన్నది ఆయన అభిమతం. అల్లాహ్ మార్గంలో చంపబడినవారి కర్మలను ఆయన వృధా కానివ్వడు. ఆయన వారికి సన్మార్గం చూపుతాడు. వారి పరిస్థితిని చక్కదిద్దుతాడు. వారికి (ముందుగా) తెలిపివున్న స్వర్గంలో ప్రవేశం కల్పిస్తాడు. విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు గనక అల్లాహ్ కు సాయం చేస్తే ఆయన మీకు సాయం చేస్తాడు. మీ పాదాలకు నిలకడను ఇస్తాడు." (ఖుర్ఆన్ 47:4-7).*

ఆ తరువాత అల్లాహ్, యుద్ధం ఆదేశం విన్నంతనే బెదిరిపోయి భయకంపితులైన వారిని విమర్శిస్తూ ఇలా సెలవిస్తున్నాడు....; ↓

*""ఏదైనా సూరా ఎందుకు అవతరించలేదు?" అని విశ్వసించినవారు అంటున్నారు. మరి యుద్ధ ప్రస్తావనతో కూడిన చాలా స్పష్టమైన భావం గల సూరా అవతరించినపుడు, హృదయాలలో రోగమున్నవారు, మరణ సమయంలో స్పృహలో లేనివాడు చూసినట్లుగా నిన్ను చూడటాన్ని నువ్వు గమనిస్తావు. (వారు అల్లాహ్ కు విధేయత చూపి ఉంటే అది) వారి కొరకు చాలా బావుండేది." (ఖుర్ఆన్ 47:20).*

యదార్థం ఏమిటంటే, యుద్ధాన్ని విధిగా చేయడం, దాన్ని ప్రోత్సహించడం, మరి యుద్ధం కోసం సమాయత్తమవడం అప్పటి పరిస్థితులకు పూర్తిగా అనుగుణమైన చర్య. పరిస్థితులను నిశితంగా బేరీజువేసే ఏ సైనిక కమాండరు అయినా ఆ పరిస్థితులలో తన సైన్యాన్ని సమాయత్తపరచి శత్రువును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండమని ఆదేశాలిస్తాడు. ప్రత్యక్ష మరియు పరోక్ష విషయాలను తెలిసిన అల్లాహ్ అలాంటి ఆదేశాలెందుకు ఇవ్వడు మరి?

నిజం చెప్పాలంటే, పరిస్థితులు, సత్యం మరియు అసత్యం నడుమ ఓ రక్తపాతంతో కూడిన యుద్ధం జరుగబోతుందని తెలియజేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా, "సరియ్యా అబ్దుల్లా బిన్ హజష్" తరువాత బహుదైవారాధకుల పౌరుషం మరియు ఆత్మాభిమానానికి పెద్ద దెబ్బ తగిలింది. ఈ సంఘటన వారికి భరింపశక్యంకానిదై పోయింది.

యుద్ధ ఆదేశాలు గల ఈ దైవవాణి అవతరణ సందర్భాన్ని బట్టి చూస్తే, త్వరలోనే ఓ భీకర యుద్ధం జరుగబోతోందని, ఆ యుద్ధంలో ముస్లిములకే విజయం చేకూరబోతోందనే సూచనలు కానవస్తాయి. *"వారు మిమ్మల్ని ఎక్కడ నుండి పారద్రోలారో, అక్కడ నుండి మీరు వారిని పారద్రోలండి"* అనే అల్లాహ్ ఆదేశం మరియు ఖైదీలను గట్టిగా బంధించడం మరియు మీ విరోధుల్ని అణచివేయండి అనే సూచన మరియు ఈ యుద్ధాన్ని కొనసాగించండి అనే ఆదేశాన్ని బట్టి చూస్తే, అంతిమ ప్రాబల్యం ముస్లిములకే దక్కనుందనే విషయం విశదమవుతోంది.

అయితే, ఈ ఆదేశం సంకేతాలు సంజ్ఞల రూపంలో ఇవ్వబడిన ఆదేశం. ఎవరైతే దైవమార్గంలో యుద్ధం చేయడానికి ఎంత ఉత్సాహంగా, ఆసక్తిగా పాల్గొన నిశ్చయించుకున్నాడో అతడు దాన్ని అమలు చేసి చూపించవలసి ఉంటుంది అన్నదే ఈ ఆదేశం ముఖ్యోద్దేశం.

🛡⚔ *(బద్ర్ యుద్ధం మరో రెండు రోజుల్లో....,)* ⚔🛡

*ఆ రోజుల్లోనే, అంటే షాబాన్ నెల హిజ్రీ శకం - 2 (క్రీ.శ. ఫిబ్రవరి 624)లో, దైవం, "బైతుల్ మగ్దిస్"కు బదులు "కాబా"ను "ఖిబ్లా"గా చేసుకోవాలని ఆదేశించాడు. అంటే, నమాజు చేసేటప్పుడు ఇక "బైతుల్ మగ్దిస్" అభిముఖంగా కాక "కాబా" గృహానికి అభిముఖంగా నిలబడి నమాజు చేయాలి.*

_(↑ మరింత వివరంగా ↓)_

*ఖిబ్లా దిశ మార్పు : -*

"బషీర్ బిన్ బరా (రజి)" ఆహ్వానంపై ఓ రోజు దైవప్రవక్త (సల్లం), ఆయన ఇంటికి వెళ్ళారు. వచ్చిన పని పూర్తయ్యేటప్పటికి "జుహర్" నమాజు వేళయింది. దైవప్రవక్త (సల్లం), అక్కడున్న అనుచరులకు నాయకత్వం వహించి నమాజు చేయించసాగారు. రెండవ రకాతులో అకస్మాత్తుగా దైవసందేశం అవతరించింది....; ↓

*In Sha Allah రేపటి భాగములో....; →*

No comments:

Post a Comment